వైఎస్ విజయమ్మ పాపులారిటీ కోసమే ఫీజు దీక్ష చేస్తున్నారన్న కాంగ్రెస్ వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ఈ పథకానికి రూపశిల్పి అయిన దివంగత మహానేత భార్యగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలుగా ఆమె దీక్షను తప్పుపట్టడాన్ని పార్టీ నేత జూపూడి ప్రభాకర్ నిరసించారు.
వైఎస్ హయాంలో శాచ్యురేషన్ పద్ధతిలో విద్యార్థులకు అభయం ఇస్తే ఈ ప్రభుత్వం నిబంధనలు పేరుతో భయపెడుతుందని జూపూడితోపాటు సీనియర్ జర్నలిస్ట్ నడింపల్లి సీతారామరాజు అన్నారు. ఇంజనీరింగ్‌లో చేరుతున్నవారిలో చాలామంది గ్రామీణ విద్యార్థులే కావడం వల్ల చాలామంది మొదటి సంవత్సరంలో ఉత్తీర్ణులు కాలేకపోతున్నారన్నారు. ఉత్తీర్ణతకు ఫీజు చెల్లింపుకు లింక్ పెట్టడం పథకం ఎత్తివేయాలనే దుర్భుద్ది కాకపోతే మరేంటని విద్యావేత్త మదన్‌మోహన్ రెడ్డి ప్రశ్నించారు.

No comments:
Post a Comment