వైఎస్ విజయమ్మ చేపట్టిన ఫీజు దీక్షకు విద్యార్థులు సంఘీభావం తెలుపుతూ పలుచోట్ల దీక్షకు దిగారు. తిరుపతి ఎస్వీ యూనివర్శిటీ విద్యార్థులు విజయమ్మకు బాసటగా దీక్ష చేపట్టారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి విద్యార్థులకు అండగా దీక్షలో పాల్గొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆంక్షలు ఎత్తివేసే వరకు పోరాటం సాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు. విద్యార్థుల ప్రయోజనాలను కాలరాస్తున్న సర్కారుకు రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు.
వైఎస్ విజయమ్మ చేపట్టిన ఫీజు దీక్షకు కాకినాడ విద్యార్థులు మద్దతు తెలిపారు. సర్పవరం జంక్షన్ వద్ద దీక్ష చేపట్టిన విద్యార్థులకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సంఘీభావం వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై వైఎస్ విజయమ్మ దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా నాలుగు లక్షలా పాతికవేల మంది విద్యార్థులకు నేడు వృత్తివిద్యా కోర్సులు చదివే అవకాశం ఉందని మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. అయితే పేద విద్యార్థులు పెద్ద చదువులకు అనర్హులన్నట్టు నేటి సర్కార్ వ్యవహరిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విజయమ్మ చేపట్టిన ఫీజు పోరులో సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ ప్రభుత్వం లేనిపోని ఆంక్షలు పెట్టి 70 శాతం విద్యార్థులను ఫీజు రీయింబర్స్ మెంట్ కు దూరం చేస్తోందని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ కు ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వ విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తీవ్రంగా విమర్శించారు . ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను మోయలేని బరువుగా కిరణ్ ప్రభుత్వం ఎందుకు భావిస్తుందో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రభుత్వం పరిస్థితి చూస్తుంటే ఇంట్లో ఎలుకలు జొరబడ్డాయని..ఇల్లు తగలబెట్టుకున్నట్లు ఉందని వాసిరెడ్డి పద్మ అన్నారు.

No comments:
Post a Comment