
క్విడ్ ఫ్రాడ్కో అని చెప్పడానికి,అక్రమ ఆస్తుల కేసు అనడానికి ఎవరికీ హక్కు లేదు,కానీ అదే చెప్తూ జనం లో విష బీజాలు నాటడానికి ప్రయత్నం చేస్తున్నారు.జగన్ ప్రభుత్వం లో ఏ పదవిలో లేనప్పుడు క్విడ్ ఫ్రాడ్కో ఎలా అవుతుంది.కాబినెట్.అధికారులు అందరు తప్పు చేసారు,అధికార దుర్వినియోగం జరిగింది అని తేలిన తర్వాత మాత్రమే జగన్ మీద దర్యాప్తు చెయ్యాలి.అది కూడా సాక్ష్యాలు లభించిన తర్వాత మాత్రమే.జగన్ సక్రమం గా పన్ను కట్టినప్పుడు కూడా గొడవ చేసారు,పన్ను కట్టని వాళ్ళని ,అక్రమ సొమ్ము దొరికిన వాళ్ళని పట్టించుకోరు కానీ జగన్ విషయం లో చాల అన్యాయం గా వ్యవహరిస్తున్నారు .జగన్ సంపాదించిన ఆస్తులు అన్ని చట్టపరం గా సక్రమమైనవే,అన్నిటికి పన్ను కట్టినవే .జగన్ విషయం లో ఏమి తప్పు దొరకకే సిబిఐ,ఎల్లో మీడియా తిప్పలు పడుతుంది.


కాంగ్రెస్ కి లొంగలేదు కాబట్టి తెలుగు దేశంతో ఒప్పందం పెట్టుకుని చంద్రబాబు ఆంధ్ర లో పాదయాత్ర చేసే దాక జగన్ కి బెయిల్ రాకుండా చేస్తున్నారు.తెలంగాణా లో కెసిఆర్ తో బేరసారాలు చేస్తున్నారు అని చెప్పుకుంటున్నారు .జగన్ ని ఒంటరిగా నిలబెడతాం అని కాంగ్రెస్ అధిష్టానం లో కొంతమంది అన్నారని చెప్తున్నారు.దేశం లో అంబానీ....రాష్ట్రము లో మురళీమోహన్,నామా...దేవేందర్ గౌడ్....రాధాకృష్ణ........ఇంకా వందల ,వేల మంది తక్కువ సమయం లో వేల కోట్లు సంపాదించిన వాళ్ళే.కానీ జగన్ టాక్స్ కడుతూ సక్రమం కొంత సంపాదించుకుంటే వేల కోట్లు,లక్షల కోట్లు అని తప్పుడు ప్రచారం చేసారు.జగన్ ఒక్కడి మీదే వందల కుట్రలు చేస్తున్నారు.దేశం లో ఎవరికీ ఇలాంటి పరిస్థితి రాలేదు.దేవుడున్నాడు మంచి జరుగుతుందని ఎదురుచూడ్డం మాత్రమే కాదు మనం చెయ్యల్సింది వుంది చాలా.
వై ఎస్సార్ ని కూడా చాలా కష్టాలు పెట్టారు.ఆర్ధికం గా,మానసికం గా,రాజకీయం గా నష్ట పరిచారు అయన ఏరోజు తలవంచలేదు.జగన్ ని అదనం గా ఇంకా ఎక్కువ కష్టాలు పెడుతున్నారు ,జగన్ తొణకలేదు,బెదరలేదు .జనం కోసం మాట మీదే నిలబడ్డాడు.అయన అనుకుంటే దర్జాగా విలాసం బతుకుతూ కాంగ్రెస్ అధిష్టానానికి లొంగి వుంటే ఎప్పుడో ముఖ్యమంత్రి అయ్యేవాడు.కానీ తెలుగువాడి ఆత్మ గౌరవం ,మాట కోసం కష్టాలను బరిస్తున్నాడు.
తెలుగువాడి ఆత్మ గౌరవం అని నందమూరి తారకరామారావు పార్టీ పెడితే ఆయన వారసులు ఈరోజు ఢిల్లీ కి అమ్ముడు పోయారు.
గ్రామ స్థాయిలో పార్టీ బలపడకుండా స్తానిక సంస్థల ఎన్నికలు రాకుండా చేసారు.
ఇప్పుడు మనం చెయ్యల్సింది పార్టీ కోసం పని చెయ్యడం. పార్టీ కి జన బలం ఏ పార్టీ కి లేనంత వుంది,కానీ నడిపించే నాయకత్వం పూర్తిగా ఏర్పడలేదు.కష్టపడి,ఇష్టపడి పని చెయ్యాల్సిన సమయం ఇది.జనం లోకి వెళ్లి కష్టపడదాం.జనానికి అండగా నిలబడదాము.పార్టీ కోసం సైనికులమై పని చేద్దాం.
No comments:
Post a Comment