YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday, 6 October 2012

జగన్ బెయిల్ నిరాకరణ సై సర్వే వివరాలు

ముఖ సంస్థ సర్వే చేసిందని , వచ్చిన పలితాలు ఆసక్తికరంగా ఉన్నాయని చెబుతున్నారు. ఈ సర్వే వివరాలు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అభిమానుల మధ్య ప్రచారం అవుతున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. జగన్ కు బెయిల్ ఇవ్వకపోవడాన్ని సమర్ధిస్తారా అని అడిగితే కేవలం ఇరవై మూడు శాతం మంది మాత్రం సమర్ధించగా, మిగిలిన డెబ్బైరెండు శాతం మంది సమర్ధించలేదు. మిగిలిన ఐదు శాతం ఎటూ తేల్చలేదు. కాగా ఇందులో కూడా ప్రాంతాల వారీగా కూడా ఫలితాలు వచ్చాయి. ఆంధ్ర ప్రాంతంలో సుప్రింకోర్టు నిర్ణయాన్ని పదమూడు శాతం మందే సమర్ధించారు. ఎనభై ఒక్క శాతం మంది సుప్రింకోర్టు నిర్ణయం సమంజసం కాదని అన్నారు.రాయలసీమలో అయితే జగన్ కు మద్దతు మరీ అదికంగా ఉంది. కేవలం ఆరు శాతం మంది మాత్రమే సుప్రింకోర్టు వైఖరికి మద్దతు ఇవ్వగా, 91శాతం మంది వ్యతిరేకించారు.తెలంగాణ లో మాత్రం జగన్ కు మెజార్టీ ఉన్నా, మిగిలిన ప్రాంతాలతో పోల్చితే కాస్త తక్కువే. సుప్రింకోర్టు తీర్పును ముప్పై రెండు శాతం సమర్దించగా, అరవై మూడు శాతం మంది వ్యతిరేకించారు. మొత్తం మీద సీమాంధ్రలో జగన్ హవా లేదా సానుభూతి కొనసాగుతోంది. ఇది తెలంగాణలో కూడా క్రమేపి పెరుగుతోందన్నది వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ వాదనగా ఉంది.

http://kommineni.info/articles/dailyarticles/content_20121007_7.php

తెలుగువాడి ఆత్మ గౌరవం ,మాట కోసం...

వైఎస్సార్  చనిపోగానే అనుకున్నట్లు గానే ముందు  వైఎస్సార్  మంచివాడు,కానీ జగన్ కాదు అని ప్రచారం చేసారు,కానీ జగన్ జనం లో వుండడం వల్ల జనానికి జగన్  అంటే ఏంటో తెలిసి వచ్చింది.ఏమి చెయ్యాలో అర్ధం కాక  వైఎస్సార్   ని అవినీతిపరుడు అని చెప్పి జగన్ ని దెబ్బతియ్యలని చూసారు,అది జనం నమ్మలేదు.ఒక చోట నేరం జరిగిన తర్వాత దర్యాప్తు వుంటుంది.కానీ జగన్ అర్రెస్ట్ విషయం లో తప్పు జరిగే వుంటుంది,మేము అదే తేలుస్తాం,అప్పటి దాక జైలు లో వుండాలి అనే విధంగా జరుగుతుంది దర్యాప్తు.కొన్ని పార్టీ లు కుమ్మక్కు కి నిదర్శనమే ఈ దర్యాప్తు.మిగతా వాళ్ళని దర్యాప్తు చెయ్యడానికి సిబిఐ కి సిబ్బంది కూడా వుండరు,జగన్ విషయం లో ప్రత్యెక సిబ్బంది వుంటారు.

క్విడ్ ఫ్రాడ్కో అని చెప్పడానికి,అక్రమ ఆస్తుల కేసు అనడానికి ఎవరికీ హక్కు లేదు,కానీ అదే చెప్తూ జనం లో విష బీజాలు నాటడానికి ప్రయత్నం చేస్తున్నారు.జగన్ ప్రభుత్వం లో ఏ  పదవిలో లేనప్పుడు క్విడ్ ఫ్రాడ్కో ఎలా అవుతుంది.కాబినెట్.అధికారులు అందరు తప్పు చేసారు,అధికార దుర్వినియోగం జరిగింది అని తేలిన తర్వాత మాత్రమే జగన్ మీద దర్యాప్తు చెయ్యాలి.అది కూడా సాక్ష్యాలు లభించిన  తర్వాత మాత్రమే.జగన్ సక్రమం గా పన్ను కట్టినప్పుడు కూడా గొడవ చేసారు,పన్ను కట్టని వాళ్ళని ,అక్రమ సొమ్ము దొరికిన వాళ్ళని పట్టించుకోరు కానీ జగన్ విషయం లో చాల అన్యాయం గా వ్యవహరిస్తున్నారు .జగన్ సంపాదించిన ఆస్తులు అన్ని చట్టపరం గా సక్రమమైనవే,అన్నిటికి పన్ను  కట్టినవే .జగన్ విషయం లో ఏమి తప్పు దొరకకే సిబిఐ,ఎల్లో మీడియా తిప్పలు పడుతుంది.

జగన్ ని అర్రెస్ట్ చెయ్యడానికి  మాట్రిక్స్ ప్రసాద్ లాంటి వాళ్ళని అర్రెస్ట్ చేసారు, తెలుగు దేశం అధికారం లో వుండగా ప్రసాద్  కొన్ని కోట్ల తో మాట్రిక్స్ ని వేల కోట్లకు తీసుకెళ్ళారు.మా టీవీ లో ఇంకా చాల వాటిలో పెట్టుబడులు పెట్టారు కానీ జగన్ కంపెనీ లలో పెట్టుబడులు పెట్టడమే తప్పు అని చూపిస్తున్నారు.వాన్ పిక్ లో  అల్ కైమా సంస్థకి నష్టం వచ్చిన ప్రభుత్వానికి,ప్రజలను నష్టం వచినట్లు గా మీడియాలో ప్రచారం చేస్తున్నారు.ఎక్కువ శాతం మీడియా జగన్ వ్యతిరేకులతో కలిసి పని చేస్తునది.ఎలా చెప్పుకుంటూ పోతే  ఎంత కుట్ర వుందో అనిపిస్తుంది.వైఎస్సార్ మరణం  మీదే నివేదికలు బహిర్ఘతం చెయ్యలేదు.అయన మరణం మీద  ప్రజలకు గట్టి సందేహాలున్నాయి.

కాంగ్రెస్ తో జగన్  కలుస్తారు అన్నట్లు,సిబిఐ స్లో అయ్యింది అని కావాలని ప్రచారం చేయించి జనం లో జగన్ ని చెడు చెయ్యాలని చూసారు ,కాని జనం నమ్మే పరిస్థితులలో లేరని తెలుసుకున్నారు. ఈరోజు చంద్రబాబు పాదయాత్ర అంటూ తన పాలన గురించి  ప్రజలు  మరిచిపోయారు అని అనుకుంటున్నాడు.కానీ అంత దుర్మార్గపు పాలనను జనం ఎప్పటికి మర్చిపోలేరు.ఏ పార్టీ తో కలవాలన్న చంద్రబాబు కే సాధ్యం ,ఈరోజు సిబిఐ ,కాంగ్రెస్ తో కలిసి  " చంద్రబాబు (కాంగ్రెస్) బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్"  గా మార్చారు.ఇప్పుడు ఈడి తో కూడా కుమ్మక్కు అయ్యి చంద్రబాబు పాదయాత్ర అయ్యేదాకా జగన్ కు బెయిల్ రాకుండా చెయ్యాలని ప్రయత్నం  చేసారు .ఎన్ని కుట్రలు చేసిన జగన్ మీద జనానికి ఉన్న అభిమానం ,నమ్మకం పెరుగుతూనే  ఉంది.

  కాంగ్రెస్ కి లొంగలేదు కాబట్టి తెలుగు దేశంతో ఒప్పందం పెట్టుకుని  చంద్రబాబు ఆంధ్ర లో పాదయాత్ర చేసే దాక జగన్ కి బెయిల్ రాకుండా చేస్తున్నారు.తెలంగాణా లో కెసిఆర్ తో బేరసారాలు చేస్తున్నారు అని చెప్పుకుంటున్నారు .జగన్ ని ఒంటరిగా నిలబెడతాం అని కాంగ్రెస్ అధిష్టానం లో కొంతమంది అన్నారని చెప్తున్నారు.దేశం లో అంబానీ....రాష్ట్రము లో మురళీమోహన్,నామా...దేవేందర్ గౌడ్....రాధాకృష్ణ........ఇంకా వందల ,వేల మంది తక్కువ సమయం లో వేల కోట్లు సంపాదించిన వాళ్ళే.కానీ జగన్ టాక్స్  కడుతూ  సక్రమం కొంత సంపాదించుకుంటే వేల కోట్లు,లక్షల కోట్లు అని తప్పుడు ప్రచారం చేసారు.జగన్ ఒక్కడి మీదే వందల కుట్రలు చేస్తున్నారు.దేశం లో ఎవరికీ ఇలాంటి పరిస్థితి రాలేదు.దేవుడున్నాడు మంచి జరుగుతుందని ఎదురుచూడ్డం మాత్రమే కాదు మనం చెయ్యల్సింది వుంది చాలా.

వై ఎస్సార్ ని కూడా చాలా కష్టాలు పెట్టారు.ఆర్ధికం గా,మానసికం గా,రాజకీయం గా నష్ట పరిచారు అయన ఏరోజు తలవంచలేదు.జగన్ ని అదనం గా ఇంకా ఎక్కువ కష్టాలు పెడుతున్నారు ,జగన్ తొణకలేదు,బెదరలేదు .జనం కోసం మాట మీదే నిలబడ్డాడు.అయన అనుకుంటే దర్జాగా విలాసం బతుకుతూ కాంగ్రెస్ అధిష్టానానికి లొంగి వుంటే ఎప్పుడో ముఖ్యమంత్రి అయ్యేవాడు.కానీ తెలుగువాడి ఆత్మ గౌరవం ,మాట కోసం కష్టాలను బరిస్తున్నాడు.

తెలుగువాడి ఆత్మ గౌరవం అని నందమూరి తారకరామారావు పార్టీ పెడితే ఆయన వారసులు ఈరోజు ఢిల్లీ కి అమ్ముడు పోయారు.
గ్రామ స్థాయిలో పార్టీ బలపడకుండా స్తానిక సంస్థల ఎన్నికలు రాకుండా చేసారు. 
ఇప్పుడు మనం చెయ్యల్సింది పార్టీ కోసం పని చెయ్యడం.   పార్టీ కి జన బలం ఏ పార్టీ కి లేనంత వుంది,కానీ నడిపించే నాయకత్వం పూర్తిగా ఏర్పడలేదు.కష్టపడి,ఇష్టపడి పని చెయ్యాల్సిన సమయం ఇది.జనం లోకి వెళ్లి కష్టపడదాం.జనానికి అండగా నిలబడదాము.పార్టీ కోసం సైనికులమై పని చేద్దాం.

‘అల్లుడి’ ఆస్తులపై విచారణ చేపట్టాల్సిందే! :సురవరం

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడైన రాబర్ట్ వధేరాపై అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై ఒక స్వతంత్య్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అభిప్రాయ పడ్డారు. అతి స్వల్ప కాలంలో వధేరా వందల కోట్ల విలువ చేసే అస్తులను ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ సాయంతో సంపాదించుకున్నారని వచ్చిన ఆరోపణలను తీవ్రంగా తీసుకోవలసిన అవసరం ఉందని విలేఖరులకు చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థను, సామాన్యుల జీవితాలను చిన్నాభిన్నం చేసే విధంగా ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేయటానికి వామపక్షాలు దేశ వ్యాప్తంగా ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ నెల 18న జరిగే వామపక్షాల సమావేశంలో కార్యాచరణ ప్రణాళికకు తుదిరూపం ఇవ్వటం జరుగుతుందని సురవరం చెప్పారు. సారూప్య భావాలున్న ఇతర పార్టీలను కూడా ఈ ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంలోకి ఆహ్వానిస్తామని ఆయన చెప్పారు. బీమా రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించటం వల్ల విదేశీ సంస్థలు విపరీతంగా లాభ పడతాయని ఆయన చెప్పారు. ఈ సంస్థలు పట్టణ ప్రాంతాలపైనే దృష్టిని కేంద్రీకరించి చేతికి వచ్చినంత దండుకుపోతాయని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం గణనీయమైన సేవలు అందిస్తూ దేశాభివృద్ధిలో కీలకపాత్ర వహిస్తున్న జీవిత బీమా సంస్థను దెబ్బతీయటానికే ప్రభుత్వం విదేశీ సంస్థలను ఆహ్వానిస్తోందని ఆయన విమర్శించారు.
ప్రధానికి ఎర్రంనాయుడు లేఖ
రాబర్ట్ వధేరాపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సమగ్రమైన విచారణకు ఆదేశించాలని తెలుగు దేశం పొలిట్ బ్యూరో సభ్యుడు ఎర్రం నాయుడు ప్రధాని మన్మోహన్ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రజా జీవితంలో ఉన్నవారు నైతిక విలువలకు కట్టుబడి ఉండాలన్న విషయాన్ని సోనియా విస్మరించటం విడ్డూరంగా ఉందని ఆయన ప్రధానికి రాసిన లేఖలో తెలియచేశారు. తన అల్లుడిపై వచ్చిన అవినీతి ఆరోపణలకు స్పష్టమైన జవాబు ఇవ్వకుండా మంత్రులను, అధికార ప్రతినిధులను రంగంలోకి దించి ఆరోపణలను తిప్పికొట్టేందుకు సోనియా ప్రయత్నించటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఇప్పటికే అవినీతి ఆరోపణలలో కొట్టుమిట్టాడుతున్న యుపిఏ ప్రభుత్వంపై ప్రజలకు కొంతలో కొంత నమ్మకం కలిగేందుకు ప్రధాని వెంటనే నిస్పక్షపాతమైన విచారణకు ఆదేశించాలని ఆయన కోరారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న అరవింద్ కేజ్రీవాల్ సాక్ష్యాధారాలతో బయటపెట్టిన వధేరా అవినీతిపై ప్రధాని తగిన రీతిలో స్పందించగలరన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
అరవింద్ ఆరోపణలను సమర్థించిన హజారే
రాలేగావ్ సిద్ధి: రాబర్ట్ వధేరాపై అరవింద్ కేజ్రివాల్ చేసిన ఆరోపణలను సామాజిక ఉద్యమ నేత అన్నా హజారే గట్టిగా సమర్థిస్తూ, ఈ ఆరోపణలు గనుక తప్పని కాంగ్రెస్ భావిస్తే న్యాయ విచారణకు ఆ పార్టీ ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. ‘ఎన్నికలు దగ్గర పడుతున్న కారణంగానే ఈ ఆరోపణలు చేస్తున్నారని, ఇవి నిరాధారమైనవని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఒకవేళ ఈ ఆరోపణలు నిరాధారమైనవయితే న్యాయ విచారణకు ఎందుకు ఆదేశించకూడదు. ఒకవేళ ఇవి తప్పుడు ఆరోపణలయితే కేజ్రివాల్‌పై పరువు నష్టం దావా వేయవచ్చు. అలాచేస్తే నిజమేంటో బయటికి వస్తుంది’ అని అన్నా హజారే అన్నారు. తాము ఇంతకుముందు 15 మంది ‘అవినీతి’ మంత్రులపై ఆరోపణలు లేవనెత్తినప్పుడు వాటిలో పస లేదని ప్రభుత్వం చెప్పింది. అయితే వారిలో ఇద్దరు మంత్రులు బైటికి వచ్చారు. ఇప్పుడు బొగ్గు కుంభకోణం బైటపడింది. మొత్తం దేశం దాన్ని చూసిందని కూడా కేజ్రివాల్ అన్నారు.

http://andhrabhoomi.net/content/demands-enquiry

జగన్‌కు బెయిల్ రాకుండా కుట్ర

జగన్ జైలులో ఉన్నా ప్రజలు వైఎస్సార్‌సీపీ వైపే
కాంగ్రెస్‌లో బాబు ‘పెద్దన్న’ పాత్ర
బాబూ.. ఎవరి కోసం మీ పాదయాత్ర?

కర్నూలు, న్యూస్‌లైన్: వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ రాకుండా కాంగ్రెస్, టీడీపీలు మహా కుట్ర పన్నాయని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష ఉపనేత భూమా శోభా నాగిరెడ్డి ఆరోపించారు. ఆమె శనివారం కర్నూలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జగన్‌ను ఎదుర్కొనే శక్తి లేకనే అధికార, ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్కయ్యాయన్నారు. ఆయనను జైలులో పెట్టి పాదయాత్రల ద్వారా ప్రజలను మభ్య పెట్టాలనుకోవడం భ్రమే అవుతుందని ఎద్దేవా చేశారు. జగన్ జైలులో ఉన్నా ప్రజలంతా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని ఆమె స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు విపత్కర పరిస్థితుల్లో ఉన్నాయని, అధికార పార్టీ బలహీనతలను దీటుగా ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష పార్టీ వారితోనే జత కట్టడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. 

63 సంవత్సరాల వయస్సులో చంద్రబాబు ఎవరి కోసం పాదయాత్ర చేస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికీ చంద్రబాబుకు తొమ్మిదేళ్ల పాలన నీడలా వెంటాడుతోందన్నారు. ప్రజలను చైతన్యవంతం చేసేందుకు పాదయాత్రలు అని చెప్పుకుంటున్న టీడీపీని చూస్తుంటే జాలేస్తోందని, ప్రజలు ఎప్పుడో చైతన్యవంతమయ్యారని, అందుకే రెండుసార్లు ఆ పార్టీని ఓడించారని గుర్తు చేశారు. జగన్‌కు బెయిల్ రాకుండా చేసేందుకే బీసీ డిక్లరేషన్ సాకుతో ప్రధానమంత్రిని చంద్రబాబు ఏకాంతంగా కలిశారని ఆరోపించారు. జగన్ బెయిల్ విచారణకు ఒక్క రోజు ముందు ఆయన ఆస్తులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ నోటీసులు జారీ చేయడం ఉద్దేశపూర్వకంగా జరిగిందని ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు. కాంగ్రెస్‌లో చంద్రబాబు పెద్దన్న పాత్ర నిర్వహిస్తున్నారని విమర్శించారు. 

ప్రత్యేక కోర్టులను ఆహ్వానిస్తున్నాం

తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్రంలో ప్రత్యేక కోర్టులను కోరడాన్ని ఆహ్వానిస్తున్నామని శోభా నాగిరెడ్డి చెప్పారు. ఒక్క జగన్ కేసుల విషయంలోనే కాకుండా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు ఐఎన్‌జీ భూముల కేటాయింపులు, ఎంఆర్ ప్రాపర్టీస్ విషయాల్లో స్టే వెకేట్ చేయించుకుని విచారణకు సిద్ధం కావాలని చంద్రబాబుకు సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీతో లాలూచీ పడకపోతే.. స్థానిక సంస్థల ఎన్నికలు, మునిసిపాలిటీ ఎన్నికలను పెట్టాలని డిమాండ్ చేయడంలేదని, అవిశ్వాస తీర్మానానికి ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. పాదయాత్రలు చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే తమ సత్తా ఎంటో చాటుతామని చెప్పారు.

source:sakshi

అల్లుడు.. ‘క్విక్’ గిల్లుడు!

Written by Srinu On 10/6/2012 11:44:00 PM
పైసా పెట్టుబడి లేకుండా 300 కోట్ల రూపాయలు సంపాదించగలమా? లేదు అనేది మీ సమాధానమైతె మీరు సత్తెకాలపు సత్తయ్య కిందే లెక్క. ‘పవర్’ ఉండాలేగానీ చెట్లకు డబ్బు కాయించడం కష్టమేమీ కాదడనానికి నిలువుటద్దంగా నిలుస్తున్న కాలమిది. తమ్ముడు తన వాడైనా ధర్మం చెప్పమన్నారు పెద్దోళ్లు. మనోడు ఒక్కడు అధికారంలో ఉంటే చాలు అందినకాడికి దోచుకో అంటున్నారు ఆధునిక నేతాశ్రీలు, వారి పరివారం. చిన్న బుద్ధులతో తరతరాలకు సరిపడా సంపాదించినా సంతృప్తి అనేది వారి డిక్షనరీల్లో ఉండదు. భజనపరులతో భుజకీర్తులు తొడిగించుకున్న తామేంచేసినా చెల్లుతుందనే అహంకారంతో అంతుపొంతు లేకుండా ఆర్జన దిగడం ఆధునిక పాలి’ట్రిక్స్’తో అబ్బిన విద్య.

క్విక్ ప్రో కో కాలంలో పైసా పెట్టుబడి పెట్టకుండా కోట్లకు పడగలెత్తడం పెద్ద కష్టం కాదని కాంగ్రెస్ అధిష్టానమ్మ అల్లుడిని చూస్తే అర్థమవుతుంది. సారూ.. కానీ పెట్టకుండా వందల కోట్ల రూపాయల ఆస్తులు ఆర్జించేశారు. ఇదంతా అక్రమ సంపాదనంటూ అరవింద్ కేజ్రీవాల్ లాంటి కిట్టనివాళ్లు ఆడిపోసుకుంటున్నారు. మెచ్చుకోలు తెలియని ప్రశాంత్ భూషణ్ కూడా పాపం ‘అల్లుడుగారిని’ అనుమానిస్తున్నారు. పైసా పెట్టకుండా వందల కోట్ల ఆస్తులు జమ చేసిన అల్లుడిని ఆకాశానికెత్తడం పోయి ఆరోపణలు చేయడం ఎంత దారుణం. కోట్ల విలువైన ఆస్తులను కారు చౌకగా సొంతంగా చేసుకున్న ‘సన్-ఇన్-లా’పై సందేహాలు కడు శోచనీయం.

వడ్డీ లేని రుణం తెచ్చిన అల్లుడుగారిని మెచ్చుకుని ఆర్థిక మంత్రి పదవి ఇవ్వకుండా బదనాం చేయడం భావ్యమేనా? పూచీకత్తు లేకుండా రుణం తీసుకున్న ఆయనగారి తెలివితేటల గురించి ముందే తెలుసుకునేంటే దేశ జనాభా తలపై రుణం సగానికి సగం తగ్గేది. ఆలస్యంగానైనా ‘వాద్రా’ వారి ‘వాల్యూ’ను గుర్తించి బహిర్గతం చేసినందుకు కేజ్రీవాల్‌ను అభినందించాల్సిందే. కాకపోతే అల్లుడిగారిపై ఆయన ఒంటికాలిపై లేవడమే బాలేదు. నోటికి వచ్చినట్టు మాట్లాడమే కాకుండా దర్యాప్తు చేయమనం ఇంకా దారుణం. అల్లుడు తన సొంత తెలివితేటలతో నాలుగురాళ్లు వెనకేసుకుంటే చూడ లేకపోతే మానేయ్యాలి గానీ, ఇష్టమొచ్చినట్టు ఆరోపణలు చేస్తాడా? దేవత లాంటి అత్తమ్మ ప్రతిష్ఠకు ఆటంకం కలిగేలా ఎలుగెత్తుతాడా? ఎంత ధైర్యం? ప్రతిభను మెచ్చుకోకపోయినా కనీసం గౌరవించడం అయినా నే ర్చుకోవాలి. అంతేగాని మీడియాకెక్కి గొంతు చించుకుంటారా? పెపైచ్చు ప్రజలు గళం విప్పాలని ఉసిగొల్పడం ఎంత విడ్డూరం.

అధిష్టానమ్మకు అల్లుడైనంత మాత్రాన ‘బిగినెస్సు’ చేసుకోకూడదా? ఆస్తులు వెనకేసుకోకుడదా? ఇదెక్కడి గొడవండీ. నిర్మాణ రంగంలో తన ‘సత్తా’ చూపి స్వల్పకాలంలోనే కాసుల పంట పండించుకుంటే ఏడుపు ఎందుకంట. డీ ఎల్‌ఎఫ్‌తో ‘క్విక్’గా ఎదిగితే కుళ్లుకుంటున్నారు. కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. పోసుకుంటే పాయేగానీ పబ్లిగ్గా పొగ పెడుతున్నారు. ప్రశ్నించే ధైర్యం లేదా అంటూ దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నారు. నిలదీయడంటూ జనాన్ని రెచ్చగొడుతున్నారు. హవ్వ! అంత అప్రదిష్ట. అల్లుడిని నెత్తిన పెట్టుకోవాల్సింది పోయి బజారు కీడుస్తారా? ఎంత తప్పు. బరి‘తెగింపు’. పండిన చెట్లకే దెబ్బలన్నట్టుగా ‘క్విక్’గా సంపాదించిన అల్లుడికే కష్టాలెందుకో? ఇలాంటి క్లిష్ట సమయంలో అల్లుడిగారికి కాంగీయులేకాకుండా అన్ని పార్టీల వారు అండ అందించి 'రాజనీతి' రుజువు చేసుకోవాలి.

source :sakshi

వైఎస్సార్ కాంగ్రెస్ సీజీసీ, సీఈసీ భేటీ రేపు

హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అధ్యక్షతన ఈనెల 8న కేంద్ర పాలక మండలి, కేంద్ర కార్య నిర్వాహక మండలి అత్యవసర సమావేశం జరగనుంది. పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు శనివారం ఈ మేరకు వెల్లడించారు. పార్టీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటాం కనుక అందరూ హాజరు కావాలని ఆయన కోరారు. శనివారం పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉన్న ముఖ్య నేతలు సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్యేలు కె.శ్రీనివాసులు, జి.బాబూరావు, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, బి.గురునాథరెడ్డి, ఆళ్ల నాని, ముఖ్య నేతలు వైవీ సుబ్బారెడ్డి, ఎంవీ మైసూరారెడ్డి, డీఏ సోమయాజులు, సజ్జల రామకృష్ణారెడ్డి, కొణతాల రామకృష్ణ, ఎం.ప్రసాదరాజు, జ్యోతుల నెహ్రూ, డి.సి.గోవిందరెడ్డి, రవీంద్రనాయక్, జనక్‌ప్రసాద్, గట్టు రామచంద్రరావు, అంబటి రాంబాబు, కె.శివకుమార్ పాల్గొన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సుప్రీంకోర్టు బెయిల్ తిరస్కరణ నేపథ్యంలో ఉత్పన్నమైన పరిస్థితులపై చర్చించారు.

పార్టీని భవిష్యత్‌లో పటిష్టం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరిగిందని అంబటి రాంబాబు తెలిపారు. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజాపక్షంగా పోరాడేందుకు రూపొందించాల్సిన కార్యాచరణపై 8న జరిగే సమావేశంలో నిర్ణయిస్తామని ఆయన వివరించారు. నిరంతరం ప్రజల మధ్య ఉన్న జననేత జగన్‌ను కాంగ్రెస్, టీడీపీలు కుట్రలు చేసి అక్రమంగా బంధించినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అణచివేయలేరన్నారు. జగన్ జైల్లో ఉన్నా విజయమ్మ నేతృత్వంలో నాయకులందరూ దిగ్విజయంగా ముందుకెళ్లే విధంగా పార్టీ నిర్ణయాలుంటాయన్నారు.

source:sakshi

మీకు కోట్లమంది కుటుంబ సభ్యులం ఉన్నాం- జగన్ కోసం (sakshi)

నా పేరు విజయలక్ష్మి. మాది రైతు కుటుంబం. డా.రాజశేఖరరెడ్డి గారు అంటే ఎనలేని ప్రేమే కాదు... గుండెనిండా కొలువై ఉన్నారు. అలాంటి పెద్దాయన ఇలా కనుమరుగయ్యారంటే ఇప్పటికీ నా గుండె చెరువు అవుతోంది. రాజశేఖరరెడ్డి గారిని భగవంతుడు దూరం చేసినపుడు నేను అసలు మనిషిని కాలేకపోయాను. జగనన్న ఎంతో బాధలో ఉండి, ప్రజానీకానికి చేతులు జోడించి ‘మీరు బాధపడవద్దు. నాన్నగారు ఎక్కడికీ వెళ్లలేదు. మన గుండెలో ఉన్నారు’ అన్నాక కాస్త ఊరట కలిగినా అదే బాధ. అప్పుడు మావారి ఆలోచనతో మా గ్రామంలో విగ్రహం పెట్టించి రోజూ చూసుకంటూ నమస్కరించుకుంటున్నాము.

భగవంతుడు ఉన్నాడు అనడానికి ఒక నిదర్శనం - కృష్ణా జిల్లా ఓదార్పు యాత్రలో జగనన్న మా గ్రామం అయిన కొణకంచి రూట్ మ్యాప్‌లో లేకపోయినా మా గ్రామానికి రావాలి అని అడగ్గానే వచ్చారు. ఆయన చుట్టూ జనం. ఆయనను చూసినప్పుడు నాకు దుఃఖం, ఏడుపు పొంగుకొచ్చాయి. జగనన్న కారు ఆపి ‘ఏమిటమ్మా బాధ’ అని అడగ్గానే నాకు అసలు నోట మాటరాక మూగబోయి, దుఃఖంలో ఉండిపోయాను. వైఎస్‌గారు పోయినప్పుడు కలిగిన బాధ గురించి చెప్పాలి అనుకున్నాను. కానీ ఏడుపు. జనం మొత్తం మామీద గుడిగూడారు. ఏమైనా జగనన్న మా దగ్గరకు వచ్చారని ఎంతో సంతోషం. కాని ఆ సంతోషాన్ని ఎన్నోరోజులు ఉండనీయకుండా ఈ ప్రభుత్వం జగనన్నను ఇలా జైల్లో ఉంచారు. నేను ఏడవని రోజు లేదు. బాధపడని క్షణం లేదు. అమ్మా విజయమ్మగారు, భారతిగారు, షర్మిల గారు మీకు కోట్లమంది కుటుంబ సభ్యులం ఉన్నాం. ఆ భగవంతుడు అన్యాయం చేయడు. దేవుని నమ్మినవాడు ఎప్పుడూ చెడ్డవాడు కాదు. ఆ భగవంతుడు మనకు న్యాయం తప్పక చేస్తాడు. జగనన్న ముఖ్యమంత్రిగా తప్పక అవుతారు. అది భగవంతుని నిర్ణయం.
- దేవరపల్లి విజయలక్ష్మి,
కొణకంచి గ్రామం, పెనుగంచిప్రోలు మండలం, కృష్ణా జిల్లా


వాళ్లు కొట్టుకుపోయే రోజు త్వరలోనే వస్తుంది.

ఈ రోజు చాలా దురదృష్టకరం. ఎంతో ఆతృతగా జగన్‌గారి కోసం మనం అంతా ఎదురుచూశాము. అయినా దేవుని ప్లాన్స్ ఎలా ఉన్నాయో మనకు తెలీదు. మేమే ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. మీరు ఎలా ఉంటున్నారో తలచుకుంటే బాధేస్తుంది. మనం ఎంత నిరీక్షణచేయాలో తెలియడం లేదు. నిజమే.. మీరు పడుతున్న ఈ బాధ పగవాడిక్కూడా రాకూడదు. ఉదయం వార్తలు చూడగానే జగనన్నను అభిమానించే ప్రతివారు ఎంతో నీరసపడ్డారు. దేవుడు మన పార్టీని నడిపిస్తాడు అని నమ్ముతున్నా. శంకరరావు రాసిన ఒక లెటర్‌తో ఇంత జరుగుతున్నా, ఈరోజుకి కూడా మీరు శంకరరావును ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అది మీ గ్పొపతనం.

పార్టీ కార్యకర్తలకు కూడా మీరు ధైర్యం చెప్పాలి. మీరు, షర్మిల గారు వచ్చి, విజయమ్మగారికి తోడుగా ప్రజల పక్షాన నిలబడి పోరాడాలి. ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు. అన్న వచ్చేవరకు పార్టీకి మీరు భరోసాగా ఉండాలి. మీ నమ్మకాన్ని దేవుడు ఎప్పుడూ వమ్ముచేయడు. మన ప్రార్థనలు ఎక్కడికీ పోవు... దేవుడు వింటున్నాడు. మీ కన్నీళ్లు చూసి నవ్వినవాళ్లు కొట్టుకుపోయే రోజు త్వరలోనే వస్తుంది. జగన్‌గారు చేసిన పెద్ద తప్పు ప్రభుత్వాన్ని కూల్చకపోవడం. అదే చేసి వుంటే అందరూ దారిలోకి వచ్చేవాళ్లు. ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ఈ అన్యాయానికి వ్యతిరేకంగా ఒక్కమాట కూడా మాట్లాడటం లేదంటే వాళ్లు మీ మీద ఎంత కక్షకట్టారో అర్థమవుతుంది. మిమ్మల్ని నమ్మిన వారికి మార్గం చూపారు. అలాంటివారే మీకు దూరంగా వున్నారు... ఇలాంటి రాజకీయాలు ఎక్కడా చూడలేదు.

దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. జగన్ తప్పకుండా బయటకు వస్తారు. ప్రజలు మీ పక్షాన ఉన్నారు. దేవుడు మీ కుటుంబాన్ని బలపరుస్తాడు. చింతించకండి. దేవుని దీవెనలు మీ కుటుంబానికి ఉన్నాయి.

- సిరి సారెళ్ల, ఈమెయిల్ ద్వారా

'ఆరోపణలపై వాద్రా సమాధానం చెప్పాలి'

న్యూఢిల్లీ:కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాపై తాను చేసిన ఆరోపణలు తప్పని తేలితే పరువునష్టం దావాను ఎదుర్కొనేందుకైనా సిద్ధమేనని సామాజిక కార్యకర్త అరవింద్ కేజ్రీవాల్ సవాలు విసిరారు. ఆయనపై తన ఆరోపణలకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. ఢిల్లీలో తాగునీరు, విద్యుత్ సమస్యలపై శనివారం ‘బిజిలీ-పానీ’ సత్యాగ్రహం ప్రారంభించిన కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. పైసా పెట్టుబడి లేకుండా వాద్రా రూ.300 కోట్ల మేరకు ఆస్తులు కూడగట్టుకున్న వైనంపై కేజ్రీవాల్, ప్రముఖ న్యాయవాదులు శాంతిభూషణ్, ప్రశాంత్‌భూషణ్‌లు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాము చేసిన ఆరోపణలపై వాద్రా సమాధానం చెప్పాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.

http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=463967&Categoryid=14&subcatid=0

'జగన్ కొక న్యాయం-వాద్రాకొక న్యాయమా?'

శ్రీకాకుళం: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న యుపిఎ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్డ్ వాద్రాపై న్యాయవిచారణకు ఆదేశించాలని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ను టిడిపి నేత ఎర్రంనాయుడు కోరారు. ఈ మేరకు ఆయన ప్రధానికి ఒక లేఖ రాశారు. అవినీతి ఆరోపణల విచారణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డికి ఒక న్యాయం, రాబర్ట్ వాద్రాకు ఒక న్యాయమా? అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో అవసరమైతే న్యాయస్థానంలో కేసు వేస్తామని ఆయన చెప్పారు.

Ambati Rambabu Press conference on 6th oct

వైఎస్ఆర్ సీపీ నేతల సమావేశం

హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం అయ్యారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై సుప్రీం తీర్పు, తదనంతర పరిణామాలు, పార్టీని ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే అంశంపై చర్చలు జరిగాయి. ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేతలతో పాటు అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు హాజరయ్యారు. భేటీలో చర్చించిన అంశాలను పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.





'జగన్ను ఎదుర్కొనే సత్తా లేదు'
హైదరాబాద్ : వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి బెయిల్ రాకుండా చేయడానికి కాంగ్రెస్‌, టీడీపీలు ఎంతో కష్టపడి విజయం సాధించాయని ఆళ్లగడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. జగన్‌ జైల్లో ఉంటే తాము చెప్పినట్లు ప్రజలు వింటారని కాంగ్రెస్‌, టీడీపీలు అనుకుంటున్నాయని ఆమె అన్నారు. అయితే... జననేత లోపల ఉన్నా, బయట ఉన్నా ఆయనను ఎదుర్కొనే సత్తా ఆ రెండు పార్టీలకు లేవని శోభా నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌, టీడీపీలు ప్రజా విశ్వాసం కోల్పోయిన పార్టీలని ఆమె అన్నారు.



విజయమ్మను కలిసిన కృష్ణబాబు

హైదరాబాద్ : పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ సీనియర్‌ నేత, కోవూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావు (కృష్ణబాబు) శనివారం లోటస్‌ పాండ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మను మర్యాద పూర్వకంగా కలిశారు. కృష్ణబాబుతోపాటు పార్టీ సీనియర్‌ నేతలు మైసూరా రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఉన్నారు. 

కృష్ణబాబు నిన్న చంచల్గూడ జైలలులో శుక్రవారం చంచల్‌గూడ జైలులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ నెలలోనే ముహూర్తం చూసుకుని కృష్ణబాబు పార్టీలో చేరే అవకాశం ఉంది.

TDP Ex-MLA Krishna Babu meet to YS Vijayamma

YSRCP MLA Srikanth Reddy press meet in YSRCP Office at Ysr district

YSRCP leaders meet YSVijayamma at Lotus pond

YSRCP MLA Shobha Nagi Reddy press meet At Kurnool

Friday, 5 October 2012

సుప్రీంకోర్టు సాక్షిగా బయటపడిన సీబీఐ డొల్లతనం

*విచారణకు మరింత సమయం కావాలంటూ ఎత్తుగడ
*ఆది నుంచీ రాంగ్‌రూట్లోనే వెళుతున్న దర్యాప్తు సంస్థ
*కేటాయింపులన్నీ చంద్రబాబు చేసినా... ఏదో చూపిస్తూ వైఎస్‌కు ముడి
*బాబు పాత్రను ప్రస్తావిస్తూనే... దర్యాప్తులోకి మాత్రం తేని సీబీఐ
*14 నెలల దర్యాప్తులో తేల్చింది సున్నా; సమయం కావాలంటూ జాప్యం
*బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు ప్రతిసారీ ఏదో ఒక అలజడి
*కాంగ్రెస్- టీడీపీ చేతులు కలిపి మరీ కుట్రను పదునెక్కిస్తున్న తీరు
*కేసు వేయడం నుంచి... ‘అటాచ్‌మెంట్’ వరకు అంతా కుమ్మక్కే

రెండేళ్లుగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ స్పష్టంగా కనిపిస్తున్న కుట్ర మరింత లోతులకు వెళుతోంది. రాజకీయ పార్టీలు కుమ్మక్కయి, రాజ్యాంగ వ్యవస్థల్ని సైతం ప్రభావితం చేసేలా సాగిస్తున్న కుయత్నాలు మరింత పదునెక్కుతున్నాయి. ఏమీ నిరూపించలేని కేసులో సైతం వేధింపుల్ని ఎంతకైనా తీసుకెళ్లగలమని దర్యాప్తు సంస్థలు నిరూపిస్తూ ఉండగా... తమను ఎదిరించి నిలవటం ఎంతటి వారికైనా అసాధ్యమని చెప్పేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. తొమ్మిదిన్నరేళ్ల అక్రమాలు బయటపడి, జనాదరణ కోల్పోయి, కార్యాలయానికి తాళం వేసుకోవాల్సిన స్థితికి చేరిన తెలుగుదేశం దానికి అండగా నిలవటంతో ఇరుపక్షాలూ రెచ్చిపోతున్నాయి. గురువారం టీడీపీ ఎంపీలు కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరాన్ని కలవడం... బాబు ఆయనతో ఫోన్లో మాట్లాడటం... వారంతా జగన్ సంస్థల ఆస్తుల్ని అటాచ్ చేయాలని కోరటం... ఆపై కొద్దిగంటల్లోనే చిదంబరం పరిధిలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ ‘అటాచ్‌మెంట్’ ఉత్తర్వులు ఇవ్వడం ఈ లోతైన కుట్రకు పరాకాష్ట.

శుక్రవారం సుప్రీం కోర్టు జగన్ బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చిన సందర్భంగా జరిగిన విచారణలో కూడా... తామింకా దర్యాప్తు చేస్తున్నామని, మరింత సమయం కావాలని సీబీఐ చెప్పడాన్ని బెయిల్‌ను జాప్యం చేసే ఎత్తుగడగానే న్యాయ వర్గాలు భావిస్తున్నాయి. విచారణ పూర్తయ్యాక బెయిల్ పిటిషన్ వేయొచ్చని సుప్రీం చేసిన సూచనపైనా విస్మయం వ్యక్తమయింది. మొత్తానికి సీబీఐ తాను అమలు చేయాలనుకున్న కుట్రను ముందుకు తీసుకెళుతోందనే చెప్పాలి. ఈ కుట్రలో ఆది నుంచీ స్పష్టమవుతున్న పలు కోణాలు, గీత దాటుతున్న వ్యవస్థలు, న్యాయానికి అన్యాయం చేస్తున్న దర్యాప్తు సంస్థలు.. అధికారం అండతో తామేం చేసినా చెల్లుతుందన్న రీతిలోనే పోతున్నాయి. ఆ కుట్రల్ని, ఈ కేసుల్లోని డొల్లతనాన్ని, దర్యాప్తు సంస్థల దిగజారుడుటెత్తులను బయటపెట్టే కథనం...


‘ఏదో’ జరిగిపోయిందని ముందస్తుగానే ఓ నిర్ణయానికి వచ్చేసి.. ఆనక దాన్ని రుజువు చేసేందుకు అధిష్టాన బాసుల ఆదేశాలకు అనుగుణంగా.. ఆద్యంతం అడ్డదారుల్లో.. అత్యంత అడ్డదిడ్డంగా జగన్‌మోహన్‌రెడ్డి కేసులో సీబీఐ దర్యాప్తు సాగిస్తున్న తీరు రాజకీయ విశ్లేషకులు, న్యాయ నిపుణులతో పాటు సామాన్యులను కూడా ఆశ్చర్యపరుస్తోంది. ఫిర్యాదులోని ప్రధానాంశాన్ని, కోర్టు విచారణాదేశాలను పూర్తిగా తుంగలో తొక్కుతూ.. కేవలం జగన్ సంస్థల్లోకి వచ్చిన ప్రతి పైసానూ పట్టి పట్టి చూడటానికి మాత్రమే దర్యాప్తును పరిమితం చేయడం ద్వారా సీబీఐ తన ఉద్దేశాలను ఎప్పటికప్పుడు మొహమాటం లేకుండా బయట పెట్టుకుంటూనే వస్తోంది...

సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఈ కేసులో ప్రధానమైన ఆరోపణ క్విడ్ ప్రో కో. అంటే ఇచ్చిపుచ్చుకోవటం. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పలు సంస్థలకు భూములు కేటాయించడంతో పాటు అనుమతులు మంజూరు చేశారని, అందుకు ప్రతిగా అవి వైఎస్ జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టాయనేది ప్రధానారోపణ. కేంద్రంలోనైనా... ఏ రాష్ట్రంలోనైనా ఇలా ప్రభుత్వ నిర్ణయాలపై ఆరోపణలు వచ్చినపుడు మొదట తేల్చేది ఆ నిర్ణయం తప్పా, కాదా అని. ఒకవేళ నిజంగా ప్రభుత్వ నిర్ణయం తప్పని తేలితే... అప్పుడు ఆ పెట్టుబడుల్ని క్విడ్ ప్రో కో అనొచ్చు. కానీ ఇక్కడ సీబీఐ ఆ నిర్ణయాల జోలికి పోలేదు. అవి తప్పో ఒప్పో పట్టించుకోలేదు. కేవలం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని టార్గెట్ చేసి... ఆయన సంస్థల్లోకి పెట్టుబడిగా వచ్చిన ప్రతి రూపాయీ ఎలా వచ్చిందో శోధిస్తోంది. సదరు ఇన్వెస్టర్లు ప్రభుత్వ ప్రాజెక్టులేమైనా పొందారో లేదో చూస్తోంది. ఒకవేళ పొంది ఉంటే... అవన్నీ క్విడ్ ప్రోకోలేనని వాదిస్తూ వారిని వేధిస్తోంది. దారుణమేంటంటే.. ఒకవేళ ఏ ప్రభుత్వ ప్రాజెక్టూ చేపట్టని ఇన్వెస్టర్లుంటే... వారు పెట్టుబడులు పెట్టి మోసపోయారని మరీ కేసు పెడుతోంది. దీన్నేమంటారు? సీబీఐ విచారిస్తున్నదేంటి? ప్రభుత్వ నిర్ణయాలనా? జగన్ సంస్థల్లో పెట్టుబడులనా? ఇన్వెస్టర్లు మోసపోయారని చెప్పే అధికారం సీబీఐకి ఎక్కడుంది? ఆ పెట్టుబడులు పెట్టినవారు లాభాలు సైతం అందుకున్నా అది సీబీఐకి కనిపించట్లేదా? క్విడ్ ప్రో కో పెట్టుబడులకు లాభాలొస్తాయా? సీబీఐ గానీ, ఇతర వ్యవస్థలు గానీ దీన్నెందుకు పట్టించుకోవడం లేదు?

నిజానికి క్విడ్ ప్రో కో ఆరోపణలకు సంబంధించి సీబీఐ చెబుతున్న అంశాల్లో ఒక్క దాన్లోనూ ప్రభుత్వానికి నష్టం జరిగినట్లు తేలలేదు. నష్టం జరగనప్పుడు ఆ నిర్ణయం తప్పుడుదనే ప్రసక్తే ఉండదు. అది సరైన నిర్ణయమైనపుడు క్విడ్ ప్రో కో అనే వాదనే ఉండదు. అంతేగాక... ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయమైనా అది మంత్రివర్గ ఉమ్మడి నిర్ణయమని న్యాయ నిపుణులతో పాటు గత తీర్పులూ స్పష్టంగా చెబుతున్నాయి. మరి ఉమ్మడి నిర్ణయానికి దురుద్దేశాలు అంటగట్టి... అందుకు అప్పటి ముఖ్యమంత్రి ఒక్కడినే బాధ్యుడిని చేస్తూ, ఏ ప్రభుత్వ పదవిలోనూ లేని ఆయన తనయుడు అధికార దుర్వినియోగం చేశారనడం ఎంతవరకూ సబబు?

చార్జిషీట్ల ప్రహసనం...

జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించి 2011 ఆగస్టులో దర్యాప్తు మొదలుపెట్టిన సీబీఐ... మార్చి 31న ఒక చార్జిషీటు దాఖలు చేసింది. చార్జిషీటంటే దర్యాప్తు పూర్తయ్యాక కోర్టుకిచ్చే తుది నివేదిక. కానీ ఇదే కేసులో ఏప్రిల్ 23న సీబీఐ మరో చార్జిషీటు దాఖలు చేసింది. మే 7వ తేదీన ఇంకొకటి, ఆగస్టులో మరొకటి వేసింది. ఇంకా చార్జిషీట్లు వేస్తూనే ఉంటామని చెప్పింది. ఇది జగన్ బెయిలుపై బయటకు రాకుండా చేయటానికేనని ఇప్పటికే ఎన్నో విమర్శలొచ్చాయి. ఇక్కడ మరో విషయం ప్రస్తావించాలి. రెండో చార్జిషీటు వేసినప్పుడు తొలి చార్జిషీటుతో కలిపి దానిపై విచారణ ఆరంభిస్తామని న్యాయమూర్తి స్పష్టంగా రాశారు. కానీ సీబీఐ అందుకు అభ్యంతరం చెబుతూ మెమో వేసింది. న్యాయ ప్రక్రియలోనూ జోక్యం చేసుకుంది. చివరికి ఒకో చార్జిషీటునూ ఒకో కేసుగా పరిగణిస్తున్నట్లు మూడు చార్జిషీట్లపైనా కోర్టు నిర్ణయాన్ని ప్రకటించింది. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే... వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉండగా ‘ఈనాడు’, మరో పత్రిక రాసిన ఆరోపణలే ఆయన మరణానంతరం శంకర్రావు, టీడీపీ నేతలు వేసిన పిటిషన్లలో దర్శనమిచ్చాయి. వాటిలోని అంశాలే సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో పునరావృతమయ్యాయి. ఎఫ్‌ఐఆర్‌లోని అంశాలే ఆ తరవాత రిమాండ్ రిపోర్టుల్లోను, చార్జిషీట్లలోను ప్రత్యక్షమవుతున్నాయి. ఇదీ కథ.

ఇవన్నీ కుట్రలకు నిదర్శనాలు కావా?

వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసులో జరుగుతున్న పరిణామాలు చూస్తే... అవి ముందెన్నడూ ఏ కేసులోనూ జరిగినవి కాదన్న విషయం స్పష్టమవుతుంది. మరి ఎక్కడా, ఎప్పుడూ జరగనివి ఈ కేసులో మాత్రమే ఎందుకు జరుగుతున్నాయి? వీటివెనక కుట్రలు లేవనగలమా?

కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు హైకోర్టుకు లేఖ రాయగా... దాంట్లో తెలుగుదేశం నేతలు ఇంప్లీడ్ అయ్యారు. ఇద్దరూ డాక్యుమెంట్లు ఇచ్చిపుచ్చుకున్నారు. ఒకరి పత్రాలు మరొకరు జిరాక్స్ తీసుకుని మరీ కేసు వేశారు. ఈ రెండు పార్టీలూ కలిసి ఒక వ్యక్తిని టార్గెట్ చేయటమనేది చరిత్రలో ఇప్పటిదాకా లేదు. ఇది కుట్ర కాదా? శంకర్రావు పిటిషన్లో వేసిన అంశాలు అంతకుముందు ఎల్లో మీడియాలో వచ్చినవే కదా? దానికి ‘సాక్షి’ ఎప్పటికిప్పుడు ఆధారాలతో సహా ఇచ్చిన సమాధానాల్ని ఎవ్వరూ పరిగణనలోకి తీసుకోలేదెందుకు?

లేఖ రాసిన శంకర్రావుకు మంత్రి పదవి దక్కింది. ఇది క్విడ్ ప్రో కో కాదా?

హైకోర్టు ప్రాథమిక విచారణకు అనుమతించగా... వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి తరఫు న్యాయవాదులు దాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకెళ్లారు. ‘‘ప్రాథమిక విచారణే కదా? చెయ్యనివ్వండి. నివేదిక మీకు చూపించాకే కోర్టు తదుపరి చర్యలకు ఆదేశాలిస్తుంది’’ అని సుప్రీం చెప్పింది. సీబీఐ ప్రాథమిక విచారణ నివేదికను హైకోర్టుకిచ్చింది. కోర్టు దాన్ని జగన్ న్యాయవాదులకు ఇవ్వకుండానే పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. అదేంటని అడిగితే... ‘‘ఆ నివేదిక చూసి మళ్లీ సీల్ చేసేశాం. అయినా మేం పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశిస్తున్నది దాని ఆధారంగా కాదు’’ అని నాటి చీఫ్ జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టంచేసింది. నివేదిక ఆధారంగా కాకుంటే మరి దేని ఆధారంగా దర్యాప్తునకు ఆదేశించారు? అని జగన్ తరఫు న్యాయవాదులు ప్రశ్నించారు కూడా. దీనిపై సుప్రీంకోర్టుకెళ్లగా... ‘‘దర్యాప్తే కదా! జరగనివ్వండి. మీరు ఏ తప్పూ చేయకుండా భయమెందుకు?’’ అని చెప్పింది సుప్రీం. మరి సీబీఐ చేస్తున్న దర్యాప్తు తప్పు జరిగిందో లేదో తేల్చేలా ఉందా?

దర్యాప్తునకు ఆదేశించిన జస్టిస్ కక్రూ... రిటైరయ్యాక రాష్ట్ర మానవహక్కుల కమిషన్ చైర్మన్‌గా నియమితులయ్యారు. తెలుగు రాని కక్రూను అలా ఎందుకు నియమించాల్సి వచ్చిందో చెప్పాలంటూ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలయింది.

తప్పు జరిగిందో లేదో... శంకర్రావు ఆరోపణలు నిజమో కాదో తేల్చేందుకు సీబీఐ దర్యాప్తు మొదలుపెడితే పర్వాలేదు. కానీ తప్పు జరిగిపోయిందని, దాన్ని రుజువు చేసేందుకు ఆధారాలు సంపాదించాలని సీబీఐ నిర్ణయించేసుకుంది. దర్యాప్తునకు ఆదేశించి 48 గంటలు తిరక్కముందే 30కి పైగా బృందాలతో, పలు ప్రాంతాల్లో ఏక కాలంలో దాడులకు దిగింది. వై.ఎస్.జగన్ సంస్థలపైన, ఇన్వెస్టర్ల ఇళ్లు-ఆఫీసులపైన దాడులకు దిగి భయభ్రాంతుల్ని చేసింది. బోఫోర్స్, 2జీ, కోల్ గేట్ వంటి తీవ్రమైన కుంభకోణాల్లోనూ ఇలా చేయని సీబీఐ ఈ కేసులో ఎందుకింత దారుణంగా చేసింది? రాజకీయ బాసుల్ని సంతృప్తి పరచటానికి కాదా? ఇది కుట్ర కాదా?

వై.ఎస్.జగన్‌ను కనీసం విచారించకుండానే మూడు చార్జిషీట్లు వేసిన సీబీఐ... కోర్టు సమన్లు అందుకుని, మరో 24 గంటల్లో కోర్టు ఎదుట హాజరౌతారనగా ఆయన్నెందుకు అరెస్టు చేయాల్సి వచ్చింది? కోర్టు ఆయనకు బెయిలిస్తే ఆపై అరెస్టు చేసి వేధించటం కుదరదనా? ఎవరు ఆడిస్తున్నారు ఈ డ్రామాను?

అరెస్టు చేసిన నాటి నుంచి జగన్‌మోహన్‌రెడ్డి బెయిలు కోసం చేస్తున్న ప్రయత్నాలు అన్నిటికీ రకరకాల మార్గాల్లో గండి కొడుతున్న సీబీఐ చేయాలనుకుంటున్నదేమిటి? ఈ కేసులో తేల్చాలనుకుంటున్నదేమిటి?

దర్యాప్తు కొనసాగుతోందని చెబుతూనే... అంతా పూర్తయినట్లుగా, అక్రమాలు బయట పడ్డాయంటూ మీడియాకు లీకులిస్తూ వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుటుంబ పరువు ప్రతిష్టల్ని దెబ్బతీసేలా ఓ వర్గానికి చెందిన మీడియాలో కథనాలెందుకు రాయించాల్సి వచ్చింది? టీడీపీ అధినేత చంద్రబాబుకు కొమ్ముకాసే మీడియాతో సీబీఐ ఎందుకు దోస్తీ చేస్తోంది?

బెయిలు పిటిషన్ విచారణకు వచ్చి... బెయిలు వచ్చే అవకాశముందని భావించిన సందర్భాల్లో... ఒకసారి జడ్జిల్ని బెదిరించే స్థాయిలో గాలి జనార్దనరెడ్డి ‘బెయిల్ ఫర్ సేల్’ స్కామ్‌ను బయటపెట్టడం... మరోసారి కేంద్రం తమకిచ్చిన న్యాయవాదిపై అభ్యంతరాల్ని మీడియా ద్వారా లీకు చేయటం వంటివి చేయలేదా? నిన్నటికి నిన్న మరోసారి ఆర్థికమంత్రి చిదంబరాన్ని టీడీపీ కలవటం... బాబు ఫోన్ చేసి జగన్ ఆస్తుల్ని అటాచ్ చేయాలని కోరటం... కొన్ని గంటల్లోనే అటాచ్‌మెంట్ ఉత్తర్వులు రావటం ఇదంతా ఏమనుకోవాలి? శుక్రవారంనాటి బెయిలు తీర్పును ప్రభావితం చేసేలా ఢిల్లీలో టీడీపీ చేసిన ఈ కుయత్నాల్ని ఏమనుకోవాలి? ఇదంతా కుట్ర కాదా? టీడీపీ-కాంగ్రెస్ పాలూనీళ్ల మాదిరిగా కలిసిపోయి పనిచేస్తున్నాయని చెప్పటానికి ఇంకా ఏం కావాలి?

16 కోట్ల లబ్ధికి 29 కోట్ల పెట్టుబడట?

అరబిందో ఫార్మా, హెటెరో డ్రగ్స్‌లకు విశాఖ జిల్లా నక్కపల్లి సెజ్‌లోను, మహబూబ్‌నగర్ జిల్లా జడ్జర్ల సెజ్‌లోను భూములు కేటాయించారని, జడ్జర్ల సెజ్‌లో ఈ రెండిటికీ తలా 75 ఎకరాల చొప్పున 150 ఎకరాలను కేటాయించారని తొలి చార్జిషీట్లో సీబీఐ పేర్కొంది. ధరల్ని నిర్ణయించే కమిటీ ఎకరానికి రూ.15 లక్షలు నిర్ణయించినా, ఎకరా రూ.7 లక్షలకే ఇచ్చారని, దీంతో ప్రభుత్వం రూ.12 కోట్లు నష్టపోయిందని పేర్కొంది. ఇదిగాక అరబిందో ఫార్మా తనకు మెదక్ జిల్లా పాశమైలారంలో ఇచ్చిన 25 ఎకరాల భూమిని తన అనుబంధ కంపెనీ ట్రైడెంట్ లైఫ్ సెన్సైస్‌కు బదలాయించిందని, ఆ సంస్థ నేరుగా ఏపీఐఐసీ నుంచి తీసుకోకుండా అరబిందో నుంచి తీసుకోవటం వల్ల దానికి రూ.4.3 కోట్లు లబ్ధి చేకూరిందని పేర్కొంది. ఇలా రూ.16.2 కోట్ల లబ్ధి చేకూరినందుకు ప్రతిఫలంగా ఈ రెండు సంస్థలూ కలిసి జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో రూ.29.5 కోట్లు పెట్టుబడి పెట్టాయని తెలిపింది.

అసలు రూ.16 కోట్లు లబ్ధి పొందినందుకు 32 కోట్లు పెట్టుబడి పెట్టేవారెవరైనా ఉంటారా? అలా పెట్టారంటే దానర్థం వారు ఆ కంపెనీల్లో లాభాల కోసమే ఇన్వెస్ట్ చేశారని కాదా? జడ్చర్ల సెజ్‌కు చంద్రబాబు హయాంలో భూములు సేకరించినా... మూడేళ్ల పాటు అక్కడ పరిశ్రమ పెట్టడానికి ఎవరూ రాకపోవటాన్ని సీబీఐ ఎందుకు ప్రస్తావించలేదు? అభివృద్ధి చేసిన భూమిని ఎకరా రూ.15 లక్షలకు ఇస్తున్నపుడు... చుట్టూ ప్రహరీ కట్టి, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చేసినవారికి తక్కువకివ్వాల్సిన పనిలేదా? దీన్ని సీబీఐ ఎందుకు గమనించలేదు? ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ ఈ కేసులో ఆస్తుల్ని అటాచ్ చేస్తూ... రూ.21.5 కోట్ల లబ్ధి కలిగినందుకే వారు రూ.29.5 కోట్లు పెట్టుబడి పెట్టారనటం ఎంతవరకు సబబు? ఈ లెక్కల్ని ఎలా అర్థం చేసుకోవాలి?

ఇన్వెస్టర్లు మోసపోయారా...?

జగన్‌మోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి కలిసి జగతి పబ్లికేషన్స్ లాభాలపై తప్పుడు అంచనాలు చెప్పి పలువురి చేత పెట్టుబడులు పెట్టించారనేది రెండో చార్జిషీట్లో సీబీఐ చేసిన ప్రధాన ఆరోపణ. ‘‘2008లో టి.ఆర్.కణ్ణన్‌ను విజయసాయిరెడ్డి కలిశారు. జగతిలో రూ.5 కోట్లు పెట్టుబడి పెట్టాలన్నారు. ఆయన ఓకే చేశారు. దుబాయ్ ఎన్నారై మాధవ్ రామచంద్రతో 2008లో విజయసాయిరెడ్డి మాట్లాడారు. త్వరలో జగతి పబ్లిక్ ఇష్యూకు వెళ్లబోతోందని, భారీ లాభాలొస్తాయని ఆశపెట్టారు. డెలాయిట్ నివేదిక ప్రతిని చూపటంతో ఆయన రూ.19.65 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఇంకా దండమూడి అరుణ్‌కుమార్ కూడా విజయసాయిరెడ్డి మాటలు నమ్మి రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టారు’’ అని సీబీఐ ప్రస్తావించింది. వారికి డివిడెండు రాలేదని, పెట్టుబడిపై వడ్డీ కూడా రాలేదని పేర్కొంది.

అసలు సీబీఐ విచారించాల్సింది క్విడ్ ప్రో కో పెట్టుబడులనా? ఇన్వెస్ట్‌మెంట్లనా? ప్రభుత్వ ప్రాజెక్టులు చేపట్టిన వారైతే క్విడ్ ప్రో కో పెట్టుబడులు పెట్టారని... ఏ ప్రాజెక్టూ చేపట్టని వారైతే మోసపోయారని చెప్పడం ఎంతవరకూ కరెక్టు? ఇలా చేయాలని సీబీఐకి ఎవరు చెప్పారు? కొందరి పెట్టుబడులకు లాభాలు కూడా వచ్చిన నేపథ్యంలో... సీబీఐ అడ్డగోలు వాదన బయటపడటం లేదా? ఇది న్యాయస్థానాల్లో నిలవదని దానికి తెలీదనుకోవాలా?

లాభాల్ని విస్మరించి అడ్డగోలు అంకెలు...

ఈ ఏడాది ఆగస్టులో వాన్‌పిక్ వ్యవహారంపై సీబీఐ దాఖలు చేసిన నాలుగో చార్జిషీటు చూస్తే ఎవరికైనా బుర్ర తిరగటం ఖాయం. ప్రభుత్వం నుంచి వాన్‌పిక్ ప్రాజెక్టును పొందినందుకు జగన్‌కు చెందిన సంస్థల్లో నిమ్మగడ్డ ప్రసాద్ రూ.854.5 కోట్లు ఇన్వెస్ట్ చేశారని, అందులో కొంత వాటాను ఆయన విక్రయించగా... ఇంకా రూ.505 కోట్ల మేర ఆయన ఇన్వెస్ట్‌మెంట్లు మిగిలాయని చార్జిషీట్లో సీబీఐ పేర్కొంది.

నిజానికి ఇదే పెద్ద కుట్ర. ఎందుకంటే ప్రసాద్ జగతి పబ్లికేషన్స్‌లో 2007లో రూ.50 కోట్లు జగతిలో, రూ.280 కోట్లు భారతి సిమెంట్స్‌లో పెట్టుబడి పెట్టారు. అప్పటికి వాన్‌పిక్ అనే ఊసేలేదు. తర్వాత 2008లో జగతి పబ్లికేషన్స్‌లో ఆయన మరో రూ.50 కోట్లు పెట్టుబడులు పెట్టారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణానంతరం 2010 ఏప్రిల్లో భారతి సిమెంట్స్‌లో మెజారిటీ వాటాను ఫ్రాన్స్ కంపెనీ వికా కొనుగోలు చేసింది. ఈ సమయంలో ప్రసాద్ తన వాటాను పూర్తిగా విక్రయించేశారు. ఆయనకు పెట్టుబడి పోను రూ.308 కోట్ల లాభం వచ్చింది. ఈ లాభానికి రూ.42 కోట్లు కలిపి రూ.350 కోట్లను 2010 ఏప్రిల్-మే మధ్య జగతి పబ్లికేషన్స్‌లో ఇన్వెస్ట్ చేశారు. అంటే ఆయన నికరంగా ఇన్వెస్ట్‌చేసింది రూ.142 కోట్లు. కానీ సీబీఐ రూ.854 కోట్లుగా పేర్కొనటమే అసలు కుట్ర. పెపైచ్చు ఈ ఇన్వెస్ట్‌మెంట్లలో అత్యధికం వాన్‌పిక్ ఊసు లేనప్పుడో... వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణించాకో వచ్చినవే. వాటిని క్విడ్ ప్రో కో అంటే ఎలా? అసలు వాన్‌పిక్‌కు కేటాయించింది ప్రైవేటు భూమి. దాన్ని వాన్‌పిక్ సంస్థే సేకరించింది. అలాంటపుడు ప్రభుత్వం నష్టపోయిందెక్కడ? ఎందుకింత అడ్డగోలు వాదనలు?

బాబును వదిలి గ్రీన్‌బెల్ట్ వెంట...

మూడో చార్జిషీట్లో సీబీఐ పేర్కొన్న అంశం విశాఖలో రాంకీ సంస్థ చేపట్టిన ఫార్మా సిటీ. దీన్లో గ్రీన్‌బెల్డ్ ఉండాల్సిన ఏరియాను తగ్గించి, ఆ సంస్థకు ప్రయోజనం కల్పించారని, ప్రతిగా అది జగతి పబ్లికేషన్స్‌లో రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టిందని సీబీఐ పేర్కొంది.

అసలు సీబీఐ చెప్పిన ప్రకారమే... ఈ ఫార్మా సిటీని ఏర్పాటు చేసింది చంద్రబాబు. 2001 సెప్టెంబరు 24న దాన్ని ఏర్పాటు చేస్తూ జీవో ఇచ్చిన బాబు ప్రభుత్వం... చేపట్టేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో దాన్ని ‘బిల్ట్ ఆపరేట్ ఓన్ ట్రాన్స్‌ఫర్ (బూట్)’ బదులు బీఓఓ పద్ధతికి మార్చింది. ఇలా మార్చిన నెల రోజులకే (2003 జూలైన 31న) రాంకీ ఇన్‌ఫ్రా ఈ ప్రాజెక్టును చేపట్టడానికి ఆసక్తి చూపిస్తూ ప్రతిపాదన ఇచ్చింది. దానికి ప్రాజెక్టు ఖరారైపోయింది. 2,143 ఎకరాల భూమిని దానికి అప్పగించడం కూడా జరిగిపోయింది. 2004 మార్చి 11న రాంకీ ఫార్మా సిటీ సంస్థ ఏర్పాటు కాగా... మర్నాడే కన్సెషన్ ఒప్పందం కుదుర్చుకున్నారు.

పాజెక్టులో 352 ఎకరాల మేర గ్రీన్ జోన్ ఉండాలని, దీన్లో గ్రీన్‌బెల్ట్ 58 ఎకరాలుండాలని ఒప్పందంలో పేర్కొన్నారు. ఆ లే ఔట్‌ను విశాఖ నగరాభివృద్ధి సంస్థ ఆమోదించింది. ఇదంతా జరిగింది బాబు హయాంలో కాగా... వైఎస్ హయాంలో గ్రీన్‌బెల్ట్‌ను పెంచాలని భావించి, మళ్లీ వినతులు రావటంతో మునుపటి 58 ఎకరాలకే పరిమితమయ్యారు. ఇలా చేసినందుకే రాంకీ సంస్థ జగతిలో రూ.10 కోట్ల పెట్టుబడి పెట్టిందన్నది సీబీఐ అభియోగం. అసలు రాంకీకి ఫార్మాసిటీ కట్టబెట్టిందెవరు? 2,143 ఎకరాల్ని అప్పగించిందెవరు? దానితో కన్సెషన్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నదెవరు? దాని ప్రకారం గ్రీన్‌బెల్ట్ ఉండాల్సిందెంత? ఇప్పుడున్నదెంత? మధ్యలో వైఎస్సార్ ప్రభుత్వం చేసిందేంటి? అనేవన్నీ సీబీఐ గాలికొదిలేసింది. సింగిల్ టెండరుతో వచ్చిన రాంకీకి బాబు భూమి కట్టబెట్టడాన్నీ ప్రశ్నించలేదు. దీన్నేమనాలి?

అంతిమ విజయం మనదే!:అంబటి

హైదరాబాద్, న్యూస్‌లైన్: జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ తిరస్కారానికి గురైందని అధైర్యపడవద్దు.. జగన్‌పై కాంగ్రెస్, టీడీపీ, సీబీఐ, ఈడీ చేస్తున్న కుట్రలు భగ్నం కాక తప్పదు.. ఇలాంటి కక్షపూరిత రాజకీయాలను ఎదుర్కొని ధైర్య సాహసాలతో ముందుకు కదిలే వారసత్వం మనకుంది.. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి మనకు అదే నేర్పారు.. ప్రజా న్యాయస్థానంలో మనకు పూర్తి బలం ఉందనే విషయం గుర్తించి పార్టీ శ్రేణులు కదం తొక్కాలని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కేంద్ర కార్య నిర్వాహక మండలి సభ్యుడు అంబటి రాంబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 

అంతిమవిజయం తమదేనని ఆయన ధీమా వ్యక్తంచేశారు. సుప్రీంకోర్టు శుక్రవారం జగన్‌కు బెయిలు నిరాకరించిన కొద్దిసేపటికి అంబటి పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్‌ను జైల్లోనే ఉంచి రాజకీయ లబ్ధి పొందాలనుకునే వారి ఆటలు ఏ మాత్రం సాగనివ్వకుండా పార్టీ కార్యకర్తలు, అభిమానులు కృషి చేయాలన్నారు. సుప్రీంకోర్టు బెయిలిస్తుందని.. 132 రోజుల తరువాత జగన్ మళ్లీ జనంలోకి వస్తారని.. తామంతా ఎంతో ఆశగా ఎదురు చూశామని చెప్పారు. అయితే సుప్రీంకోర్టు బెయిల్‌ను తిరస్కరించడం తమకు తీవ్ర నిరుత్సాహాన్ని కలిగించిందన్నారు. జగన్ జైల్లో ఉంటే వైఎస్సార్ సీపీ మనుగడ ఉండదని కొందరు కలలు కంటున్నారని, విజయమ్మ నాయకత్వంలో దేదీప్యమానంగా పార్టీ ముందుకు నడుస్తుందని అంబటి చెప్పారు. 

పార్టీకి ఇబ్బంది లేదు: బెయిల్ తిరస్కరణపై మళ్లీ తాము సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసే విషయం పరిశీలిస్తున్నామని అంబటి తెలిపారు. తుదికంటా న్యాయపోరాటం చేస్తామని... అంతిమ విజయం తమదేనని విశ్వాసం వ్యక్తం చేశారు. జగన్ బెయిల్ సుప్రీంకోర్టులో విచారణకు వస్తుందనుకున్నపుడల్లా కాంగ్రెస్, టీడీపీ, సీబీఐ, ఈడీ ఏదో ఒక గందరగోళం సృష్టించడం పరిపాటి అయిందని ఆయన విమర్శించారు. బెయిల్ పిటిషన్ విచారణకు రావడానికి ఒక్క రోజు ముందు ఈడీ అటాచ్‌మెంట్ నోటీసులు ఇవ్వడం వల్ల కోర్టు ప్రభావితమై ఉండొచ్చని తాము భావిస్తున్నామని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గత నెల 28వ తేదీన బెయిల్ విచారణ ఉందన్నపుడు కూడా సీబీఐ న్యాయవాదులను మార్చి సమయాన్ని దాట వేశారని గుర్తుచేశారు. జగన్ జైల్లో ఉండటం వల్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం ఇబ్బంది లేదనే విషయం కార్యకర్తలు, అభిమానులు గ్రహించాలన్నారు. అయితే మహాతల్లి విజయమ్మకు, జగన్ భార్యా పిల్లలు, సోదరికి కుటుంబసభ్యులకు మానసిక ఇబ్బంది ఉంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 

బాబు పాకుడు యాత్ర చేసినా ప్రతిష్ట పెరగదు

జగన్ జైలులో ఉన్నప్పుడు తాను పాదయాత్ర చేస్తే రాజకీయ బలం పెరుగుతుందని చంద్రబాబు ఆశిస్తే అది అడియాసే అవుతుందని అంబటి ఎద్దేవా చేశారు. పాదయాత్ర కాదు కదా, పాకుడు యాత్ర చేసినా ఆయన ప్రతిష్ట, బలం పెరగదని తేల్చి చెప్పారు.
దోషిగా నిర్ధారణ అయ్యేవరకూ అన్ని హక్కులూ ఉంటాయి

హైదరాబాద్, న్యూస్‌లైన్: కేసుల్లో నేరారోపణలు ఎదుర్కొంటున్న ముద్దాయిలను నేరస్తులుగా భావించడం తగదని, దోషిగా నిర్ధారణ అయ్యేవరకూ రాజ్యాంగపరంగా సంక్రమించిన అన్ని హక్కులూ వారికి వర్తిస్తాయని సాక్షి టీవీ నిర్వహించిన ‘లా పాయింట్’ చర్చావేదికలో న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. పలుకుబడి కలిగిన వ్యక్తి అయినందున సాక్షులను ప్రభావితం చేస్తారనే భావనతో బెయిల్ ఇవ్వకపోవడం సరికాదని, సాక్షులను ప్రభావితం చేసినప్పుడు మాత్రమే వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని వివరించారు. హైకోర్టు సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్, న్యాయవాదులు పి.వీరారెడ్డి, ఎ.చంద్రశేఖర్, జీఎల్ నరసింహారావు ఈ చర్చావేదికలో పాల్గొన్నారు. న్యాయవాదుల అభిప్రాయాలు వారి మాటల్లోనే...

చట్టప్రకారం బెయిల్ అనివార్యం: రవిచందర్

‘‘చట్టప్రకారం 99 శాతం కేసుల్లో బెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది. సాక్షులను ప్రభావితం చేస్తారని, దేశం వదిలిపారిపోతారనే కారణాలతో మాత్రమే బెయిల్ నిరాకరించే అవకాశం ఉంది. బెయిల్ ఇవ్వకుండా ఉండాలంటే కోర్టు సహేతుకమైన కారణాలను చూపాల్సి ఉంటుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులైనందున సాక్షులను ప్రభావితం చేస్తారని భావించడం సరికాదని నా అభిప్రాయం. ఒక వేళ సాక్షులను ప్రభావితం చేస్తే దర్యాప్తు సంస్థ వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. న్యాయమూర్తులను ఎవరూ ప్రభావితం చేయలేరని భావించినప్పుడు ప్రజాస్వామ్యంలో వేరే సంస్థలను కూడా మనం గౌరవించాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది మార్చి నెల వర కూ దర్యాప్తు జరుగుతున్నందున అప్పటివరకూ బెయిల్‌కు దరఖాస్తు చేయవద్దని సుప్రీంకోర్టు అనడం మాత్రం చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం. సుప్రీంకోర్టు చాలా నిశితంగా పరిశీలించి తన అధికారాన్ని వాడుకోవాలని నా వ్యక్తిగత అభిప్రాయం. క్రిమినల్, సివిల్ కేసుల్లో ఏళ్ల తరబడి కేసులు కొనసాగుతున్నందున బెయిల్ ఇవ్వకుండా జైల్లోనే ఉంచాలనుకోవడం సమీక్షించాల్సిన అంశంగా నేను భావిస్తున్నాను. దోషిగా నిర్ధారణ అయ్యే వరకూ నిందితులందరికీ రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులు వర్తిస్తాయి. ‘ఇప్పుడు అధికారంలో ఉన్నాం.. లేదా ప్రతిపక్షంలో ఉన్నాం.. ఇదే పరిస్థితి రేపు మనకూ రావచ్చు..’ అనే ఆలోచన ఏ రాజకీయ పార్టీకీ ఉండకపోవడం బాధాకరం. 

బెయిల్ ఇవ్వకుండానే అనుబంధ చార్జిషీట్లు: నరసింహారావు

‘‘ పెట్టుబడుల వ్యవహారంలో ఒక చార్జిషీటు తరువాత మరో చార్జిషీటు వేయడం ద్వారా జగన్‌కు బెయిల్ రాకుండా అడ్డుకోవాలని సీబీఐ చూస్తోంది. చట్టప్రకారం 90 రోజుల్లోగా చార్జిషీటు దాఖలుచేయాలి. ఒక వేళ చార్జిషీటు దాఖలు చేయకుంటే బెయిల్ పొందే అవకాశం ఉంది. చార్జిషీటు వేయడం పూర్తయిందంటే దర్యాప్తు కూడా పూర్తయినట్లే కాబట్టి బెయిల్ ఇవ్వవచ్చు. కానీ, ఒకటి తరువాత మరొక అనుబంధ చార్జిషీట్టు వేస్తున్నారు. ఇలా అనుబంధ ఛార్జిషీట్లు వేయడం తప్పేనని నా అభిప్రాయం’’. 

మానవ హక్కులకు భంగం: చంద్రశేఖర్

‘‘పోలీసులు, దర్యాప్తు సంస్థలూ మానవ హక్కులకు భంగం కలిగిస్తున్న సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. హెబియస్ కార్పస్ దాఖలు చేస్తే గతంలో టెలిగ్రాఫిక్ ఆదేశాలిచ్చేవారు. ఇప్పుడు మిగతా కేసుల్లోలాగానే మూడు నాలుగు రోజులు వాద ప్రతివాదనలు వింటున్నారు. దీంతో నిందితులను తాపీగా కోర్టులో హాజరుపరుస్తున్నారు. ఇది సాధారణంగా మారుతోంది. సహేతుక కార ణం చూపకుండా ఏ వ్యక్తినీ జైల్లో ఉంచరాదని సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసింది.’’

కోర్టు అన్ని అంశాలనూ పరిశీలిస్తుంది: వీరారెడ్డి

చార్జిషీటు వేయడానికి ముందు, చార్జిషీటు వేసిన తరువాతా.. బెయిల్ ఇవ్వాలా? వద్దా? అన్న అంశంపై న్యాయస్థానం న్యాయ ప్రక్రియలో భాగంగా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. కొన్ని కేసుల్లో మాత్రం దర్యాప్తు పూర్తయ్యేవరకూ బెయిల్ ఇవ్వకపోవచ్చు. అయితే సాక్షులను ప్రభావితం చేస్తారని కానీ, తీవ్రమైన నేరం అయినప్పుడుకానీ మాత్రమే కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తుంది.’’

సాక్షి ‘లా పాయింట్’లో న్యాయ నిపుణులు

దోషిగా నిర్ధారణ అయ్యేవరకూ అన్ని హక్కులూ ఉంటాయి

హైదరాబాద్, న్యూస్‌లైన్: కేసుల్లో నేరారోపణలు ఎదుర్కొంటున్న ముద్దాయిలను నేరస్తులుగా భావించడం తగదని, దోషిగా నిర్ధారణ అయ్యేవరకూ రాజ్యాంగపరంగా సంక్రమించిన అన్ని హక్కులూ వారికి వర్తిస్తాయని సాక్షి టీవీ నిర్వహించిన ‘లా పాయింట్’ చర్చావేదికలో న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. పలుకుబడి కలిగిన వ్యక్తి అయినందున సాక్షులను ప్రభావితం చేస్తారనే భావనతో బెయిల్ ఇవ్వకపోవడం సరికాదని, సాక్షులను ప్రభావితం చేసినప్పుడు మాత్రమే వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని వివరించారు. హైకోర్టు సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్, న్యాయవాదులు పి.వీరారెడ్డి, ఎ.చంద్రశేఖర్, జీఎల్ నరసింహారావు ఈ చర్చావేదికలో పాల్గొన్నారు. న్యాయవాదుల అభిప్రాయాలు వారి మాటల్లోనే...

చట్టప్రకారం బెయిల్ అనివార్యం: రవిచందర్

‘‘చట్టప్రకారం 99 శాతం కేసుల్లో బెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది. సాక్షులను ప్రభావితం చేస్తారని, దేశం వదిలిపారిపోతారనే కారణాలతో మాత్రమే బెయిల్ నిరాకరించే అవకాశం ఉంది. బెయిల్ ఇవ్వకుండా ఉండాలంటే కోర్టు సహేతుకమైన కారణాలను చూపాల్సి ఉంటుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులైనందున సాక్షులను ప్రభావితం చేస్తారని భావించడం సరికాదని నా అభిప్రాయం. ఒక వేళ సాక్షులను ప్రభావితం చేస్తే దర్యాప్తు సంస్థ వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. న్యాయమూర్తులను ఎవరూ ప్రభావితం చేయలేరని భావించినప్పుడు ప్రజాస్వామ్యంలో వేరే సంస్థలను కూడా మనం గౌరవించాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది మార్చి నెల వర కూ దర్యాప్తు జరుగుతున్నందున అప్పటివరకూ బెయిల్‌కు దరఖాస్తు చేయవద్దని సుప్రీంకోర్టు అనడం మాత్రం చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం. సుప్రీంకోర్టు చాలా నిశితంగా పరిశీలించి తన అధికారాన్ని వాడుకోవాలని నా వ్యక్తిగత అభిప్రాయం. క్రిమినల్, సివిల్ కేసుల్లో ఏళ్ల తరబడి కేసులు కొనసాగుతున్నందున బెయిల్ ఇవ్వకుండా జైల్లోనే ఉంచాలనుకోవడం సమీక్షించాల్సిన అంశంగా నేను భావిస్తున్నాను. దోషిగా నిర్ధారణ అయ్యే వరకూ నిందితులందరికీ రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులు వర్తిస్తాయి. ‘ఇప్పుడు అధికారంలో ఉన్నాం.. లేదా ప్రతిపక్షంలో ఉన్నాం.. ఇదే పరిస్థితి రేపు మనకూ రావచ్చు..’ అనే ఆలోచన ఏ రాజకీయ పార్టీకీ ఉండకపోవడం బాధాకరం. 

బెయిల్ ఇవ్వకుండానే అనుబంధ చార్జిషీట్లు: నరసింహారావు

‘‘ పెట్టుబడుల వ్యవహారంలో ఒక చార్జిషీటు తరువాత మరో చార్జిషీటు వేయడం ద్వారా జగన్‌కు బెయిల్ రాకుండా అడ్డుకోవాలని సీబీఐ చూస్తోంది. చట్టప్రకారం 90 రోజుల్లోగా చార్జిషీటు దాఖలుచేయాలి. ఒక వేళ చార్జిషీటు దాఖలు చేయకుంటే బెయిల్ పొందే అవకాశం ఉంది. చార్జిషీటు వేయడం పూర్తయిందంటే దర్యాప్తు కూడా పూర్తయినట్లే కాబట్టి బెయిల్ ఇవ్వవచ్చు. కానీ, ఒకటి తరువాత మరొక అనుబంధ చార్జిషీట్టు వేస్తున్నారు. ఇలా అనుబంధ ఛార్జిషీట్లు వేయడం తప్పేనని నా అభిప్రాయం’’. 

మానవ హక్కులకు భంగం: చంద్రశేఖర్

‘‘పోలీసులు, దర్యాప్తు సంస్థలూ మానవ హక్కులకు భంగం కలిగిస్తున్న సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. హెబియస్ కార్పస్ దాఖలు చేస్తే గతంలో టెలిగ్రాఫిక్ ఆదేశాలిచ్చేవారు. ఇప్పుడు మిగతా కేసుల్లోలాగానే మూడు నాలుగు రోజులు వాద ప్రతివాదనలు వింటున్నారు. దీంతో నిందితులను తాపీగా కోర్టులో హాజరుపరుస్తున్నారు. ఇది సాధారణంగా మారుతోంది. సహేతుక కార ణం చూపకుండా ఏ వ్యక్తినీ జైల్లో ఉంచరాదని సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసింది.’’

కోర్టు అన్ని అంశాలనూ పరిశీలిస్తుంది: వీరారెడ్డి

చార్జిషీటు వేయడానికి ముందు, చార్జిషీటు వేసిన తరువాతా.. బెయిల్ ఇవ్వాలా? వద్దా? అన్న అంశంపై న్యాయస్థానం న్యాయ ప్రక్రియలో భాగంగా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. కొన్ని కేసుల్లో మాత్రం దర్యాప్తు పూర్తయ్యేవరకూ బెయిల్ ఇవ్వకపోవచ్చు. అయితే సాక్షులను ప్రభావితం చేస్తారని కానీ, తీవ్రమైన నేరం అయినప్పుడుకానీ మాత్రమే కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తుంది.’’

పైసా లేకుండా రూ.300 కోట్లు

రాబర్ట్ వాద్రాపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు 
సోనియాగాంధీ అల్లుడికి రియల్ దిగ్గజం 
డీఎల్‌ఎఫ్ నుంచి భారీగా ముడుపులు
కారుచౌకగా ఆస్తులిచ్చి, వాటిని కొనటానికీ రుణం 
ఎలాంటి పూచీకత్తు,వడ్డీ లేకుండా వాద్రాకు రూ. 65 కోట్ల 
డీఎల్‌ఎఫ్ రుణం వాద్రా సంస్థలకు రూ. 300 కోట్ల ఆస్తుల సంతర్పణ 
రూ. 35 కోట్ల విలువైన 7 ఫ్లాట్లు వాద్రాకు రూ. 5 కోట్లకే విక్రయం 
రూ. 25 కోట్ల విలువ చేసే పెంట్‌హౌస్ రూ. 89 లక్షలకే.. 
డీఎల్‌ఎఫ్ హిల్టన్ గార్డెన్ ఇన్‌లో 50 శాతం వాటా, 
విలువ రూ. 150 కోట్లకు పైనే..నాలుగేళ్లలో రూ. 50 లక్షల నుంచి రూ. 300 కోట్లకు 
పెరిగిన రాబర్ట్ వాద్రా ఆస్తులు 
ప్రతిఫలంగా డీఎల్‌ఎఫ్‌కు ఢిల్లీ, హర్యానాల్లో వందల ఎకరాల భూకేటాయింపులు
అక్రమ లావాదేవీలపై స్వతంత్రంగా నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలని కేజ్రీవాల్ డిమాండ్

న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు, ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా.. రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో భారీ అవినీతికి పాల్పడ్డారని, పైసా పెట్టుబడి లేకుండా వందల కోట్ల రూపాయాల విలువైన ఆస్తులు సమకూర్చుకున్నారని.. అవినీతి వ్యతిరేక ఉద్యమ (ఐఏసీ) కార్యకర్త అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్‌ఎఫ్ నుంచి వాద్రా ముడుపులు అందుకున్నట్లు తమ వద్ద ఆధారాలున్నాయని చెప్పారు. డీఎల్‌ఎఫ్ ఎంతో విలువైన ఆస్తులను వాద్రాకు కారుచౌకగా నామ మాత్రపు ధరలకే విక్రయించిందని, అంతేకాకుండా వాటిని కొనుగోలు చేయటానికి వాద్రాకు వడ్డీ లేకుండా, సెక్యూరిటీ లేకుండా కోట్ల రూపాయల రుణం కూడా ఇచ్చిందని వెల్లడించారు. 

భూ కేటాయింపుల కారణంగా వాద్రా ఆస్తులు రూ. 50 లక్షల నుంచి ఏకంగా రూ. 300 కోట్లకు పెరిగాయని తెలిపారు. కేజ్రీవాల్ తన సహచరుడు ప్రశాంత్‌భూషణ్, సీనియర్ న్యాయవాది శాంతిభూషణ్‌లతో కలిసి శుక్రవారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా రాబర్ట్‌వాద్రా గ్రూపు సంస్థలకు చెందిన ఆస్తుల వివరాలు కొన్నింటిని బహిర్గతం చేశారు. తన ఆరోపణలకు సాక్ష్యాలుగా కొన్ని అధికారిక పత్రాల నకళ్లను మీడియాకు అందజేశారు. 

రూ. 50 లక్షలతో 300 కోట్ల ఆస్తులు! 

‘‘రాబార్ట్ వాద్రా, ఆయన తల్లి మౌరీన్‌వాద్రాలు కలిసి 2007 నవంబర్ 1, ఆ తర్వాత ఐదు కంపెనీలను ఏర్పాటు చేశారు. ఆ కంపెనీల ఆడిట్ నివేదిక ఆధారంగా వీరి భాగస్వామ్య పెట్టుబడి రూ. 50 లక్షలు మాత్రమే. ఈ కంపెనీలకు డీఎల్‌ఎఫ్ నుంచి అందిన వడ్డీలేని రుణంపై లభించే వడ్డీ తప్పితే.. ఇతరత్రా ఎలాంటి వ్యాపార లావాదేవీలు కానీ, ఆదాయాలు కానీ లేవు. అయినప్పటికీ రాబర్ట్‌వాద్రా గత నాలుగేళ్లలో భారీగా ఆస్తులు కొనుగోలు చేశారు. 2007 - 2010 మధ్య కాలంలో ఈ ఐదు కంపెనీల పేరుతో ఢిల్లీలోనూ పరిసర ప్రాంతాల్లోనూ 31 ఆస్తులు కొన్నారు. వాటిని కొనుగోలు చేసే సమయంలోనే వాటి మార్కెట్ విలువ రూ. 300 కోట్లుగా ఉంది. ప్రస్తుత మార్కెట్ ప్రకారం వీటి విలువ రూ. 500 కోట్లు ఉంటుంది’’ అని కేజ్రీవాల్ వివరించారు. అయితే.. వాద్రా సంస్థల బ్యాలన్స్ షీట్లలో వీటి విలువను రూ. 69.64 కోట్లుగా చూపినట్లు చెప్పారు. అదేవిధంగా సాకేత్‌లోని డీఎల్‌ఎఫ్ హిల్టన్ గార్డెన్ ఇన్‌లో 50 శాతం షేర్ కింద రూ. 32 కోట్లు చూపించారని, అయితే ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ. 150 కోట్లు పైనే ఉంటుందని చెప్పారు. 

వడ్డీ లేని రుణం.. కారుచౌకగా ఫ్లాట్లు

ఈ ఆస్తులను కొనటానికి కూడా రాబర్ట్ వాద్రాకు డీఎల్‌ఎఫ్ ఐదేళ్ల కిందట రూ. 65 కోట్లకు పైగా రుణాన్ని వడ్డీ, సెక్యూరిటీ లేకుండా ఇచ్చిందని కేజ్రీవాల్ తెలిపారు. తమ హౌసింగ్ ప్రాజెక్టుల్లో కోట్ల రూపాయలు విలువ చేసే ఫ్లాట్లను రాబర్ట్ వాద్రాకు నామ మాత్రపు ధరకే విక్రయించిందని వివరించారు. ఉదాహరణకు.. ఢిల్లీ సమీపంలోని గుర్గాంలో డీఎల్‌ఎఫ్‌కు చెందిన మైగ్రోలియా అనే హౌసింగ్ ప్రాజెక్టులో 7 అపార్ట్‌మెంట్లను కారుచౌక ధరలకే వాద్రా కొనుగోలు చేశారని చెప్పారు. ‘‘ఈ 7 ఫ్లాట్లను కేవలం రూ. 5.2 కోట్లకు కొనుగోలు చేసినట్టు వాద్రా కంపెనీలు లెక్కలు చూపాయి. 

కొనుగోలు చేసిన సమయంలో ఒక్కో ఫ్లాట్ విలువ రూ. 5 కోట్లుగా ఉంది. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఒక్కో ప్లాట్ విలువ రూ. 10 నుంచి రూ. 15 కోట్ల వరకు ఉంది’’ అని తెలిపారు. ‘‘రూ. 35 కోట్ల విలువ చేసే ఫ్లాట్లను రూ. 5 కోట్లకే ఇచ్చారంటే.. అందులో తప్పకుండా ఏదో మతలబు ఉందనే అనుకోవాలి’’ అని వ్యాఖ్యానించారు. ‘‘గుర్గాంలోని ఒక డీఎల్‌ఎఫ్ భవనంలో నాలుగు పెంట్‌హౌస్‌లు ఉన్నాయి. వీటిని వాద్రా ఐదు సంస్థలతో కొనుగోలు చేశారు. పది వేల చదరపు గజాల పెంట్‌హౌస్‌ను 2009లో రూ. 89 లక్షలకు విక్రయించారు. అప్పుడు దాని మార్కెట్ విలువ రూ. 25 కోట్లుగా ఉంటే.. ప్రస్తుత విలువ రూ. 40 కోట్లు’’ అని ప్రశాంత్‌భూషణ్ పేర్కొన్నారు. ‘‘ఇంత సొమ్మును డీఎల్‌ఎఫ్ ఎలాంటి ప్రయోజనం లేకుండా వాద్రాకు ఎందుకిచ్చింది?’’ అని ప్రశ్నించారు. 

క్విడ్ ప్రో కోలో భాగమేనా..? 

‘‘వందల కోట్ల రూపాయలైన ఈ భారీ ఆస్తుల కొనుగోలుకు వాద్రాకు సొమ్మును డీఎల్‌ఎఫ్ ఇవ్వటం క్విడ్ ప్రో కోలో భాగమేనా?’’ అని అరవింద్ కేజ్రీవాల్, ప్రశాంత్‌భూషణ్ ప్రశ్నించారు. డీఎల్‌ఎఫ్ చేకూర్చిన మేళ్లకు ప్రతిగా.. తాను అధికారంలో ఉన్న హర్యానా వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఆ సంస్థకు పెద్ద మొత్తంలో ప్రభుత్వ భూములను, అందునా ప్రజా ప్రయోజనాల ప్రాజెక్టుల కోసం కేటాయించిన భూములను ధారాదత్తం చేసిందని వారు ఆరోపించారు. మైగ్రోలియా హౌసింగ్ ప్రాజెక్టులో రాబర్ట్‌వాద్రాకు 7 ఫ్లాట్లను కారుచౌకగా ఇచ్చినందుకు ప్రతిఫలంగా హర్యానా ప్రభుత్వం డీఎల్‌ఎఫ్‌కు 350 ఎకరాల భూమిని అప్పగించిందని వారు పేర్కొన్నారు. డీఎల్‌ఎఫ్ సంస్థకు ఢిల్లీ ప్రభుత్వం, హర్యానా ప్రభుత్వాల ద్వారా వాద్రా లబ్ధి చేకూరుస్తున్నారని ఆరోపించారు. 

ఆ లావాదేవీలన్నీ ముడుపుల వ్యవహారమే 

‘‘వాద్రాకు డీఎల్‌ఎఫ్ రూ. 65 కోట్ల రుణాన్ని వడ్డీ లేకుండా ఎందుకు ఇచ్చింది? డీఎల్‌ఎఫ్ ఆస్తులను వాద్రాకు కారుచౌకగా ఎందుకు అమ్మింది? వాద్రా రూ. 65 కోట్ల ఆస్తులను రూ. 5 కోట్లకే కొన్నారు. ... డీఎల్‌ఎఫ్‌కు ఎలా లాభం వచ్చింది? డీఎల్‌ఎఫ్‌కు కాంగ్రెస్ చేకూర్చిన ప్రయోజనమేమిటి?’’ అని ప్రశాంత్‌భూషణ్ ప్రశ్నల వర్షం కురిపించారు. డీఎల్‌ఎఫ్ నుంచి ఆస్తులు కొనుగోలు చేయటానికి వాద్రా ఆ సంస్థ నుంచే అప్పు ఎలా తీసుకుంటారన్నారు. ‘‘రాబర్ట్‌వాద్రా వందల కోట్ల రూపాయల ఆస్తులు కొనుగోలు చేసుకోవటానికి డీఎల్‌ఎఫ్ డబ్బును సమకూర్చి కాంగ్రెస్ ప్రభుత్వ రుణం తీర్చుకుందా..?’’ అని వ్యాఖ్యానించారు. 

‘‘డీఎల్‌ఎఫ్ ప్రాజెక్ట్‌లో వాద్రా ఏడు ఫ్లాట్లు పొందారు. ... వాద్రాకు రూ. 300 కోట్లు ఇవ్వటం కోసమే ఈ లావాదేవీలన్నీ జరిగాయి’’ అని ఆరోపించారు. ‘‘గత ఐదేళ్లలో రిజిస్టర్ చేసిన 12 సంస్థల వివరాలు మా దగ్గర ఉన్నాయి. వీటిలో ఆరు సంస్థలను ఒక్క 2012లోనే రిజిస్టర్ చేశారు. ఈ సంస్థలకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి?’’ అని ప్రశాంత్ ప్రశ్నించారు. ‘‘కాంగ్రెస్ అక్రమ నిధులను ఈ ఆస్తుల కొనుగోళ్ల కోసం బదలాయిస్తున్నారా?’’ అని వ్యాఖ్యానించారు. ఆరు సంస్థల్లోనూ ఏళ్ల తరబడి ఎలాంటి కార్యకలాపాలు సాగటం లేదని కేజ్రీవాల్ చెప్పారు. డీఎల్‌ఎఫ్ ఆస్తులను దక్కించుకోవటానికి రాబర్ట్‌వాద్రా వినియోగించిన నల్లధనంపై కాంగ్రెస్ సమాధానం చెప్పాలన్నారు. 

ప్రశ్నించే ధైర్యం ఏ సంస్థకూ లేదు

ఈ విషయాలు ఇప్పటికే ఆదాయపన్నుశాఖకు తెలిసి ఉండాల్సిందని, అది దీనిపై ఇప్పటికే దర్యాప్తు జరుపుతూ ఉండాల్సిందని ప్రశాంత్‌భూషణ్ పేర్కొన్నారు. దేశం ఏ విధంగా పనిచేస్తోందో చూస్తే ఇలాంటి శక్తిమంతమైన వ్యక్తి నిజాయతీని ప్రశ్నించే ధైర్యం ఏ సంస్థకూ ఉండదన్న విషయం స్పష్టమేనన్నారు. వాద్రాపై అవినీతి వ్యతిరేక చట్టం, ఆదాయ పన్ను చట్టం నిబంధనల అతిక్రమణ కింద కేసు నమోదు చేసి, త్వరగా దర్యాప్తు చేయాలన్నారు. ‘‘మా సమాచారం మొత్తాన్నీ మేం ఆర్‌ఓసీ (రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్) ద్వారా పొందాం. ఇంకా చాలా ఆస్తులపై దర్యాప్తు చేయాల్సి ఉంచి’’ అని చెప్పారు. ‘‘వాద్రా వద్ద లెక్క తేలని అనేక ఆస్తులు ఉన్నాయి. వాటి రికార్డులు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. వాటిపై విచారణ జరగదు. దోపిడీ జరుగుతూనే ఉంటుంది. ప్రజలు గళం విప్పాలి’’ అని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. 

నిష్పాక్షిక దర్యాప్తు సాధ్యం కాదు 

ఈ ఆస్తుల అవినీతి లావాదేవీల్లో వాద్రాకు కలిగిన ప్రయోజనాలపై అవినీతి నిరోధక చట్టం కింద స్వతంత్ర దర్యాప్తు చేయించాలని కేజ్రీవాల్, ప్రశాంత్‌భూషణ్‌లు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడైన రాబర్ట్ వాద్రా హోదాను బట్టి ఆయనపై నిష్పాక్షికమైన దర్యాప్తు సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారంలో దర్యాప్తు జరగదని తమకు ముందే తెలుసన్నారు. శాంతిభూషణ్ మాట్లాడుతూ ‘‘దేశంలో 2జీ స్కాం, కామన్వెల్త్ క్రీడల స్కాం, కోల్‌గేట్ స్కాంలు జరిగాయి. ఇప్పుడు దీనికి రాబర్ట్‌వాద్రా స్కాంగా పెరుపెట్టాలి’’ అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వమేమో కుంభకోణాల నుంచి ప్రజల దృష్టిని మరల్చటానికి ప్రయత్నిస్తోంది’’ అని వ్యాఖ్యానించారు. సోనియా అల్లుడైనంత మాత్రాన ఏదైనా చేస్తారా అని ఆగ్రహం వెలిబుచ్చారు. 

10న మరో నాయకుడి గుట్టు రట్టు

ఇటీవలే రాజకీయ పార్టీని స్థాపించిన కేజ్రీవాల్.. శక్తిమంతమైన ఇద్దరు రాజకీయ నేతల అవినీతిని శనివారం బట్టబయలు చేస్తామని ఈ నెల 2నే ప్రకటించారు. అయితే.. తమ ప్రణాళికను మార్చుకున్న ఆయన శుక్రవారమే విలేకరుల సమావేశం నిర్వహించి వాద్రాపై అవినీతి ఆరోపణలు గుప్పించారు. ముంబైకి చెందిన మరో రాజకీయ ప్రముఖుడికి సంబంధించి ఈ నెల 10న కేజ్రీవాల్ బృందం అవినీతి ఆరోపణలు చేస్తుందని ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తోంది. కేజ్రీవాల్, ప్రశాంత్‌భూషణ్‌లు ఇటీవల ప్రధాని సహా 15 మంది కేంద్ర మంత్రులపై అవినీతి ఆరోపణలు చేస్తూ పలు పత్రాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నెలకొల్పాలని వారు డిమాండ్ చేశారు. 

నోట్: పై ఆస్తులన్నీ స్కై లైట్ హాస్పిటాలిటీ ప్రయివేట్ లిమిటెడ్, స్కై లైట్ రియాలిటీ ప్రయివేట్ లిమిటెడ్, రియల్ ఎర్త్ ఎస్టేట్స్ ప్రయివేట్ లిమిటెడ్, నార్త్ ఇండియా ఐటీ పార్క్స్ ప్రయివేట్ లిమిటెడ్, బ్లూ బ్రీజ్ ట్రేడింగ్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థల పేర్ల మీద ఉన్నాయి.

ఈడీ కంటే ముందే ఎల్లో మీడియాకు లీక్ చేసిన టీడీపీ

ఆ మీడియాకు స్వయంగా అందజేసిన టీడీపీపీ నేత నామా
కాంగ్రెస్‌తో కుమ్మక్కులో భాగంగానే చిదంబరంతో భేటీ
నోట్ బాగోతంలో తనవంతు పాత్ర పోషించిన సీబీఐ
జగన్ బెయిల్ పిటిషన్ విచారణకు ముందే విడుదలయ్యేలా పావులు

న్యూఢిల్లీ, సాక్షి ప్రతినిధి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని వీలైనంత ఎక్కువ కాలం ప్రజలకు దూరంగా ఉంచేందుకు కాంగ్రెస్ ఆడుతున్న దుష్ట రాజకీయ క్రీడ బట్టబయలైంది. ఇందుకోసం ఎప్పట్లాగే దర్యాప్తు సంస్థ సీబీఐని పావుగా వాడుకోవడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే తనతో నిస్సిగ్గుగా అంటకాగుతున్న విపక్ష టీడీపీని కూడా ఢిల్లీ స్థాయిలో ఈ పథకంలో భాగస్వామిగా మార్చుకున్న వైనంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

జగన్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) చర్యల విషయమై కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంతో చంద్రబాబు గురువారం ఫోన్‌లో మంతనాలు జరపడం తెలిసిందే. దాంతోపాటు విశ్వసనీయ సమాచారం మేరకు.. గురువారం సాయంత్రం ఈడీ విడుదల చేసిన ఆస్తుల అటాచ్‌మెంట్ నోట్‌ను కూడా మధ్యాహ్నానికే టీడీపీ అనుకూల తెలుగు మీడియాకు టీడీపీ ఎంపీల ద్వారా బాబు చేరవేశారు. ఈడీ ఇంకా విడుదల చేయకముందే టీడీపీపీ నేత నామా నాగేశ్వరరావు దాన్ని స్వయంగా తెలుగు మీడియాకు అందజేశారు! పైగా నామా నేతృత్వంలో గురువారం మధ్యాహ్నం టీడీపీ ఎంపీల బృందం బాబు లేఖ తీసుకుని చిదంబరంతో భేటీ అవడానికి ముందే ఈడీ నోట్ గురించి ఎల్లో మీడియాకు పక్కాగా ఉప్పందింది.

సీబీఐ కూడా ఈ విషయంలో తన వంతు పాత్ర పోషించడం ద్వారా యథాశక్తి సహకరించింది. శుక్రవారం జగన్ బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు రానున్న నేపథ్యంలో అంతకుముందే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈడీ నోట్ విడుదలయ్యేలా పావులు కదిపింది.

కాంగ్రెస్ నాయకత్వం కూడా టీడీపీని దువ్వే చర్యలను దాచుకోవడానికి ప్రయత్నించడం లేదు. పైగా ఆ పార్టీని మున్ముందు మరింతగా ‘పోత్సహిస్తా’మంటూ సంకేతాలు కూడా ఇస్తోంది. ఏఐసీసీలోకి ఒక ముఖ్య నేత చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు అద్దం పడుతున్నాయి. చంద్రబాబుతో కేంద్ర ఆర్థిక మంత్రి మాటామంతీ నిజమేనా అని ప్రశ్నించగా, ప్రస్తుతం తామున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతున్నామని కుండబద్దలు కొట్టారాయన. పైగా, ‘ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరితోనూ మాట్లాడాల్సి ఉంటుంది. అదీగాక శత్రువుకు శత్రువు మనకు మిత్రుడే అవుతాడుగా’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు కూడా చేశారు. అక్కడితో ఆగకుండా, ‘చంద్రబాబు కూడా అవినీతిపై పోరాటం చేస్తున్నారుగా’ అంటూ అసలు విషయాన్ని చెప్పకనే చెప్పారు. తృణమూల్ కాంగ్రెస్ నిష్ర్కమణ నేపథ్యంలో యూపీఏ ప్రభుత్వం మెజారిటీ త్రిశంకు స్వర్గంలో ఉన్నందున చిన్న, ప్రాంతీయ పార్టీలను కూడా కూడగట్టుకోవాలన్న వ్యూహం కూడా టీడీపీతో కాంగ్రెస్ దోస్తీకి మరో కారణంగా కన్పిస్తోంది. ప్రభుత్వ మనుగడకు ఢోకా లేకుండా చూసుకోవడంతో పాటు శత్రువుపై దాడికి కూడా ఇది ఉభయతారకంగా పనికొస్తుందన్నది ఏఐసీసీ పెద్దల భావనగా తెలుస్తోంది.

హస్తిన సాక్షిగా ఎన్ని కుట్రలో!

వందమంది దోషులైనా తప్పించుకోవచ్చుగానీ ఒక్క నిర్దోషి కూడా శిక్షకు గురికాకూడదన్నది మన నేర న్యాయ శాస్త్ర సిద్ధాంతానికి ప్రాణధాతువు. కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేస్తున్న సీబీఐ తన చేష్టలతో సరిగ్గా దాన్నే దెబ్బతీస్తోంది. సుప్రీంకోర్టులో శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ కొచ్చిన సందర్భంగా ఆ సంస్థ చేసిన వాదనలు చూసినా, దాదాపు ఏడాదికాలంగా జగన్‌మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో అది చేస్తున్న దర్యాప్తు తీరు గమనించినా ఇది స్పష్టంగానే అర్ధమవుతుంది. కాంగ్రెస్ అధిష్టానం జగన్‌పై కన్నెర్రజేసి శంకర్రావు ద్వారా హైకోర్టులో పిటిషన్ దాఖలుచేయించడం, అటు తర్వాత దానిలో తెలుగుదేశం పార్టీని జత కలుపుకోవడం దగ్గర్నుంచి దర్యాప్తు పేరుతో 28 బృందాలతో సీబీఐ అధికారులు చేసిన హంగామా... నాలుగు నెలలనాడు జగన్‌మోహన్ రెడ్డిని ప్రశ్నించడం పేరిట పిలిచి అరెస్టుచేయడంతో పరాకాష్టకు చేరుకుంది. 

అవినీతికి మూలమని చెబుతున్న 26 జీవోల ఊసెత్తకుండా సాగిన ఈ తతంగంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని వాటి గురించి పట్టించుకోరేమని ప్రశ్నించాక కొత్త అంకానికి తెరలేచింది. అందులోనూ ఎన్ని ఎత్తులని? జగన్‌మోహన్ రెడ్డిని అరెస్టు చేయదల్చుకున్నప్పుడు ఒక మంత్రిని అరెస్టు చేయడం...ఆయన బెయిల్ పిటిషన్ విచారణ కొచ్చినప్పుడు మరో మంత్రిపై చార్జిషీటు దాఖలు చేయడం...ఒక అధికారిని అరెస్టు చేసి బెయిల్ రాకుండా నిరోధించడం...మరో అధికారి పేరు చార్జిషీటులో ఉన్నా ఆయన జోలికెళ్లకపోవడం...ఇవన్నీ కళ్లెదుట కనబడుతున్నవే. సీబీఐని ఎవరో ఆడిస్తున్నారని తెలియజెప్పేవే. అది నిజంగా స్వతంత్రంగా వ్యవహరిస్తుంటే, నిబంధనల ప్రకారం దర్యాప్తు చేస్తుంటే ముందు జీవోల జారీ దగ్గర్నుంచి దర్యాప్తు మొదలెట్టాలి. వాటి పర్యవసానంగానే అవినీతి జరిగిందని చూపగలగాలి. దాని లబ్ధిదారులను గుర్తించగలగాలి. కానీ, కాంగ్రెస్ అధిష్టానం పెద్దల ‘అసలు లక్ష్యం’ వేరుగనుక దర్యాప్తు రివర్స్‌లో మొదలైంది. 

సీబీఐ వేస్తున్న ప్రతి అడుగూ దాని పక్షపాత ధోరణిని ప్రతిఫలిస్తున్నది. పాలకుల అవసరాలకు అనుగుణంగా దర్యాప్తు నెలల తరబడి నడుస్తూనే ఉంది. ఎక్కడిదాకానో అవసరంలేదు... సుప్రీంకోర్టులో జగన్ బెయిల్ పిటిషన్ విచారణ కొచ్చిన ప్రతిసారీ ఏదో రకమైన ఎత్తుగడ అనుసరించడం, విచారణ వాయిదా పడేలా చూడటం సీబీఐకి అలవాటైపోయింది. న్యాయవాదులను మార్చడం దగ్గర్నుంచి తమ న్యాయవాది అందుబాటులో లేరని చెప్పడం వరకూ చూస్తే జగన్‌మోహన్ రెడ్డికి బెయిల్ రాకూడదన్న కాంగ్రెస్, బాబు పార్టీల మనోభీష్టానికి అనుగుణంగా సీబీఐ వ్యవహరిస్తోందని అందరికీ అర్ధమయ్యే విషయం. జగన్‌మోహన్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ తనముందుకు విచారణ కొచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఈ వాస్తవాలన్నిటినీ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదా అనే అనుమానం సామాన్యులకు సైతం కలగడం సహజం. 

బెయిల్ ఇవ్వడమనేదే రూలు... జైలు అనేది అరుదైన స్థితిలో మాత్రమే అనుసరించదగ్గ మార్గమని జస్టిస్ కృష్ణయ్యర్ ఒక కేసులో వ్యాఖ్యానించారు. కానీ, జగన్‌మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో తమ దర్యాప్తు ఇంకా పూర్తికాలేదని, విదేశాల్లో కూడా ఇంకా దర్యాప్తు చేయవలసి ఉన్నదని, అందుకోసమని ఆయా దేశాలకు అభ్యర్ధనా పత్రాలు (లెటర్ రొగేటరీలు) కూడా పంపామని సీబీఐ అంటోంది. సీబీఐ ఎన్ని కేసుల్లో ఇలా అభ్యర్ధనా పత్రాలు పంపిందో, ఎన్నింటిపై ఇంతవరకూ దర్యాప్తు పూర్తయిందో ఈ సందర్భంలో సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించి ఉంటే ఆ సంస్థ అసలు రంగు వెల్లడయ్యేది. వివిధ దేశాలకు సీబీఐనుంచి వెళ్లిన 194 అభ్యర్థనా పత్రాల అతీ గతీ ఏమైందో ఎవరికీ తెలియదు. ఇదంతా ఏడాదిక్రితం లెక్క. ప్రస్తుతం వాటి సంఖ్య ఇంకా పెరిగి ఉండొచ్చుకూడా. 

నిందితులను పట్టించి ఇవ్వడం ఇష్టంలేకే ఆయా దేశాలు స్పందించడంలేదని ఎవరైనా అనుకుంటే పొరపాటే. ఆ అభ్యర్ధనా పత్రాలు సక్రమంగా లేకపోవడమే కారణమని చాలా కేసుల్లో రుజువవుతున్న అంశం. పశ్చిమబెంగాల్‌లోని పురూలియాలో కొన్నేళ్లక్రితం విమానంనుంచి వందలకొద్దీ ఏకే-47 రైఫిళ్లు వెదజల్లి తప్పించుకుపోయిన డెన్మార్క్ దేశస్తుడు కిమ్ డెవీని అప్పగించండంటూ పంపిన అభ్యర్థనా పత్రంతోపాటు సమర్పించిన కోర్టు వారెంటుకు కాలం చెల్లిందని కోపెన్‌హాగన్ కోర్టు చెబితేతప్ప అక్కడకు వెళ్లిన మన సీబీఐ బృందానికి జ్ఞానోదయం కలగలేదు. చివరకు కి మ్ డెవీని రప్పించలేకపోవడం వేరే కథ. బోఫోర్స్ కీలక నిందితుడు ఖత్రోచీ విషయంలోనూ సీబీఐ చరిత్ర డిటోయే. 

ఇంత నేపథ్యమున్న సీబీఐ... సర్వోన్నత న్యాయస్థానానికి జగన్‌మోహన్ రెడ్డి కేసులో లెటర్ రొగేటరీ సాకును చూపడం వింతల్లోకెల్లా వింత. బెయిల్ ఇవ్వడం, ఇవ్వకపోవడం న్యాయస్థానాల విచక్షణకు సంబంధించిందే అయినా దర్యాప్తు సాగుతున్నందున బెయిల్ ఇవ్వలేమని నిర్ణయానికొచ్చేముందు ఆ దర్యాప్తు ఎలా సాగుతున్నదో సర్వోన్నత న్యాయస్థానం దృష్టిపెట్టి ఉంటే బాగుండేది. ఏమైనప్పటికీ తాజా పరిణామాలతో కాంగ్రెస్, తెలుగుదేశం కుమ్మక్కయిన వైనం హస్తిన సాక్షిగా మరోసారి బయటపడింది. జగన్ బెయిల్ పిటిషన్ విచారణ జరిగే ముందురోజు హుటాహుటీన తెలుగుదేశం బృందం కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరాన్ని కలవడం, వారి రాకకోసమే ఎదురుచూస్తున్నట్టు ఆయన వెనువెంటనే ఈడీకి ఆదేశాలివ్వడం, ఈడీ ఏమి చేయబోతున్నదో ముందుగా తెలుగుదేశమే మీడియాకు లీక్ ఇవ్వడం... గురువారం పగలంతా సాగిన కుట్ర తాలూకు ఆనవాళ్లు. తెలుగుదేశాధినేత ‘వస్తున్నా మీకోసం...’ అంటూ తమ కళ్లముందే తిరుగుతూ ఢిల్లీలో కాంగ్రెస్‌తో కలిసి ఆడిన నాటకాన్ని జనం గమనించకపోలేదు. ఈ కుట్రదారులకు వారు తగిన సమయంలో బుద్ధి చెప్పడం ఖాయం.

http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=50301&Categoryid=1&subcatid=17
Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!