తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతిలో ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్‌ను ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి సందర్శించారు. నగరంలో పర్యటించిన ఆయన చెన్నారెడ్డి కాలనీలో ఎస్సీ బాలుర వసతి గృహంలో విద్యార్థులతో పడుకున్నారు. అక్కడి పరిస్థితిని స్వయంగా పరిశీలించిన ఆయన ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు నరకకూపంగా ఉన్నాయనిన్నారు. విద్యార్థులు దారుణమైనస్థితిని ఎదుర్కొంటున్నారని చెప్పారు. వారికి సరైన ఆహారం అందడం లేదని ఆవేధన వ్యక్తం చేశారు. విద్యార్థుల సంక్షేమం పట్ల కిరణ్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యహరిస్తోందని ఆయన ఆరోపించారు. ఏ హాస్టల్ భవనం ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి ఉందని చెప్పారు. నిధులు సమకూర్చడంలో కిరణ్ సర్కార్ పూర్తిగా విఫలమైందని కరుణాకరరెడ్డి విమర్శించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment