తమ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే అవకాశాలను వైఎస్ విజయమ్మ తోసిపుచ్చలేదంటూ వచ్చిన పీటీఐ వార్తా కథనాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. పీటీఐలాంటి సంస్థ ఇలాంటి కథనాలు రాయడం దురదృష్టకరమని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధులు బాజిరెడ్డి గోవర్థన్, వాసిరెడ్డి పద్మ, రెహ్మాన్ అన్నారు. ఇలాంటి కథనాలతో పీటీఐకున్న విశ్వసనీయత దెబ్బతినే ప్రమాదముందని హెచ్చరించారు. పీటీఐలో కూడా కోవర్టులున్నారన్న విధంగా కథనాన్ని రాశారని అన్నారు. తమ పార్టీని అపఖ్యాతిపాలు చేయాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్‌లో విలీనం కావాల్సిన ఖర్మ వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు లేదని స్పష్టం చేశారు. చిరంజీవిలా పార్టీని అమ్ముకునే పరిస్థితి వైఎస్సార్ సీపీకీ ఎన్నటికి రాదన్నారు. పీటీఐ కథనాన్ని అదే పనిగా ప్రచారం చేసిన కొన్ని చానల్స్, వైఎస్ విజయమ్మ ఖండనను ఎందుకు ప్రచారం చేయలేదని వారు ప్రశ్నించారు. ఫీజుదీక్ష విజయవంతం కావడాన్ని జీర్ణించుకోలేక కొన్ని చానల్స్ దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. దమ్ముంటే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో అవిశ్వాసం పెట్టాలని ప్రతిపక్ష నేత చంద్రబాబుకు వారు సవాల్ విసిరారు. అవిశ్వాసం పెడితే ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో తేలిపోతోందని అన్నారు.

No comments:
Post a Comment