

మరోవైపు, కువైట్‌లోని జబ్రియాలో తూర్పు, పశ్చిమ గోదావరి, కడప జిల్లాలకు చెందిన ప్రవాసాంధ్రులు వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వైఎస్ అందించిన సువర్ణపాలన ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ రావాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. అనంతరం, రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ వివరాలను వైఎస్సార్ యువసేన ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి కువైట్ కన్వీనర్ దేవ వినోద్, ఖతార్ నుంచి దోహా వైఎస్సార్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యుడు రాపాక శేఖర్ మంగళవారం ఈ-మెయిల్ ద్వారా తెలిపారు.
No comments:
Post a Comment