ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం కింద అర్హులందరికీ మొత్తం ఫీజును ప్రభుత్వమే చెల్లించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్ర రావు డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ వైఖరి తుగ్లక్ పాలనలాగా ఉందని విమర్శించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో అనేక అవకతవకలు చోటుచేసుకుంటున్నాయన్నారు. ఫీజులపై హైకోర్టు చివాట్లు పెట్టినా ప్రభుత్వ తీరులో మార్పులేదన్నారు. విద్యార్థి ప్రయోజనాలను ప్రభుత్వం విధ్వంసం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. పదవ తరగతిలో మార్కులు ఎక్కువ వచ్చిన విద్యార్థులను కార్పోరేట్ కాలేజీల వారు తీసుకువెళ్లి ఉచితంగా చదువు చెబుతున్నారని తెలిపారు. అటువంటి వారిలో ఫీజు రీయింబర్స్ మెంట్ పథకానికి అర్హులైతే ప్రభుత్వం ఫీజు చెల్లించదా? అని ఆయన ప్రశ్నించారు. విద్యార్థులను ఇబ్బంది పెట్టకుండా పెంచిన ఫీజుని కూడ ప్రభుత్వమే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
వికలాంగుల పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. వికలాంగులకు 75 రూపాయలు ఉన్న పెన్షన్ ని 500 రూపాయలకు పెంచిన ఘనత దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిదన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment