YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday, 1 September 2012

వైఎస్ఆర్

ఇడుపులపాయ : మహానేత దూరమై నేటికి సరిగ్గా మూడేళ్లు.. మది నిండా జ్ఞాపకాలు. గుండెలో చెరగని గురుతులు. వైఎస్‌ఆర్‌ మూడో వర్దంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఆదివారం నివాళులు అర్పించారు. వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతి, షర్మిల, వైఎస్‌ వివేకానందరెడ్డి, బ్రదర్‌ అనిల్‌కుమార్‌ ఇతర కుటుంబ సభ్యులు ఇడుపులపాయ వైఎస్‌ఆర్‌ ఘాట్‌లో అంజలి ఘటించారు. గుండె లోతుల్లోంచి తన్నుకు వస్తున్న దుఖాన్ని ఆపుకుంటూ మౌనంగా ఉండిపోయారు. మహానేతకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు.

వై.ఎస్.రాజశేఖరరెడ్డి మూడో వర్ధంతి ఘన నివాళికి రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఏర్పాట్లు

రక్తదానం, అన్నదానం, ఉచిత వైద్య శిబిరాలు
ఇడుపులపాయలో వైఎస్ సమాధి వద్ద
శ్రద్ధాంజలి ఘటించనున్న విజయమ్మ

హైదరాబాద్, న్యూస్‌లైన్: మహానేత, దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి మూడో వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించడానికి ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ పలు కార్యక్రమాలను చేపడుతోంది. రక్తదానం, అన్నదానంతోపాటు ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించనున్నారు. వీటితోపాటు ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు, ఆహారం పంపిణీ వంటి కార్యక్రమాలను పెద్దఎత్తున చేపడుతున్నారు. ఆదివారం ఉదయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ ఇడుపులపాయలోని మహానేత సమాధి వద్ద ప్రార్థనలు జరిపి, శ్ర ద్ధాంజలి ఘటిస్తారు. ఈ కార్యక్రమంలో వైఎస్ కుటుంబ సభ్యులందరూ పాల్గొంటారు. 

హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 9.30 గంటలకు వైఎస్‌కు శ్రద్ధాంజలి ఘటించే కార్యక్రమం జరుగుతుంది. వైఎస్సార్ కాంగ్రెస్ సేవాదళం ఆధ్వర్యంలో ఇక్కడో వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ శిబిరంలో 2,000 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు సరఫరా చేస్తారు. పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. ఇవి కాకుండా గ్రామస్థాయి నుంచి జిల్లా కేంద్రాల వరకూ వైఎస్ సంస్మరణ కార్యక్రమాలు జరగనున్నాయి. వైఎస్ మరణించిన నల్లకాలువ వద్ద కూడా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అక్కడ పేదమహిళలకు చీరల పంపిణీ చేయడంతో పాటుగా కొవ్వొత్తులు వెలిగించి మహానేతకు నివాళులర్పిస్తారు.

వైఎస్ వర్ధంతి సందర్భంగా వైఎస్ విజయమ్మతో ప్రత్యేక ఇంటర్వ్యూ

విద్యార్థిగా ఉండగానే జలయజ్ఞాన్ని స్వప్నించారు
జనం బాధలను వారి కళ్లు చూసి అర్థం చేసుకునేవారు
కష్టాల్లో ఉండగానే పలకరించాలంటూ పాదయాత్ర చేశారు
సీఎం అయ్యాకే మాతో కాస్త సమయం గడిపారు
ఇడుపులపాయ ఎస్టేట్ అంటే ఆయనకు ఎంతిష్టమో!
ఆ పంచె కట్టు అనితర సాధ్యం.. 

ఇడుపులపాయ నుంచి జి.రామాంజనేయులు, ఎస్.నగేశ్:
చిరునవ్వు చెరగని ముఖం. మడత నలగని పంచె కట్టు. నేనున్నానని భరోసా కలిగించే మాటతీరు. ఆరునూరైనా మాటపై నిలబడే వ్యక్తిత్వం. ఒక్కమాటలో తెలుగుదనానికి నిలువెత్తు సంతకం. మనిషి మరణించాక కూడా బతికే ఉండాలని నమ్మిన మహా మనీషి వైఎస్ రాజశేఖరరెడ్డి. దాన్ని జీవితాంతం నమ్మి ఆచరించారు గనుకే జనం గుండెల్లో ఆయన చిరంజీవిగా నిలిచిపోయారు. ‘ఆయన ఓ మంచి నాయకుడు, మంచి తండ్రి, పేదల కోసం తపించిన మనసున్న మహరాజు’ అంటూ వైఎస్ సతీమణి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయనకు ప్రపంచం అంతా కుటుంబమేనని, ప్రజలంతా కుటుంబీకులేనని అన్నారు. మహానేత మరణించి నేటికి మూడేళ్లు. ఈ సందర్భంగా ఆయన వ్యక్తిత్వం, పనితీరుపై ‘న్యూస్‌లైన్’కు విజయమ్మ ఇచ్చిన ఇంటర్వ్యూ...

మూడేళ్లు గడిచిపోయాయా!

ఆయన లేరనుకుంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఆయనుంటే ప్రజలకు భరోసా ఉండేది. కష్టమొస్తే నేరుగా కలిస్తే సాయం లభిస్తుందనే నమ్మకముండేది. ఆయన కూడా ప్రజలకు చాలా చేయాలనుకున్నారు. వారికేం చేయాలనుకున్నా వేగంగా ఆలోచించేవారు, పేదలకు మేలు జరిగే ఏ నిర్ణయంలోనూ ఆలస్యం కూడదన్న గాంధీ హితవే ఆయనకు స్పూర్తి. 1978లో రాజకీయాల్లోకి వచ్చారు. 1983 తర్వాత 21 ఏళ్లు పెద్దగా పదవులేమీ లేవు. అయినా ఏనాడూ ఆయన ప్రజలకు దూరం కాలేదు. రాష్ట్రంలో ఆయన తిరగని ప్రాంతమే లేదు. ఏ ఊరికి ఏ రోడ్డు వెళ్తుందో తెలుసాయనకు. చిన్న చిన్న ఊళ్లన్నీ కూడా ఆయనకు గుర్తే. కొన్ని లక్షల మందిని పేర్లు పెట్టి పిలిచేంత జ్ఞాపకశక్తి. వారానికి ఐదు రోజులు బయటే ఉండేవారు. మిగతా రెండు రోజులు కూడా తర్వాతి వారం ఏం చేయాలన్న ప్లానింగ్‌తో గడిచిపోయేవి. పదవిలో ఉన్నా లేకపోయినా ప్రజల పట్ల ఒకే రకమైన మమకారముండేది.

వెంకటప్ప సార్ ప్రభావం

మా మామగారు రాజకీయాల్లో లేకపోయినా ఎప్పుడూ ప్రజల మధ్యే ఉండేవారు. కొన్ని బై బర్త్ వస్తాయనుకుంటా. వెంకటప్ప గారని టీచర్. ఆయనకు పిల్లల్లేరు. చిన్నప్పటి నుంచీ రాజశేఖరరెడ్డి గారు వాళ్లింట్లోనే పెరిగి చదువుకున్నారు. వెంకటప్ప గారికి కమ్యూనిస్టు భావాలెక్కువ. ఆయన ప్రభావం రాజశేఖరరెడ్డి గారిపై ఉండింది. అందుకే చదువుకునే రోజుల నుంచీ తన ప్రాంత ప్రజలకు ఏదో ఒక మేలు చేయాలని ఆలోచించేవారు. అదే ఆయన్ను రాజకీయాల వైపు నడిపించిందేమో. డాక్టర్‌గా కొందరికే సేవ చేయగలం. రాజకీయాల్లో అయితే ఎందరో పేదల్ని ఆదుకోగలమని అనేవారు. తన ఆలోచనలకు పునాదులేసిన గురువు జ్ఞాపకార్థం పులివెందులలో స్కూలు కట్టించారు.

జలయజ్ఞం.. ఎప్పటి కలో!

గుల్బర్గాలో చదువుకుంటున్నప్పుడు బళ్లారి చుట్టుపక్కల ప్రాంతాల్లో కాల్వలు, పచ్చదనం ఆయన్ను ఎంతో ఆలోచింపజేశాయి. మన ప్రాంతానికీ ఇలా నీళ్లెప్పుడొస్తాయో అని నాతో అనేవారు. పులివెందులకు నీళ్లు తేవాలనే నాటి ఆలోచనే జలయజ్ఞం పథకానికి మూలం. వ్యవసాయమన్నా, రైతులన్నా ఆయనకెంతో ప్రేమ. అందుకే ధైర్యంగా జలయజ్ఞం మొదలుపెట్టారు.

రోల్ మోడల్

మనం మన కోసం కాదు, జనం కోసమేనన్న భావన ఆయన నరనరాల్లో ఇంకిపోయింది. నిజానికి ఆయనో రోల్ మోడల్. ఆయనలో నచ్చే గుణాలు ఒక్కటని చెప్పలేను. మనిషిలో ఎన్ని సుగుణాలున్నాయో అన్నీ ఆయనలో ఉన్నాయి. ఆయనో మంచి టీచర్. పిల్లలకు మంచి తండ్రి. మనవరాళ్లకు మంచి తాతయ్య. మంచి భర్త. అన్నిటికీ మించి మంచి నాయకుడు. డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు గానీ మనుషుల్ని పోగొట్టుకుంటే సంపాదించుకోలేం అనేవారు. అందుకే ఆయనకు జనంతో బాంధవ్యం ఎక్కువ. ఏ సమయంలోనైనా వైఎస్‌ను కలవొచ్చు, ఆయన మన మనిషి అనే విశ్వాసాన్ని జనంలో కలిగించాలనేవారు.

కళ్లలోకి చూసి తెలుసుకునేవారు

సీఎంగా ప్రజా దర్బార్‌లో రోజూ ప్రజల్ని కలిసేవాళ్లు. కళ్లలోకి చూసి వాళ్ల బాధను తెలుసుకునేవారు. బాధలో ఉన్నవాళ్ల కళ్లే మాట్లాడతాయనేవారు. 60 శాతం మంది ఆరోగ్య సమస్యలతోనే వచ్చేవాళ్లు. ఆరోగ్య శ్రీ లేనప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సాయం చేసేవారు. చాలామందికి చార్జీలకు, బట్టలకు, మందులకు సొంత డబ్బులిచ్చి పంపేవారు. ప్రభుత్వ సాయం అందిన తరవాత వారి ఆరోగ్యం గురించి వాకబు చేస్తూ ఉత్తరాలు రాసేవారు. ఆపరేషన్ తరవాత మందులకు డబ్బులు లేవని వాళ్లు రాస్తే పంపేవారు.

కష్టాల్లో వున్నప్పుడే పలకరించాలి

ఆయన ఏం చేయాలనుకుంటే అది చేసేవారు. ఎంతటి కష్టాన్నయినా భరించేవారు. ప్రజల మధ్య తిరిగేవాడికి ఓర్పు, సహనముండాలి, కష్టానికి భయపడకూడదనేది ఆయన తత్వం. ఆయన క ష్టాన్ని చూడడానికి నేను అలవాటు పడిపోయాను. అయితే మండుటెండల్లో పాదయాత్రకు పూనుకున్నప్పుడు మాత్రం నాకు నిజంగా భయమేసింది. ఎన్నడూ దేనికీ అడ్డం చెప్పని దాన్ని మొదటిసారి పాదయాత్రను సెప్టెంబర్‌కు వాయిదా వేసుకోమన్నాను. కానీ ప్రజలు కష్లాల్లో ఉన్నప్పుడే మనం వాళ్ళ దగ్గరకెళ్లాలంటూ బయల్దేరారు. లక్షల మందిని కలుసుకున్నారు. అన్ని వర్గాల కష్టాలను కళ్లారా చూశారు. యాత్ర ముగిశాక జనం కష్టాలు గుర్తు చేసుకుని బాధపడేవారు. ఉచిత విద్యుత్ ఇస్తున్నప్పుడు ప్రధాని సహా అంతా వ్యతిరేకించారు. కానీ రైతులకు ఈ మాత్రం కూడా చేయకపోతే ఎట్లాగంటూ ఆయన అనుకున్నది చేశారు. నెలకు 75 రూపాయల పెన్షన్ కోసం వృద్ధులు మూడు నెలల దాకా ఎదురు చూసేవాళ్లు. వారికి నెల నెలా ఒకటో తేదీకల్లా అందేలా చేసారు. వాళ్లంతా వైఎస్‌ను తమ పెద్ద కొడుకన్నారు. మహిళలకు సాయం చేసినప్పుడు ఓ తండ్రిలా ఆనందించేవారు. మీకు నేనున్నానని అన్ని వర్గాలకూ చెప్పడమే కాదు, చేసి చూపించేవారు. ప్రజల దీవెనలే ఈ రోజు జగన్‌కు శ్రీరామరక్ష.

ప్రజల కోసమే ప్రభుత్వం

మనిషికి ముఖ్యంగా ఏం కావాలో దాన్నే ప్రజలకు ప్రభుత్వమివ్వాలి. అందుకే ఆయన రెండు రూపాయల బియ్యమిచ్చారు. 80 లక్షల ఇళ్లు కట్టించాలన్న ఆయన ఆశ సగమే నెరవేరింది. ఏదైనా సభకు వెళ్లినప్పుడు మాకిది అందలేదని ఎవరూ చెయ్యి ఎత్తకూడదనేవారు. ఆయన సంకల్ప బలానికి తోడు పంటలు బాగా పండాయి. గిట్టుబాటు ధర లేదనో, పన్నులేశారనో ప్రజలు బాధపడింది లేదు. మంచి రాజు, మంచి మనసు ఉంటే ప్రకతి కూడా సహకరిస్తుంది. ఇప్పుడెవరూ మనసుతో ఆలోచించడంలేదు. రైతులకే కాదు, ఎవరికీ కరెంటు లేదు. ఏ వర్గాన్ని కదిలించినా అనేక ప్రశ్నలే. సమస్యలే. బాధలే. జవాబు చెప్పేవాళ్లు, ఆదుకునే వారు లేరు. పేద పిల్లల ఫీజు విషయంలో కూడా పూర్తిగా ఇవ్వలేమంటున్నారు. రాష్ట్రంలో ఎవరూ ఆనందంగా లేరు. సారుంటే ఇట్లా ఉండేది కాదని అంటున్నారు. కానీ ప్రజల కోసం ఇంత చేసిన ఆయన పేరు, బొమ్మ వద్దంటున్నారిప్పుడు. చేయాలనుకునే వాళ్లకు నిజానికి పేర్లు, బొమ్మలు అడ్డొస్తాయా?

సీఎం అయ్యాకే

1978లో ఆయన ఎమ్మెల్యే అయ్యారు. అప్పటి నుంచి సీఎం అయ్యేదాకా కుటుంబ సభ్యులతో పెద్దగా గడిపింది లేదు. ఎప్పుడూ జనంలోనే. సీఎం అయ్యాకే మాతో రోజూ గడిపే అవకాశం వచ్చింది. కనీసం రోజుకు అరగంటయినా మాట్లాడేవారు. అయితే ఏ హోదాలో ఉన్నా, ఎక్కడున్నా రోజూ రాత్రి భోంచేశాక పిల్లల గురించి కనుక్కునేవారు. వాళ్లు మేల్కొని ఉంటే ఫోన్లో మాట్లాడేవారు. వాళ్లంటే ఆయనకు చాలా ఇష్టం. ఏనాడే వాళ్లను ఒక మాటన్నది లేదు. ఇలా ఉండాలి, అలా ఉండాలంటూ ఆంక్షలు పెట్టింది లేదు. క్రమశిక్షణ గురించి మాత్రం చెప్పేవారు. మనకు క్యారెక్టరుండాలని అనేవారు. పై చదువులకు జగన్‌ను అమెరికా పంపాం. నేనుండగలిగాను గానీ ఆయన ఉండలేకపోయారు. జగన్ కూడా నెలకు మించి ఉండలేక వచ్చేశాడు.

మొదట్లో కష్టంగా వుండేది

ఆయన తీరు చూసి మొదట్లో కష్టంగా అనిపించింది. తరవాత అలవాటయింది. సీఎంగా ప్రజల కోసం చేసిన పనులు, ప్రజలు ఆయన్ను అభిమానిస్తున్న తీరు చూసి కారణజన్ముడని అనిపించింది. ఆయన అందరివాడు. అందుకే ఆయన పోయినప్పుడు రాష్ట్రమంతా బాధపడింది. ప్రతి కుటుంబమూ కొడుకునో, అన్ననో, తమ్ముడినో కోల్పోయినట్టుగా విలపించింది. ఆయన మృతిని తట్టుకోలేక 700 మందికి పైగా కన్నుమూశారు.

ఎస్టేటంటేప్రాణం

ఇడుపులపాయ ఎస్టేటంటే ఆయనకు ప్రాణం. చెట్లు, నెమళ్లు, ఆవులను ఎంతగానో ప్రేమించే వారు. సీఎంగా ఉన్నప్పుడు కూడా ఉదయమే ఎస్టేట్ మేనేజర్‌కు ఫోన్ చేసి పశువులెలా ఉన్నాయి, మొక్కలెలా పెరుగుతున్నాయని అడిగి తెలుసుకునేవారు. నెలకో, రెండు నెల్లకో ఒకసారైనా ఇడుపులపాయకొస్తే కలసి వాకింగ్ చేసేవాళ్లం. పసిబిడ్డల ఎదుగుదలను చూసినట్టుగానే చెట్లను చూసేవారు. ఎస్టేట్‌లోని రెండు కొండల మధ్య నుంచి వచ్చే సూర్యోదయం చూడటానికి కుర్చీలు వేసుకుని కూర్చునేవాళ్లం. బిజీగా ఉండి ఎస్టేట్‌కి రావడం కుదరకపోతే హోంసిక్ ఫీలయ్యేవారు.

పంచె కట్టే అందం

పంచె కట్టే ఆయనకు చాలా అందంగా ఉండేది. ఎలా కడతారో గానీ రోజంతా కనీసం నలిగేది కూడా కాదు. ఎక్కడికైనా పోతే విప్పిన బట్టలను ఆయనే ఇస్త్రీ చేసినంత నీట్‌గా మడిచి సూట్‌కేసులో సర్దుకునేవారు. రోజుకు రెండు మూడు సార్లు స్నానం చేసేవారు. అర్ధరాత్రి 1, 2 గంటలప్పుడొచ్చినా విధిగా స్నానం చేసేవారు. ఎప్పుడూ శుభ్రంగా ఉండాలనుకునేవారు. ఇంట్లో కూడా పేపర్ చదివాక చక్కగా మడిచి నీట్‌గా పెట్టేవారు. ఫర్నీచర్ కూడా చిందరవందరగా ఉంటే ఇష్టపడేవారు కాదు. వీలైతే తానే సర్దేవారు. ఎవరి ఇంటికైనా వెళ్తే పేపర్లు,కుర్చీలు, టీపాయ్‌లు అడ్డదిడ్డంగా ఉంటే ‘ఇదిలా ఉంటే బాగుంటుందేమో’ అని వారికి చెప్పి సర్దించేవారు.

వేళకు జరిగి తీరాల్సిందే

రాజశేఖరరెడ్డిగారికి టైం సెన్స్ ఉండేది. ఫలానా సమయానికి ఫలానా చోటికి వెళ్లాలంటే వెళ్లి తీరాల్సిందే. సీఎం కాక ముందు రాత్రి 11కు పడుకుని ఉదయమే ఐదింటికి లేచేవారు. సీఎం అయ్యాక మాత్రం 4.30కే లేచేవారు. 5.30 నుంచి 6.30 వరకు ఇంట్లో అందరితో మాట్లాడేవారు. తర్వాత ప్రజా దర్బార్, ఇతర కార్యక్రమాలు. బయట ఎన్ని టెన్షన్లున్నా ఇంటికొచ్చాక ఆ ప్రభావం పడనిచ్చేవారు కాదు. మాతో బాగా మాట్లాడే వారు. కొన్నిసార్లయితే ఫోన్ కూడా పక్కన పెట్టేసేవారు. ఈ టైం సెన్స్ వల్లే ఆ రోజు (2009 సెప్టెంబరు 2) కుంభవష్టిలోనూ రచ్చబండకు బయల్దేరారు.

కష్టాలే ఎక్కువ

రాజశేఖరరెడ్డి గారి రాజకీయ జీవితంలో కష్టాలే ఎక్కువ. ఎన్టీఆర్ టీడీపీ పెట్టినప్పుడు ఆయన పీసీసీ అధ్యక్షుడిగా ఉండేవారు. జనం ఎన్టీఆర్‌ను దేవునిగా చూసేవారు. అప్పట్లో కాంగ్రెస్‌లో పని చేసేవారు తక్కువ. ఒక్క మీటింగ్ పెట్టాలన్నా చాలా కష్టపడాల్సి వచ్చేది. మండల, పంచాయతీ ఎన్నికలు జరిగినా పీసీసీ అధ్యక్షుడు వెళ్లాల్సిన పరిస్థితి. ఆర్థికంగా పార్టీ సాయపడింది కూడా లేదు. ఆస్తులమ్మి పార్టీ కోసం పని చేశారు. ఇందిర, రాజీవ్‌గాంధీలతో ఆయనకెంతో సన్నిహిత సంబంధాలుండేవి. అయినా కాంగ్రెస్‌లో ఒక అడుగు ముందుకేస్తే పదడుగులు వెనక్కు లాగేవారు. రాజీవ్ ఆయన్ను కేంద్రంలోకి రావాలని పిలిచినా పెద్దగా చేసిందేమీ లేదు. 1989లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు అంతా రాజశేఖరరెడ్డి గారు సీఎం అవుతారని భావించారు. 

అయినా అధిష్టానం అవకాశమివ్వలేదు. 1989-94 మధ్య కోట్ల విజయభాస్కరరెడ్డి సీఎంగా ఉండగా మా మైనింగ్ లీజులు రద్దు చేశారు. అయినా ఆయన ఏనాడూ భయపడలేదు. ఆయనకు విల్‌పవర్ ఎక్కువ. ఎన్టీఆర్, బీజేపీ వాళ్లు కూడా ఆయన్ను వాళ్ల పార్టీలోకి పిలిచారు. ఎన్ని ఇబ్బందులెదురైనా ఆయన కాంగ్రెస్‌ను విడిచి పోవాలని అనుకోలేదు. 2004 నాటికి వైఎస్‌కు రాష్ట్రంలో తిరుగులేని అభిమానం, ప్రజా బలం లభించాయి. ఇప్పుడు కూడా ఆయన్ను సీఎంగా చేయకపోతే వేరే పార్టీ పెడతారేమోననే అభద్రతా భావంతోనే కాంగ్రెస్ అధిష్టానం సీఎం చేసింది. 2009లో పార్టీని ఒంటిచేత్తో నడిపించి మరోసారి సీఎం అయ్యే అవకాశం ఆయనే తెచ్చుకున్నారు. ఆయనలాగే మేం కూడా కాంగ్రెస్‌ను విడిచి పోవాలని ఏనాడూ అనుకోలేదు. చెప్పుడు మాటలు వినే కాంగ్రెస్ అధిష్టానం తీరు వల్లే అనివార్యంగా బయటకు రావాల్సి వచ్చింది. వివేకానందరెడ్డికి మంత్రి పదవి వచ్చినందుకు మేము కూడా ఎంతో సంతోషించాం. కానీ దాన్ని ఆయుధంగా చేసుకుని మా కుటుంబంలో చీలిక తేవాలనుకోవడం మమ్మల్ని బాధపెట్టింది. దాంతో పార్టీ వీడక తప్పలేదు.

నాయనలా బతుకుతానన్నాడు

ఆయన ఎప్పుడూ ప్రజల్లోనే ఉండటం, రాజకీయంగా పడుతున్న ఇబ్బందులు చూసి ఒకరోజు నేను జగన్‌తో ‘‘నాయనతో మనం ఎక్కువగా గడపలేకపోతున్నాం. ఆయన కూడా ఫ్యాక్టరీలు పెట్టి కాలు మీద కాలు వేసుకుని కూర్చోవచ్చు కదా. మనకెందుకీ ఇబ్బందులు?’’ అని అన్నాను. అప్పుడు జగన్, ‘నాయన ప్రజల కోసం బతుకుతున్నాడు. నేను కూడా నాయన లాగే బతకాలనుకుంటున్నాను’ అని చెప్పాడు.

పాత పాటలంటే ఇష్టం

రాజశేఖరరెడ్డి గారికి పాత పాటలంటే చాలా ఇష్టం. తీరిక దొరికినప్పుడు, కారులో వెళ్లేటప్పుడు వాటిని వినేవారు. తీరిక లేకపోవడం వల్ల పెద్దగా సినిమాలు చూసేవారు కాదు.

మా నాయన పెట్టిన పేరది

మా నాయనకు జాతకాల మీద బాగా గురి. వాటి గురించి ఆయనకు బాగా తెలుసు. జగన్ పుట్టినప్పుడు టైం, నక్షత్రాలు అన్నీ లెక్క చూసి ‘జ’తో పేరు పెట్టాలని నిర్ణయించారు. జగన్నాథరెడ్డి, జయసింహారెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి అని నాలుగైదు పేర్లు చెప్పారు.

పాస్ మార్కులేనని బాధపడ్డారు

2009లో కనీసం 185 సీట్లు వస్తాయని ఆయన గట్టిగా నమ్మారు. జనం 156 సీట్లే ఇచ్చారు. ఇన్ని సంక్షేమ, అభివద్ధి పథకాలు అమలు చేసినా జనం పాస్ మార్కులే ఇచ్చారని బాధపడ్డారు. పథకాలన్నీ జనానికి పూర్తిగా చేరడం లేదని గ్రహించి, వారికి మరింత దగ్గరవడం కోసమే రచ్చబండ రూపొందించారు.

వస్తారనుకున్నాం

2009 సెప్టెంబరు 2న కుంభవృష్టిలోనే రచ్చబండ కోసం చిత్తూరు బయల్దేరుతున్నారు. ఇంత వానలోనూ పోవాలా అని అడిగాను. జనం తనకోసం ఎదురు చూస్తుంటారని చెప్పి బయల్దేరారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ప్రేయర్ ముగించుకుని కిందకొస్తే, ఆయన హెలికాఫ్టర్ మిస్సయిందని చెప్పారు. ఆయనకేమీ కాదని, క్షేమంగా వస్తారని అనుకున్నా. కొంతసేపటి తర్వాత టీవీ పెడితే రకరకాల వార్తలొస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కాక రూములోనే కూర్చుండిపోయాను. రాత్రంతా గడిచింది. అయినా ఆయన తిరిగి వస్తారనే నమ్మకంతోనే ఉన్నాను. మర్నాడు ప్రేయర్ జరుగుతుంటే జగన్ బాబు, కేవీపీ వచ్చి హెలికాప్టర్ కూలిపోయిన విషయం చెప్పారు. నేను నమ్మలేదు. అక్కడికి పోదామన్నాను. వాళ్లు అలాగేనన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకేమీ గుర్తు లేదు. ఇప్పటికీ ఆయన ఫొటోను తదేకంగా ఒకట్రెండు నిమిషాలు చూస్తే నా కళ్లలో నీళ్లొస్తాయి (కళ్లలో సుడులు తిరిగాయి). అందుకే ఆయన ఫొటోను కూడా నేను ఎక్కువగా చూడను.

వెంటనే సీఎం అయ్యుంటే ఎవరేమిటో తెలిసేది కాదు

ఆయన చనిపోతూనే జగన్ బాబు సీఎం అయ్యుంటే ఎవరు ఎవరో, ఎవరేమిటో తెలిసేది కాదు. దేవుడు ఓదార్పు యాత్ర ఎందుకు చేయమని చెప్పాడో! జగన్ పెరిగిన వాతావరణం కాంగ్రెస్‌కు సరిపోదనుకుని దేవుడే మమ్మల్ని బయటకు తెచ్చాడేమో! మంచి రాజు కావాలంటే ప్రజల కష్టసుఖాలు బాగా తెలిసుండాలి. అందుకే అవి తెలుసుకోవడానికే దేవుడు జగన్‌ను ఇలా నడిపిస్తున్నాడు. ఆయన చనిపోయినప్పుడు క్యాంప్ ఆఫీసులో కుటుంబీకులమంతా ఒకచోట కూర్చుని ఏడ్చే పరిస్థితి కూడా లేదు. ఇంట్లో ఎక్కడ చూసినా ఆయన కోసం వచ్చిన జనమే. ఆ తర్వాత కూడా జనం మమ్మల్ని ఓదార్చడానికి రోజూ వేలాదిగా క్యాంప్ ఆఫీసుకు వచ్చారు. అంత బాధలో కూడా జగన్ బాబు బయట నిలబడి వచ్చిన వారందరినీ పలకరించి పంపాడు. 

మనల్ని ఓదార్చడానికి ఇంతమంది వస్తే, నాయన కోసం చనిపోయిన వారి ఇళ్లకు వెళ్లి ఆ కుటుంబాలను పలకరించి ఓదార్చాల్సిన బాధ్యత మనకుంది కదా అని జగన్ ఆనాడే చెప్పాడు. ఇది రాజకీయంతో సంబంధం లేకుండా దేవుడిచ్చిన ఆజ్ఞ. అందుకే నల్లకాల్వలో ఓదార్పు యాత్ర ప్రకటన చేశాడు. మాటకు కట్టుబడి యాత్ర చేయాలనుకున్నాం. కాంగ్రెస్ అధిష్టానానికి మా వ్యతిరేకులు పితూరీలు మోశారు. సోనియా ఓదార్పు యాత్ర వద్దన్నారు. జిల్లాకో చోట విగ్రహం పెట్టి అక్కడికే అందరినీ పిలిపించి పలకరించి పంపమన్నారు. ఆ మాటలు మమ్మల్నెంతో బాధపెట్టాయి. మాటిస్తే తప్పని వ్యక్తి కొడుకుగా జగన్ కూడా మాట మీదే నిలవాలనుకున్నాడు. 

ఆ ప్రయత్నంలో ఎన్ని కష్టాలొచ్చినా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాం. అప్పటికి మేం కాంగ్రెస్‌లోనే ఉన్నాం. జగన్ ఓదార్పు యాత్రకు రావద్దన్నా మంత్రులు, ఎమ్మెల్యేలు చాలామంది స్వచ్ఛందంగా వచ్చారు. వైఎస్‌కు గుండెల్లో గూడు కట్టుకున్న ప్రజలు జగన్ బాబును ఎంతగానో ఆదరించారు. ఓదార్పు యాత్ర ఇలా జరుగుతుందనీ, ఇంత అభిమానం కురుస్తుందనీ మేం కూడా అనుకోలేదు. ఆ తర్వాత మమ్నల్ని ఎలా ఇబ్బంది పెట్టారో, మేమెందుకు బయటికొచ్చి పార్టీ పెట్టామో అందరికీ తెలుసు. ప్రజల కోసం అన్నీ చేయాలని కలలు గన్న రాజశేఖరరెడ్డి గారి కోరికలో దేవుడు జగన్‌కూ భారం పెట్టాడు. ప్రజల కష్టసుఖాలను దగ్గరిగా చూసి వారి బాధలు పంచుకున్న జగన్‌ను సీఎం చెయ్యాలని జనం డిసైడయ్యారు. అతను కూడా నాన్న ప్రారంభించిన పథకాలు, ప్రాజెక్టులు పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నాడు. పూర్తి చేస్తాడు. అందుకు నేను చేయగలిగినంతా చేస్తాను. నేను దేవున్ని నమ్ముతాను. ఆయన ఏ తప్పూ చేయలేదు. జగన్ కూడా ఏ తప్పూ చేయలేదు. న్యాయం, ధర్మం మా పక్షానున్నాయి. దేవుడి దయతో జగన్‌బాబు త్వరలోనే బయటకొస్తాడు.

తప్పును అంగీకరించేవారు

రాజశేఖరరెడ్డి గారికి సెల్ఫ్ చెకింగ్ ఎక్కువ. తాను తప్పు చేశానా, ఒప్పు చేశానా అని చెక్ చేసుకునేవారు. తప్పు చేసినట్టు అనిపిస్తే సరిచేసుకునే వారు. తప్పును అంగీకరించేవారు కూడా. ప్రజల కోసం ఏదైనా చేయాలనుకుంటే ఎవరేమనుకున్నా భయపడేవారు కాదు.
ఇద్దరిదీ ఒకటే గుణంపజలతో వ్యవహరించే విధానం, వారిని ఆప్యాయంగా పలకరించే తీరులో రాజశేఖరరెడ్డి గారు, జగన్‌ది ఇద్దరిదీ ఒకటే గుణం. ఆయనలాగే జగన్ కూడా జనానికి దగ్గరయ్యాడు. వారితో ఆత్మీయత పంచుకుంటున్నాడు. ‘‘నేను 30 ఏళ్లు కష్టపడి సంపాదించిన జనాన్ని, మంచి పేరును నువ్వు మరింత పెంచుకోవాలి’’ అని 2009లో జగన్‌ను పోటీ చేయించేప్పుడు ఆయన చెప్పారు. జగన్ దాన్ని నిజం చేస్తున్నాడు. రెండున్నరేళ్లుగా జనంలోనే ఉంటూ, రాజశేఖరరెడ్డి గారు ఇచ్చి వెళ్లిన కుటుంబాన్ని (ప్రజలను) తన కుటుంబంగా భావిస్తున్నాడు. జగన్ కష్టం చూస్తే బాధనిపిస్తుంది. కానీ ఇది వాళ్ల నాన్న ఆశయ సాధనకు, పేదలకు మేలు చేయడానికి చేస్తున్న కష్టం కాబట్టి నన్ను నేనే తమాయించుకుంటాను.

కృతజ్ఞత ఉండాలి

తన మనుషులనుకునే వారికి ఎందరికి రాజశేఖరరెడ్డి గారు ఎంత సాయం చేశారో ప్రజలకు తెలుసు. ఎంతమందికి రాజకీయ జీవితం ఇచ్చారో కూడా తెలుసు. మనుషులకు కృతజ్ఞత ఉండాలి. అది లేనివారి విషయాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. అదేమో గానీ రాజశేఖరరెడ్డి గారు సాయం చేసిన చాలామంది ఆయన నెత్తినే చెయ్యి పెట్టేవారు. కానీ దేవుడే ఆయనకు అండగా నిలిచాడు.

మూడేళ్లు గడిచినా...

రాజశేఖరరెడ్డి గారు మరణించి అప్పుడే మూడేళ్లు గడుస్తున్నా ఆయన లేరనే విషయాన్ని ఎవరూ నమ్మలేకపోతున్నారు. ప్రజలు ఆయన్ను తమ మనసుల్లో పదిలం చేసుకున్నారు. వారి అభిమానాన్ని మా కుటుంబం ఎన్నటికీ మరచి పోలేదు. రాజశేఖరరెడ్డి గారు ప్రజలకు ఏ మేళ్లు చేయాలనుకున్నారో అవన్నీ నెరవేర్చడానికి మేం కట్టుబడి ఉన్నాం. మా కుటుంబం మీద ఇంత అభిమానం చూపుతున్న రాష్ట్ర ప్రజలందరికీ కృతజ్ఞతలు. 

టీడీపీకి చెంగల గుడ్‌బై.అక్టోబర్ 15 తర్వాత వైఎస్సార్‌సీపీలో చేరతా

కులాలు, ప్రాంతాల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నారు
ఎస్సీ వర్గీకరణ పేరుతో కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు
ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్నారు.. తర్వాత సమైక్యవాదం పేరుతో
సీమాంధ్ర నేతలను రెచ్చగొట్టారు.. ఇప్పుడు తెలంగాణ పాట పాడుతున్నారు
నందమూరి వారసులను అణగదొక్కుతున్నారు

నక్కపల్లి/పాయకరావుపేట (విశాఖపట్నం), న్యూస్‌లైన్: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకటరావు శనివారం ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అక్టోబరు 15 దాటిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. శనివారం పాయకరావుపేట లక్ష్మీ ఫంక్షన్ హాల్‌లో ఆయన నియోజక వర్గ స్థాయి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీలో తనకు జరుగుతున్న అవమానం భరించలేక, చంద్రబాబు నాయుడి వైఖరి నచ్చక పార్టీని వీడుతున్నానన్నారు. అందుకు దారితీసిన పరిస్థితులను తన అనుచరులకు వివరించి, టీడీపీని వీడుతున్నట్టు ప్రకటించారు. అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కులం కార్డును ఉపయోగించి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

బాబూ అధికారంలో ఉన్నపుడేం చేశారు?

ప్రస్తుతం బీసీ డిక్లరేషన్ గురించి మాట్లాడుతున్న చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదని చెంగల ప్రశ్నించారు. బీసీలపై అంత ప్రేమ ఉన్నప్పుడు రాజ్యసభ సీటును బీసీలకు చెందిన యనమల రామకృష్ణుడికి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిని చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణను తెరపైకి తెచ్చిన చంద్రబాబు కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయాలు చేయాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మాలలు టీడీపీకి ఓటేయలేదా అని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుని తెలంగాణకు అనుకూలంగా లెటర్ ఇచ్చి తిరిగి సీమాంధ్ర నాయకులను రెచ్చగొట్టి సమైక్యవాదం పేరుతో ధర్నాలు, ఆందోళనా కార్యక్రమాలను ప్రోత్సహించారని ఆరోపించారు. మళ్లీ ఇప్పుడు తెలంగాణ పాట పాడుతున్నారని విమర్శించారు. 

తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్‌టీఆర్ కుటుంబాన్ని అణగదొక్కాలని ప్రయత్నిస్తున్నారని, వారసుడిగా తన కుమారుడినే ప్రతిపాదిస్తున్న చంద్రబాబు, పార్టీ వ్యవస్థాపకులైన ఎన్‌టీఆర్ కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించడంలేదన్నారు. చంద్రబాబును ప్రజలు రెండు పర్యాయాలు తిరస్కరించారని, ఆయన నాయకత్వంపై ప్రజల్లో విశ్వాసం పోయిందన్నారు. ఎన్‌టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ బతికి బట్టకట్టాలంటే బాలకృష్ణను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్‌తో చంద్రబాబు మ్యాచ్‌ఫిక్సింగ్..

కాంగ్రెస్‌ను ఎన్‌టీఆర్ ఆగర్భ శత్రువుగా చూశారని, అదే పార్టీతో చంద్రబాబు మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకున్నారని చెంగల ఆరోపించారు. కాంగ్రెస్‌తో చేతులు కలిపి వైఎస్సార్ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ఎన్ని కుట్రలు పన్నినా జగన్ తన సచ్ఛీలతను నిరూపించుకుంటారన్నారు. 2014లో జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని కోట్లాది మంది ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 220 స్థానాలు కైవసం చేసుకుని అధికారంలోకి రావడం ఖాయమన్నారు. చంద్రబాబు అవలంబిస్తున్న విధానాల వల్ల పార్టీ నానాటికీ దిగజారిపోతోందన్నారు. త్వరలో తెలుగుదేశం పార్టీని చంద్రబాబు కాంగ్రెస్‌లో విలీనం చేయడం ఖాయమన్నారు.

వైఎస్సార్‌సీపీలో చేరుతున్నా

పూర్తిగా భ్రష్టుపట్టిన కాంగ్రెస్ ప్రక్షాళన అసాధ్యం.. అందుకే ఆ పార్టీని వీడుతున్నా
9న రాయగిరిలో నా అభిమానులతో సమావేశం

భువనగిరి టౌన్(నల్లగొండ), న్యూస్‌లైన్: కాంగ్రెస్ పార్టీ పూర్తిగా భ్రష్టు పట్టిపోయిందని, అందులో ప్రక్షాళన జరగడం అసాధ్యమని, అందువల్ల తాను ఆ పార్టీని మనోపూర్వకంగా వదిలి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని మాజీ మంత్రి, సీనియర్ నేత ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి తెలిపారు. శనివారం భువనగిరి రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాను ఎలాంటి పదవులు, ప్రలోభాలను ఆశించి వైఎస్‌ఆర్ సీపీలోకి రావడం లేదన్నారు. మహాత్మా గాంధీ, వల్లభాయి పటేల్, సంజీవరెడ్డిలాంటి నాయకుల స్ఫూర్తితో ప్రజాసేవ చేయడమే లక్ష్యంగా నిర్ణయించుకున్నానని తెలిపారు. తాను ఎలాంటి పదవులకూ పోటీ చేయనని, పార్టీలో సామాన్య కార్యకర్తగా పనిచేస్తూ జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వెల్లడించారు. ఈ నెల 9న భువనగిరి మండలం రాయగిరిలో జిల్లాస్థాయి వైఎస్సార్ అభిమానులతో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

సీఎంకు అవగాహన లేకనే అనిశ్చితి..

ఏ మంత్రి పదవినీ నిర్వహించని కిరణ్‌కుమార్‌రెడ్డి అవగాహన లోపం వల్ల పరిపాలన చేయలేకపోతున్నారని, అందుకే కచ్చితమైన నిర్ణయాలు తీసుకోకుండా చీటికీ మాటికీ భయపడి ఢిల్లీకి వెళుతున్నారని, దీనివల్ల రాజకీయ అనిశ్చితి ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఉప్పునూతల విమర్శించారు. రాష్ట్రంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రితోపాటు కేబినేట్‌లోని పలువురు మంత్రులకు తాను టికె ట్‌లు ఇప్పించడం వల్లే పోటీ చేసి ఈ స్థాయికి వచ్చారన్నారు. నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ముందు చేతులు కట్టుకొని నిలబడిన నేటి ముఖ్యమంత్రి, మంత్రులే ఇప్పుడు ఆయన పేరు, ఫొటోలు తొలగించాలని చూడడం సిగ్గుచేటన్నారు. వైఎస్‌ఆర్ నిర్ణయాలు ప్రతి కుటుంబానికీ మేలు చేశాయన్నారు. ఆయన తీసుకున్న నిర్ణయాల వల్లే నేడు విద్యార్థులు, యువకులు ఉత్సాహంతో ఆయన కుమారుడు స్థాపించిన పార్టీలో చేరుతున్నారని చెప్పారు.

రాజీవ్‌నెలా ప్రధానిని చేశారు?: వైఎస్ మరణానంతరం జగన్ సీఎం కావాలని 154 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేసినా, ఆయనకు పరిపాలన అనుభవం లేదని కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకుందని ఉప్పునూతల విమర్శించారు. అదే మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మరణించినప్పుడు పరిపాలన అనుభవం లేని రాజీవ్‌గాంధీని ప్రధానమంత్రిని ఎందుకు చేశారని ఆయన ప్రశ్నించారు. జగన్ 5.40 లక్షల ఓట్ల మెజార్టీతో గెలవడం అంటే అతడు సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పడానికి నిదర్శనమన్నారు. సోనియాగాంధీ రాష్ట్రంలో పర్యటించినప్పుడు వైఎస్ పరిపాలన సమర్థవంతంగా ఉందని, ఆయనను ఆదర్శంగా తీసుకొని మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరిపాలన చేయాలని కొనియాడారన్నారు. అలాంటి వారే నేడు జగన్‌ను రాజకీయంగా ఎదగకుండా జైల్లో పెట్టారని, అతడిపై ఒత్తిడి తీసుకువస్తున్నారని అన్నారు. అయినా, ప్రజల నుంచి ఆయనకు ఉప్పెనలా ఆదరణ లభిస్తోందన్నారు. ప్రస్తుత తరుణంలో ప్రజలు జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నారని, సర్వేలు కూడా జగన్ గెలుపునే సూచిస్తున్నాయని అన్నారు.

ఫీజుపై విజయమ్మ పోరు. 6, 7 తేదీల్లో నిరాహార దీక్ష

రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నీరుగారుస్తున్నందుకు నిరసన
బీసీలు, నిరుపేదలను అడ్డుకునేందుకే ప్రభుత్వం అనేక నిబంధనలు పెట్టిందని వైఎస్సార్ కాంగ్రెస్ మండిపాటు.. శాచ్యురేషన్ స్థాయిలో అమలుకు డిమాండ్
ఫీజులపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ విజయమ్మ దీక్ష చేయడం ఇది రెండోసారి

హైదరాబాద్, న్యూస్‌లైన్: ప్రజా సమస్యలపై పోరాటాల పరంపరలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి పాలకుల కళ్లు తెరిపించేందుకు సిద్ధమైంది. విద్యార్థుల ఫీజుల రీయింబర్స్‌మెంట్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నీరుగారుస్తున్నందుకు నిరసనగా పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ దీక్షను చేపడుతున్నారు. హైదరాబాద్‌లో ఈ నెల 6, 7 తేదీల్లో రెండ్రోజులపాటు ఆమె నిరాహార దీక్ష చేయాలని సంకల్పించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రవేశ పెట్టిన ఒక్కో పథకాన్ని ప్రభుత్వం కుంటిసాకులతో నీరుగారుస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొలినుంచి చెబుతోంది. బీసీలు, నిరుపేదలను ఉన్నత విద్యకు దూరం చేసేలా ప్రభుత్వం తాజాగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు పలు నిబంధనలు పెట్టి అడ్డుకుంటున్నందుకు నిరసనగా ఈ దీక్ష చేస్తున్నట్టు పార్టీ ప్రకటించింది. శాచ్యురేషన్ (సంతృప్తస్థాయిలో) స్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్ అందరికీ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ విజయమ్మ దీక్ష చేపట్టడం ఇది రెండోసారి. ఇంజనీరింగ్, మెడిసిన్, ఇతర వృత్తి విద్యాకోర్సులు చదవాలనుకుంటున్న విద్యార్థులకు ఫీజుల ఖరారులో జాప్యాన్ని నిరసిస్తూ ఏలూరులో ఆమె ఆగస్టు 13, 14 తేదీల్లో నిరాహార దీక్ష చేశారు. అయినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా ఈ పథకం కింద లబ్ధి పొందే విద్యార్థుల విషయంలో పరిమితులను విధించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గత ఏడాది ఫిబ్రవరి 18 నుంచి 24వ తేదీ వరకూ ఏడు రోజుల పాటు హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద ఫీజు పోరు పేరుతో నిరాహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే.

పాలకులు ఇప్పటికైనా నిద్ర లేవాలి

ఫీజుల పథకంపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా విజయమ్మ చేస్తున్న దీక్షతోనైనా పాలకులు మేల్కొనాలని ఆ పార్టీ సీజీసీ సభ్యుడు, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. పేద విద్యార్థుల చదువుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతి పేద విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించాలన్న సదుద్దేశంతో వైఎస్ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ప్రస్తుత పాలకుల చేతకానితనం కారణంగా ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నిర్వీర్యమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టకు పోకుండా ఫీజుల పథకాన్ని శాచ్యురేషన్ పద్ధతిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు

వైఎస్ నిర్ణయాలు మేలు చేశాయి: ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి

నల్గొండ: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు మేలు చేశాయని కాంగ్రెస్ పార్టీ నేత ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్ రెడ్డికి గతంలో మంత్రిగా చేసిన అనుభవం లేకపోవడంతో రాష్ట్రం అనేక సమస్యల్లో చిక్కుకుందన్నారు. అనుభవ లేమి కారణంతోనే రాష్ట్రంలోని యంత్రాంగం స్తంభించిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు.

ఫీజు ప్రభుత్వమే భరించాలి: విజయమ్మ

హైదరాబాద్: పేద విద్యార్థుల ఫీజు మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని వైఎస్ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై వైఎస్‌ఆర్‌సీపీ ఉద్యమబాట చేపట్టనున్నట్టు విజయమ్మ తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వ తీరు నిరసిస్తూ ఈ నెల 6, 7న హైదరాబాద్‌లో నిరాహారదీక్ష చేపట్టనున్నట్టు విజయమ్మ తెలిపారు. పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వర్తింపచేయాలని ప్రభుత్వానికి విజయమ్మ సూచించారు.

కాంగ్రెస్ పరిస్థితి దారుణం: రాయపాటి

రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా తయారైందని ఎంపీ రాయపాటి సాంబశివరావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీని ఆ భగవంతుడే కాపాడాలని రాయపాటి అన్నారు. ప్రస్తుత రాజకీయాలకు తాను సరిపోనని.. అయితే త్వరలోనే రాజకీయ సన్యాసంపై ఓ నిర్ణయం తీసుకుంటానని ఎంపీ రాయపాటి అన్నారు. కేంద్రంలో ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందో తెలియని పరిస్థితి ఉందని.. అయితే 2014 సంవత్సరం వరకు ప్రభుత్వాన్ని లాగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.

వైఎస్సార్ విగ్రహాల ఏర్పాటుకు అడ్డంకులు

తిరుపతి: చిత్తూరు జిల్లాలోని చంద్రగిరిలో వైఎస్సార్ విగ్రహాల ఏర్పాటుకు పోలీసులు అడుగడునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. విగ్రహాల ఏర్పాటు చేస్తున్న వైఎస్సార్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటూ ఆటంకాలు సృష్టిస్తున్నారు.భారీగా పోలీసులను మోహరించి విగ్రహాల ఏర్పాటును అడ్డుకుంటున్నారు. రేపు వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా150 విగ్రహాల ఏర్పాటుకు వైఎస్సార్‌సీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి సర్వ సిద్ధం చేశారు. దీనిలో భాగంగా చంద్రగిరిలో విగ్రహాల ఏర్పాటు చేస్తుండగా పోలీసులు విగ్రహాల ఏర్పాటును అడ్డుకున్నారు. సర్కారు విగ్రహాల ఏర్పాటును అడ్డుకోవడం ఎంత మాత్రం సమంజసం కాదని వైఎస్సార్‌సీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.

పేద ప్రజలకు మూడు పూటలా అన్నం పెట్టిన వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డని, అటువంటి మనిషి విగ్రహాల ఏర్పాటును అడ్డుకోవడం ఎంత మాత్రం సమంజసం కాదని భాస్కరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ విగ్రహాల ఏర్పాటుకు మూడ అడుగుల స్థలం ఇవ్వకపోవటం బాధాకరమని ఆయన అన్నారు.

'విజయమ్మ ఓటు అడిగితే కాదంటారా?'

గుంటూరు: కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు భయపడుతుంటే..ఎన్నికలు పెట్టాలని అడగడానికి చంద్రబాబు భయపడుతున్నాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. టీడీపీ - కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయి, వైఎస్ విజయమ్మ ఓటు అడిగితే కాదనే వ్యక్తి ఉంటాడా అని అంబటి అన్నారు.

వంగవీటి మోహనరంగా బతికున్న రోజుల్లో కాంగ్రెస్ నుంచి బయటకు పంపేందుకు కొందరు ప్రయత్నించగా వైఎస్‌ఆర్ అండగా ఉన్నారని అంబటి తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు అంబటి, లేళ్లఅప్పిరెడ్డి, రామివెంకటరమణ సమక్షంలో 200 మంది వైఎస్‌ఆర్ సీపీలో చేరారు.

మరణానంతర జీవితం!

babu On 9/1/2012 7:39:00 PM
‘జీవితానికి ముగింపుగా మనం భావించే రోజు, నిజానికి అమరత్వానికి తొలి రోజు!’ అన్నాడట -క్రీస్తుకు సమకాలికుడయిన రోమన్ తత్వవేత్త, నాటకకర్త, రాజనీతిజ్ఞుడు- సెనెకా.

ఇది ఎందరి విషయంలో నిజమయిందో ఏమో తెలియదు. అయితే, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విషయంలో మాత్రం సెనెకా మాట నూటికి నూరుపాళ్లు నిజమయింది. సరిగ్గా మూడేళ్ల కిందట సెప్టెంబర్ రెండో తేదీన వైఎస్‌ఆర్ విమానం కూలి మరణించిన నాటినుంచీ, ఆయన ప్రజల హృదయాల్లో సజీవంగా స్థిరపడిపోయారు. ఈ నాటికీ, జనహృదయాల్లో వైఎస్‌ఆర్ చిరంజీవిగా నిలిచే ఉన్నారు. ‘మరణానంతర జీవితం’ అంటే ఇదేనేమో!

మనమందరం మర్త్యులం. అంటే, ఏదో ఒకనాడు మరణించేవాళ్లమే. కానీ, మనలో కొందరు దశాబ్దాలూ, శతాబ్దాలూ, సహస్రాబ్దాలూ ‘జీవించడం’ చూస్తూనే ఉంటాం. ఒక వ్యక్తి, మరణించిన తర్వాత సైతం జనజీవనంలో సజీవంగా మిగలడం -అనుకున్నంత, అన్నంత- ఆషామాషీ కాదు. అతగాడి వల్ల సమాజ జీవనం ప్రగాఢంగా ప్రభావితం అయితే తప్ప ఈ ఫలితం సాధ్యంకాదు. మనిషికి నిప్పు చేసుకోవడం నేర్పిన ప్రొమిథియస్‌ను మానవజాతి మరువలేదు. వరద ముప్పు నుంచి మానవాళిని కాపాడిన గిల్గమేష్‌ను మనుషులు మర్చిపోలేదు.

మధ్య ప్రాచ్యంలో వ్యవసాయ నాగరికతకు చాళ్లేసిన ఆదిమ మానవులను మనం ఎన్నటికీ మరువలేం. ఒకఫాదర్ డామియెన్‌నూ, ఒక ఫ్లారెన్స్ నైటింగేల్‌నూ, ఒక నార్మన్ బెత్యూన్‌నూ, ఒక కోట్నిస్‌నూ మర్చిపోయిన నాడు మనం మనుషులమనిపించుకోం. వాళ్లందరూ అమరులయి మన మధ్యనే జీవిస్తున్నారు!

సమకాలీన తెలుగు చరిత్రలో అమరత్వం సిద్ధింపచేసుకున్న రాజనీతిజ్ఞుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. నాలుగు సార్లు లోక్‌సభకూ, అయిదుసార్లు అసెంబ్లీకి ఎన్నికయినందువల్లనో- 1980-83 సంవత్సరాల మధ్యకాలంలో మూడు మంత్రిత్వ శాఖలు నిర్వహించినందుకో- 2004-09 సంవత్సరాల మధ్యకాలంలో రెండుసార్లు ముఖ్యమంత్రి పదవిని అధిష్టించి కడదాకా ఆ పదవిలో ఎదురులేకుండా కొనసాగినందుకో వైఎస్‌ఆర్కు అమరత్వం సిద్ధించలేదు.

2009 సెప్టెంబర్ రెండో తేదీన ఆయన కన్నుమూసినప్పుడు బీబీసీ వార్తాసంస్థ ప్రకటించినట్లుగా- మన రాష్ట్రంలోని అనేక సంక్షేమ పథకాలకు మారుపేరుగా నిలిచినందువల్లనే వైఎస్‌ఆర్ అమరుడయ్యారు. ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిననాడే ఉచిత విద్యుత్తుఫైలుపై తొలి సంతకం చేసి తన విశ్వసనీయతను మరోసారి రుజువు చేసుకున్నారు వైఎస్‌ఆర్. ఆరోగ్యశ్రీ, 108, పావలా వడ్డీ, ఇందిరమ్మ ఇళ్లు, రెండు రూపాయలకు కిలో బియ్యం, వరికి కనీస మద్దతు ధర, ఫీజు రీయింబర్స్‌మెంట్, గ్రామీణ ఉపాధి పతకం సమర్థ నిర్వహణ- ఇవి వైఎస్‌ఆర్హయాంలో అమలయిన సంక్షేమ పథకాల్లో కొన్ని మాత్రమే!

గ్రామీణ పేదరికం నిర్మూలించడం లక్ష్యంగానే ఈ పథకాలన్నీ రూపుదిద్దుకోవడం విశేషం. ఇక, రైతులకు సాగునీటి కొరత సమస్యను సమూలంగా పరిష్కరించే దిశగా చేపట్టిన జలయజ్ఞం ఈ పథకాలకు తలకట్టులాంటిది. వైఎస్‌ఆర్ ను ప్రజా హృదయ సీమలో సుస్థిరంగా ప్రతిష్ఠించిన పథకాలివి.

వైఎస్‌ఆర్ మరణవార్త విన్న వెంటనే కొన్ని వందల గుండెలు ఆగిపోయాయి. మరెందరో దుఃఖభారం భరించలేక ప్రాణాలు వదిలేశారు. అలా కన్నుమూసిన వారందరి కుటుంబ సభ్యులనూ వారివారి ఇళ్లకు వెళ్లి పరామర్శిస్తానని వైఎస్‌ఆర్ కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నల్లకాలువ బహిరంగ సభలో ప్రకటించారు. చెప్పినట్లే ఓదార్పు యాత్ర ప్రారంభించారు. కాంగ్రెస్ అధిష్టానం మొదలుకుని ఇక్కడి చిల్లర దేవుళ్ల వరకూ ఎందరెన్ని అభ్యంతరాలు లేవదీసినా వైఎస్ జగన్ వెనక్కు తగ్గలేదు. ఈ ప్రవృత్తి ఆయనకు తండ్రి నుంచి సంక్రమించింది. ఆ వారసత్వం అలా కొనసాగుతోనే ఉంది!

వైఎస్‌ఆర్‌ను ఇడుపులపాయలో నిద్రిస్తున్న ఈ అవిశ్రాంత యోధుడని ఎవరో అభివర్ణించారు. వాస్తవానికి వైఎస్‌ఆర్ లేని చోటే లేదీ రాష్ట్రంలో. ప్రతి గ్రామంలోనూ, ప్రతి ఇంట్లోనూ వైఎస్‌ఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల లబ్ధిదారు కనీసం ఒక్కరయినా ఉంటారు. వారి గుండెలో వైఎస్‌ఆర్ సజీవంగా నిలిచే ఉంటారు. అమరత్వం సిద్ధింపచేసుకోవడమంటే ఇదే కదా! ఇంతకు మించిన మరణానంతర జీవితం మరేముంటుంది?

'జీవితాన్ని సంపూర్ణంగా జీవించు! ఎంత సంపూర్ణంగానంటే, అర్ధరాత్రి మృత్యువు దొంగలా నిన్ను చేరే వేళకు తన చేతికి ఏమీ దక్కకూడదు సుమా!’ అన్నారెవరో కవిగారు. అంత సంపూర్ణంగా జీవితాన్ని గడపగలిగే వారు ఎందరో ఉండరు. ఆ అరుదయిన పక్షుల కోవకు చెందినవారే వైఎస్‌ఆర్.

Copy Right & Discliamer


© 2012 www.ysrcongress.in | All rights reserved
This is not official website.This website is for YSR and YS Jagan Mohan Reddy fans.
The views expressed in this blog are endorsed by neither Mr. Y.S.Jagan nor YSR Congress Party
This site should be viewed purely as a source of information and should not be taken to guarantee or warranty for performance of any activity
We are not responsible for any aspect of any web site it does not control, nor does it accept any responsibility for sites linked from this one. Creating a link does not imply that we endorse the views expressed on that linked website.

The website contains links to other sites that are not owned or controlled by us. Please be aware that we are not responsible for the privacy practices of such other sites.


YSR Congress Party Offficial website:   www.ysrcongress.com

Download image for flex

'ఫీజు'పై 6,7 తేదీల్లో విజయమ్మ దీక్ష

ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని నీరుగారుస్తున్న కాంగ్రెస్ సర్కార్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సమరభేరీ మోగించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ అమలులో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆమె ఈనెల 6,7 తేదీల్లో హైదరాబాద్ లో నిరాహార దీక్ష చేయనున్నారు. పేద విద్యార్థుల ఫీజు మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని, అర్హులైన విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించాలని వైఎస్ విజయమ్మ శనివారం డిమాండ్ చేశారు.

'వైఎస్ హయాంలో అన్నివర్గాలకు లబ్ధి'

నల్గొండ : వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అందరూ లబ్ది పొందాయని, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు అన్నివర్గాలకు మేలు చేశాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం లేకపోవటంతో రాష్ట్రంలో పాలనా యంత్రాంగం స్తంభించిపోయిందన్నారు. బీసీలకు వంద సీట్లు కాదని... అసెంబ్లీలో వందమందిని కూర్చోపెట్టాలని పురుషోత్తంరెడ్డి అన్నారు.

Ex-MLA Chengala Venkat rao resigned from TDP

Chittoor Womens went to Idupulapaya

YSRCP Announces Fee Deeksha Sep 6th and 7th

వైఎస్ఆర్ సీపీలోకి చెంగల వెంకట్రావు

విశాఖ : విశాఖలో తెలుగుదేశం పార్టీకి షాక్‌ తగిలింది. పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే, టిడిపి సీనియర్‌ నేత చెంగల వెంకట్రావు పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 15న వైఎస్ విజయమ్మ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు శనివారమక్కడ తెలిపారు. పాయకరావుపేట ఉప ఎన్నికల్లో తనను తెలుగుదేశం పార్టీ అవమానపరిచిందని అన్నారు. సొంతపార్టీ నేతలే తన ఓటమికి కారణం అయ్యారని చెంగల వ్యాఖ్యానించారు.

'ఫీజు'పై 6,7 తేదీల్లో విజయమ్మ దీక్ష

ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని నీరుగారుస్తున్న కాంగ్రెస్ సర్కార్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సమరభేరీ మోగించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ అమలులో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆమె ఈనెల 6,7 తేదీల్లో నిరాహార దీక్ష చేయనున్నారు. పేద విద్యార్థుల ఫీజు మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని, అర్హులైన విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించాలని వైఎస్ విజయమ్మ శనివారం డిమాండ్ చేశారు.

'ఒంటికన్ను' ఆపరేషన్



రెండు కళ్ల సిద్ధాంతంతో రెంటికి చెడ్డ రేవడిగా తయారైన తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఒంటికన్ను 'ఆపరేషన్'కు సిద్ధం అయ్యారు. రెండుకళ్ల సిద్ధాంతం రెండు ప్రాంతాల్లోనూ పార్టీ డిపాజిట్లను గల్లంతు చేయడంతో కనీసం ఒక ప్రాంతంలోనైనా పార్టీని నిలుపుకోవాలనే పట్టుదలతో టీడీపీ ఉంది. దాంతో ప్రత్యేక తెలంగాణా కోరుతూ లేఖ ఇచ్చే దిశగా టిడిపి ఆలోచిస్తోంది. సీమాంధ్రలో తాము ఏంచేసినా పార్టీకి భవిష్యత్‌ కనిపించదని, తెలంగాణా ప్రాంతంలోనైనా పార్టీ పట్టు నిలుపుకోవాలనే దిశగా తెలుగు తమ్ముళ్లు కసరత్తు చేస్తున్నారు.

దీంట్లో భాగంగానే ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా గతంలో ప్రణబ్‌ముఖర్జీ కిచ్చిన లేఖను మళ్లీ కేంద్ర హోంశాఖకు ఇవ్వాలని నిన్న ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో జరిగిన ఆపార్టీ ఎమ్మెల్యేల సమావేశం నిర్ణయించింది. తెలంగాణకు మద్దతుగా ఈ నెల రెండో వారంలో కేంద్రానికి మళ్లీ లేఖను ఇవ్వనున్నట్లు టీడీపీ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రకటించారు. దీనికి సంబంధించి సీమాంధ్ర నేతలతో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. తెలంగాణపై లేఖ అంశాన్ని తెలంగాణా తెలుగు తమ్ముళ్లు ఏడాది నుంచీ చెబుతున్నా ఈసారి మాత్రం సీమాంధ్ర నేతలూ ఈ విషయాన్ని బలపరుస్తున్నారు. తెలంగాణ లేఖ ఇచ్చాకే సెప్టెంబర్‌ 17తెలంగాణా విమోచన దినోత్సవం నాడు ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమాన్ని ప్రకటిస్తామని పార్టీ నేతలు చెబుతున్నారు.

మరోవైపు చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి సీమాంధ్ర నేతలను తెలంగాణ విషయంలో ఒప్పించేందుకు మంతనాలు జరుపుతున్నారు. అయితే ప్రణబ్‌కిచ్చిన లేఖనే మళ్లీ ఇవ్వడానికి ఎవరికీ అభ్యంతరం ఉండదని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఆ పార్టీ సీనియర్‌ నేతలు చెప్పటం విశేషం. రానున్న ఎన్నికల్లో పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు టీడీపీ వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. దీంతోపాటు మధ్యంతర ఎన్నికలు ఏ క్షణమైనా రావచ్చనే ఊహాగానాల నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించారు. అక్టోబర్ రెండో తేదీ నుంచి ఆయన సుదీర్ఘమైన యాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం.

బీసీలకు వంద సీట్లు అంటూ బీసీ డిక్లరేషన్ ఇచ్చామని, ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపి దానికీ స్ఫష్టత ఇచ్చామని, ఇక తెలంగాణకు మద్దతుగా త్వరలోనే లేఖ రాసి తెలంగాణ పట్ల కూడా పార్టీ వైఖరి తేల్చుతామని చంద్రబాబు చెప్పటం విశేషం. అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణలో తమ వైఖరిని స్పష్టం చేయటంతో కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు చెక్ పెట్టాలని బాబు ఎత్తులు వేస్తున్నారు. రెండుకళ్ల సిద్దాంతంతో ఇప్పటికే పార్టీ క్యాడర్ ను పోగొట్టుకోవటంతో పాటు... నాన్చుకుంటూ పోతే మొదటికే మోసం వస్తుందని ఆలస్యంగా అయినా గ్రహించి కొంతమేరకు నష్టపోయినా.... అంతిమంగా లాభం జరుగుతుందని చంద్రబాబు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఏది ఏమైతేనేమీ.... మొత్తానికి చంద్రబాబు తెలంగాణ కన్నుకు ఆపరేషన్ మొదలు పెట్టారు. అయితే రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజకీయ సమీకరణాల కోసమే టిడిపి తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇస్తుందా అనే అనుమానాలు రాజకీయ విశ్లేషకులలో నెలకొన్నాయి. ఇక బాబుగారి మాటలో క్లారిటీ రాగానే మిగిలిన సీమాంధ్ర నేతలు ఏమంటారో వేచిచూడాలి.

Friday, 31 August 2012

ఇడుపులపాయకు మహిళలు

చిత్తూరు : మహానే వైఎస్ రాజశేఖరరెడ్డిని మరవలేమని చిత్తూరు జిల్లా మహిళలు తెలిపారు. మహిళలను లక్షాధికారులను చేసిన ఘనత ఆయనదే వారు తెలిపారు. చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం నుంచి 29 డ్వాక్రా గ్రూపుల మహిళలు ఇడుపులపాయకు పయనం అయ్యారు. ఈరోజు తెల్లవారు జామున మూడు గంటలకు వీరంతా మహానేత వైఎస్‌ఆర్‌ ఘాట్‌ను దర్శించుకోవడానికి ఇడుపులపాయ బయల్దేరారు. మహానేత అంటే తమకు ప్రాణమని మహిళలు తెలిపారు.

Special Edition on Bandh

జగన్ బెయిల్‌పై కౌంటర్‌కు వారం గడువు

తన కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో బెయిల్ ఇవ్వాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు సీబీఐకి సుప్రీంకోర్టు వారం రోజులు గడువిచ్చింది. వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామని, అందుకు అనుమతివ్వాలంటూ సీబీఐ న్యాయవాది చేసిన అభ్యర్థనకు సుప్రీం కోర్టు అంగీకరించింది. సీబీఐ కౌంటర్ దాఖలు చేసిన తరువాత బెయిల్ పిటిషన్ తిరిగి విచారణకు వచ్చే అవకాశాలున్నాయి.

బంద్‌ను నీరు గార్చాలని చూశారు: వాసిరెడ్డి పద్మ

సర్కారుకు ప్రధాన ప్రతిపక్షం మద్దతు స్పష్టమైందని ధ్వజం 

విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించటంలో రాష్ట్ర ప్రభుత్వం చేతకానితనానికి నిరసనగా తమ పార్టీ చేపట్టిన బంద్‌ను నిర్వీర్యం చేయటానికి ఓ వైపు నుంచి అధికారపక్షం మరో వైపు నుంచి ప్రధాన ప్రతిపక్షం ప్రయత్నించాయని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. కరెంటు లేక చీకటి బాధలు అనుభవిస్తున్న ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరిస్తుంటే పోలీసులు రంగంలోకి దిగి బలవంతంగా వాణిజ్య సంస్థలు, షాపులను తెరిపించారని విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ బంద్‌కు సహకరించరాదని తమ కార్యకర్తలందరికి టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారని.. దీన్నిబట్టి ఆ పార్టీ ప్రభుత్వానికి ఎంత మద్దతునిస్తోందో అర్థం అవుతోందని ఈసడించారు. ఆమె శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. బంద్‌కు సహకరించొద్దని ఎర్రబె ల్లి చెప్పటమంటే.. విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించటంలో ప్రభుత్వ వైఫల్యాన్ని టీడీపీ సమర్ధించినట్లే కదా అని నిలదీశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం పోలీసులను భారీగా మోహరించి తమ పార్టీ శ్రేణులపై అణచివేత చర్యలకు దిగిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్‌టీసీ బస్సులను తిప్పాల్సిందిగా ప్రభుత్వమే ఆదేశాలిచ్చింద ని, పోలీసులు కూడా అతిగా జోక్యం చేసుకున్నారని ధ్వజమెత్తారు. సాధారణంగా అయితే బలవంతంగా షాపులు మూయించే వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలి కానీ.. అందుకు భిన్నంగా దుకాణదారులు స్వచ్ఛందంగా మూసేసుకుంటూ ఉంటే పోలీసులు బలవంతంగా తెరిపించారని పేర్కొన్నారు. తమ పార్టీకి చెందిన నాయకులను ఇష్టమొచ్చినట్లు అరెస్టు చేశారంటూ ఖండించారు. బంద్ ప్రారంభమయ్యీ కాక ముందే.. బంద్ ప్రభావం ఏమీ లేదంటూ ఓ వర్గం మీడియా అదే పనిగా ప్రసారాలు చేశారని.. తప్పుపట్టారు. ‘‘ఉదయం ఎనిమిది గంటలకే ప్రభుత్వ కార్యాలయాలను చూపించి ఇంకా మూయలేదని అంటున్నారు.. వాస్తవానికి అవి పనిచేసేది పది గంటలకు కదా!’’ అని ఆమె ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా విజయవంతంగా జరిగిందంటూ.. పాల్గొన్న ప్రజలందరికీ కతజ్ఞతలు తెలిపారు. ఇది బలవంతపు బంద్ ఏమీ కాదని ప్రభుత్వ వైఫల్యంపై ఆగ్రహంతో ప్రజలందరూ మౌనంగా తమ సంఘీభావాన్ని తెలిపారని ఆమె అభివర్ణించారు.

టీవీ9, ఏబీఎన్, ఈటీవీ చానళ్లపై శోభానాగిరెడ్డి ధ్వజం


హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో ప్రజలను పట్టి పీడిస్తున్న విద్యుత్ సమస్యపై స్పందించకుండా మొద్దునిద్రపోతున్న ప్రభుత్వాన్ని మేల్కొలిపేందుకు ప్రజల మద్దతుతో వైఎస్సార్ కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలకు కొన్ని చానళ్లు వక్రభాష్యం చెప్పడం ఎంతవరకు సమంజసమని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభ ఉపనాయకురాలు భూమా శోభానాగిరెడ్డి ప్రశ్నించారు. ప్రజా సమస్యల పట్ల ఆ చానళ్ల ఉద్దేశమేంటని నిలదీశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘‘బంద్ విజయం కాలేదంటూ టీవీ 9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ఈటీవీ చానళ్ల కూటమి ప్రత్యేక బులిటెన్లతో దుష్ర్పచారం చేయడం చాలా బాధాకరం. విద్యుత్ సమస్యతో ప్రజలు నరకం చూస్తున్నారు. పరిశ్రమలకు వారంలో 3 రోజులు పవర్ హాలిడే విధిస్తున్నారు. మిగిలిన రోజుల్లో కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. వ్యవసాయానికి రోజులో 3 గంటలు కూడా సక్రమంగా సరఫరా అవడంలేదు. ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో మేం చేసిన బంద్‌ను కొన్ని చానళ్లు వక్రదృష్టితో చూడటం ఎంతవరకు సబబు? అసలు విద్యుత్ సమస్యపై ఆ చానళ్ల ఉద్దేశమేంటి? రాష్ట్రంలో కరెంటు సమస్య లేదనుకోవాలా? లేక ప్రభుత్వం మరిన్ని కోతలు విధించాలని చెప్పదలుచుకున్నారా? వాళ్లు ఏం సంకేతం పంపదలుచుకున్నారు?’’ అని ధ్వజమెత్తారు. బంద్ నిర్వహణ తమ పార్టీ ప్రయోజనం కోసం చేసిన కార్యక్రమం కాదని, ప్రజల కోసం వారి మద్దతుతో చేసిన కార్యక్రమమని ఆమె స్పష్టంచేశారు. ‘‘ఎమ్మె ల్యే ధర్మాన కృష్ణదాస్ చేతిని గాయపరిస్తే అది ఆ మీడియా కంటికి కనపడదు. ఆయన సతీమణిపై పోలీసులు చేసిన దౌర్జన్యాలూ కనపడవు’’ అని అన్నారు.

అక్రమ నిర్బంధాలను అధిగమిస్తూ వెల్లువెత్తిన జన నిరసన


బంద్‌ను నీరుగార్చేందుకు సర్కారు దమననీతి 
ఎక్కడికక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ నేతల అరెస్టులు 
ఎమ్మెల్యేలు, మహిళా నేతలపైనా దౌర్జన్యకాండ 
రాష్ట్రవ్యాప్తంగా 20 వేల మంది శ్రేణుల నిర్బంధం 
వాణిజ్య సంస్థలను బలవంతంగా తెరిపించిన వైనం 
పోలీసు బందోబస్తు మధ్య బస్సులు తిప్పే యత్నం 
బంద్‌కు సహకరించవద్దంటూ టీడీపీ ప్రచారం 
బంద్ విఫలమంటూ ఒక వర్గం మీడియా కట్టుకథలు 

హైదరాబాద్, న్యూస్‌లైన్: కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పడిన విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించటంలో రాష్ట్ర ప్రభుత్వ ఘోర వైఫల్యాన్ని, సర్కారు నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్ర బంద్ సంపూర్ణంగా ప్రశాంతంగా జరిగింది. పార్టీ శ్రేణులపై ప్రభుత్వ అణచివేత వైఖరి, పోలీసుల అక్రమ నిర్బంధాలు, పెద్ద ఎత్తున అరెస్టుల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. అయితే.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ బంద్‌ను విఫలం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం దమననీతిని ప్రదర్శించింది. బంద్‌కు ముందు రోజు అర్ధరాత్రి నుంచే వైఎస్సార్ కాంగ్రెస్ ముఖ్య నేతలందరినీ అరెస్ట్ చేశారు. శుక్రవారం తెల్లవారుజాము సమయానికే వేలాది మందిని నిర్బంధించారు. ఉదయం రోడ్లపైకి వచ్చిన వారిని వచ్చినట్లు అదుపులోకి తీసుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బంద్ సందర్భంగా తమ నియోజకవర్గాల్లో ఊరేగింపుల్లో పాల్గొంటూ ఉండగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. కొందరిని వారి ఇళ్ల వద్దనే నిర్బంధంలోకి తీసుకున్నారు. జిల్లా అడ్‌హాక్ కమిటీ కన్వీనర్లు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, కన్వీనర్లను ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ జెండా పట్టుకుని కార్యకర్తలు కనిపిస్తే చాలు వారిని బలవంతంగా పోలీసులు వ్యాన్‌లోకి ఎక్కించి తరలించుకుపోయారు. బంద్‌ను నిర్వీర్యం చేయాలన్న ఏకైక లక్ష్యంతో వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులను ప్రభుత్వం చక్రబంధంలో ఇరికించింది.

రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 వేల మంది పార్టీ నాయకులు, కార్యకర్తలను రోజంతా నిర్బంధంలో ఉంచారు. జిల్లాల్లోనూ, పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలోపోలీసులను మోహరించారు. రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించిన ప్రధానమైన విద్యుత్ సమస్యపై ప్రభుత్వంలో కదలిక తెచ్చే లక్ష్యంతో క్రియాశీల ప్రతిపక్ష పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్ బంద్‌కు పిలుపునివ్వగా.. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ మాత్రం.. ప్రజల కష్టనష్టాలను, ప్రజా ప్రయోజనాలను విస్మరించింది. వైఎస్సార్ కాంగ్రెస్ బంద్ కనుక ఎవరూ సహకరించవద్దంటూ ప్రచారం చేసింది. మరోవైపు.. వైఎస్సార్ కాంగ్రెస్‌పై కక్ష కడుతున్నట్లు ప్రవర్తిస్తున్న ఒక వర్గం మీడియా కూడా.. బంద్ పిలుపు ప్రజల్లోకి వెళ్లకుండా చేసేందుకు ప్రయత్నించింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచే బంద్ విఫలమైందంటూ ఆ వర్గం మీడియా ప్రత్యేక కథనాలు ప్రచారం చేయటం విస్తుగొలిపింది. అయితే.. ప్రభుత్వ, ప్రధాన ప్రతిపక్ష, ఎల్లో మీడియా ప్రయత్నాలను వమ్ము చేస్తూ.. విద్యుత్ కోతలతో సతమతమవుతున్న ప్రజలు తమ వ్యాపార, వాణిజ్య సంస్థలను స్వచ్ఛందంగా మూసేసి బంద్ పాటించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలన్నీ మూతపడ్డాయి. జేఎన్‌టీయూ, ద్రవిడ, ఆంధ్రా విశ్వ విద్యాలయాల్లో శుక్రవారం జరగాల్సిన పలు పరీక్షలు వాయిదా పడ్డాయి. పలు ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలను పోలీసు బందోబస్తు మధ్య తెరచినప్పటికీ హాజరు అంతంతమాత్రంగానే వుంది. కొన్నిచోట్ల పోలీసులు ఉదయం నుంచి రోడ్లపైనే మకాం వేసి దుకాణాలను తెరిపించారు. గురువారం సాయంత్రం నుంచే ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు ఫోన్ చేసి బంద్ పాటించవద్దంటూ హెచ్చరించారు. పాఠశాలల వద్ద బందోబస్తు పెట్టారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు బంద్‌లో పాల్గొనవద్దని ఉన్నతాధికారులు ఫోన్ల ద్వారా హెచ్చరించారు. 

రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం... 

ప్రజా రవాణా వ్యవస్థపై కూడా బంద్ తీవ్రమైన ప్రభావం చూపింది. ఆర్‌టీసీ బస్సులను పోలీసులే బలవంతంగా డిపోల నుంచి బయటకు తీయించి ప్రయాణికులు లేక వెలవెల పోతున్నా నడిపించారు. ఉదయం వేళల్లో రాష్ట్రవ్యాప్తంగా బస్సులన్నీ డిపోలకే పరిమితం కాగా.. మధ్యాహ్నం తర్వాత చాలా సర్వీసులను పునరుద్ధరించారు. కర్నూలు, గుంటూరు, కడప, చిత్తూరు, శ్రీకాకుళం, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఆర్‌టీసీ బస్సులు డిపోల నుంచి బయటకు రాలేదు. పలుచోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు డిపోల ముందు బైఠాయించటం.. రోడ్డెక్కిన బస్సులను అడ్డుకోవటంతో ఉదయం పూట సర్వీసులను ఆర్‌టీసీ రద్దు చేసింది. నేతలు, కార్యకర్తలను ఆర్‌టీసీ డిపోల వద్ద అరెస్టు చేసి అందరినీ తొలగించిన తరువాత పోలీసులు బస్సులను బయటకు వచ్చేలా చేశారు. వివిధ ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను అరెస్టు చేయటంతో ఆగ్రహించిన కార్యకర్తలు 8 బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. పలు బస్సుల టైర్లలో గాలి తీసేశారు. బంద్ కారణంగా ఆర్‌టీసీకి శుక్రవారం రూ. 4 కోట్ల ఆదాయం నష్టపోయింది. 

అరెస్టుల పర్వం
తెలంగాణ ప్రాంతంలో... 

- వరంగల్ జిల్లాలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు 986 మంది పార్టీ నేతలను పోలీసులు తమ అదుపులోకి తీసుకుని.. శుక్రవారం సాయంత్రం వదిలిపెట్టారు. డోర్నకల్‌లో మాత్రం ముగ్గురిపై కేసు నమోదు చేసి కోర్టుకు పంపించారు. 

- నిజామాబాద్ జిల్లాలో సుమారు 300 మంది నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసకున్నారు. నిజామాబాద్‌లో బస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేసిన కేంద్రపాలక మండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్, జిల్లా కన్వీనర్ వెంకటరమణారెడ్డి తదితరులను అరెస్టు చేశారు. 

- ఖమ్మం జిల్లాలో దాదాపు వెయ్యి మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఖమ్మంలో పార్టీ జిల్లా కన్వీనర్ పువ్వాడ అజయ్‌కుమార్, మహిళా విభాగం కన్వీనర్ బాణోత్ పద్మావతి తదితరులను అదుపులోకి తీసకున్నారు. 

- కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంకలో ప్రశాంతంగా బంద్ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న నాయకులు, కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేశారు. వేములవాడలో పార్టీ కేంద్ర నిర్వాహక మండలి సభ్యుడు ఆది శ్రీనివాస్, జిల్లా కన్వీనర్ పుట్ట మధు తదితరులతో సహా.. మొత్తం 418 మంది నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. 

- మెదక్ జిల్లాలో 170 మందిని అదుపులోకి తీసుకుని శుక్రవారం సాయంత్రం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. మెదక్ పట్టణంలో బంద్ చేయాల్సింగా విజ్ఞప్తి చేస్తున్న పార్టీ జిల్లా కన్వీనర్ బట్టి జగపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డిలో ఉదయం ఆరు గంటల ప్రాంతంలో బస్సు డిపో ఎదుట బైఠాయించిన యువజన విభాగం జిల్లా కన్వీనర్ గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. 

- నల్లగొండ జిల్లాలో సుమారు 900 మందికిపైగా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. పార్టీ జిల్లా కన్వీనర్ బీరవోలు సోమిరెడ్డిని సూర్యాపేటలో.. జిల్లా కేంద్రంలో బంద్‌లో పాల్గొన్న నిజామాబాద్ జిల్లా పరిశీలకుడు గాదె నిరంజన్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా పరిశీలకుడు జిన్నారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు సూరేపల్లి సత్యకుమారి ఇతర నాయకులను ఆర్‌టీసీ బస్టాండు సమీపంలో అరెస్టు చేసి రూరల్ స్టేషన్‌కు తరలించారు. 

- ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 350 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే సోయం బాబూరావు, జిల్లా నాయకుడు బి.అనిల్‌కుమార్‌లతో పాటు 50 మందిని తెల్లవారు జామున్నే అరెస్టు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 500 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

రాయలసీమలో జిల్లాల్లో... 

- అనంతపురం జిల్లాలో 2,500 మందికి పైగా వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురంలో ఎమ్మెల్యే గురునాథరెడ్డితో పాటు 40 మంది కార్యకర్తలను అరెస్టు చేసి నగరంలోని వన్‌టౌన్, టూటౌన్, త్రీటౌన్ పోలీసుస్టేషన్లలో ఉంచారు. 

- చిత్తూరు జిల్లా వ్యాప్తంగా రెండు వేల మందికి పైగా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అంబేద్కర్ విగ్రహం నుంచి పార్టీ కార్యకర్తలతో కలిసి శాంతియుతంగా ర్యాలీగా వెళ్తుండగా.. ఆయనతో పాటు పార్టీ జిల్లా కన్వీనర్ కె.నారాయణస్వామి తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకాళహస్తి పట్టణంలో శుక్రవారం ఉదయం కేంద్ర ఆర్థికవుంత్రి చిదంబరం వాహనాన్ని వైఎస్సార్ సీపీ మహిళా నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. 

- కర్నూలు జిల్లాలో పార్టీ కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎస్.వి.మోహన్‌రెడ్డితో పాటు దాదాపు 250 మంది పార్టీ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

- వైఎస్సార్ జిల్లా పులివెందులలో యువజన విభాగం అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కడప నగరంలో తెల్లవారుజామునే పార్టీ జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, నగర కన్వీనర్ అంజాద్‌బాషలను అరెస్టు చేశారు. 

కోస్తాంధ్ర జిల్లాల్లో... 

- శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో 538 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 200 మందికి పైగా ముందస్తుగా అదుపులోకి తీసుకుని వదిలేశారు. 

- ప్రకాశం జిల్లాలో గిద్దలూరు, కనిగిరి, ఒంగోలు, ఎస్‌ఎన్ పాడు, మార్కాపురం, కందుకూరు నియోజకవర్గాల్లో 133 మంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. 

- కృష్ణా జిల్లాలో పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా, గుంటూరు జిల్లా ఎన్నికల పరిశీలకుడు పూనూరి గౌతంరెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. సిటీ కన్వీనరు జలీల్‌ఖాన్, మహిళా విభాగ కన్వీనరు తాతినేని పద్మావతిలను హౌస్ అరెస్టు చేశారు. విజయవాడ నగరంలో 263 మంది, జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో 105 మంది కార్యకర్తలను అరెస్టు చేశారు. 

- పశ్చిమగోదావరి జిల్లాలో 140 మంది నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారు. కొయ్యలగూడెంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజును అదుపులోకి తీసుకుని బైండోవర్ చేశారు. 

- తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 800 మంది నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ, సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ ఎంపీ గిరిజాల వెంకటస్వామినాయుడు, పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి తదితరులను అరెస్టు చేశారు. 

- విశాఖ జిల్లాలో విశాఖ జిల్లాలో వేయి మందికిపైగా వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. పార్టీ విశాఖ నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్, నేతలు డాక్టర్ జహీర్‌అహ్మద్, కొయ్య ప్రసాదరెడ్డి, చొక్కాకుల వెంకట్రావు, పసుపులేటి ఉషాకిరణ్, పిన్నింటి వరలక్ష్మి, జి.వి.రవిరాజ్ తదితరులు అరెస్టు అయ్యారు. 

- విజయనగరం జిల్లాలో పోలీసులు శుక్రవారం తెల్లారేసరికే మాజీ ఎమ్మెల్యేలు పెద్దింటి జగన్మోహనరావు, గద్దే బాబూరావు, పార్టీ నాయకులు తూముల రాంసుధీర్, గొర్లె వెంకటరమణతో సహా పలువురు కార్యకర్తలను అరెస్టు చేశారు. 
- శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, పార్టీ జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియలపై దౌర్జన్యానికి పాల్పడటంతో పాటు.. జిల్లా వ్యాప్తంగా మొత్తం 119 మందిని అరెస్ట్ చేశారు. 

మాచర్ల ఎమ్మెల్యేపై పోలీసుల దౌర్జన్యం
గుంటూరు జిల్లా మాచర్లలో శుక్రవారం ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రశాంతంగా నిర్వహిస్తున్న ధర్నాపై పోలీసులు దురుసుగా ప్రవర్తించటంతో కొద్దిసేపు ఉద్రిక్తత తలెత్తింది. సీఐ దురుసుగా వ్యవహరిస్తూ ఎమ్మెల్యేను నెట్టివేస్తూ.. ఒక చేత్తో తుపాకీ పట్టుకొని బెదిరించే ధోరణితో మాట్లాడటంతో తోపులాట జరిగింది. ఎమ్మెల్యేను సీఐ ధర్మేంద్రబాబు, డీఎస్పీ రావుల గిరిధర్‌లు బలవంతంగా పట్టుకొని నెట్టుకుంటూ తీసుకె ళ్లారు. అడ్డగించిన కార్యకర్తలపై లాఠీచార్జి చేశారు. ఎమ్మెల్యేను పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్న సమయంలో ఎమ్మెల్యే చొక్కా చిరిగిపోయింది. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న తనను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే ఉదయం నుంచి సాయంత్రం వరకు రూరల్ పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. జిల్లా రూరల్ ఎస్‌పీకి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి వందలాది మంది కార్యకర్తలతో రూరల్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని నిరసన వ్యక్తం చేయబోయారు. ఆ సమయంలో పోలీసులు మళ్లీ లాఠీచార్జి చేశారు. నిరసనకారులు సాగర్ రింగ్‌రోడ్డు, రాయవరం జంక్షన్, కొత్తపల్లి జంక్షన్, కంభంపాడు ఆర్టీసీ బస్సులను నిలిపివేసి టైర్లుకు గాలితీశారు. సాయంత్రం ఐదు గంటలకు ఎమ్మెల్యేను విడుదల చేశారు.
Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!