YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday, 8 September 2012

కాబోయే సీఎం జగన్: ఉప్పునూతల

నల్గొండ: గతంలో కాంగ్రెస్‌కు, ఇప్పటి కాంగ్రెస్‌కు చాలా తేడా ఉందని సీనియర్ నేత ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి అన్నారు. ప్రజల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్న నాయకుడు వైఎస్‌ఆర్ అని ఆయన కితాబిచ్చారు. 2014 ఎన్నికల్లో కాబోయే సీఎం జగన్ అని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు. ఉప్పునూతల నేడు వైఎస్ఆర్ సీపీలో చేరుతున్నారు.

Dengue Fevers Raised in AP

వైఎస్‌ను పొగిడి..ఆయన కుటుంబానికి వేధింపులా?


గుంటూరు, న్యూస్‌లైన్: మహానేత వైఎస్‌ను, ఆయన కుటుంబాన్ని వేరు చేసి చూపించి ప్రయోజనం పొందాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. వైఎస్ పాదయాత్ర డైరీ ఆవిష్కరణ పేరిట ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు చేసిన హడావుడి ప్రజలను మభ్యపెట్టేందుకేనని ఆయన విమర్శించారు. గుంటూరులో ఆయన శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహానేత పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చి, క్రిమినల్‌గా చిత్రీకరించినప్పుడు ఆ నేతలు ఎందుకు మౌనం దాల్చారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు అధికారంలోకి తెచ్చేందుకు అహర్నిశలు కష్టపడ్డ వైఎస్సార్ కుటుంబాన్ని వేధిస్తున్న వారే ఆయన పాలనను ఆహా.. ఓహో అని ప్రశంసించారన్నారు. భారీ ప్రజాదరణ గలిగిన వైఎస్ కుమారుడు జగన్‌ను జైలుకు పంపినప్పుడు ఈ నేతలంతా ఏమయ్యారని ప్రశ్నిం చారు.

మహానేత కుటుంబాన్ని క్షోభకు గురిచేస్తున్న ఈ నేతలకు వైఎస్‌ను తమవాడని చెప్పుకొనే నైతిక హక్కు లేదన్నారు. త్వరలో కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ విలీనమవుతున్నట్లు వస్తున్న వదంతుల దుమారాన్ని ప్రజలు నమ్మడానికి సిద్ధం గా లేరని అన్నారు. ఇవన్నీ రాష్ర్ట్రంలో ఒక బలమైన రాజకీయ శక్తిగా అవతరించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసేందుకు వైరి పార్టీల ప్రయోగాలంటూ కొట్టిపారేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఇంకా అధికారదాహం తీరలేదని, పాదయాత్రలు, సైకిల్ షోలు వంటి జిమ్మిక్కులతో ఆయనకు అధికారం దక్కడం కల్లేనని జోస్యం చెప్పారు. పాదయా త్ర చేసిన అందరూ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోలేరని ఎద్దేవా చేశారు. ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయిన బాబు, ప్రస్తుతం ఉనికి పోరాటంలో కొట్టుమిట్టాడుతున్నారని చెప్పారు. పాదయాత్రలో ప్రజలు ఆయన్ను ఛీ కొట్టడం ఖాయమన్నారు. 

ఆ కథనాలు ‘పీటీఐ’ విశ్వసనీయతనే దెబ్బతీస్తాయి: వైఎస్సార్ కాంగ్రెస్

ఆ సంస్థ మా ఖండనను ఎందుకు ప్రకటించడంలేదు?
కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే పడవలాంటిది
ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ కూడా
అందులో విలీనం కావాల్సిన ఖర్మ మాకు పట్టలేదు
వైఎస్సార్ కాంగ్రెస్‌ను దెబ్బకొట్టడానికి జరుగుతున్న 
కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు
బాబూ అవిశ్వాసం పెట్టు.. ఎవరు కుమ్మక్కయ్యారో తేలిపోతుంది

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో మునిగిపోతున్న పడవలాంటి కాంగ్రెస్ పార్టీలో విలీనం కావాల్సిన ఖర్మ తమకు పట్టలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ప్రజా సమస్యలపై పోరాడుతూ ఉంటాం తప్ప ఎట్టి పరిస్థితిలోనూ విలీనమయ్యే ప్రసక్తే ఉండదని తేల్చిచెప్పారు. కాంగ్రెస్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ విలీనమయ్యే అవకాశముందన్నట్లుగా పీటీఐ వార్తా సంస్థ ఇచ్చిన కథనం అవాస్తవమని పేర్కొంటూ తాము ఆ సంస్థకు పంపిన ఖండనను ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన అధికార ప్రతినిధులు వాసిరెడ్డి పద్మ, హెచ్.ఎ.రెహమాన్‌లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ‘‘ప్రజా సమస్యలపై విస్తృతంగా పోరాడుతూ ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్న ప్రతీసారి వైఎస్సార్ కాంగ్రెస్‌ను దెబ్బకొట్టడానికి కుట్రలు జరుగుతున్నాయి. 

జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకొచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలన్నింటినీ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు ఆయన్ను అక్రమంగా బంధించినప్పటికీ ప్రజా పార్టీ అయిన వైఎస్సార్ కాంగ్రెస్ నిరంతరం ప్రజల మధ్యే ఉంది, ఉంటుంది. మా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కూడా రాత్రి, పగలును లెక్కచేయకుండా ప్రజాసమస్యలపై పోరాడుతూ భర్త, కొడుకు బాటలో నడుస్తున్నారు. ఇంతగా పోరాడుతున్నా మాకు కాంగ్రెస్‌లో విలీనం కావాల్సిన దుస్థితి పట్టలేదు’’ అని స్పష్టం చేశారు.

‘ఫీజు దీక్ష’కు లభిస్తున్న మద్దతును ఓర్వలేకే: పేద విద్యార్థుల కోసం శాచ్యురేషన్ పద్ధతిలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు విజయమ్మ చేసిన ఫీజు దీక్షకు పెద్ద ఎత్తున మద్దతు లభించేసరికి ఓర్వలేక కొన్ని దుష్టశక్తులు బురదచల్లుతున్నాయని గోవర్ధన్ దుయ్యబట్టారు. రాష్ట్రంలో తమపట్ల కొన్ని పత్రికలు, చానళ్లు చాలాకాలంగా పనిగట్టుకొని వ్యతిరేకంగా పనిచేస్తున్నా.. ప్రజలు ఏనాడూ వాటిని నమ్మలేదని గుర్తుచేశారు. 

పీటీఐ లాంటి సంస్థ కూడా విజయమ్మ ఇంటర్వ్యూకు వక్రభాష్యం చెప్పడం దురదృష్టకరమని, అందులో ఉన్న కొందరు కోవర్టుల వల్లే ఈవిధమైన కథనం వచ్చి ఉంటుందేమోనని సందేహం వ్యక్తం చేశారు. ఇలాంటి కథనాల వల్ల ఆ సంస్థకున్న విశ్వసనీయత దెబ్బతింటుందని వ్యాఖ్యానించారు. ‘తండ్రి ఆశయం కోసం జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌ను వదిలి బయటకొచ్చి పార్టీ స్థాపించినప్పటినుంచి ఎక్కడా కూడా వెనక్కితగ్గకుండా ప్రజాసమస్యలపై ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. అయితే ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ తన బాధ్యతను నిర్వర్తించకపోగా జగన్‌ను ఏ విధంగా ఎదుర్కోవాలనే దానిపైనే దృష్టిపెడుతోంది. కడప, పులివెందుల ఉప ఎన్నికల సమయంలో కూడా జగన్ బీజేపీలో కలిసిపోతున్నారంటూ దుష్ర్పచారం చేసింది. వారి అనుకూల మీడియా దాన్ని విస్తృతంగా ప్రచారం చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, జగన్‌మోహన్‌రెడ్డిని అపఖ్యాతి పాలుచేసేందుకు చంద్రబాబు నిరంతరం కుట్రలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లో విలీనమవుతుందంటూ గోబెల్స్ ప్రచారం చేసినప్పటికీ ప్రజలు అవేవీ నమ్మలేదు. మా పార్టీ చిత్తశుద్ధిని గమనించి మా అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించారు. ఇవన్నీ జరిగాక కాంగ్రెస్‌లో మేం ఎందుకు కలుస్తాం’’ అని అన్నారు. 

చంద్రబాబు అవిశ్వాసం పెట్టు: కాంగ్రెస్‌తో ఎవరు కుమ్మక్కు అయ్యారో తేలాలంటే రానున్న శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని టీడీపీకి ఈ సందర్భంగా గోవర్ధన్ సవాల్ విసిరారు. విద్యార్థుల ఫీజు సమస్య, కరెంటు తీవ్రత పట్ల చంద్రబాబు ఉత్తి ప్రసంగాలను కట్టిపెట్టి ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని సూచించారు. అప్పుడు ఎవరేంటో అసలు స్వరూపం బయటపడుతుందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కొనేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ నేతలతో అవగాహన కుదుర్చుకున్నారని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. అందుకే అప్పటి నుంచి బాబు విక్టరీ సింబల్‌కు బదులుగా ప్రజలకు హస్తం చూపిస్తున్నారని విమర్శించారు.

కాంగ్రెస్‌కు బీటలు

ప్రతి ఒక్కరిలో స్తబ్దత, నైరాశ్యం నెలకొన్నాయి
నేనూ అభద్రతా భావంతో ఉండాల్సిన పరిస్థితి
అందరం కలిసి పునర్నిర్మాణం చేసుకోవాలి
వీహెచ్ సదస్సులో చిరు సంచలన వ్యాఖ్యలు
పేలవంగా ముగిసిన ‘సేవ్ ది పార్టీ’ సదస్సు
 ‘‘కాంగ్రెస్‌కు కష్టకాలమొచ్చింది.. పార్టీ బీటలు వారుతోంది.. ప్రతి ఒక్కరిలో స్తబ్దత, నైరాశ్యం నెలకొన్నాయి. ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది’’ అని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఆధ్వర్యంలో శనివారం జూబ్లీహాల్‌లో ‘సేవ్ ది పార్టీ’ పేరిట ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన సదస్సు ముగింపు సమయంలో హాజరైన చిరంజీవి పార్టీ పరిస్థితిపై ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘పార్టీలో ప్రధానంగా సమన్వయ లోపం ఏర్పడింది. తల్లిలాంటి పార్టీకి కష్టకాలం వచ్చింది. ఈ సమయంలో ఈ సదస్సు నిర్వహించడం శుభ పరిణామం. ఇందులో నా స్వార్థం కూడా ఉంది. నేను ఇంట్లోకి (కాంగ్రెస్) ప్రవేశించాక గాలివానలు, సునామీల్లాంటి ప్రకృతి వైపరీత్యాలు వ చ్చినా తట్టుకోగలిగేలా ఉండాలనుకున్నా. ఎందుకంటే ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే అందులో అంత సేఫ్‌గా ఉండొచ్చని అనుకుంటా.

కానీ ఈ రోజు ఇల్లు బీటలు వారేలా, గోడలు పగుళ్లు వచ్చేలా, రూఫ్ (పైకప్పు)లు చెల్లాచెదురవుతుంటే అభద్రతా భావంతో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది’’ అని ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఈ ఇంటిని (కాంగ్రెస్‌ను) ఎవరో వచ్చి రిపేర్ చేయరని, అందరం కలిసి పున ర్నిర్మాణం చేసుకోవాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. మీడియా ఉందని తప్పొప్పులను సమీక్షించుకోకూడదనుకోవడం సరికాదన్నారు. బలహీనతల్లేని పార్టీలు లేవని, వాటిని అధిగమించడమే వివేకమని పేర్కొన్నారు.

పార్టీలో సమన్వయ లోపం ఉందనే విషయం హైకమాండ్ పెద్దలకు తెలుసునన్నారు. కార్యకర్తల్లో నెలకొన్న నైరాశ్యాన్ని పోగొట్టాల్సిన అవసరముందని తాను సోనియాగాంధీని కోరినట్లు చెప్పారు. ఈ విషయంలో ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలని సూచించానన్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు కమిటీ ఇచ్చిన నివేదికను అలాగే ఉంచారే తప్ప ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కొందరు నాయకులు కాంగ్రెస్ పార్టీలో లబ్ధి పొందుతూ అవతలి పార్టీకి మద్దతు పలుకుతున్నారని ఆరోపించారు. ‘‘తినేది ఇక్కడ... పాడేది అక్కడా? ఇదేం న్యాయం, ధర్మం? ఇవేం ఎథిక్స్’’అని ప్రశ్నించారు. తాను బేషరతుగా ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసినప్పటికీ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అధిక నిధులు కేటాయించాలని, బీసీలకు అధిక సీట్లు ఇవ్వాలనే విషయంలో కొన్ని షరతులు పెట్టిన మాట వాస్తవమేన న్నారు. సోనియాగాంధీ 2014 ఎన్నికల్లో బీసీలకు అత్యధిక సీట్లు కేటాయిస్తారనే విషయంలో తనకు ఎలాంటి సందేహమూ లేదన్నారు.

ఒకరికి పదవిస్తే మిగిలిన వారు
పోతామంటున్నారట: వీహెచ్

వీహెచ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి డ్వాక్రా మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యత యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు ఇవ్వటం లేదని మండిపడ్డారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మంత్రి పదవిని వదిలేస్తే ఆ స్టయిలే వేరుగా ఉండేదన్నారు. మంత్రిగా ఉండటం వల్ల సీఎం వద్ద చేతులు కట్టుకుని నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. సీఎం, మంత్రి పదవులు అనుభవిస్తున్న నాయకులు నామినేటెడ్ పదవులను మాత్రం భర్తీ చేయటం లేదన్నారు. ఇదేమని ప్రశ్నిస్తే ఒకరికి పదవిస్తే మిగిలిన వాళ్లు పార్టీని విడిచి వెళ్లేలా ఉన్నారని చెబుతున్నారన్నారు. రాజ్యసభ సభ్యుడు కె.వి.పి.రామచంద్రరావు రూపొందించిన ‘వైఎస్ పాదయాత్ర డైరీ’ ఆవిష్కరణ కార్యక్రమానికి హైకమాండ్ పెద్దలు హాజరు కావడాన్ని తాను సీరియస్‌గా తీసుకోవడం లేదన్నారు. సీబీఐ కేసులో ఐఏఎస్ అధికారి బి.పి.ఆచార్య కేవీపీ పేరును ప్రస్తావించడంతో ఆయనకు భయం పట్టుకుందన్నారు. రేపటి నుంచి తమకు చేతినిండా పని ఉందని, కేవీపీ ఎక్కడికి వెళ్లినా వదిలే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.

తుస్సుమన్న వీహెచ్ సదస్సు...

‘సేవ్ ది పార్టీ’ పేరుతో వీహెచ్ నిర్వహించిన సదస్సు పేలవంగా ముగిసింది. 1972 నుంచి ఇప్పటి వరకు యువజన కాంగ్రెస్‌లో పనిచేసిన నాయకులతో ఏర్పాటు చేసిన సదస్సుకు హాజరు కావాలని సీఎం, పీసీసీ చీఫ్, మంత్రులు సహా పార్టీ ప్రజా ప్రతినిధులందరినీ ఆహ్వానించారు. రాజ్యసభ సభ్యుడు చిరంజీవి మినహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరూ హాజరు కాలేదు. గతంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేసిన నాయకులు కూడా చాలామంది హాజరు కాలేదు. మాజీ మంత్రులు చిన్నారెడ్డి, వసంత నాగేశ్వరరావు, పీసీసీ ప్రధాన కార్యదర్శి జి.నిరంజన్ వంటి కొద్దిమంది నాయకులు మాత్రమే వీహెచ్ నిర్వహించిన సదస్సులో పాల్గొన్నారు.

చిరంజీవి వస్తే ఎంత... రాకుంటే ఎంత?

జూబ్లీహాలులో జరిగిన యువజన కాంగ్రెస్ కార్యకర్తల మేథోమధనానికి ప్రముఖులు గైర్హాజరు కాకపోవటంపై వీహెచ్ అసంతృప్తి చెందారు. కొందరు నేతలతో చివరి ప్రయత్నంగా ఫోన్‌లో ఆహ్వానించేందుకు ప్రయత్నించారు. సమావేశం జరుగుతుండగా మధ్యాహ్నం 1.10 నిమిషాలకు ఒక్కసారిగా వేదికపై నుంచి జూబ్లీహాలు వెనక్కి వెళ్లి చిరంజీవికి ఫోన్ కలిపారు. తాను వేరే మీటింగ్‌లో ఉన్నాననీ రాలేనని ఆయన చెప్పారు. సామాజిక న్యాయం అంటూ గొప్పలు చెప్తావు కదా, ఆ అంశంపై మీటింగ్ పెడితే ఎందుకు రావంటూ ప్రశ్నించారు. రెండు నిమిషాలు వచ్చిపో అంటూ ఫోన్ పెట్టేసిన తర్వాత వీహెచ్ తన సన్నిహితులు గడ్డమీది నరేందర్ యాదవ్, శ్రీను, లక్ష్మణ్ గౌడ్, కన్నయ్యలాల్‌ల సమక్షంలో చిరంజీవిని తిట్టిపోశారు. ఆయన వస్తే ఎంత.. రాకుంటే ఎంత అంటూ విరుచుకుపడ్డారు.

AMBATI SLAMS CONGRESS DOUBLE STANDARDS


Speaking to media here on Saturday Ambati Rambabu YSR Congress Party spokesman said neither he nor any of the close circle of YSR had an idea of the existence of any diary which was suddenly released amidst much fanfare.
“I had very closely followed YSR during his 1600 km padayatra and never did I nor any one in the close circles of YSR did hear that that he was writing a diary. The talk did not come up while he was in Leader of Opposition nor did it come up when he was chief Minister for five years and three months.”
Suddenly the diary comes up as if from nowhere and the who-is-who of Congress attend the book release function and heap praises on YSR and describes him as a model Congress chief minister. Ironically, the very same senior leaders were mum and did not open their mouth when YSR was named in the charge-sheet by CBI.

This exposes the raw opportunism of Congress.

“All this shows that Congress wants to own YSR and his policies and at the same time distance itself from the 26 GOs and show YS Jagan Mohan Reddy in bad light. This is simply not possible and people gave their verdict earlier and such theatrics of diaries and senior leaders trying to own YSR up will not cut any ice,” he said.

ప్రెస్ ‘ట్రస్ట్’కు పట్టిన గతి!


‘నువు నాతో అబద్ధం చెప్పినందుకు చింతించడం లేదు- ఇకమీదట నిన్ను నమ్మలేనే అని బాధపడుతున్నా’నన్నాడట నీషే. పీటీఐ -ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా- కల్పిత కథనం విషయంలో వైఎస్‌ఆర్సీపీ బాధ కూడా అలాంటిదే. సమాచార వ్యవస్థ దేనికయినా ప్రాణం విశ్వసనీయత. దేశంలోని అతిపెద్ద వార్తాసంస్థగా చెప్పుకునే పీటీఐ ఏ చిన్న ప్రలోభానికో కక్కుర్తిపడి తప్పుడు కథనాలు ప్రచురిస్తే సమాచార వ్యవస్థ మీదే నమ్మకం నశిస్తుంది. బాధ్యత గల వార్తాసంస్థ ప్రవర్తించాల్సిన తీరు ఇదేనా? తమ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే అవకాశాలను వైఎస్‌ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ‘తోసిపుచ్చలే’దంటూ పీటీఐ ఓ కల్పిత కథనాన్ని ప్రసారం చేసింది. ఇది కేవలం అభూత కల్పన మాత్రమేననీ, దీని వెనక నీచమయిన దురుద్దేశాలు ఉన్నాయనీ స్పష్టం చేస్తూ వైఎస్‌ఆర్సీపీ అధికార ప్రతినిధులు శనివారం నాడు -సెప్టెంబర్ ఎనిమిదో తేదీన- ఓ వివరణ ఇవ్వవలసి వచ్చింది.

ఏ రేవంత్ రెడ్డి లాంటి జూనియర్ ఆర్టిస్టో, సంచలనాలను తిని-తాగి-త్రేన్చే ఏదో టీవీ చానెల్‌ను ఆశ్రయించి ఏవేవో కారుకూతలు కూయడం వేరు! ఏ వైబీ రాజేంద్రప్రసాద్ లాంటి అద్దెనోరు ఎక్స్‌ట్రా ఆర్టిస్టో, ఏదో వేదిక మీద నక్కి, ఏవేవో ఊళలు పెట్టి చంకలు గుద్దుకోవడం వేరు! వాటికి వివరణ ఇవ్వాల్సిన అగత్యం కూడా లేదు. అలాంటి పాశవికానందాన్ని అసలు ఖాతరు చెయ్యాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వాళ్లు ఎవరో, వారి స్థాయి ఏమిటో జనానికి తెలుసు. కానీ, పీటీఐ నిజస్వరూపం ఇంతవరకూ బయటపడనందువల్ల, ఆ వార్తాసంస్థ ఏదేనా కల్పిత కథనాన్ని ప్రసారం చేస్తే నమ్మే అమాయకులు ఉంటారు. అందుకే, వైఎస్‌ఆర్సీపీ బాధపడుతున్నది.

ఫీజు వాపసు పథకాన్ని బేషరతుగా అందరికీ అనువర్తింప చెయ్యాలనే డిమాండ్‌తో చేసిన రెండు రోజుల నిరాహార దీక్ష ముగింపు సందర్భంగా ‘కాంగ్రెస్ పార్టీలో మీ పార్టీని విలీనం చేస్తారా?’అనే ప్రశ్నకు సందర్భశుద్ధి ఏమిటో పీటీఐ ప్రతినిధికే తెలియాలి. ఈ నిరశన దీక్షకు ముందు ఒకసారి ఏలూరులోనూ, మరోసారి సిర్సిల్లలోనూ విజయమ్మ రెండు సందర్భాల్లో నిరశన దీక్ష చేసి ఉన్నారు. మధ్యలో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్సీపీ అభ్యర్థులు 15 నియోజకవర్గాల్లో భారీ ఆధిక్యంతో గెలిచి ఉన్నారు. ఒకటి రెండు నియోజకవర్గాల్లో స్వల్పమయిన తేడాలతో మాత్రమే వైఎస్‌ఆర్సీపీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో వైఎస్‌ఆర్సీపీలాంటి పార్టీకి -తమ అభ్యర్థుల చేతిలో ఘోరపరాజయం పాలయిన- కాంగ్రెస్‌లో విలీనం కావలసిన అవసరమూ అగత్యమూ ఎంతమాత్రమూ లేదని గ్రహించడానికి గొప్ప మేధావి కానవసరం లేదు. కానీ ఏ కారణం చేతనో పీటీఐ ప్రతినిధికి ఈ ప్రశ్నే తట్టింది. అసందర్భమయిన ఆ ప్రశ్నకు విజయమ్మ సమాధానం ఇవ్వక పోవడాన్ని, ‘తోసిపుచ్చక పోవడం’గా చిత్రిస్తూ కల్పిత కథనాన్ని ప్రసారం చేసేందుకు సదరు ప్రతినిధిని ఏ శక్తి పురికొల్పిందో మరి!

ఒక వార్తా సంస్థ ప్రతినిధి తమ సంస్థ విశ్వసనీయతమీద అనుమానాలు తలెత్తే రీతిలో కల్పిత కథనాలను ప్రసారం చెయ్యడం, కూర్చున్న కొమ్మనే నరుక్కోవడంతో సమానం. ఆత్మహత్యా సదృశమయిన ఈ దుస్సాహసానికి పాల్పడినందుకు చరిత్ర ఆ ప్రతినిధిని క్షమించదు. అంతకుమించి, మరెవ్వరూ పీటీఐ ‘కథనాలను’ గతంలో మాదిరిగా నిశ్చింతగా నమ్మజాలరు.ఇలాంటి తప్పుడు కథనాల వల్ల వెఎస్‌ఆర్సీపీకి జరిగే నష్టం కన్నా సమాచార రంగానికి జరిగే నష్టమే అధికమని ప్రతి ఒక్క జర్నలిస్టూ గుర్తించాలి! తద్వారా మన ప్రజాస్వామ్యానికి సైతం తీరని నష్టం జరిగిందని ప్రజాస్వామ్య వాదులందరూ గ్రహించాలి!!

విజయమ్మపై తప్పుడు ప్రచారం: జలీల్‌ఖాన్

విజయవాడ: తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మపై కాంగ్రెస్, టీడీపీ, కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని వైఎస్‌ఆర్ సీపీ నగర అధ్యక్షులు జలీల్‌ఖాన్ ఆరోపించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంతోపాటు కేంద్రంలోనూ యువనేత వైఎస్ జగన్‌ కీలక పాత్ర పోషిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

'క్రిమినల్‌ కేసులు పెట్టినప్పుడు ఏమయ్యారు?'

ఢిల్లీలో వైఎస్‌ పాదయాత్ర డైరీ ఆవిష్కరణ సందర్భంగా ఆయన్ను కొనియాడిన నేతలు వైఎస్‌పై క్రిమినల్‌ కేసులు పెట్టినప్పుడు ఏమయ్యారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. వైఎస్‌ను కుటుంబం నుంచి వేరుచేసేందుకే కాంగ్రెస్‌ వాదంటూ నేతలు వైఎస్‌ ను కొనియాడారని అంబటి ఆరోపించారు. కాగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని మరోపార్టీలో విలీనం చేయాల్సిన దౌర్బాగ్యం లేదని కాంగ్రెస్‌, టీడీపీల నుంచి వస్తున్న నేతలే తమ పార్టీలో కలుస్తున్నారని ఆయన స్పష్టంచేశారు.

పీటీఐ కథనాన్ని ఖండించిన వైఎస్సార్ సీపీ

తమ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే అవకాశాలను వైఎస్ విజయమ్మ తోసిపుచ్చలేదంటూ వచ్చిన పీటీఐ వార్తా కథనాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. పీటీఐలాంటి సంస్థ ఇలాంటి కథనాలు రాయడం దురదృష్టకరమని వైఎస్సార్ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధులు బాజిరెడ్డి గోవర్థన్, వాసిరెడ్డి పద్మ, రెహ్మాన్‌ అన్నారు. ఇలాంటి కథనాలతో పీటీఐకున్న విశ్వసనీయత దెబ్బతినే ప్రమాదముందని హెచ్చరించారు. పీటీఐలో కూడా కోవర్టులున్నారన్న విధంగా కథనాన్ని రాశారని అన్నారు. తమ పార్టీని అపఖ్యాతిపాలు చేయాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్‌లో విలీనం కావాల్సిన ఖర్మ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు లేదని స్పష్టం చేశారు. చిరంజీవిలా పార్టీని అమ్ముకునే పరిస్థితి వైఎస్సార్ సీపీకీ ఎన్నటికి రాదన్నారు. పీటీఐ కథనాన్ని అదే పనిగా ప్రచారం చేసిన కొన్ని చానల్స్‌, వైఎస్ విజయమ్మ ఖండనను ఎందుకు ప్రచారం చేయలేదని వారు ప్రశ్నించారు. ఫీజుదీక్ష విజయవంతం కావడాన్ని జీర్ణించుకోలేక కొన్ని చానల్స్‌ దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. దమ్ముంటే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో అవిశ్వాసం పెట్టాలని ప్రతిపక్ష నేత చంద్రబాబుకు వారు సవాల్‌ విసిరారు. అవిశ్వాసం పెడితే ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో తేలిపోతోందని అన్నారు.

Ambati Rambabu Press Meet 8th Sep 2012

అనునిత్యం ఆత్మహత్యా ప్రక్రియలో ములిగితేలే కాంగ్రెస్ పార్టీని కాపాడ్డం? హాస్యానికయినా ఓ హద్దుండాలి హనుమన్నా!


అరుపులూ కేకలూ అల్లరీ హడావుడీ బతుకుతెరువుగా బండి లాగిస్తున్న కాంగ్రెస్ మార్కు రాజకీయుల్లో ముందుగా చెప్పుకోవలసిన వ్యక్తి వుత్పల హనుమంతరావు అనే వీహెచ్. అలాంటివాడు హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ను కాపాడుకునే నిమిత్తం ‘మేధో మథనం’ పేరిట ఓ సమావేశం నిర్వహించారు. ఎలాగయినా వీహెచ్ సెన్సాఫ్ హ్యూమర్ చాలా గొప్పది. కాకపోతే, కాంగ్రెస్ పరిరక్షణ కోసం ఆయన నడుంకట్టడమేమిటి? అందుకాయనకున్న అర్హతేమిటి? తన పేరుకు సంపూర్ణంగా న్యాయం చేస్తూ అధిష్టానానికి చెక్కభజన చెయ్యడం తప్పిస్తే, వీహెచ్ ఎన్నడయినా కాంగ్రెస్ అభ్యున్నతికి ఏమయినా ప్రయత్నం చేశారా? (నా పేరే హనుమంతు- ఇది వీహెచ్ అభిమాన డైలాగు! కాదనడానికి ఎవరికయినా ఎన్ని గుండెలు?) ఆమాటకొస్తే, ఆయన జూబ్లీ హాల్లో ‘మేధో మథనం’ సదస్సు నిర్వహించడం మాత్రం చిన్న జోకా? అనునిత్యం ఆత్మహత్యా ప్రక్రియలో ములిగితేలే కాంగ్రెస్ పార్టీని కాపాడ్డం ఒకటా? అదీ హనుమంతరావు ఆధ్వర్యంలోనా? హాస్యానికయినా ఓ హద్దుండాలి హనుమన్నా!

అధిష్టానం ఏమీ మాటాడకముందే అది ఎలా కరెక్టో రుజువుచేసేందుకు రెడీ అయిపోయే అతివిధేయుల జాబితాలో మొదటి పేరే మన వీహెచ్‌ది. మేడమ్ సోనియా గాంధీ పక్కింట్లోనే -11 జన్‌పథ్‌లో- నివాసం ఉండే హనుమన్న అధిష్టానవర్గాన్ని సమర్ధించేందుకు దొరికే ఏ చిన్న అవకాశాన్నీ జరవిడుచుకోరు. అసలు వీహెచ్‌ది నిజంగానే ఓ వింతకథ. సొంతబలం కొంతయినా లేకపోయినా, తన పేరు చెప్పి ఒక్క కార్పొరేటర్‌నయినా గెలిపించుకోలేకపోయినా, హనుమంతరావు లీడర్‌గిరీకి మాత్రం ఏ ఢోకా రాలేదు! హనుమంతరావు ‘సొంత నియోజక వర్గం’గా చెప్పుకునే అంబర్ పేట (ఒకప్పుడు హిమాయత్ నగర్)లో కాంగ్రెస్ పార్టీ పొరబాటున ఒకే ఒక్కసారి -చావు తప్పి కన్నులొట్టబోయినట్లుగా- గెలిచింది. ఎనిమిదిసార్లు ఘోరంగా ఓడిపోయింది. అదే నియోజక వర్గ పరిధిలో ఉండే, వీహెచ్ నివాసం ఉన్న డివిజన్‌లోనే కాంగ్రెస్ పార్టీ ఎడ్రస్ లేకుండా పోయింది. ఇలాంటి వ్యక్తి జాతీయ స్థాయికి ఎగబాకగలగడం ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమేమో!

నిజానికి హనుమన్న రాజకీయ రంగప్రవేశమే రంజుగా జరిగింది. 1974లో, అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ పుత్రరత్నం సంజయ్ గాంధీ యూత్ కాంగ్రెస్ జాతీయ నాయకత్వం చేపట్టి సొంత సైన్యం సమకూర్చుకుంటున్న నేపథ్యంలో, హనుమంతరావు రంగంలోకి దిగారు. అప్పట్నుంచి ఇప్పటి దాకా పైవాళ్ల దయతోనే ఆయన అభ్యున్నతి అప్రతిహతంగా సాగిపోయింది. ఎమెర్జెన్సీ నీలినీడలో, మన రాష్ట్ర అసెంబ్లీకి 1978లో జరిగిన ఎన్నికల్లో వీహెచ్ హిమాయత్ నగర్‌లో వీరంగమాడి, గెలుపు తమదేనని ఢంకా బజాయించి చెప్పారు. కానీ, ఆ ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్ రాష్ట్రం మొత్తం మీద 175 సీట్లు గెలిచినా వీహెచ్ సొంత నియోజకవర్గం హిమాయత్ నగర్‌లో మాత్రం తేళ్ల లక్ష్మీ కాంతమ్మ ఘన విజయం సాధించారు. ‘కాపరం చేసే గుణం కాలిగోటి దగ్గిరే తెలిసిపోతుం’దన్నట్లుగా వీహెచ్ ప్రతిభా పాటవాలు తొలి ఎన్నికల్లోనే తేలిపోయాయి.

ఈ నేపథ్యంలో ఎవరయినా ఏం జరుగుతుందనుకుంటారు? సోది కబుర్లకు తప్ప మరెందుకూ పనికిరాని ఇలాంటి నేతలను తప్పించి కాంగ్రెస్ పార్టీలోని ఇతరులకు అవకాశమిస్తారని భావిస్తారు. కానీ కాంగీయులు అలా చెయ్యలేదు. మరుసటి సంవత్సరమే, 1979లో, వీహెచ్‌ను రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షపీఠం మీద కూర్చోపెట్టింది కాంగ్రెస్ నాయకత్వం. ఆ పీఠానికి బల్లిలా అతుక్కుపోయిన వీహెచ్ 1983 దాకా వదల్లేదు. అప్పుడయినా, ఎన్టీఆర్ నాయకత్వంలో టీడీపీ కాంగ్రెస్ పార్టీని తుక్కుతుక్కు కింద ఓడించి అధికారం చేజిక్కించుకున్నందువల్లనే కబుర్లకు తప్ప కార్యానికి పనికిరాని వీహెచ్‌లాంటి నేతలను పక్కకు తప్పించారు.

‘నా పేరే హనుమంతు!’ అని గర్వంగా ప్రకటించుకునే వీహెచ్ వెంటనే చిరతలు పట్టుకుని అధిష్టానం ముందు ప్రత్యక్షమయిపోయారు. రెండేళ్లు నానా రకాలుగా పాట్లుపడి ఏపీసీసీ సంయుక్త కార్యదర్శి పదవిలో నియుక్తుడయాడు వీహెచ్. వీహెచ్ రాజకీయ జీవితం మరీ అంత కటిక చీకటి మయమేం కాదు. 1989లో వీహెచ్ ఎమ్మెల్యేగా గెలిచారు- పొదుపుగా రెండువేల ఓట్ల మెజారిటీతో! 1999లో ఇదే వీహెచ్ అదే అంబర్ పేట నియోజక వర్గం నుంచి ఘోరంగా ఓడిపోయారు- 39 వేల ఓట్ల తేడాతో! అదీ మన హనుమన్న ఘన చరిత్ర.

ఇలాంటి వ్యక్తి, కాంగ్రెస్ పరిరక్షణకు నడుంకట్టి రంగంలోకి దిగడంలో అర్థమేమిటి? దానివల్ల ఒరగదోసే పరమార్థమేమిటి? కాంగ్రెస్ పార్టీని చెమ్చాలకు కేంద్రంగా తయారు చేయడం తప్ప, వీహెచ్ తన నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో సాధించిన ఘనకార్యం ఏముంది? ఈయనగారు పెద్ద పోటుగాడిలా మేధోమథనం నిర్వహిస్తే, జనం తండోపతండాలుగా విరగబడిపోనందుకు మళ్లీ అలకపాన్పు ఎక్కడం కూడా జరిగింది. జి.చిన్నారెడ్డి లాంటి రాజకీయ నిరుద్యోగులు ఇద్దరు ముగ్గురు ఈ మేధోమథనం సదస్సుకు హాజరుకాకపోలేదు. కాకపోతే, వాళ్లు 2014 ఎన్నికల్లో -తలకిందులుగా తపస్సు చేసినా- కాంగ్రెస్ పార్టీ గెలిచే ప్రమాదం లేదని ఉన్నమాట చెప్పేశారు. అంతే- వీహెచ్‌కు కోపం బుస్సని పొంగిందట! పొంగదా మరి? అవతలివాళ్లు కూడా మరో రెండు చిరతలందుకుని అధిష్టానమ్మ కీర్తిగానం చేసి ఉంటే అప్పుడద అచ్చమయిన కాంగ్రెస్ మార్కు ‘మేధోమథన సదస్సు’ అనిపించుకునేది. అలా చెయ్యకుండా నిజాలు మాట్లాడేస్తే ఎలా?

Bajireddy Press Meet 8th Sep 2012

వీహెచ్ మేథోమథనానికి స్పందన కరువు

కాంగ్రెస్‌ను బతికించుకుందామంటూ ఆపార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు నిర్వహించిన మేథోమథనానికి పార్టీ నేతల నుంచే స్పదన కరువైంది. శనివారం జూబ్లీహాలులో పార్టీని బలోపేతం చేయడంపై వీహెచ్‌ ఆధ్వర్యంలో ఓ సమావేశం జరిగింది. ఒకరిద్దరు నేతలు మినహా ప్రజా ప్రతినిధులెవరూ హాజరుకాలేదు. తన మద్దతుదారులతోనే ఆయన మేథోమథనాన్ని కొనసాగిస్తున్నారు.

పార్టీ వరుసగా ఎందుకు ఓడిపోతోందనే దానిపై చర్చ జరగాలన్న తన సూచనను పీసీసీ పట్టించుకోకపోయినప్పటికీ తానే చొరవ తీసుకుని ఏర్పాటు చేయాల్సి వచ్చిందని వీహెచ్ తెలిపారు. నామినేటెడ్‌ పదవులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

కాగా ఈ సదస్సులో పాల్గొన్న మాజీ మంత్రి చిన్నారెడ్డి 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలవడం కష్టమేనన్నారు. అవినీతి ఆరోపణలపై యూపీయే సర్కారు ప్రతిష్ట దెబ్బతిన్నదన్నారు. రాష్ట్రంలోనూ గడ్డు పరిస్థితులే ఉన్నాయన్నారు. తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రం అంశం, సీమాంధ్రలో జగన్‌ ప్రభంజనంతో కుదేలైన కాంగ్రెస్‌ను మళ్లీ గాడిలో పెట్టేందుకు యువ కాంగ్రెస్‌ నేతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

మహానేత- ప్రజల సొత్తు!

మనది మార్కెట్ చోదిత వ్యవస్థ! ఇక్కడ దేనికి గిరాకీ ఉంటే దాన్ని సొంతం చేసుకోడానికే అందరూ ప్రయత్నిస్తారు. రాజకీయాలతో సహా ఏదీ దీనికి మినహాయింపు కాదు. ఈ విషయాన్ని ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు మరోసారి రుజువు చేశారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కన్నుమూసి మూడు సంవత్సరాలు గడిచిపోయాకా, ఆయన తొమ్మిదేళ్లకింద -2003 వేసవిలో- చేసిన చరిత్రాత్మక ‘ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర డైరీని పుస్తకరూపంలో ఇప్పుడు వెలువర్చారు కాంగ్రెస్ నేతలు. అంతేకాదు- ఆ సందర్భంగా ప్రసంగించిన కాంగ్రెస్ అతిరథ మహారథులు అందరూ ‘వైఎస్ మా కాంగ్రెస్ పార్టీ సొత్తు!’ అని నిస్సిగ్గుగా ‘క్లెయ్‌మ్’ చేసుకున్నారు. ఇంతకాలం ఈ మౌనం ఎందుకు పాటించారో అర్థంచేసుకోవాలంటే, పెద్ద మేధావి కానవసరం లేదు. 

2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ పార్టీని -వ్యక్తిగత బాధ్యతపై- గెలిపించి గట్టెక్కించిన తర్వాత మళ్లీ ఆ పార్టీ పెద్దెత్తున ప్రజల తీర్పు కోరుతూ జనం ముందుకు వెళ్లవలసి వస్తున్నదిప్పుడే. అది కూడా మొన్న హైకోర్టు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిపించమని స్పష్టంగా ఆదేశించిన నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి ఈ అవసరం ఏర్పడింది. 

దాదాపు దశాబ్ద కాలంగా ఆ పార్టీని విజయపథంలో నడిపించగల బొమ్మ ఎప్పుడూ ఒక్కటే- అది వైఎస్ రాజశేఖరరెడ్డి బొమ్మే! నిన్న గాక మొన్ననే సంక్షేమ పథకాలపై వైఎస్ ముద్ర చెరిపెయ్యకపోతే, కాంగ్రెస్ బతికి బట్టకట్టడం కష్టమని ఆ పార్టీలోని ‘భావజాల నిపుణుడు’ ధర్మాన ప్రసాదరావు సారథ్యంలోని ఓ కమిటీ సిఫార్సు చేసింది. మరుక్షణమే అనేక పథకాలకు సంబంధించిన ప్రచార పత్రాల్లోంచి, కాంగ్రెస్ పార్టీ వేదికల మీంచి వైఎస్ బొమ్మను తొలగించేశారు.

స్థానిక ఎన్నికల సందర్భంగా వైఎస్ బొమ్మ లేకుండా జనం ముందుకెళ్తే -ఓట్ల మాట ఎలాఉన్నా- తరిమితరిమి కొడతారని కాంగ్రెస్ పెద్దలకు అర్థమయిపోయింది. అంతే- ఠక్కున ప్లేటు ఫిరాయించి ‘వైఎస్ మా సొత్తే!’ అంటూ కొత్త పల్లవి ఎత్తుకున్నారు. అవును మరి- ఎప్పుడు దేనికి గిరాకీ ఉంటే దాన్నే మార్కెట్ చేసుకోవడం మన వ్యవసథ మూలసూత్రం! కాంగ్రెస్ పెద్దలు ఈ మూలసూత్రాన్ని కాదని బతకడం ఎలా సాధ్యం?ప్రజల జ్ఞాపకశక్తి బహుపరిమితమని నమ్మే రాజకీయులు ఇలాంటి చిట్కాలూ చమక్కులూ ఝలక్కులూ ప్రదర్శించడం కొత్తేం కాదు. 

అంతెందుకు- రాజశేఖరరెడ్డిముఖ్యమంత్రిగా ఉన్న ఆరేళ్ల కాలంలో ఆయన ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకానికీ వంకలు పెట్టి, విమర్శించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు -ఫీజు వాపసు పథకంతో సహా- అవే సంక్షేమ పథకాలను కనిపెట్టింది తానేనని డప్పుకొట్టుకోవడం మొదలుపెట్టలేదా? అది కూడా గిరాకీ సూత్రం ప్రాతిపదికగా ఫిరాయించిన ప్లేటే! అయినా, మన పిచ్చిగానీ-కాంగ్రెస్ పెద్దలు ఏ ఎత్తుగడ వేసినా, బాబుగారి సలహా తీసుకోకుండా చేస్తారా?

ఈ సందర్భంగా ఒక్కమాట చెప్పాలి! మామూలు మనుషుల జ్ఞాపక శక్తి మీద మన అసాధారణ ‘మేధావుల’ అంచనా ఏమయినప్పటికీ, ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ముందే తేలిపోయిందిప్పుడు. వైఎస్‌ఆర్ బొమ్మకే గెలిపించే శక్తి ఉందని నమ్మినందువల్లనే కదా కాంగ్రెస్ పెద్దలు తొందరపడి తొమ్మిదేళ్ల తర్వాత ఆయన పాదయాత్ర డయరీని ఢిల్లీలో విడుదల చేశారు!

ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ఓట్ల్ట సంపాదించిపెడతాయన్న నమ్మకంతోనే కధా చంద్రబాబు ‘విధాన చౌర్యానికి’ తెగబడింది! ఈ రెండు రంగాల్లోనూ పరిస్థితి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగా ఉందని చెప్పక తప్పదు. వైఎస్ బొమ్మను ఆ పార్టీ జెండాపైనే హత్తుకున్నారు వాళ్లు. ఇక, వైఎస్‌ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలు -మహానేత రాజశేఖరరెడ్డి సతీమణి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి- వైఎస్ విజయమ్మ జులై నెల్లో సిరిసిల్లలో నేత దీక్ష నిర్వహించారు. 

అగస్ట్ నెల్లో ఏలూరులో ఫీజు పోరు దీక్ష నిర్వహించారు. ఈ గురు, శుక్రవారాల్లోనే -సెప్టెంబర్ ఆరు, ఏడోతేదీల్లో- విజయమ్మ రెండు రోజుల ఫీజు దీక్షను హైదరాబాద్‌లో నిర్వహించిన సంగతి తెలిసిందే. అంటే, వై ఎస్ ఆర్ పథకాల వారసత్వం కూడా ఆ పార్టీకే దక్కుతోంది! అంచేత, కాంగ్రెస్-టీడీపీల నీచమయిన ఎత్తుగడల వల్ల వాటికి ఓట్ల మార్కెట్‌లో పెద్దగా కలిసొచ్చేసూచనలేం కనబడ్డం లేదు!

అయినా, కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖరరెడ్డిని ‘సొత్తు’గా చూడ్డమూ, దానిమీద ‘దానవిక్రయాది సర్వ హక్కులూ దఖలు పరచుకోవా’లని తాపత్రయపడ్డమూ కేవలం అమాయకత్వం. ఇక, ఫోర్జరీల మీద ఫోర్జరీలు చేసేస్తూ, ఆయన పథకాలను ఆబగా సొంతం చేసుకోవాలనే చంద్రబాబు యావ కేవలం మూర్ఖత్వం! మహానేత వైఎస్ ఆర్ ఏనాడో జనం పరమయిపోయారు. ఆయన అనుసరించిన విధానాలూ, అమలుచేసిన పథకాలను అనుసరించే ప్రతి ఒక్కరికీ వైఎస్ ఆశీర్వాదం లభిస్తుంది. అవేం చెయ్యకుండా మాసొత్తంటే మా సొత్తని గుండెలు బాదుకోవడం వల్ల ప్రయోజనం శూన్యం! 

Jagan prepares in jail for 2014 elections (The Hindu)


YSR Congress (YSRC) president Y.S. Jaganmohan Reddy has been in jail for over 100 days, but that has not prevented him from carrying out his political agenda and shortlisting candidates for the Assembly elections in 2014.
Till recently, Jagan was liberal in meeting visitors during the ‘mulaqat’ in Chanchalguda jail but of late he is selective about whom he should meet. The Kadapa MP is said to be utilising his time in planning out his party’s strategy for the elections, either those for the panchayat raj bodies in the coming months or the Assembly and the Lok Sabha in 2014.
Interviews
Over the last few weeks, he met several probables for the party ticket and, after interviewing them, gave them the go-ahead to start working for the next elections.
Notable among them was Vijaya Reddy, daughter of former CLP leader, the late P. Janardhan Reddy. Only after their meeting did Ms. Vijaya Reddy join the party; she is now tipped to be the YSRC candidate from Khairatabad constituency.
It is believed that GHMC corporator from Habsiguda, Singireddy Harivardhan Reddy has got the green signal to contest from Medchal Assembly. He later joined the party with fanfare and invited YSRC leader Vijayamma to Jawaharnagar in Medchal constituency.
Sources said Sanjeeva Rao, who contested the Assembly elections from Vikarabad (SC) constituency, had recently met Jagan in jail and got the nod for the party ticket.
Another influential Congress leader from Ranga Reddy district is tipped to get the party ticket from Uppal.
Summoning hopefuls
It is understood that Jagan was summoning the hopefuls only after getting a thorough feedback about their prospects. A systematic survey and comprehensive background check besides the standing of the aspirants preceded the granting of green signal. Party seniors are understood to be regularly briefing him about the developments.
A senior Minister confirmed that a number of party leaders in the twin cities and neighbouring Rangareddy district were ready to jump into the bandwagon of the YSR Congress.
“Our efforts to arrest this trend is not succeeding as Jagan is meeting the hopefuls and assuring them that he would field them on behalf of the YSRC,” the Minister remarked.
http://www.thehindu.com/news/states/andhra-pradesh/article3869605.ece

Farmers problems in Andhra Pradesh

Friday, 7 September 2012

వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు

కడప: ప్రజలకు వైద్య సదుపాయాలను అందుబాటులోకి తేవడానికి వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్రవ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తోంది. నేడు,రేపు రైల్వేకోడూరు, చక్రాయపేటలో సాహి ఫౌండేషన్ ఫర్ హియరింగ్ ఎయిడ్ ఆధ్వర్యంలో చెవి సంబంధించిన వ్యాధులకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తోంది. 

ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు శనివారం రైల్వేకోడూరులో మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీనేత వైఎస్ కొండారెడ్డి, పలువురు పార్టీనేతలు పాల్గొన్నారు. ఈ వైద్య శిబిరాల్లో 15మంది అపోలో వైద్యులు పాల్గొంటున్నారు. శస్త్ర చికిత్స అవసరం అయినవారిని హైదరాబాద్ కు రిఫర్ చేయనున్నారు.

అన్నీ తానై పార్టీ బరువు బాధ్యతలను భూజాన (surya news)

DSC_0796హైదరాబాద్‌, మేజర్‌ న్యూస్‌:రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరా డటంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాటుదేలుతోంది. పార్టీ అధినేత జగన్‌ లేని కొరతను పార్టీ వర్గాలపైన, కార్య కర్తలు, అభిమానులపైన పడనీయకుండా పార్టీ గౌరవా ద్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ తీవ్రంగా కృషి చేస్తున్నారు. అన్నీ తానై పార్టీ బరువు బాధ్యతలను భూజాన వేసుకు న్నారు. ప్రజా సమస్యలపై ప్రజల పక్షాన నిలిచి ప్రభు త్వంపై పోరాటాలకు కొంగు బిగించారు. మూడేళ్ళ కిందటి దాక గుమ్మం దాటి బైటకురాని విజయమ్మ ను రాష్ట్రంలో నెలకున్న ప్రత్యే క పరిస్థితులే బయటకు వచ్చేలా చేశాయి. అంతే కాదు నడుస్తున్న రాజకీయాల్లో ఆమెను మంచి వక్తగానే కాకుండా సమర్ధత గల నేతగా ఏదిగేందుకు దోహద పడుతున్నాయి. 

రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇప్పటివరకూ చరిష్మా ఉన్న మహిళానేతగా రాష్టస్థ్రాయిలో ఎవరూ లేరన్న లోటును భర్తీ చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులంటున్నారు. పేద విద్యార్దులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం చేస్తున్న కుదింపు ప్రయత్నాలను ఎండగడుతూ విజయమ్మ రెండురోజుల ఫీజుదీక్ష విజయవంతంగా మగియటం పార్టీ వర్గాల్లో ఉత్సాహం నింపింది. రాజధాని నడిబొడ్డున చేపట్టిన ఈ దీక్షకు విద్యార్ది వర్గాలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలివచ్చి విజయమ్మ డిమాండ్లకు గళం కలిపాయి. ఇతర వర్గాల ప్రజలు కూడా దీక్షా స్థ్ధలానికి చేరుకుని ప్రభుత్వంపై ఫీజుపోరుకు బాసటగా నిలిచాయి. అంతకు ముందు కూడా ఇదే అంశంపై విజయమ్మ ఏలూరు కేంద్రంగా చేసుకుని రెండురోజుల పాటు చేసిన దీక్ష విజయవంతం కావటం పార్టీ శ్రేణుల్లో మనోధైర్యం నింపింది. 

గత నెల 14, 15తేదీల్లో విజయమ్మ చేపట్టిన ఫీజురీఎంబర్స్‌మెంట్‌ దీక్ష అన్ని వర్గాల విద్యార్దులను అకర్షించమే కాకుండా ప్రభుత్వ విధానాలపై ఆలోచింప చేసింది.‘ వైఎస్‌ పైనుంచి ఈ ప్రభుత్వాన్ని చూస్తుంటే చాల బాధ పడుతుంటారు’ అంటూ విజయమ్మ గద్గద స్వరంతో కంటతడిపెట్టడం వంటి దృశ్యాలు సాధారణ ప్రజానీకాన్ని సైతం చలింపచేశాయంటున్నారు. రాష్ట్రంలో ఎవరూ సుఖంగా లేరని తన మాటలతో విజయమ్మ రాష్ట్ర పరిస్థితులను కళ్ళకు కట్టారు. తెలుగుదేశం పార్టీ వెనుకబడిన తరగతులకు వంద టిక్కెట్లు వచ్చే ఎన్నికల్లో ఇవ్వనుందని ప్రకటించడం పట్ల వైఎస్‌ఆర ్‌కాంగ్రెస్‌ పార్టీ అంతకు మించిన స్థాయిలోనే స్పందించింది. బీసీలకు ఎన్నికల్లో వంద టిక్కెట్లు కాదు శాసనసభలోనే వంద స్దానాలు కేటాయిద్దాం అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు విజయమ్మ లేఖరాసి కొత్త ప్రతిపాదనలకు తెరలేపింది. 

విజయమ్మ ప్రతిపాదన పట్ల బీసీ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. బీసి సంఘాల రాష్ట్ర నేత ఆర్‌ కృష్ణయ్య సైతం విజయమ్మ చేసిన ప్రతిపాదన చారిత్రాత్మక ప్రతిపాదన అంటూ హర్షించారు. సహజంగానే ఈ ప్రతిపాదనతో విజయమ్మ పార్టీని బీసి వర్గాలకు మరింత చేరువ చేసే ప్రయత్నం చేసింది. గత నెల చివరివారంలో గడపగడపకు వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌పార్టీ అన్న నినాదంతో విజయమ్మ రంగారెడ్డిజిల్లాల్లో నేరుగా జనంలోకి వెళ్ళారు. వైఎస్‌ మీ ముందుకొస్తే ..ఆయన కళ్ళలోకి సూటిగా చూడగలరా! అంటూ సంచలన వ్యాఖ్యలు చేసి అధికార కాంగ్రెస్‌ పార్టీ నేతల గుండేల్లో రైళ్ళు పరిగెత్తించారు. మొన్నటిదాక విద్యుత్‌ కోతలతో విసిగెత్తిపోతున్న ప్రజలకు అండగా నిలిచి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు తనే ధర్నాల్లో పాల్గొన్నారు. రాష్ట్ర బంద్‌ పిలుపుతో పార్టీ శ్రేణుల్లో చురుకు పుట్టించారు.

మరిన్ని ఉద్యమాలకు వ్యూహం
పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చేపట్టిన దీక్షలు, ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలకు ప్రజలనుంచి మంచి స్పందన వస్తుండంతో పార్టీ ముఖ్యనేతలు ఇక విజయాస్త్రానికి మరింత పదును పెట్టాలన్నన అభిప్రాయంతో ఉన్నాయి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎప్పటికపుడు స్పందిస్తూ ఉద్యమాలకు వ్యూహరచన చేయనున్నట్టు పార్టీ సీనియర్‌ నాయకులొకరు పేర్కొన్నారు. జిల్లాల వారీగా స్దానిక సమస్యలపై కూడా ఉద్యమాలకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. జగన్‌ జైలునుంచి బయటకు వచ్చేలోపు పార్టీని కాపాడు కోనుకునేందు ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్నింటిని ఉపయోగించుకునే అలోచనలో ఉన్నారు. సమస్యల ఆధారంగా ఒక వైపు ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే మరోవైపు ప్రతిపక్షస్దానంలో ఉన్న తెలుగుదేశం పార్టీని వెనక్కు నెట్టి ఆ స్ధానంలో ఎదిగేందుకు ద్విముఖ వ్యూహం అమలు చేస్తూ పార్టీని పటిష్టం చేసుకునే దిశగా ముందుకు సాగే యోచనలో ఉన్నారు.

ప్రజల్లోకి చంద్రబాబు వెళ్లినప్పుడు దగ్గరకు వచ్చిన వారిపై చనువుగా భుజంపై చేయి వేయడానికి కూడా సిద్ధపడరు(part from andhrajyothy)


"...ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులలో నేను ఇది చేశాను. మళ్లీ అధికారం అప్పగిస్తే పరిస్థితిని ఫలానా విధంగా చక్కదిద్దగలను'' అని చెప్పవలసింది పోయి ఇష్టానుసారం హామీలు ఇవ్వడం వల్ల ప్రత్యర్థులు తనను పిట్టల దొరతో పోల్చే అవకాశం చంద్రబాబు ఇస్తున్నారు. తెలుగుదేశం సీనియర్ నాయకులు కొందరు వాస్తవాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లకుండా తాళం వేస్తున్నారు. నిర్మొహమాటంగా చెప్పాలనుకుంటున్నవారికి చంద్రబాబు అవకాశం ఇవ్వడం లేదు. దీంతో లోపాలను, తప్పులను సరిదిద్దుకోలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారు...''

"...సిగ్నల్స్ పేరిట పోరాటాలకు స్వస్తి చెప్పిన కె.సి.ఆర్. పట్ల సగటు తెలంగాణవాదుల్లో నమ్మకం సడలిన నేపథ్యంలో, రాజకీయ జె.ఎ.సి.తో జత కట్టడానికి కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధపడుతోంది.  తెలుగుదేశం-సి.పి.ఐ. రాజకీయ జె.ఎ.సి.తో జతకట్టి తెలంగాణ రాష్ట్ర సమితిని పక్కకు నెట్టే అవకాశాలు లేకపోలేదు...''
 

తెలుగుదేశం పార్టీ భవిష్యత్ ఏమిటి? ఆ పార్టీ శ్రేణులనే కాదు- పార్టీ అధినేతను కూడా వేధిస్తున్న ప్రశ్న ఇది! రాజశేఖర్ రెడ్డి మరణానంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ప్రతిపక్ష స్థానంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పుంజుకోవలసింది పోయి క్షీణించడం మొదలైంది.

 జైలు పాలైనప్పటికీ, యువతతో పాటు కింది స్థాయి జనంలో జగన్ పట్ల  క్రేజ్ ఏర్పడింది. దీంతో 2014 ఎన్నికలలో అధికారంలోకి రావడానికి గల అన్ని అవకాశాలనూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పరిశీలించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో తన సహజ సిద్ధమైన స్వభావానికి భిన్నంగా వివాదాస్పద అంశాలపై స్పష్టత ప్రదర్శించడం ద్వారా కొన్ని వర్గాల ప్రజలనైనా దరి చేర్చుకోవాలన్న నిర్ణయానికి ఆయన వచ్చారు. ఎస్.సి. వర్గీకరణ విషయంలో గానీ, తెలంగాణ విషయంలో గానీ పార్టీ వైఖరిని స్పష్టంచేయడం ఇందులో భాగమే! అదే సమయంలో పార్టీకి మొదటి నుంచీ ఆయువుపట్టుగా ఉన్న బి.సి.లను తిరిగి దరిచేర్చుకోవడానికై ఆ వర్గాలను ఆకర్షించే పనిలో చంద్రబాబు పడ్డారు. 

ఇంతటితో ఆగకుండా అక్టోబర్ రెండవ తేదీ నుంచి వచ్చే ఏడాది జనవరి 26వ తేదీ వరకు సుదీర్ఘంగా పాదయాత్ర చేపట్టాలన్న నిర్ణయానికి వచ్చారు. అయితే చంద్రబాబు తీసుకున్న, తీసుకోబోయే నిర్ణయాలు, చేపట్టనున్న పాదయాత్ర ఆయనను తిరిగి అధికారంలోకి తీసుకువస్తాయా? అన్న ప్రశ్న ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ శ్రేణులలోనే కాకుండా రాజకీయ వర్గాలలో కూడా నలుగుతోంది. 

 "చంద్రబాబు అధికారంలోకి వస్తే బాగానే ఉంటుంది- కానీ ప్రజలు ఆయనను విశ్వసించడం లేదే!'' అని పెదవి విరిచేవారి సంఖ్యా ఎక్కువగానే ఉంది. వాస్తవం కూడా ఇదే! 

ప్రజల్లో ఆయన విశ్వసనీయత కోల్పోవడానికి కారణం ఏమిటి? ఈ ప్రశ్నలకు ముందుగా సమాధానం లభించవలసి ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మరో విధంగా చంద్రబాబు వ్యవహరించడాన్ని ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఒడిసిపట్టుకుని చంద్రబాబు విశ్వసనీయతను దెబ్బతీయడంలో విజయం సాధించారు. 

ఒక నాయకుడిగా స్థిర నిర్ణయాలు తీసుకోవలసిన చంద్రబాబు, పరిస్థితులను బట్టి గాలివాటుగా వ్యవహరించడం ఆయనకు అంతులేని నష్టాన్ని తెచ్చిపెట్టింది. ప్రతిపక్షంలో ఉన్న ఈ ఎనిమిదిన్నరేళ్ల కాలంలో ఆయన చేసిన వాగ్దానాలకు అంతే లేదు. తొమ్మిదేళ్లపాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి రాష్ట్ర స్థితిగతులు, ఆర్థిక పరిస్థితిపై పూర్తి అవగాహన ఉండి తీరాలి. అయితే చంద్రబాబు ఇందుకు భిన్నంగా ఆచరణ సాధ్యంకాని హామీలు కూడా ఇవ్వడం ప్రారంభించారు. ప్రజల అవసరాలను గుర్తించి వాటిని తీర్చితే గుర్తుపెట్టుకుంటారు గానీ, ఏది పడితే అది వాగ్దానం చేయడం వల్ల అసలుకే మోసం వస్తోంది. 

2004 ఎన్నికలకు ముందు వరుసగా ఆరేళ్ల పాటు రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నందున రైతాంగాన్ని ఆకర్షించడానికి ఉచిత విద్యుత్ పథకాన్ని రాజశేఖర్ రెడ్డి అప్పుడు ప్రకటించి ప్రయోజనం పొందారు. ఇనుమును కొలిమిలో కాల్చిన తర్వాత సుత్తితో కొడితే వంగుతుంది. అలాగే ప్రజలకు నిజంగా ఏది అవసరమో గుర్తించి వాటిని తీర్చడమే రాజకీయ నాయకులు చేయవలసిన పని. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. దీంతో ఆయన మాటలకు విలువ లేకుండా పోయింది. అధికారానికి దూరంగా ఉన్నవాళ్లు ఏమి మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది. 

తొమ్మిదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కూడా సాధ్యాసాధ్యాలను పరిశీలించకుండా మాట్లాడటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
ఇప్పుడున్న పరిస్థితులలో రైతులకు ఏడు గంటలపాటు ఉచిత విద్యుత్ సరఫరా చేయడమే గొప్ప. అలాంటిది తాను ఏమి చేశానో గుర్తుచేయకుండా, రైతులు కోరకపోయినా మళ్లీ అధికారంలోకి వస్తే వ్యవసాయానికి తొమ్మిది గంటలపాటు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తానని చంద్రబాబు హామీ ఇస్తున్నారు. ఇలాంటి ప్రకటనలే ఆయన కొంప ముంచుతున్నాయి. "ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులలో నేను ఇది చేశాను. మళ్లీ అధికారం అప్పగిస్తే పరిస్థితిని ఫలానా విధంగా చక్కదిద్దగలను'' అని చెప్పవలసింది పోయి ఇష్టానుసారం హామీలు ఇవ్వడం వల్ల ప్రత్యర్థులు తనను పిట్టల దొరతో పోల్చే అవకాశం చంద్రబాబు ఇస్తున్నారు. 

తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకులు కొందరు వాస్తవాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లకుండా తాళం వేస్తున్నారు. పరిస్థితులను నిర్మొహమాటంగా చెప్పాలనుకుంటున్నవారికి చంద్రబాబు అవకాశం ఇవ్వడం లేదు. దీంతో లోపాలను, తప్పులను సరిదిద్దుకోలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారు. ఫలితంగా ఆయన ఏమి చేసినా కలసి రావడం లేదు. వచ్చే ఎన్నికలలో ఎలాగైనా అధికారంలోకి రావాలని కోరుకోవడంలో తప్పు లేదు. రాజకీయాలలో ఉన్నవారు ఎవరైనా అధికారంలోకి రావాలనే కోరుకుంటారు. అయితే అందుకు తగిన రోడ్ మ్యాప్‌ను పకడ్బందీగా రూపొందించుకోవలసి ఉంటుంది. ప్రస్తుతం చంద్రబాబు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య విశ్వసనీయత. 

ప్రజలు ఆయనను నమ్మకపోవడం! ఈ సమస్యను అధిగమించడానికి ఏమి చేయాలన్న దానిపై ముందుగా స్పష్టత ఏర్పరచుకోకుండా చంద్రబాబు సుదీర్ఘ పాదయాత్ర చేపట్టినప్పటికీ ఉపయోగం ఉంటుందా? అన్న సందేహం సహజంగానే కలుగుతుంది. విషయాన్ని వివరించి చెప్పడంలో చంద్రబాబు పూర్! ప్రజలను ఆకట్టుకునే విధంగా ఆయన భాష గానీ, ఉపన్యాసం తీరు గానీ ఉండవు. హావభావాలు కూడా అలాగే ఉంటాయి. మనుషులతో స్వేచ్ఛగా, కలివిడిగా ఆయన కలిసిపోలేరు. 30 ఏళ్లుగా చంద్రబాబు ఉపన్యాసాలు విన్నవారికి ఆయన సహజంగానే బోర్ కొడతారు. తెలుగుదేశం పార్టీకి బలం, బలహీనత కూడా చంద్రబాబునాయుడే! అటు కాంగ్రెస్, ఇటు జగన్ పార్టీ అంటే ఇష్టంలేని వాళ్లు రాష్ట్రంలో  ఉన్నారు. అయితే వారిలో కూడా చంద్రబాబు పట్ల నమ్మకం కుదరడం లేదు. 
సామాన్య జనంతో కలిసిపోయి, వారిని ఆకట్టుకునేలా మాట్లాడటం చంద్రబాబుకు ఇంతవరకు అలవాటు కాలేదు. 

అక్కడిదాకా ఎందుకు- ప్రజల్లోకి వెళ్లినప్పుడు దగ్గరకు వచ్చిన వారిపై చనువుగా భుజంపై చేయి వేయడానికి కూడా ఆయన సిద్ధపడరు. ఇక్కడ ఒక విషయం గుర్తుచేయవలసి ఉంది. 2004 ఎన్నికలకు ముందు గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన చంద్రబాబు వారి సమస్యలు ప్రస్తావించి పరిష్కరిస్తానని చెప్పవలసిందిపోయి, సత్యం కంపెనీ రామలింగరాజు తరహాలో 'మీరు కూడా పైకి రావాలి, డబ్బు సంపాదించాలి' అని చెబుతుండేవారు. అర్ధాకలితో, తాగునీరు, సాగునీటి సమస్యలతో అల్లాడుతున్న ప్రజల వద్ద ప్రస్తావించవలసిన అంశలేనా అవి? సందర్భ శుద్ధి లేకుండా మాట్లాడటం కూడా చంద్రబాబుకు ఉన్న మైనస్ పాయింట్లలో ఒకటి.

అదే సమయంలో గ్రామీణ ప్రజలతో మమేకం అవ్వడం ఎలాగో నేర్చుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా తన విశ్వసనీయతను పెంపొందించుకునే విధంగా హుందాగా వ్యవహరించాలి. తొమ్మిదేళ్లపాటు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తిగా అధికారంలోకి వస్తే ఏమి చేయగలనో, ఏమి చేయలేనో స్పష్టంగా చెప్పగలగాలి. జగన్మోహన్ రెడ్డిని కాదని తనకు ఎందుకు పట్టం కట్టాలో ప్రజలకు అర్థమయ్యేట్టు వివరించగలగాలి. ఈ మార్పులకు సిద్ధపడకుండా నాలుగు నెలలు కాదు; ఆరు నెలలపాటు పాదయాత్ర చేసినా ఫలితం ఉండదు.

ఈ ఆయుధాన్ని సక్రమంగా వినియోగించుకోలేని పక్షంలో ఆయన రాజకీయ జీవితమే కాదు- తెలుగుదేశం పార్టీనే నమ్ముకుని ఉన్న ఎంతో మంది రాజకీయ జీవితం వైఫల్యంతో ముగుస్తుంది. 2004 ఎన్నికలకు ముందు రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్రతో చంద్రబాబు పాదయాత్రను సహజంగానే పోల్చుకుంటారు కనుక తాను తీసుకోవలసిన జాగ్రత్తలపై స్పష్టతతో ముందుకు వెళ్లడం చంద్రబాబుకు, ఆయన పార్టీకి మంచిది. తన స్వభావాన్ని, ఆంగికాన్ని మార్చుకోకుండా బి.సి. డిక్లరేషన్ ప్రకటించినా, తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నా, మరో డిక్లరేషన్ ప్రకటించినా ఆశించిన ఫలితం రాదన్న వాస్తవాన్ని చంద్రబాబు దృష్టిలో పెట్టుకోవాలి. 

పథకాల ప్రకటనలో పోటీపడే బదులు వాటి సాధ్యాసాధ్యాలను ప్రజలకు వివరించడం అవసరం. 

వచ్చే ఎన్నికలలో మెదక్ జిల్లా నుంచి శాసనసభకు పోటీ చేయాలన్న ఆలోచనతో ఉన్న ఒక నాయకుడిని ఉద్దేశించి "ఆరు నెలల తరువాత టి.ఆర్.ఎస్. ఉంటుందో లేదో తెలియదు. అందువల్ల త్వరలో జరగబోయే ఎం.ఎల్.సి. ఎన్నికలకు పోటీ చేయడం మంచిది'' అని కె.సి.ఆర్. కుటుంబ సభ్యులు ఒకరు సూచించినట్టు ప్రస్తుతం ప్రచారంలో ఉంది. ఇక టి.ఆర్.ఎస్.ను కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి కె.సి.ఆర్. కూడా తహతహలాడుతున్నందున, అదే జరిగితే తమ రాజకీయ అవకాశాలు దెబ్బతింటాయని భావిస్తున్న టి.ఆర్.ఎస్. నాయకులు కొందరు తెలంగాణకు చెందిన తెలుగుదేశం నాయకులతో సంప్రదింపులు ప్రారంభించారు. 


రెండు నెలల క్రితం సీమాంధ్రలో జరిగిన ఉప ఎన్నికలలో ఒక్క స్థానం కూడా గెలవలేకపోవడంతో తెలంగాణలోనైనా అదృష్టాన్ని పరీక్షించుకోవాలన్న నిర్ణయానికి వచ్చింది. 


. "కొందరిని కొంత కాలమే మోసగించగలం. అందరినీ అన్ని వేళలా మోసగించలేం'' 

గ్యాస్‌పై మన హక్కు హుళక్కేనా?


రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న గ్యాస్‌లో 10 శాతం తెలుగు ప్రాంతానికి దక్కాలని వైఎస్ ఆనాడే కేంద్రానికి లేఖ రాశారు. ఈ లేఖ సాధికార మంత్రుల కమిటీ వద్ద పెండింగులో ఉంది. దీనికి విరుద్ధంగా కేటాయింపులు జరిగాయి. గ్యాస్‌ను ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించడం కారణంగా రాయల్టీ వసూలు చేస్తే కోట్లాది రూపాయలు రాష్ట్రానికి ఆదాయంగా వస్తాయి. కానీ, ఈ విషయాన్ని ఆ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్దగా పట్టించుకోలేదు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఇంటింటికీ గ్యాస్ పైపులైను ఏర్పాటుపై సన్నాహాలు మొదలయ్యాయి. కానీ ఆయన అకాల మరణం తెలుగు జాతికి శాపంలా పరిణమించింది.

రాజకీయాల్లో సమర్థులు అతిసహజంగా మంచి పనులు చేసి ప్రజల మన్ననకు పాత్రులవుతుంటారు. అసమర్థులు తప్పుడు నిర్ణయాలు తీసుకుని ప్రజలను కష్టాల పాలు చేస్తుంటారు. రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వానిది రెండవ తరహా. అందుకే అది అసమర్థపాల నకు నిలువెత్తు ప్రతిరూపంగా నిలుస్తోంది. చేతగానితనాన్ని పుణికిపుక్చుకున్న కేంద్రం, రాష్ట్ర ప్రజానీకానికి ద్రోహం తలపెట్టే నిర్ణయా లతో కపటనాటకాలాడుతోంది. రాష్ట్రానికి కేటాయించిన గ్యాస్‌ను మహారాష్ట్రకు తరలి స్తుంటే మొద్దునిద్ర నటించిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఇందుకు తాజా నిదర్శనం.

అసలే విద్యుత్ కొరతతో అల్లాడిపోతూ అంధకారప్రదేశ్‌గా ఆంధ్ర ప్రదేశ్ దిగజారుతున్న దుస్థితిలో విద్యుత్ సంక్షోభాన్ని మరింతగా పెంచే దిశగా తీసుకున్న అనాలోచిత నిర్ణయాలపై రాష్ట్ర ప్రభుత్వ స్పందన, కేంద్రప్రభుత్వ నిర్వాకం తెలుగువారందరినీ విస్మయానికి గురిచేసింది. విద్యుత్ కొరత మూలంగా ప్రజలు పడుతున్న బాధలను పరిష్కరించాలనే చిత్తశుద్ధిగానీ, ఆలోచనగానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేవని ఈ తరలింపు తేటతెల్లం చేసింది. రాజకీయ పక్షాలు గగ్గోలు పెట్టడం, పత్రికల్లో వార్తా కథ నాలు వెలువడటంతో మొద్దునిద్ర నుంచి మేల్కొని తాత్కాలిక సర్దుబాటు ఏదో చేసినప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఇది కంటితుడుపు చర్యగానే మిగిలిపోతుంది.

గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాల మూతకు కుట్ర!
రాష్ట్రంలోని కోస్తా తీరప్రాంతంలో రియలన్స్ సంస్థ ఉత్పత్తి చేస్తున్న గ్యాస్‌లో కొంత భాగాన్ని రాష్ట్రంలో నెలకొల్పే గ్యాస్ ఆధారిత విద్యుత్తు సంస్థలకు కేటాయించారు. కానీ క్రమంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని, గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు ఇచ్చే గ్యాస్ కోటాను తగ్గిస్తూపోతున్నారు. పరిస్థితులు, పరిణామాలు లోతుగా పరిశీలించి, విశ్లేషిస్తే, రియలన్స్ సంస్థ రానున్న కాలం లో గ్యాస్ ఆధారిత విద్యుత్తు సంస్థలకు గ్యాస్ కోటాను కుదించడంతో పాటు, క్రమంగా గ్యాస్ రేటును పెంచుకోవడం ద్వారా గ్యాస్ కొనుగోలు చేయలేని స్థితికి పర్రిశమలను నెట్టి, తదనంతరం వాటిని మూసివేసేందుకు రోడ్‌మ్యాప్ వేస్తోందనే అనుమానం కలుగుతుంది. ఇతర రాష్ట్రాలకు అధిక లాభాలకు గ్యాస్ అమ్ముకునేందుకే ఈ ఎత్తుగడ పన్నిందనే వాదన వినిపిస్తోంది.

ఎంత ఉత్పత్తి చేయాలి? ఎంత ఇవ్వాలి?
రియలన్స్ సంస్థ 2009-10 సంవత్సరంలో రోజుకి 70 మిలియన్ క్యూబిక్ మీటర్ల (ఎంసీ ఎండీ) గ్యాస్‌ను 2011-12 నాటికి 80 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్‌నూ ఉత్పత్తి చేయాల్సి ఉంది. అంచనాల ప్రకారం గ్యాస్ ఉత్పత్తి జరిగి ఉంటే విద్యుత్, ఎరువుల కర్మాగారాలకు సంబంధించి అది సంతోషకర మైన వార్తే అయి ఉండేది. రిలయన్స్ సంస్థ ఉద్దేశపూర్వకంగా చేసిందో, ముందస్తు లాభాపేక్ష వ్యూహంతో చేసిందోగాని అంచనాల మేరకు గ్యాస్ ఉత్పత్తి జరగలేదు. 2009-10లో 70 మిలియన్ క్యూబిక్ మీటర్ల (ఎంసీ ఎండీ)కు గాను, కేవలం 42 మిలియన్ క్యూబిక్ మీటర్లు ఉత్పత్తి చేయగలమని ముందు చెప్పినా చివరకు 29 మిలియన్ క్యూబిక్ మీటర్లు మాత్రమే ఉత్పత్తి చేసింది.

దీనితో రియలన్స్‌ను నమ్ముకొని కోటానుకోట్ల రూపాయల పెట్టుబడు లతో ఉత్పత్తి లక్ష్యాలు పెంచుకోవాలనుకున్న విద్యుత్ సంస్థలు, ఏటేటా ఉత్పత్తిని కుదించుకునే దుస్థితికి దిగజారాయి. గ్యాస్ ఆధారిత విద్యుత్ సంస్థలకు తగిన గ్యాస్ లభించి ఉండి ఉంటే, వాటి సామర్థ్యం మేర అవి విద్యుత్తును ఉత్పత్తి కనుక చేసి ఉంటే రాష్ట్రంలో ఇంత దారుణంగా విద్యుత్ సంక్షోభం నెలకొని ఉండేది కాదు. ఎంతో కొంత వెసులుబాటు కలిగి ఉండేది. కానీ రిలయన్స్ సంస్థ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఖాతరుచేయక రాష్ట్రానికి చెందిన వనరులను సొంత జాగీరుగా భావిస్తూ ప్రజలను ఇబ్బందుల్లోకి నెడుతోంది.

గోరుచుట్టుపై రోకలిపోటు!
ఇస్తామన్న గ్యాస్ ఇవ్వని కారణంగా, ఒకపక్క గ్యాస్ ఆధారిత విద్యుత్ సంస్థలు, ఎరువుల కర్మాగారాలు లబోదిబోమంటుండగా, గోరుచుట్టుపై రోకలిపోటు చందంగా కేంద్రం ఒక తప్పుడు నిర్ణయంతో రాష్ట్ర ప్రజల నెత్తిన సుత్తి దెబ్బ వేసింది. అదేమిటంటే, రాష్ట్రంలోని గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలకు ఇస్తున్న గ్యాస్‌లో కోతపెట్టి, ఎక్కడో మహారాష్ట్రలో ఉన్న రత్నగిరి విద్యుత్ ప్రాజెక్టుకు సుమారు 37 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ తరలించాలని నిర్ణయించింది. 11 నెలల క్రితమే ఈ ప్రతిపాదన కేంద్ర సాధికార మంత్రుల బృందం ఆమోదిం చింది. దీని అమలు ఫలితంగా, రాష్ట్రంలో జరగాల్సి ఉన్న ఉత్పత్తిలో 400 మెగావాట్ల మేరకు నష్టం కలుగుతుంది. అసలే కష్టకాలంలో ఉన్న రాష్ట్రానికి ఇది సమ్మెట పోటులాంటిది.

రాష్ట్ర ప్రజల అవసరాలకు కావలసిన విద్యుత్ 258 మిలియన్ యూనిట్లు మాత్రమే! కొరత 46 మిలియన్ యూనిట్లు. ఈ నేపథ్యంలో అన్నిరకాల విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోవాల్సిన బాధ్యత రాష్ట్రంపై ఉంది. రాష్ట్రం తరపున కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు, ఎంపీలపైన ఉంది. కానీ ఉత్పత్తిని పెంచుకునే అవకాశాలపై వీరు దృష్టిసారించకపోగా ఉన్న అవకాశాలపై గండికొడుతూ, రాష్ట్రం నోటిదగ్గర బువ్వను మహారాష్ట్రకు గ్యాస్ రూపంలో అందిస్తుంటే, వీరంతా చేష్టలుడిగి చూడటం విడ్డూరం.

మన తెలుగోడు జైపాల్ ఏం చేస్తున్నాడు?
ఇంత జరుగుతుంటే కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిగా ఉన్న మన తెలుగువాడు జైపాల్‌రెడ్డి ఏం చేస్తున్నట్లు? ‘‘11 నెలల కిందే కిరణ్‌ని ప్రధానిని కలవమన్నాను. ఇంతకన్నా నేను చేసేది ఏముంది!’’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. పదవి ముఖ్యమా! ప్రజలు ముఖ్యమా అనేది ఖచ్చితంగా బేరీజు వేసుకుని ఉంటే ఏ నాయకుడైనా తెలుగు ప్రజలకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఒడ్డున కూర్చొని కబుర్లు చెప్పరు.

అడ్డుకట్టగా నిలుస్తారు. నిత్యం ‘మేడం’ని ప్రసన్నం చేసుకోవడంకన్నా మంచి పని మరొకటి లేదనుకునే ఇటువంటి వాళ్ల నుంచి రాష్ట్ర ప్రజలు ఆశించడం వృథా! జనం గొడవ చేసిన తర్వాత గానీ ఓహో! ఇదొక సమస్యే సుమా! అని గుర్తించి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఢిల్లీ వెళ్లి పరువు నిలుపుకునే ప్రయత్నం చేశాడు. ఇప్పటికిది నయమే, కానీ దీర్ఘకాల ప్రయోజనాల మాటేమిటి?

రిలయన్స్ పెత్తనాన్ని ప్రశ్నించిన వైఎస్!
‘‘గ్యాస్ రాజ్యసంపద! మన రాష్ర్టం తీరం వెంబడి లభ్యమవుతున్నం దున రాష్ట్ర ప్రయోజనాలకు కొంత గ్యాస్‌ను విధిగా కేటాయించాల్సి ఉంది. తద్వారా చౌకగా విద్యుత్తు ఉత్పత్తి చేయవచ్చు. ఎరువుల కర్మాగారాలను నడపవచ్చు. ఇంటింటికీ పైపు లైన్ ద్వారా గ్యాస్ పంపిణీ చేయవచ్చు. రియలన్స్ సంస్థ కేవలం గ్యాస్ వెలికి తీసే కాంట్రాక్టరు మాత్రమే, కాబట్టి గ్యాస్ ఉత్పత్తిపైన, కేటాయింపులు, అమ్మకం రేట్లపైన దానికి అధికారం ఉండకూడద’’ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ పలు మార్లు పేర్కొన్నారు. కేంద్రానికి అనేక పర్యాయాలు లేఖలు రాశారు.

2009, జులై 7న రాజశేఖరరెడ్డి ప్రధానికి రాసిన లేఖలో కేజీ బేసిన్ డీ-6 బ్లాక్‌లో రియలన్స్ చేస్తున్న లూటీపై చాలా ఘాటుగా విరుచుకు పడ్డారు. లక్షల కోట్ల సంపద తరలిపోతోందంటూ కాగ్ ఇచ్చిన నివేది కను ఆయన ఉటంకించారు. రాష్ట్రానికి గ్యాస్ కేటాయింపు, ధర నిర్ణయం అనేది కేంద్ర ప్రభుత్వం చేపట్టాలని స్పష్టం చేశారు.

10 శాతం రాష్ట్రానికే కేటాయించాలి!
రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న గ్యాస్‌లో 10 శాతం తెలుగు ప్రాంతానికి దక్కాలని వైఎస్ ఆనాడే కేంద్రానికి లేఖ రాశారు. ఈ లేఖ సాధికార మంత్రుల కమిటీ వద్ద పెండింగులో ఉంది. దీనికి విరుద్ధంగా కేటాయింపులు జరిగాయి. గ్యాస్‌ను ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించడం కారణంగా రాయల్టీ వసూలు చేస్తే కోట్లాది రూపాయలు రాష్ట్రానికి ఆదాయంగా వస్తాయి. కానీ, ఈ విషయాన్ని ఆ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్దగా పట్టించుకోలేదు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఇంటింటికీ గ్యాస్ పైపులైను ఏర్పాటుపై సన్నాహాలు మొదలయ్యాయి. కానీ ఆయన అకాల మరణం తెలుగు జాతికి శాపంలా పరిణమించింది. ఆయన ప్రారంభించిన ఇతర పథకాల మాదిరే దీన్ని కూడా తుంగలోకి తొక్కారు నేటి పాలకులు.

ఇప్పుడేం చేయాలి!
* గ్యాస్ కేటాయింపుల విషయంలో పునఃసమీక్ష జరగాలి.
* రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న గ్యాస్‌తో రాష్ట్రానికి మేలు కలగకపోతే ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తారు. కనుక కనీసం 10 శాతం గ్యాస్ రాష్ట్ర అవసరాలకు కేటాయించాలి.
* రిలయన్స్‌ను నమ్ముకొని అనేక విద్యుత్ ఎరువుల కర్మాగారాలను నెలకొ ల్పారు. వీరి అవసరాలకు, విస్తరణకు అవసరమైన గ్యాస్‌ను విధిగా అందించాల్సిన బాధ్యత రిలయన్స్‌దే!
* రానున్న కాలంలో ఎక్కువ ధరకు గ్యాస్ అమ్ముకునే ఉద్దేశంతో రియలన్స్ సంస్థ ఉత్పత్తిని క్రమంగా తగ్గిస్తూ పోతోందన్న వాదన ఉంది. దీనిపై విచారణ జరపాలి.
* ఉత్పత్తి లక్ష్యాలు నిర్దేశిస్తూ, లక్ష్యాలకు తగ్గకుండా గ్యాస్ ఉత్పత్తి జరిగేలా రియలన్స్‌పై కేంద్రం గట్టి చర్యలు తీసుకోవాలి. ఇలా జరిగినప్పుడే జాతీయ సంపద ప్రజల సౌకర్యార్థం సవ్యంగా వినియోగించినట్లవు తుంది.

* రాజకీయ పక్షాలు కూడా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంపై ఈ విషయంలో ఒత్తిడి తేవాలి. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించే పాలకులను సహించేది లేదనే సంకేతం ప్రజల నుంచి సూటిగా వ్యక్తం కావాలి. అప్పుడు గానీ న్యాయం జరగదు.

పీటీఐ కథనం వెనుక కుట్ర

ఎవరితోనూ విలీనమయ్యే ప్రశ్నే తలెత్తదని స్పష్టీకరణ
కథనాన్ని వెనక్కు తీసుకోవాలని, దుష్ర్పచారం ఆపాలని డిమాండ్.. లేదంటే చట్టపరమైన చర్యలకు హెచ్చరిక

హైదరాబాద్, న్యూస్‌లైన్: తమ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే అవకాశాలను వైఎస్ విజయమ్మ తోసిపుచ్చలేదంటూ వచ్చిన పీటీఐ వార్తా కథనాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. దాన్ని అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించింది. ఈ మేరకు శుక్రవారం పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘విజయమ్మ వ్యాఖ్యలను యథాతథంగా ఇస్తే అభ్యంతరం లేదు. కానీ వాటికి తనకు నచ్చినట్టుగా పీటీఐ భాష్యం చెప్పటం కుట్ర పూరితమైన వ్యవహారం’’ అంటూ తీవ్రంగా ఆక్షేపించింది. ఆ కథనాన్ని రిపోర్ట్ చేసిన వ్యక్తి వాస్తవాలను యథేచ్ఛగా వక్రీకరించాడని, పీటీఐ వార్తా కథనం శీర్షికే దాన్ని ధ్రువీకరిస్తోందని అభిప్రాయపడింది. ‘వైఎస్సార్‌సీపీ ఎన్నటికీ ఏ పార్టీలోనూ విలీనమయ్యే ప్రశ్నే తలెత్తదని రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ కచ్చితంగా తెలుసు. అలాంటప్పుడు ఇలాంటి కుట్రపూరిత కథనాలను ఎందుకు వండి వార్చిందో పీటీఐ సమీక్షించుకోవాలి’ అని కోరింది. ఇదే అదనుగా ఎల్లో మీడియాలోని చంద్రబాబు చానళ్లు ఈ అసత్య కథనానికి పెద్ద స్థాయిలో ప్రాముఖ్యమివ్వడం చూస్తుంటే, ఇది కుట్రపూరితమేనన్న తమ అభిప్రాయం సరైనదేనని ఎవరికైనా అర్థమవుతోందని పార్టీ పేర్కొంది. ఆ కథనాన్ని తక్షణం వెనక్కు తీసుకోవాలని, దుష్ర్పచారాన్ని ఆపాలని డిమాండ్ చేసింది. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ఫీజుల పథకం ఎత్తేసేందుకే!

*ఫీజులు రూ.లక్ష పైగా నిర్ణయించి 35 వేలే కడతామంటే ఎలా?
*మిగతా సొమ్ము ఆ పేద పిల్లలు ఎక్కడి నుంచి తెచ్చి కడతారు?
*వైఎస్ హయాంలో బడ్జెట్ కంటే ఎక్కువ నిధులు ఇచ్చారు..
*ఇప్పుడు అడ్మిషన్లు వచ్చినప్పుడల్లా తల్లిదండ్రులకు టెన్షనే
*బీసీ, ఈబీసీ, వికలాంగులు, మైనారిటీలకు నష్టం జరుగుతోంది
*ఇంత జరుగుతున్నా ప్రభుత్వాన్ని బాబు ప్రశ్నించరెందుకు?
*పైగా, తానే ఈ పథకం పెట్టానని చెప్పుకుంటున్నారు..
*కాంగ్రెస్-టీడీపీ కుమ్మక్కయి రాజకీయాలు చేస్తున్నాయి
*ప్రభుత్వం ఏ హామీనీ సరిగ్గా అమలు చేయడం లేదు

ప్రజలపై భారం పడకూడదని భావించిన వైఎస్... ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్లూ ఒక్క రూపాయి కూడా పన్నులు పెంచలేదు. కానీ ఈరోజు అన్ని పన్నులూ పెంచారు. రేట్లు పెరిగాయి. ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరిగింది. అలాంటపుడు ఫీజుల పథకం అందరికీ అమలు చేస్తే వారికి వచ్చే నష్టం ఏమిటి? వైఎస్ మన మధ్య నుంచి వెళ్లిపోయాక గత మూడేళ్లుగా అడ్మిషన్లు వచ్చినపుడల్లా విద్యార్థులకు, తల్లిదండ్రులకు టెన్షనే! అసలు ఈ పథకాన్ని ఒక భారంగా ప్రభుత్వం ఎందుకు భావిస్తోంది? ప్రజల కష్టాలను తీర్చే ఒక బాధ్యతగా ఎందుకు అనుకోవడం లేదు?
- వైఎస్ విజయమ్మ

హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘ఇంజనీరింగ్ కళాశాల ఫీజులను ప్రభుత్వం రూ.50 వేల నుంచి ఒక లక్షా ఐదు వేల వరకూ నిర్ణయించింది. ఇప్పుడేమో 35 వేల రూపాయలే కడతామంటోంది. రూ.35 వేలుపోను అంత పెద్ద మొత్తం ఆ పేద పిల్లలెక్కడి నుంచి తెస్తారనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఎందుకు కలగడం లేదు? ఆ తల్లిదండ్రులు అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చికట్టాలి? ప్రభుత్వం ఈ పథకాన్ని ఏదో విధంగా తీసేయాలనే ఆలోచనతోనే ఈ ఆంక్షలన్నీ పెడుతోంది తప్ప మరొకటి కాదు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అర్హులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వర్తింపజేయాలని కోరుతూ హైదరాబాద్ ధర్నా చౌక్(ఇందిరాపార్కు) వద్ద గురువారం ఉదయం ప్రారంభించిన ‘ఫీజు దీక్ష’ను విజయమ్మ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు విరమించారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు ప్రియాంక, నవీన ఆమెకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. అనంతరం విజయమ్మ ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

పెద్ద చదువులపై వైఎస్ భరోసా కల్పించారు

మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాక ముందు పిల్లల తల్లిదండ్రులు ఇంజనీరింగ్ చదువులంటే అవి మన పరిధిలో లేవనుకునేవారు. ఇంజనీరింగ్, మెడిసిన్ గురించి వారసలు ఆలోచించే వారే కాదు. అలాంటిది వైఎస్ సీఎం అయ్యాక.. ఇంజనీరింగ్‌తోపాటు వృత్తి విద్యా కోర్సులన్నిటినీ పేద పిల్లలూ చదువుకోవచ్చనే భరోసా కల్పించారు. ఫీజుల రీయింబర్స్‌మెంట్ పథకం అందుకే ప్రవేశ పెట్టారు. అయితే ఈ ప్రభుత్వం ఆయన మాదిరిగా ఆలోచించడం లేదు. ఈ పథకాన్ని ఎలా ఎత్తి వేయాలా అని చూస్తోంది. ఇంజనీరింగ్‌లాంటి చదువులు తమ వంశంలో లేనివని విద్యార్థులు ఆలోచించే పాత రోజులు వచ్చేస్తాయనిపిస్తోంది. వైఎస్ ఇపుడు ఉన్నా ఈ పథకాన్ని కొనసాగించలేకపోయేవారని మంత్రులు చెబుతున్నారు. ఆయన చేసి పోయిన అప్పులు ఇప్పుడు కడుతున్నాం అంటున్నారు. అది చాలా తప్పు. ఆయన ఉన్నపుడు ఈ పథకానికి బడ్జెట్‌లో కేటాయించిన మొత్తంకన్నా ఎక్కువ డబ్బు విడుదల చేశారు. వైఎస్ పాలన నిజంగా సువర్ణయుగమే! ఉచిత విద్యుత్ ఇచ్చారు, కరెంటు బకాయిలు రద్దు చేశారు. 

గామీణ రైతులకు ఎంతో మేలు చేశారు. మరి ఈరోజు, విత్తనాలు దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం పడిన చోట కూడా క్రాప్‌హాలిడే ప్రకటించే పరిస్థితి. ఎరువుల ధరలు వందల రెట్లు పెరిగాయి. రైతు కూలీలకు వంద రోజుల ఉపాధిని 200 చేస్తామన్నారు. అది జరగలేదు. రూ.6.5 లక్షల కోట్లతో పరిశ్రమలు వస్తాయన్నారు. ఏటా 15 లక్షల ఉద్యోగాలన్నారు. ఎక్కడ ఇచ్చారు? కరెంటు లేక 20 లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయే పరిస్థితి. లక్షా 85 వేల మంది వికలాంగులకు పెన్షన్లు రద్దు చేశారు. వయసు తక్కువ అనే సాకుతో వృద్ధుల పెన్షన్లు కూడా రద్దు చేశారు. ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా మారి పోయింది. చాలా వ్యాధులను ప్రభుత్వాసుపత్రులకు మార్చేశారు. అక్కడ సరైన వైద్య సదుపాయాలు లేవు.

చంద్రబాబు ప్రశ్నించరేం?

వైఎస్ ఉన్నపుడు ఫీజు పథకం కింద 28 లక్షల మంది లబ్ధి పొందారు. ఈ ప్రభుత్వం విధించిన ఆంక్షల వల్ల కొన్ని వందల మందికి మాత్రమే ఈ పథకం వర్తించేలా ఉంది. ఇలా జరుగుతూ ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా.. అంటే ఆయన ప్రశ్నించరు. ప్రభుత్వం తన బాధ్యతను మర్చిపోతోంది. ప్రతిపక్షం కూడా ఆ బాధ్యతను గుర్తు చేయదు. చంద్రబాబు తానే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం పెట్టానంటున్నారు. ఈ పథకం ఆయనదేనని ఏ ఒక్క విద్యార్థి చెప్పగానేను వినలేదు. ఏనాడూ కళాశాలలకు వెళ్లి ఫీజులు ఎలా కడుతున్నారని అడగని బాబు ఇపుడిలా చెప్పుకుంటున్నారు. ప్రభుత్వం తీరు వల్ల బీసీ, ఈబీసీ, వికలాంగ, మైనారిటీ విద్యార్థులకు నష్టం జరుగుతున్నా ఆయన అసలు పట్టించుకోవడం లేదు.

కుమ్మక్కు రాజకీయాలు

ప్రజల పరిస్థితి ఇలా ఉంటే ఈ మూడేళ్లలో టీడీపీ, కాంగ్రెస్ రెండూ కలిసిపోయి పనిచేస్తున్నాయి. ఈ రెండు పార్టీలూ కలిసి పోయి జగన్ ఒక్కడిని టార్గెట్ చేశాయి. శంకర్రావు, ఎర్రన్నాయుడు కుమ్మక్కయి కోర్టుకు వెళ్లారు. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు, అవిశ్వాస తీర్మానం, సమాచార కమిషనర్ల నియామకం, అమీర్‌పేట భూములు.. అన్నింటా రెండు పార్టీల కుమ్మక్కు బయటపడింది. ఎంతసేపూ ఈ రెండు పార్టీల నాయకులకూ వైఎస్‌పైనా, జగన్‌బాబుపైనా నిందలేయడమే కార్యక్రమంగా మారింది. సీబీఐ పరిస్థితీ అంతే! 26 జీవోల జారీపై ప్రభుత్వాన్ని విచారించాలని కోర్టు ఆదేశిస్తే సీబీఐ మాత్రం ప్రభుత్వం అనే పదాన్ని తీసేసి ఆ స్థానంలో వై.ఎస్.రాజశేఖరరెడ్డి పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. ఫిర్యాదులో 52వ ముద్దాయిగా ఉన్న జగన్‌బాబును ఒకటో నిందితుడిగా చేర్చింది. (సీబీఐ జేడీ లక్ష్మీనారాయణకు వ్యతిరేకంగా దీక్షా స్థలిలో నినాదాలు మారుమోగాయి).

జగన్ తప్పు చేశాడని తేల్చారా?

జగన్‌ను జైలులో పెట్టి వంద రోజులైంది. ఇన్ని రోజుల నుంచి ఆయన ఒక్క తప్పైనా చేసినట్లు సీబీఐ వారు తేల్చారా? చివరకు ఆయనను కోర్టుకు ఒక క్రిమినల్‌లా సాధారణ వాహనంలో తెచ్చారు. ఎన్నో కష్టాలు పెడుతున్నారు. దేవుడు అన్నీ చూస్తున్నాడు. ధర్మం, న్యాయం మన పక్షాన ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రజాపక్షంగా ఉంటుంది. ప్రజలంటే వైఎస్సార్‌కు ప్రాణం. చివరి వరకూ వారి కోసమే తపించారు. అలాగే జగన్ కూడా.. జగన్‌బాబు ప్రజల్లో తిరుగుతూ ఉంటే తొలుత బాధ అనిపించేది. కానీ మిమ్మల్నందరినీ చూశాక మంచి నిర్ణయమే తీసున్నాడనిపించింది(ప్రజల హర్షధ్వానాలు). మిమ్మల్నందరినీ చూస్తూ ఉంటే వైఎస్‌లాంటి నాయకుడు కావాలని అనుకుంటున్నట్లుగా ఉంది. తప్పకుండా వైఎస్సార్ సువర్ణయుగం మళ్లీ వస్తుంది. త్వరలోనే జగన్‌బాబు బయటకు వచ్చి ఈ పథకాలన్నీ అమలు చేస్తాడు.

‘‘వైఎస్సార్ కాంగ్రెస్ దీక్షలు ఎందుకు చేస్తోందని కొందరు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఈ పథకాన్ని సరిగ్గా అమలు చేయడం లేదు కనుకనే నేను ఈ రోజు ఇక్కడ దీక్షకు కూర్చోవాల్సి వచ్చింది. మన దీక్షలకు ప్రభుత్వం ఎంత దిగి వస్తుందో తెలియదు. నిద్రపోయే వాళ్లనైతే లేపి చెప్పవచ్చు కానీ.. నిద్రపోతున్నట్లు నటిస్తున్న ప్రభుత్వాన్ని మాత్రం మనం లేపలేం..’’
- వైఎస్ విజయమ్మ

‘‘అమ్మా.. ఈ రోజు నేను ఇంజనీరింగ్ చదువుతున్నానంటే అది వైఎస్ రాజశేఖరరెడ్డిగారు పెట్టిన ఫీజు పథకం వల్లనే. వైఎస్ జీవించి ఉన్నంతకాలం ఆయనలాగే అందరం చిరునవ్వు నవ్వుతూ ఉండేవాళ్లం. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. జగనన్న జైల్లో ఉన్నాడని ఎవ్వరూ అధైర్యపడొద్దు. జగనన్న తప్పకుండా జైలు నుంచి బయటకొస్తాడు. ఎన్నికల్లో గెలుస్తాడు. అమ్మా మీరు బాధపడొద్దు.. మేమంతా మీ వెంటే ఉన్నాం.’’
- విజయమ్మతో ఫీజు దీక్ష విరమింపజేయడానికి ముందు విద్యార్థిని ప్రియాంక అన్న మాటలు

Special Edition on Fee Deeksha

కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం కాదు : వైఎస్ విజయలక్ష్మి (andhrajyothy)

హైదరాబాద్, సెప్టెంబర్ 7 : తమ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కాబోదని వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. తమ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే అవకాశాలను విజయలక్ష్మి తోసిపుచ్చలేదంటూ పీటీఐ ఒక వార్తా కథనాన్ని ప్రచురించటం అత్యంత హేయమైన చర్యగా వైసీపీ అభివర్ణించింది. 

విజయలక్ష్మి ఏమన్నారో..యథాతథంగా ప్రచురిస్తే అభ్యంతరంలేదని, దానికి పీటీఐ తనకు నచ్చిన భాష్యం చెప్పటం కుట్రపూరితమైన వ్యవహారమని పార్టీ కార్యాలయం శుక్రవారం రాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. తమ పార్టీ మరే పార్టీతోనూ, ఏ నాటికీ విలీనం అయ్యే ప్రశ్నే తలెత్తదని, అయినా కుట్రపూరితమైన కథనాలను ఎందుకు ప్రచురించిందో పీటీఐ సమీక్షించుకోవాలని కోరింది. తక్షణం ఆ కథనాన్ని వెనక్కు తీసుకోవాలని, దుష్ప్రచారాన్ని ఆపాలని పార్టీ డిమాండ్ చేసింది. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Naidu is also trying to walk in the footsteps of Dr. Y.S.R


Everybody wants a share of the YSR legacy. Not to be outdone by the Congress, Naidu is also trying to walk in the footsteps of Dr. Y.S.Rajasekhar Reddy.
Chandrababu has now taken a complete u-turn and is now talking about free power supply scheme for the agricultural sector, Arogyasri and other schemes, which were a part of Dr. YSR's welfare-driven governance. It is important to recall that he had criticized all these schemes publicly all through YSR's tenure. Not a day would pass when he would not fly hammer and tongs at free power supply to farmers, Arogyasri or Indiramma Housing. However, suddenly we find him endorsing all the schemes that Dr. YSR had initiated and that he is in agreement with them.

He has borrowed yet another leaf from YSR's book and is setting out on a padayatra starting from October 2. Chandrababu thinks he has the charisma and appeal of Dr. YSR! Obviously, he hasn't learnt any lessons from the recent by-polls held three months ago.

Added to all this, his son Lokesh is being anointed as the TDP General Secretary. Lokesh will oversee the arrangements and logistics of his father's padayatra. He is all set to take over the reins of the the party at the TDP headquarters at NTR Bhavan.
In view of these developments, a two-day statewide  conference scheduled for September 11, 12 has now been postponed.  Lokesh will be formally anointed the heir, following his appointment as General  Secretary in the next such state-wide conference.  Interestingly, Lokesh's chambers are getting ready at NTR Bhavan. Sources from NTR Bhavan, anonymously, said that the first floor of the chamber used in the past by Chandrababu, was now being remodeled for the new secretary.
Meanwhile, the Congress leaders with all their vilification of Dr. YSR on one side have rediscovered him and are beginning to invoke his name. Suddenly, we find YSR's statues being garlanded by people like Botsa and Danam Nagender and praising him to high heavens! We know all that Botsa has been saying up until now. Nagender went to the extent of saying that he would reveal everything that took place in closed-door cabinet meetings, if protection was given to him.
Whether it's the TDP or the Congress, everybody wants to emulate Dr. YSR even while denigrating him. They know that they cannot win on their own steam and will have to endorse his schemes, while trying to project them as their own.
-Siva@sakshipost

VIJAYAMMA ENDS DEEKSHA


Hyderabad, Sept 7, 2012: YSR Congress party honourary president Smt. Y.S.Vijayamma today concluded her two-day Fee Deeksha at Indira Park here with an assurance to the people that the party will continue to stand by the people in finding solutions to their problems.
Vijayamma concluded her fast by accepting lemon juice from two girl students Priyanka and Naveena.
Winding up her Deeksha, Vijayamma said her son Jaganmohan Reddy has been enquiring about people’s problems even from the jail and asking the party leaders to take up people’s problems and try to find solutions to them.
“Jagan has been in the jail for more than 100 days but he will soon come out of the jail and fight for the public cause again,” she said, adding that nothing has been proved against him even after one year of filing the case. 
Vijayamma said 28 lakh students were benefited during the YSR period from the fee reimbursement scheme. “YSR allotted more funds to the scheme than in the budget,” she said and asked the government if it can confidently say the scheme is being implemented in its entirety. 
Lambasting the Government for not releasing the fee reimbursement funds to colleges for the last three years, Vijayamma asked the government to show sincerity and implement the scheme fully as implemented by YSR.
She said no other leader can understand the people’s problems as YSR had understood. “He always thought of the welfare of the people. The present government is collecting thousands of crores in taxes but is not willing to implement the welfare programmes or solve people’s problems,” she said, adding that no one in the state is happy with the present government.
Where are the jobs?
Criticizing the chief minister Kiran Kumar Reddy for announcing that investments worth Rs. 6.5 lakh Cr are arriving in the state and lakhs of people would get jobs, she said the Government has not kept its promises. 
“Tell us where the jobs and where the investments are” she asked the CM. “There are no medicines and doctors in the hospitals. You have abolished old age pensions and are not interested in finding solutions to the people’s problems,” she said. 
While the YSR regime offered free power to the farmers, the government has removed all subsidies and even seeds are not available today, she said and added that the rates of fertilizes have increased by 300 per cent.
Vijayamma slams Naidu
Finding fault with TDP chief N.Chandrababu Naidu for not responding to her call to ensure that 100 BC representatives are elected to the assembly in the next elections, Vijayamma said Naidu never visited any college nor spoke with any student. 
“It is surprising to note that Naidu is claiming he had introduced the fee reimbursement scheme,” she said and accused him of hobnobbing with the Congress government.
Vijammma charged that both Congress and TDP have joined hands together aiming at her son Jagan Mohan Reddy. “Both Congress and TDP are holding press conferences only to attack Jagan and criticize him,” she said.
“Why Chandra babu went to Delhi and meet Chidambaram secretly,” she asked saying that this incident alone proved Naidu has been in collusion with the Congress.
Vijayamma also said Congress leaders are also involved in several scandals like the Ameerpet land scam. 
Govt has no concern for students: Sobha
YSR Congress Legislature Party deputy leader and MLA SobhaNagi Reddy lambasted the Government for not responding to people’s protest over the issue.
Addressing the gathering on the occasion,Sobha said Government has remained unconcerned despite numerous protests and dharnas by students and parents for the restoration of the full fee reimbursement.
“The Government has not been caring though thousands of BC students will forgo the opportunity of pursuing the engineering course because of the conditions and limitations imposed for full fee reimbursement,” she said and added that the Kiran Kumar Reddy Government has no interest in implementing the schemes introduced by YSR. The government doesn’t want to do good to the people, she remarked. 
SobhaNagi Reddy said the Government had cleared the dues of fee reimbursement to all colleges as YSR Congress Party president YS Jagan Mohan Reddy took up a 7-day Deeksha in February 2011.
She charged the government with trying to cancel the scheme completely on some pretext or the other and demanded it to implement it fully by removing the limitations and conditions so that all eligible students will benefit. 
Lakhs of students would be adversely affected: Janak Prasad
YSR Congress Party Trade Union leader Janak Prasad, who also addressed the gathering, said the way the fee reimbursement scheme is being implemented by the Government will rid lakhs of students of the golden opportunity to pursue their academic career.
“The future of lakhs of students is at stake with the government’s decision forcing them on to the streets,” he lamented.
Janak Prasad said the Government is not in a position to take decisions even after being chided by the legal courts.
“This is a hopeless and inefficient government as it is unable to engage the services of efficient and expert lawyers in courts,” he criticized. 

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!