విద్యుత్ కోతలకు నిరసనగా శాంతియుతంగా బంద్ పాటిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ అరెస్ట్ లు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లావ్యాప్తంగా రెండు వందలమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టులను నిరసిస్తూ పలుచోట్ల కార్యకర్తలు ధర్నాలు, రాస్తారోకోలు చేపడుతున్నారు.
నిజామాబాద్ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంద్‌కు అనూహ్య మద్దతు లబించింది. బంద్‌ను విజయవంతం చేసేందుకు పార్టీ కార్యకర్తలు తెల్లవారుజామునుంచే రోడ్డెక్కారు. పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ నిజామాబాద్ ఆర్టీసి డిపో ఎదుట బైఠాయించి నిరసన తెలియజేశారు.
నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పార్టీ బంద్‌కు విద్యా, వ్యాపార, వాణిజ్య రంగాలు పూర్తిగా మద్దతు పలికాయి. పోలీసుల సహకారంతో బస్సులు నడపాలని అధికారులు ప్రయత్నించడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆందోళనకు దిగిన వారిని పోలీసులు అరెస్ట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
పశ్చిమగోదావరిజిల్లాలో ఫైర్ స్టేషన్ సెంటర్‌లోని మహానేత వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బంద్‌కు పూనుకున్నారు. బస్టాండ్ల వద్ద బస్సులను శాంతియుతంగా అడ్డుకుంటున్న వారిని పోలీసులు అత్యుత్సాహంతో అదుపులోకి తీసుకున్నారు. పలు ప్రాంతాల్లో పోలీసుల జులుం కనిపించింది.

No comments:
Post a Comment