ఎవరితోనూ విలీనమయ్యే ప్రశ్నే తలెత్తదని స్పష్టీకరణ
కథనాన్ని వెనక్కు తీసుకోవాలని, దుష్ర్పచారం ఆపాలని డిమాండ్.. లేదంటే చట్టపరమైన చర్యలకు హెచ్చరిక
హైదరాబాద్, న్యూస్‌లైన్: తమ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే అవకాశాలను వైఎస్ విజయమ్మ తోసిపుచ్చలేదంటూ వచ్చిన పీటీఐ వార్తా కథనాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. దాన్ని అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించింది. ఈ మేరకు శుక్రవారం పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘విజయమ్మ వ్యాఖ్యలను యథాతథంగా ఇస్తే అభ్యంతరం లేదు. కానీ వాటికి తనకు నచ్చినట్టుగా పీటీఐ భాష్యం చెప్పటం కుట్ర పూరితమైన వ్యవహారం’’ అంటూ తీవ్రంగా ఆక్షేపించింది. ఆ కథనాన్ని రిపోర్ట్ చేసిన వ్యక్తి వాస్తవాలను యథేచ్ఛగా వక్రీకరించాడని, పీటీఐ వార్తా కథనం శీర్షికే దాన్ని ధ్రువీకరిస్తోందని అభిప్రాయపడింది. ‘వైఎస్సార్‌సీపీ ఎన్నటికీ ఏ పార్టీలోనూ విలీనమయ్యే ప్రశ్నే తలెత్తదని రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ కచ్చితంగా తెలుసు. అలాంటప్పుడు ఇలాంటి కుట్రపూరిత కథనాలను ఎందుకు వండి వార్చిందో పీటీఐ సమీక్షించుకోవాలి’ అని కోరింది. ఇదే అదనుగా ఎల్లో మీడియాలోని చంద్రబాబు చానళ్లు ఈ అసత్య కథనానికి పెద్ద స్థాయిలో ప్రాముఖ్యమివ్వడం చూస్తుంటే, ఇది కుట్రపూరితమేనన్న తమ అభిప్రాయం సరైనదేనని ఎవరికైనా అర్థమవుతోందని పార్టీ పేర్కొంది. ఆ కథనాన్ని తక్షణం వెనక్కు తీసుకోవాలని, దుష్ర్పచారాన్ని ఆపాలని డిమాండ్ చేసింది. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

No comments:
Post a Comment