తమిళనాడు నుంచి సరఫరా చేసే పాలలో కల్తీ
పాలలో క్యాన్సర్‌కు దారితీసే రసాయన పదార్థం ఫార్మలిన్
పరీక్షల్లో బయటపడిన బండారం
నెలపాటు నిషేధం విధించిన కేరళ ఫుడ్ సేఫ్టీ కమిషనర్
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తమిళనాడుకు లేఖ
చెన్నై/తిరువనంతపురం: ‘ఆరోగ్యం-ఆనందం’ (హెల్త్-హ్యాపీనెస్). ఇది తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబు నాయుడుకు చెందిన హెరిటేజ్ సంస్థ పాల ప్యాకెట్లపై ముద్రించే నినాదం. కానీ ఆ సంస్థ మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలిస్తూ వినియోగదారులకు శఠగోపం పెడుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో హెరిటేజ్ అర లీటరు పాల ప్యాకెట్లలో 496 మిల్లీలీటర్ల పాలే ఉన్నట్లు ఇటీవల బయటపడిన విషయం మరిచిపోకముందే తాజాగా కేరళలోనూ హెరిటేజ్ బండారం బట్టబయలైంది. తమిళనాడు నుంచి కేరళకు సరఫరా అవుతున్న హెరిటేజ్ పాలలో కల్తీ జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు.
క్యాన్సర్ కారక రసాయన సంరక్షకం ఫార్మలిన్ లేదా ఫార్మల్‌డీహైడ్ ఈ పాలలో ఉన్నట్లు కేరళ ప్రభుత్వ లాబ్‌లలో నిర్వహించిన పరీక్షల్లో నిర్ధారణ అయింది. తమిళనాడులోని దిండిగుల్ జిల్లాలో ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ (ఇండియా) లిమిటెడ్ నుంచి హెరిటేజ్-పద్మనాభ బ్రాండ్ పేరుతో సరఫరా అవుతున్న పాశ్చరైజ్డ్, హోమోజినైజ్డ్, స్టాండడైజ్డ్ పాలలో ఈ రసాయనాన్ని గుర్తించారు. హెరిటేజ్ పాలతోపాటు తిరునెల్వెలి, వడక్కానుకుళంలోని సోఫియా రాజా మిల్క్ అందించే జేష్మా మిల్క్, కన్యాకుమారిలోని అరుల్వాయ్‌మొజిలో ఉన్న మైమా మిల్క్ ప్లాంట్ అందించే మైమా పాల బ్రాండ్‌లలోనూ ఫార్మలిన్‌ను కనుగొన్నారు. దీంతో కేరళ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ హెరిటేజ్ పాలపై ఈ నెల 24 నుంచి నెలపాటు నిషేధం విధించారు. అలాగే కల్తీ జరుగుతున్న ప్లాంట్లలో తనిఖీలు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తమిళనాడు ఫుడ్ సేఫ్టీ కమిషనర్‌కు లేఖ రాశారు.
కణజాలం చెడిపోకుండా వాడతారు...
ఫార్మలిన్‌ను శరీర కణజాలం చెడిపోకుండా ఉంచేందుకు జీవశాస్త్ర, కణజాల-రోగ లక్షణ శాస్త్ర పరీక్షల్లో ఉపయోగిస్తారు. అయితే పాలను కల్తీ చేసేవారు మాత్రం వాటిని తాజాగా ఉంచేందుకు, చెడిపోకుండా చూసేందుకు ఫార్మలిన్‌ను కలుపుతున్నారు. మనుషుల్లో క్యాన్సర్‌ను కలిగించే పదార్థాల జాబితాలో ఫార్మలిన్ కూడా ఒకటని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ గుర్తించింది.

No comments:
Post a Comment