దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మూడో వర్ధంతి సందర్భంగా సెప్టెంబర్ 2వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, రోగులకు పండ్ల పంపిణీ చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి పార్టీ శ్రేణులను కోరారు. హెలికాప్టర్ దుర్ఘటనలో రాజశేఖరరెడ్డి మరణించిన కర్నూలు జిల్లా నల్లకాల్వ వద్ద ఆదివారం పెద్దఎత్తున రక్తదాన శిబిరం, అన్నదానం, కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టనున్నట్లు శుక్రవారం ఓ ప్రకటనలో ఆయన తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment