న్యూఢిల్లీ: సెప్టెంబర్ 6, 7 తేదిలలో చేపట్టనున్న విజయమ్మ ఫీజు దీక్షకు ఆర్.కృష్ణయ్య మద్దతు ప్రకటించారు. వైఎస్ విజయమ్మ దీక్షకు బీసీ సంఘాల పూర్తి మద్దతు ఉంటుందని కృష్ణయ్య అన్నారు. విజయమ్మ దీక్షను ప్రభుత్వం రాజకీయ కోణంలో చూడొద్దని ఆయన సూచించారు. సమస్య పరిష్కార దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కిరణ్ సర్కార్ కు కృష్ణయ్య సలహా ఇచ్చారు. వైఎస్‌ఆర్ మా సమస్యలన్నీంటిని పరిష్కరించారని ఆయన తెలిపారు. ఒక్కటడిగితే రెండిచ్చిన గొప్ప మనిషి అని మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిని ఆర్.కృష్ణయ్య ప్రశంసలతో ముంచెత్తారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment