వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం కలియుగ వైకుంఠ దైవం శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో వైకుంఠం క్యూ కంప్లెక్స్ ఒకటి ద్వారా ఆయన ఆలయంలోకి ప్రవేశించారు. శ్రీవారిని దర్శించుకునేందుకు జగన్ గత రాత్రే తిరుమలకు విచ్చేశారు. ఆయన శ్రీకృష్ణ అతిథి గృహంలో బస చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు జగన్ వెంట శ్రీవారిని దర్శించుకున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment