తిరుపతి: వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఫీజు దీక్షకు మద్దతుగా ఎస్వీ యూనివర్శిటీలో రేపట్నుంచి విద్యార్థులు నిరాహారదీక్ష చేయనున్నారు. విజయమ్మ దీక్షకు ముందుగానే విద్యార్థులు తమ నిరాహారదీక్షతో సంఘీభావం తెలుపనున్నారు. విద్యార్థుల ఫీజులపై ప్రభుత్వం దిగిరాకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నేత అజయ్‌కుమార్ ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరించారు. విద్యార్థుల చేపట్టే నిరాహారదీక్షకు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి హాజరుకానున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment