YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday, 29 August 2012

రాష్ట్రంలో తుగ్లక్ పాలన: గట్టు

హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘బలహీనవర్గాల ఉన్నత చదువులు- బలవంతంగా రద్దు చేయాలి’ అనే లక్ష్యంతో నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు విమర్శించారు. పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి సమున్నత ఆశయంతో ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రవేశపెడితే... ప్రస్తుత పాలకులు రకరకాల పద్ధతులతో వాటికి తూట్లు పొడుస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్-60ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 

రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోందని అందుకే విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని గట్టు మండిపడ్డారు. పాలకుల నిర్ణయాలతో విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోవాల్సి వస్తోందని ధ్వజమెత్తారు. ఫీజుల విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసినా కిరణ్ ప్రభుత్వానికి సిగ్గురావడంలేదన్నారు. పెంచిన ఫీజులను అర్హులందరికి ప్రభుత్వమే ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయాలని డిమాండ్ చేశారు. 

అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబుకు అవార్డు: నిజాలను ఖూనీ చేస్తూ, అబద్ధాలను చె ప్పి వాటిని గోబెల్స్ ప్రచారం చేయడంలో చంద్రబాబును మించిన వ్యక్తి మరొకరుండరని, అందుకే ఆయనకు అవార్డు ప్రకటించాలని గట్టు రామచంద్రరావు ఎద్దేవా చేశారు. విద్యుత్ సమస్యపై నిరసన తెలుపుతున్న వారిపై అన్యాయంగా కాల్పులు జరిపి నలుగురిని పొట్టనబెట్టుకున్న వ్యక్తి వికలాంగుల సభలో సిగ్గులేకుండా అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. 

తన తొమ్మిదేళ్లపాలనలో వికలాంగులను పట్టించుకోకుండా చిన్నచూపు చూసిన చంద్రబాబు అధికార దాహంకోసం వెర్రివేషాలేస్తున్నారని విమర్శించారు. బాబు హయాంలో వికలాంగుల పింఛన్‌ను కేవలం రూ.25 మాత్రమే పెంచి ఇచ్చే రూ.75ను మూడునెలలకొసారి ఇచ్చేవారని గుర్తుచేశారు. అలాంటిది దివంగత వైఎస్ మానవతా దృష్టితో వాటిని ఒక్కసారిగా రూ.200లకు ఆ తర్వాత 500లకు పెంచారన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!