YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday, 3 November 2012

జగన్ మీద కాంగ్రెస్-టీడీపీల కుట్రపై సురేఖ ఆవేదన

మొన్న జగన్ జైలులో ఫోన్ వాడుతున్నారంటూ అడ్డగోలు ఆరోపణలు చేశాయి
దీన్ని ఖండిస్తూ జగన్ సతీమణి భారతి సవాల్ చేస్తే ఈ పార్టీలు స్పందించలేదు
మళ్లీ ఇప్పుడు జగన్‌కు జైలులో సౌకర్యాలు కల్పిస్తున్నారంటూ అవాస్తవ ప్రచారం
వీరి కుమ్మక్కు రాజకీయాలు చూస్తుంటే మాకు అనేక అనుమానాలొస్తున్నాయి
ఇప్పుడు నిబంధనల ప్రకారం కల్పిస్తున్న సౌకర్యాలను కూడా రద్దు చేస్తారేమో!
జగన్‌కు మిగిలిన వీఐపీ ఖైదీల కంటే ఏ ఒక్క అదనపు సౌకర్యం లేదు
ఉన్నాయని నమ్మితే మీరు భారతి చాలెంజ్‌కు స్పందించి బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పగలరా?

పెద్దాయనా.. పెద్దాయనా.. 
ఇది స్వార్థపు లోకం పెద్దాయనా... 
పెద్దాయనా.. పెద్దాయనా..
ఇది చెడు కలికాలం పెద్దాయనా...

మహానేత తనయుడు, తమ నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అన్యాయంగా జైల్లో పెట్టించిన కాంగ్రెస్-టీడీపీలు అంతటితో ఆగకుండా.. అవాస్తవ ఆరోపణలు చేస్తున్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకురాలు కొండా సురేఖ ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘మొన్నటికి మొన్న జగన్ జైలులో ఫోన్ వినియోగిస్తున్నారంటూ ఆధారాలు లేని అడ్డగోలు ఆరోపణలు చేశారు. ఇప్పుడేమో జగన్‌కు జైలులో సౌకర్యాలు కల్పిస్తున్నారంటూ అవాస్తవ ప్రచారానికి దిగుతున్నారు. కాంగ్రెస్-తెలుగుదేశం పార్టీ కుమ్మక్కు రాజకీయాలు చూస్తుంటే.. జైలు నిబంధనల ప్రకారం జగన్‌కు కల్పిస్తున్న సౌకర్యాలను కూడా రద్దు చేస్తారేమోనని అనిపిస్తోంది’’ అంటూ అనుమానం వ్యక్తంచేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్-తెలుగుదేశం పార్టీల కుమ్మక్కు రాజకీయాల నడుమ సాగుతున్న అంతులేని ‘కుట్ర’ చూస్తున్నప్పుడల్లా ఆ పాట నా చెవుల్లో రింగుమని మారుమోగుతూనే ఉంది. ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టడానికి ఈ రెండు పార్టీలు నీచాతి నీచమైన స్థాయికి దిగజారాయి. ప్రజా నాయకుడు రాజశేఖరరెడ్డి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ఇచ్చిన మాట కొరకు ప్రజల మధ్యన తిరుగుతున్న ఆయన కుమారుడు, మా నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డిని జైలు గోడల మధ్యకు తీసుకెళ్లేదాకా నిదురపోలేదు ఈ రెండు పార్టీలు. సీబీఐ విచారణ ప్రారంభించిన పది మాసాలకు, ఉప ఎన్నికల పోలింగ్‌కు సరిగ్గా 15 రోజుల ముందు అక్రమంగా జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్ట్ చేసే దాకా వీరు కుయుక్తులు పన్నుతూనే ఉన్నారు. అంతటితో ఆగకుండా జైలు గోడల మధ్య నిస్సహాయంగా ఉన్న జగన్‌పై రాళ్లు వేసేందుకు కూడా వీరు ఏ మాత్రం వెనుకాడడం లేదు. తాజాగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు సాగిస్తున్న కుట్ర రాజకీయాలు చూస్తుంటే వారి మీద కోపం కంటే జాలి ఎక్కువగా కలుగుతోంది. ఎదుటి వ్యక్తిపై ఎంతటి అవాస్తవ ఆరోపణలు చేయడానికైనా వెనుకాడని ఈ రెండు పార్టీల స్వభావం చూస్తుంటే వీరిలో అధికారదాహం ఎంతగా దాగి ఉందో తెలుస్తోంది. ప్రజల అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా, ప్రజల ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా వీరు సాగిస్తున్న కుట్ర రాజకీయాలు చూస్తుంటే ఎంతకైనా తెగిస్తారేమో అన్న భయం కూడా కలుగుతోంది. 

నేరారోపణ మోపబడ్డ వ్యక్తి 90 రోజులకు మించి జైలులో ఉండకూడదని చట్టాలు చెపుతున్నాయి. ఇప్పటికిమా నేతను జైలులో పెట్టి ఆరు నెలలు కావస్తోంది. నాలుగు మాసాల తరువాత బెయిల్‌కోసం దరఖాస్తు చేస్తే ఎక్కడ బెయిల్ దొరుకుతుందోనని కాంగ్రెస్-తెలుగుదేశం పార్టీలు భయపడి సరిగ్గా సుప్రీంకోర్టులో వాదనలకు ఒకరోజు ముందు సాగించిన కుమ్మక్కు రాజకీయాన్ని రాష్ట్ర ప్రజలు కళ్లారా చూశారు. సుప్రీంకోర్టులో కేసు విచారణకు రావడానికి ఒకరోజు ముందు టీడీపీ పార్లమెంట్ సభ్యులు ఢిల్లీలో ఆర్థిక మంత్రి చిదంబరంను కలవడం, ఆ తరువాత కొద్దిసేపటికే సంచలనాత్మక ప్రకటన వెలువడటం, ‘సాక్షి’ ఆస్తులను అటాచ్ చేస్తున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ ప్రకటించడం వీరి కుమ్మక్కు రాజకీయాలకు పరాకాష్ట. పట్టపగలు, నిస్సిగ్గుగా ఒకరోజు ముందు సుప్రీంకోర్టును ప్రభావితం చేయడానికి ఈ రెండు పార్టీలు వ్యవహరించిన తీరును ప్రజలు గమనించారు. జగన్‌కు బెయిల్‌వస్తే బాగుండని సుప్రీంకోర్టు నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న కోట్లాది మంది వైఎస్సార్ అభిమానులు వీరి జుగుప్సాకరమైన రాజకీయాలను ఈసడించుకున్నారు. వారికి అన్నీ తెలుసు. అందుకే దేవుడున్నాడు, భయపడవద్దంటూ వైఎస్సార్ కుటుంబానికి ధైర్యం చెపుతున్నారు. కాంగ్రెస్-తెలుగుదేశం కుమ్మక్కు రాజకీయాలకు నిరసనగా జగన్ సోదరి షర్మిల అసాధారణమైన రీతిలో మూడు వేల కిలోమీటర్ల పాదయాత్రను మొదలుపెడితే ప్రజలు అడుగడుగునా అక్కున చేర్చుకుంటూ జగన్ జైలు నుంచి బయటకు రావాలని దీవిస్తున్నారు. ఇది చూసి తట్టుకోలేని ఈ రెండు పార్టీలూ ఇప్పుడు జైలు గోడల మధ్య ఉన్న జగన్‌ను లక్ష్యంగా చేసుకుని రాజకీయాలు చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ చేస్తున్న నీచమైన కుమ్మక్కు రాజకీయాల వల్ల భవిష్యత్ లేదని నిర్ధారించుకుని వైఎస్సార్ కాంగ్రెస్‌వైపు చూస్తున్న ఎమ్మెల్యేలను కాపాడుకునే శక్తి లేని చంద్రబాబు రాజకీయంగా మరీ దిగజారిన పరిస్థితి. జగన్ జైలులో ఫోన్ వినియోగిస్తున్నారంటూ ఆధారాలు లేని అడ్డగోలు ఆరోపణలు చేసినప్పుడు జగన్ సతీమణి వైఎస్ భారతి తీవ్రంగా ఖండించారు. తన బిడ్డల సాక్షిగా అది తప్పుడు ఆరోపణ అని చెప్పారు. నిజం అనుకుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు వారి బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పాలని గట్టిగా అడిగారు. 

ఇప్పటికీ వారు స్పందించలేదు. ఎందుకంటే వారు అబద్ధాలు చెపుతున్నారు. ఇంతకుముందు బెయిల్ పిటిషన్ విచారణకు రావడానికి ముందు కాంగ్రెస్ పెద్దలతో కలిసి ఎలా కుమ్మక్కు రాజకీయాలు చేశారో అదే మాదిరి ఇప్పుడు వీరు అడగడం, వారు చేయడం అన్న విధంగా సాగుతోంది. అందుకే మళ్లీ పాత పాట అందుకున్నారు. జగన్‌కు జైలులో సౌకర్యాలు కల్పిస్తున్నారంటూ అవాస్తవ ప్రచారానికి దిగుతున్నారు. కాంగ్రెస్-తెలుగుదేశం పార్టీ కుమ్మక్కు రాజకీయాలు చూస్తుంటే మాకు అనేక అనుమానాలొస్తున్నాయి. జైలు నిబంధనల ప్రకారం జగన్‌కు కల్పిస్తున్న సౌకర్యాలను కూడా రద్దు చేస్తారేమో అన్న సందేహం కలుగుతోంది. 

తెలుగుదేశం ఆరోపణలు చేయడం, కాంగ్రెస్ వెంటనే స్పందించడం చూస్తుంటే ఈ అనుమానం ఎందుకు రాకుండా ఉంటుంది? జగన్ నేరం చేసి జైలుకు వెళ్లాడా... నేరం రుజువు కాబడి శిక్ష అనుభవిస్తున్నాడా... అలాంటిదేమీ లేదే! ఏ న్యాయస్థానం ఆయనకు శిక్ష విధించలేదే! అలాంటప్పుడు ఓ బలమైన రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి బంధువులతోపాటు మరో ఒకరినో, ఇద్దరినో ఒక వారంలో కలిస్తే అది తప్పు అవుతుందా? 18 మంది శాసనసభ్యులు, ఇద్దరు లోక్‌సభ సభ్యులను కలిగి ఉన్న పార్టీ అధినేత తనను కలవడానికి వచ్చిన వారితో మాట్లాడితే నేరం అవుతుందా? లేనిపోని ఆరోపణలు చేసి తనను కలువడానికి వచ్చేవారిని కట్టడి చేయడం భావ్యమేనా? ఇక ఫోన్ విషయానికి వస్తే వారి బిడ్డల మీద ప్రమాణం చేయమని జగన్ సతీమణి అడిగితే ఇప్పటిదాకా స్పందించని వారికి ఓ విషయం తెలుసా.. చర్లపల్లి జైలులో ఉన్న ఖైదీలు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి అధికారులు ఒక బూత్ ఏర్పాటు చేశారు. 

వారానికి రెండు సార్లు ఖైదీలకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. నేరం రుజువై శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు ఈ అవకాశం ఉన్నప్పుడు, ఫోన్ విషయం అటుంచి ఏ నేరం చేయకపోయినా అన్యాయంగా జైలులో ఉంటున్న జగన్‌ను జైలు నిబంధనల ప్రకారం వెళ్లి కలుస్తున్న వారిని నియంత్రించాలనుకోవడం కుమ్మక్కు రాజకీయాలకు నిదర్శనం కాదా? జైలులో జగన్‌కు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారని ఆరోపిస్తున్న వారికి మళ్లీ చెపుతున్నా. జగన్‌కు మిగిలిన వీఐపీ ఖైదీల కంటే ఏ ఒక్క అదనపు సౌకర్యం లేదని మేము గట్టిగా చెప్పగలం. 

మిగిలిన వారి కంటే ఎక్కువ సౌకర్యాలు ఉన్నాయని నమ్మితే తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ భారతి చాలెంజ్‌కు స్పందించి వారి బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పగలరా? వీరు ఎన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు.. ఎన్ని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు! ఇంటిపెద్ద దిక్కును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబాన్ని మరింత క్షోభ పెడుతూ.. జగన్‌మోహన్‌రెడ్డిని కూడా అకారణంగా జైల్లో పెట్టారు. అయినా కూడా వారికి తృప్తి లేదు. ఇంకా ఏవో అబద్ధపు ప్రచారాలు చేసి ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? సునీల్‌రెడ్డితో కలిసి జగన్ షటిల్ ఆడుతున్నారట.. ఏం తప్పా? జైలులో షటిల్స్(డబుల్స్) మాత్రమే ఆడే అవకాశం ఉందట. అంటే నలుగురు కలిసి ఆడతారన్న మాట. ఎప్పుడు ఆడినా నలుగురు ఆడాల్సి ఉంటుందని తనతో జగన్‌మోహన్‌రెడ్డి చెప్పినట్లు భారతి చెప్పారు. అదీ కాకుండా నాలుగు వారాలుగా ఆయన కాలు బెణికి షటిల్‌కు దూరమయ్యారని కూడా అమె అన్నారు. తెలుగుదేశం పార్టీ అబద్ధాలు చూస్తుంటే వారెందుకు ఇంత నీచానికి దిగజారుతున్నారో అర్థం కావడం లేదు. ఏదో ఒక ఆరోపణ చేస్తే జగన్‌కు జైలులో ఏ సౌకర్యాలూ లేకుండా, ఎవరినీ కలువనీయకుండా చేయొచ్చని.. కాంగ్రెస్-తెలుగుదేశం పార్టీలు కుట్ర చేస్తున్నాయా అన్న అనుమానమూ కలుగుతోంది. 

భూములు కేటాయించారంటూ సీబీఐని అడ్డుపెట్టుకుని అడ్డగోలు ఆరోపణ చేస్తున్నవారికి.. రాజధాని నడిబొడ్డున అత్యంత విలువైన భూములను ఎమ్మార్ అనే సంస్థకు చంద్రబాబు గారి ప్రభుత్వం అతి తక్కువ ధరకు కట్టబెట్టిన సంగతి గుర్తుకు రాకపోవడం విచిత్రం. అక్కడే గోల్ఫ్‌కోర్సు ఒకటి ఏర్పాటు చేసి సంపన్నులు విలాసవంతమైన బంగ్లాలు కట్టి అమ్ముకునేందుకు వీలుగా ఒక ఒప్పందం చేసుకున్న విషయం మర్చిపోవడం చూస్తే ఆశ్చర్యంగా ఉంది. అవును మరి ఇదే పెద్ద మనిషి ఇప్పుడు అధికారపక్షంతో అంటకాగుతున్నారు, అందువల్ల ఆయన తప్పులు ఒప్పులు అవుతాయి. అసలు ఏ పరిశ్రమ కోసం 530 ఎకరాల భూమి కౌరు చౌకగా, చెనక్కాయలకు, బెల్లానికి ఇచ్చినట్లు సిటీ నడిబొడ్డున ఏకపక్షంగా కేటాయించారు.. ఎన్ని ఉద్యోగాలు వస్తాయని ఆశించి భూములు కట్టబెట్టారు. 

మరి సీబీఐ ఆ దిశగా ఎందుకు విచారణ జరుపలేదు. వేలాది ఉద్యోగాలు వస్తాయని చెప్పి, వెనుకబడిన జిల్లాల్లో పరిశ్రమలకు భూములు కేటాయించడాన్ని తప్పుబడుతున్న సీబీఐ ఎమ్మార్ భూముల కేటాయింపుల వెనుక మతలబును ఎందుకు ఛేదించలేదు? ఎమ్మార్‌కు ఏ ఉద్దేశాలతో భూమి కట్టబెట్టారని కనీసం సీబీఐ ప్రశ్నించనూ లేదంటే వారి కుమ్మక్కు రాజకీయం ఎంత ధృడంగా ఉందో స్పష్టమవుతూనే ఉంది. జైలులో ఉన్న మా నాయకుడిపై లేనిపోని ఆరోపణలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్న తెలుగుదేశం పార్టీ అందులో పదోవంతైనా ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించలేదు. వారు చేస్తున్నదల్లా జగన్‌పై బురద జల్లడమే. వారి దృష్టి అంతా వైఎస్సార్ కుటుంబాన్ని ఎలా ఇబ్బంది పెట్టాలన్నదే. ప్రజల సమస్యలను పరిష్కరించలేదంటూ మొసలి కన్నీరు కారుస్తూ తిరగడం కాదు.. సంఖ్యాబలం ఉంది కాబట్టి అవిశ్వాసం పెట్టి ప్రభుత్వాన్ని తూర్పారబట్టాలి. ప్రజలను అష్టకష్టాలు పెడుతున్న ఈ ప్రభుత్వాన్ని అవిశ్వాసం పెట్టి గద్దె దింపాలి. ప్రజాస్వామ్యంలో ఇది అత్యంత ప్రాముఖ్యమైనది. కానీ, ఆ పార్టీకి కావాల్సింది కుమ్మక్కు, నీచమైన రాజకీయాలే.
-కొండా సురేఖ

http://www.sakshi.com/main/FullStory.aspx?catid=480625&Categoryid=1&subcatid=33

చేతకాని ప్రభుత్వమంటున్న బాబు అవిశ్వాసం పెట్టరేం?

మాటిమాటికీ ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపడం చూస్తూంటే రాష్ట్ర ప్రభుత్వానికి జవాబుదారీతనం లేదనేది స్పష్టమవుతోందని, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు కూడా ఇలాంటి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడంలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బి.జనక్‌ప్రసాద్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రాష్ట్ర ప్రజలపై ఇంధన సర్దుబాటు చార్జీల పేరిట రూ.1,740 కోట్ల భారాన్ని వేయడాన్ని తప్పుపట్టారు. ‘‘వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా చార్జీలు పెంచలేదు. మరో ఐదేళ్లు చార్జీలు పెంచబోమని వైఎస్ ఇచ్చిన హామీని ప్రస్తుత ప్రభుత్వం తుంగలో తొక్కింది. రోశయ్య హయాంలో 1,000 కోట్ల రూపాయల చార్జీలు పెంచారు. కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో మరింత ఎక్కువగా విద్యుత్ చార్జీలను పెంచడమే కాక, ప్రతి మూణ్ణెల్లకు ఒకసారి ఇంధన సర్దుబాటు చార్జీల పేరిట భారం వేస్తున్నారు. 2010-11 ఆర్థిక సంవత్సరంలో రూ.3,957 కోట్లు, 2011-12లో రూ.2,068 కోట్లు, 2012-13 తొలి త్రైమాసికానికి రూ.1,740 కోట్ల మేరకు సర్దుబాటు చార్జీలు విధించారు’’ అని ధ్వజమెత్తారు. ‘ఈ ప్రభుత్వం చేతగానిదని, అసమర్థ ప్రభుత్వమని, దద్దమ్మ ప్రభుత్వమని బజారుకెక్కి విమర్శిస్తున్న చంద్రబాబు అవిశ్వాస తీర్మానం పెట్టి ఎందుకు కూలదోయరు’ అని ప్రశ్నించారు.

source:sakshi

మహానేత వైయస్ ధరించినవి చేనేత బట్టలే!

ఉరవకొండ చేనేతన్నల ప్రాంతం కావడాన శనివారం జరిగిన సభలో విజయమ్మ మాట్లాడుతూ నాడు వైయస్ నేతబట్టలే కట్టేవారన్న విషయం గుర్తు చేశారు. "రాజశేఖర్ రెడ్డిగారు కట్టుకున్నవి నేతబట్టలే. తెల్లని రంగులోని నేతన్న బట్టలే వేసుకునేవారు. ఆఫీసర్లు కూడా వారానికి ఒకసారి నేతబట్టలే వేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పిల్లలకు కూడా నాలుగు జతల బట్టలు కొనుగోలు చేయాలన్నారు. అంతో ఇంతో ఎన్టీఆర్ చేశారు. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డిగానే చేనేతన్నలకు సాయం చేశారు. ఇప్పుడు చేనేతకార్మికుల కోసం ఆలోచించే ఒకే ఒక వ్యక్తి జగన్‌బాబు. ధర్మవరంలో జగన్ బాబు ధర్నా చేశారు. ప్రభుత్వమే నూలు సరఫరా చేస్తుందని, రుణమాఫీ చేస్తానని, వడ్డీ లేని రుణాలు ఇస్తామని, మగ్గాలకు షెడ్లు కట్టించి ఇస్తామనీ జగన్ వాగ్దానం ఇవ్వడం జరిగింది" అని ఆమె గుర్తు చేశారు..........
continue:  http://ysrcongress.com/news/news_updates/_vaiyas__kaTTukunnavi_naetabaTTalae_.html

త్వరలోనే వైఎస్సార్ సీపీలో


ఏలూరు, న్యూస్‌లైన్: ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్ష పదవికి రాజీ నామా చేశానని నందమూరి లక్ష్మీపార్వతి వెల్లడించారు. త్వరలోనే వైఎస్సార్ సీపీలో చేరనున్నట్లు తెలిపారు. ఏలూరులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. దివంగత మహానేత వైఎస్ పేదల కోసం జీవితాన్ని త్యాగం చేశారని, ఆయన అడుగుజాడల్లోనే వైఎస్ తనయుడు జగన్ నడుస్తూ పేద ప్రజలకు అండగా నిలవడం తనను ఆకర్షించిందని చెప్పారు. 1983లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించారని, ప్రస్తుతం జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ సీపీని ఏర్పాటుచేసి అంతకు మించిన మరో రాజకీయ విప్లవాన్ని తీసుకువచ్చారని అన్నారు. 

source:sakshi

విజయమ్మ కొవ్వూరు సభ రద్దు

పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో ఆదివారం జరగాల్సిన వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ సభ రద్దయింది. భారీ వర్షాల కారణంగా ఈ సభను రద్దు చేసినట్లు పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అడ్‌హాక్ కమిటీ కన్వీనర్ టి.బాలరాజు, పార్టీ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావు (కృష్ణబాబు), గోపాలపురం టీడీపీ ఎమ్మెల్యే టి.వనితతో పాటు పలువురు నేతలు ఈ సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని తొలుత భావించారు. సభ రద్దవడంతో అనుకున్న ముహూర్తానికే ఆదివారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలోనే విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరాలని వారు నిర్ణయించారు. కృష్ణబాబు శనివారం రాజమండ్రిలోని తన నివాసంలో ఉభయ గోదావరి జిల్లాల ముఖ్య నేతలతో సమావేశమై ఆదివారం జరగాల్సిన కార్యక్రమంపై చర్చించారు. 

ఆదివారం ఉదయం 9 గంటలకు ఏలూరులో బయల్దేరి, సాయంత్రానికి హైదరాబాద్ చేరుకోవాలని నిర్ణయించారు. కృష్ణబాబు, ఎమ్మెల్యే టి.వనితతో పాటు మాజీ ఎమ్మెల్యే జొన్నకూటి బాబాజీరావు, చింతలపూడి నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ కర్రా రాజారావు, దెందులూరు నియోజకవర్గ కాంగ్రెస్ కన్వీనర్ కొఠారు రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ పోలిపర్తి సత్యవతి, మున్సిపల్ వైస్‌చైర్మన్ బొబ్బా సుబ్బారావులతోపాటు కాంగ్రెస్, టీడీపీలకు చెందిన పలువురు నేతలు విజయమ్మ సమక్షంలోపార్టీలో చేరతారని బాలరాజు ప్రకటించారు.

source:sakshi

ప్రాణాలంటే లెక్కలేదు..

ఎర్రన్నాయుడు ప్రమాదానికి గురైతే 108కు 11 సార్లు ఫోన్ చేసినా పలకలేదట
మరో ప్రైవేటు అంబులెన్స్ వచ్చినా అందులో ఆక్సిజన్ లేక ఆయన మరణించారు
ప్రతి పథకాన్నీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది.. అవిశ్వాసం పెట్టకుండా టీడీపీ చోద్యం చూస్తోంది
చంద్రబాబు హయాంలో నేతన్నలు మరణిస్తే పైసా సాయం చేయలేదు
వైఎస్ వచ్చాక వారి కుటుంబాలకు రూ.లక్షన్నర పరిహారం ఇచ్చారు
నేతన్నల కోసం బడ్జెట్‌లో వైఎస్ రూ. 312 కోట్లు పెడితే.. ఇప్పటికీ చెల్లించలేదీ ప్రభుత్వం
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ శనివారం యాత్ర ముగిసేనాటికి.. రోజులు: 17, కిలోమీటర్లు: 223.60

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ‘నిన్నటికి నిన్న ఎర్రన్నాయుడు ప్రమాదానికి గురైనప్పుడు 108కు 11 సార్లు ఫోన్ చేసినా పలకలేదట. మరో ప్రైవేటు అంబులెన్స్ వచ్చినా దాంట్లో ఆక్సిజన్ లేక ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆయనే కాదు. ప్రతి ప్రాణం ముఖ్యం. కానీ ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు. ప్రతి పథకాన్నీ నిర్వీర్యం చేస్తోంది. నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్షం చోద్యం చూస్తోంది. ఆ బాధ్యతను చంద్రబాబు విస్మరించారు. చంద్రబాబు నిద్రపోతుంటే.. కిరణ్‌కుమార్‌రెడ్డి మొద్దు నిద్రపోతున్నారు. ఇద్దరూ ఇద్దరే. జోడీ బాగా సరిపోయింది..’ అంటూ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేతలపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెల్లెలు షర్మిల నిప్పులు చెరిగారు. ‘మరో ప్రజాప్రస్థానం’ 17వ రోజు శనివారం పాదయాత్రలో భాగంగా అనంతపురం జిల్లా ఉరవకొండలో జరిగిన భారీ సభలో ఆమె ప్రసంగించారు.

ఆ రూ. 312 కోట్లు ఎప్పుడు చెల్లిస్తారు?

‘‘ఉరవకొండ అంటే మొట్టమొదట గుర్తొచ్చేది చేనేత కార్మికులు. రాజశేఖరరెడ్డిని గుర్తు తెచ్చుకుంటే నేతన్నలు నేసిన తెల్లటి బట్టలు గుర్తొస్తాయి. చిక్కటి చిరునవ్వు జ్ఞాపకమొస్తుంది. నేతన్న అంటే రాజన్నకు, జగనన్నకు చాలా ప్రీతి. చంద్రబాబు హయాంలో నేతన్నలను పట్టించుకోకపోవడంతో వందల మంది ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదు. రాజన్న ముఖ్యమంత్రి కాగానే చంద్రబాబు హయాంలో చనిపోయిన నేతన్నల కుటుంబాలకు లక్షన్నర పరిహారం ఇచ్చి ఆదుకున్నాడు. నేతన్నలకు నడుములు వంగిపోతున్నాయని, కంటిచూపు దెబ్బతింటోందని 50 ఏళ్లకే పెన్షన్ వచ్చే ఏర్పాటుచేశాడు. వాళ్ల అప్పులు తీరిపోవాలని రుణమాఫీ కోసం రూ. 312 కోట్లు బడ్జెట్లో కేటాయించాడు. కానీ ఈ ప్రభుత్వం ఇప్పటివరకు వాటిని చెల్లించలేదు. ఈరోజు నేతన్న కుటుంబం పనికి వెళితే ఆ భార్యాభర్తలకు ఇద్దరికీ రోజుకు రూ. 70 కూడా గిట్టడం లేదట. రోజంతా కష్టపడితే వచ్చే ఈ డబ్బులతో ఆ కుటుంబం ఎలా గడిచేది? పవర్‌లూమ్స్ పెట్టుకుందామంటే కరెంటు ఇవ్వరు. ఇది వారి పొట్టమీద కొట్టడం కాదా?’’ అని షర్మిల నిలదీశారు.

ప్రజలకు అంతా తెలుసు: ‘‘ప్రజలకు తెలుసు.. చంద్రబాబుకు లేనిదీ, రాజన్న, జగనన్నలకు ఉన్నదీ మాట మీద నిలబడే నైజమని! ప్రజలకు తెలుసు.. చంద్రబాబుకు లేనిదీ, రాజన్న, జగనన్నలకు ఉన్నది విశ్వసనీయత అని! చంద్రబాబు ఒక ఇంటర్వ్యూలో అడిగారట. విశ్వసనీయత అంటే ఏమిటని? నాకు ఆశ్చర్యమనిపించింది. ఆయనకు విశ్వసనీయత అంటే తెలియకపోవడమేంటి? విశ్వసనీయత అంటే పిల్లలకు తల్లిదండ్రుల మీద ఉండే నమ్మకం. విశ్వసనీయత అంటే తమ నాయకుడు సొంత బిడ్డలా తమను చూసుకుంటాడన్న నమ్మకం. విశ్వసనీయత అంటే తమ నాయకుడు నిజాయతీపరుడు, మాట ఇస్తే నిలబడతాడు.. మడమ తిప్పడు అనే నమ్మకం. విశ్వసనీయత అంటే చంద్రబాబుకు ఈ జన్మలో అర్థం కాదు’’ అని షర్మిల అన్నారు. ‘‘పాదయాత్ర చేయాల్సిన అవసరమే ఆయనకు లేదు. ఈ అసమర్థ ప్రభుత్వాన్ని దింపేయడానికి కావాల్సినంత బలం ఆయనకుంది. కానీ అవిశ్వాసం పెట్టడట. ఈ ప్రభుత్వాన్ని దింపడట. పెంచి పోషిస్తాడట’’ అని విమర్శించారు.

బాబు నడకలో రాజకీయ ఆకాంక్ష: వైఎస్ విజయమ్మ

ఉరవకొండ సభలో వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ ‘‘8 ఏళ్ల 8 నెలల పాలనలో చంద్రబాబు ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మార్చారు. ఇప్పుడు ఆయనే సలహాదారుగా ఈ ప్రభుత్వం నడుస్తోంది. చంద్రబాబు రాజకీయ ఆకాంక్ష ఆయన నడకలో కనిపిస్తోంది. ఎన్నికల కోసం ఏమైనా చెబుతాడాయన. పైగా ఈ ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం అని కూడా చెబుతారు’’ అని దుయ్యబట్టారు. ‘‘ఉచిత విద్యుత్తు ఇస్తారట. రుణాలు మాఫీ చేస్తారట. బెల్ట్ షాపులు రద్దు చేస్తారట. గ్యాస్ ధర పెంచనేలేదట. ప్రాజెక్టులు పూర్తిచేస్తారట. అప్పుడు వ్యవసాయం దండగ అన్నది చంద్రబాబు కాదా? ఉచిత విద్యుత్తు ఇస్తే బట్టలు ఆరేసుకోవచ్చన్నది చంద్రబాబు కాదా? పంటలు ఎండిపోతున్నాయి.. కరెంటు ఇవ్వాలని కోరితే.. ఎండిపోయాక కరెంటు ఎందుకు అని ఎగతాళి చేసింది చంద్రబాబు కాదా?’’ అని ప్రశ్నించారు.

ఉరకలెత్తిన ఉరవకొండ: మరో ప్రజాప్రస్థానం 17వ రోజు అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ కేంద్రానికి చేరడంతో షర్మిల వెంట జన ఉప్పెన కదిలింది. శనివారం ఉదయం లత్తవరం సమీపం నుంచి ఉదయం గం.11.15కు పాదయాత్ర మొదలవగా.. అడుగడుగునా జనం బారులు తీరి ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఉరవకొండ సమీపంలోకి రాగానే పాదయాత్రకు వేలాది మంది స్వాగతం పలికారు. భోజన విరామ అనంతరం 3.30కు వేలాది మంది జనం కదం కలపగా షర్మిల ఉరవకొండ వీధుల్లో పాదయాత్ర చేశారు. సాయంత్రం 5.45కు బస్టాండ్ సెంటర్‌కు చేరుకున్న షర్మిల, విజయమ్మ భారీ సభలో ప్రసంగించారు. భారీ వర్షంలో తడుస్తూనే రాత్రి 7.35కు మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన రాత్రి బసకు చేరుకున్నారు. శనివారం 10 కి.మీ. మేర పాదయాత్ర సాగింది. ఇప్పటివరకు పాదయాత్ర 223.60 కిలోమీటర్లు పూర్తయింది. శనివారం పాదయాత్రలో ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, గురునాథరెడ్డి, కాపు రాంచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు, పార్టీ నేతలు వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, ఉరవకొండ ఇన్‌చార్జి వై.విశ్వేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. సాయంత్రం జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే కె.శ్రీనివాసులు పాల్గొన్నారు.

షర్మిల వెంట కొడుకు, కూతురు..

షర్మిల కుమారుడు రాజారెడ్డి, కూతురు అంజలి తల్లిని కలిసేందుకు లత్తవరం సమీపంలో బస చేసిన చోటుకు వచ్చారు. వారిద్దరూ తల్లితో పాటు మధ్యాహ్న భోజన విరామం వరకు దాదాపు 4 కిలోమీటర్ల మేర పాదయాత్రలో పాల్గొన్నారు. 12.40కి కాసేపు వర్షం కురవగా వర్షంలోనే వారు కూడా పాదయాత్ర చేశారు.

రోజుకు రూ. 70తో బతికేదెలా?

షర్మిల ఉరవకొండ వీధుల్లో వెళుతున్నప్పుడు.. చేనేత కార్మికులైన మల్లికార్జున్, సరోజ దంపతుల ఇంటికి వెళ్లి వారి కష్టాలు తెలుసుకున్నారు. చీర నేస్తే ఇద్దరికి కలిసి రోజుకు రూ. 70 ఆదాయం వస్తోందని, నిత్యావసర ధరలు మండిపోతున్నాయని,ఈ ఆదాయం ఏమూలకూ సరిపోదని ఆవేదన వ్యక్తంచేశారు. రూ. 1,600 అమ్మాల్సిన చీర ఇప్పుడు రూ. 1,400కు అమ్మాల్సివస్తోందని, అదే చీరను షోరూముల్లో రూ. 2,500కు అమ్ముతున్నారని వాపోయారు. ముడిసరుకు ధర 200 శాతం పెరిగిందని తెలిపారు. తమకు చేనేత తప్ప వేరే పని రాదని, బతకడం కష్టంగా మారిందని విన్నవించారు. దీనికి షర్మిల స్పందిస్తూ జగనన్న సీఎం అయ్యాక చేనేత కష్టాలన్నీ తీరుతాయని భరోసా ఇచ్చారు.

రైతులపై ఈ ప్రభుత్వం కక్ష సాధింపు

 ఉరవకొండ వీధుల్లో శనివారం జన ప్రవాహం పోటెత్తింది. వైఎస్సార్‌సీసీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, తనయ షర్మిలకు జనం బ్రహ్మరథం పట్టారు. టీడీపీకి పట్టున్న గ్రామాలు, ఉరవకొండ పట్టణంలో రికార్డు స్థాయిలో జనం పోటెత్తి, షర్మిల వెంట కదంతొక్కడం సరికొత్త రాజకీయ సమీకరణాలకు దారితీయనుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

శుక్రవారం రాత్రి లత్తవరం శివారులో బస చేసిన షర్మిల శనివారం ఉదయం 11.30 గంటలకు పాదయాత్రకు ఉపక్రమించారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో 17 రోజులుగా నడుస్తోన్న షర్మిలకు ఆమె కుమారుడు రాజారెడ్డి, కుమార్తె అంజలి శనివారం సంఘీబావం ప్రకటిస్తూ తల్లి వెంట అడుగులో అడుగేస్తూ కదంతొక్కారు. భారీ జనసందోహం మధ్య లత్తవరం గ్రామం చేరుకున్న షర్మిలకు ఆ గ్రామ ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. లంబాడీ మహిళలు సంప్రదాయ నృత్యాలతో.. అడుగడుగునా హారతులు పట్టి ఘనస్వాగతం పలికారు. గ్రామంలో రచ్చబండ నిర్వహించిన షర్మిల.. ప్రజల నుంచి సమస్యలను తెలుసుకున్నారు.

లత్తవరం గ్రామానికి చెందిన ఓ మహిళ మాట్లాడుతూ ‘అమ్మా.. మాకు పది కేజీల బియ్యమే ఇస్తున్నారు. నా కుమారుడికి పెళ్లైంది. ఐదుగురికి పది కేజీల బియ్యం సరిపోవడం లేదు. అర్ధాకలితో మాడిపోతున్నాం’ అంటూ విలపించారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘మహానేత వైఎస్ బతికి ఉండి ఉంటే.. మీ కుటుంబానికి ప్రతి నెలా 30 కేజీల బియ్యం అందేవి. వైఎస్ రెండో సారి కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడానికి రెండు హామీలు ఇచ్చారు. అందులో ఒకటి ప్రతి నెలా 30 కేజీల బియ్యం.. సేద్యానికి తొమ్మిది గంటల విద్యుత్. ఆ రెండు హామీలను తుంగలోతొక్కిన ఈ ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పొడిచింది. త్వరలో రాజన్న రాజ్యం వస్తుంది. అప్పుడు మీకు 30 కేజీల బియ్యం వస్తాయి’ అంటూ భరోసా ఇచ్చారు. 

అంతలో మరో విద్యార్థిని మాట్లాడుతూ ‘అక్కా.. మాకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వడం లేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించడం లేదు. దీని వల్ల కాలేజీల యాజమాన్యాలు ముందుగానే ఫీజు కట్టించుకుంటున్నాయి. మాకు ఆర్థిక స్థోమత లేక ఫీజులు కట్టలేక చదువులను అర్ధంతరంగా ఆపేస్తున్నాం’ అంటూ విలపించింది. ఇందుకు షర్మిల స్పందిసూ.. ‘పేద ప్రజలంటే ఈ ప్రభుత్వానికి ఎంత చులకనో దీన్ని బట్టే అర్థమవుతోంది. ప్రతి ఇంట్లోనూ ఒకరు డాక్టరో ఇంజనీరో వంటి చదవులు చదివితే పేదరికం పోతుందని రాజన్న కన్న కలలను ఈ ప్రభుత్వం కల్లలు చేస్తోంది. త్వరలో జగనన్న సీఎం అవుతారు. రాజన్నలానే అన్ని పథకాలను అమలు చేస్తారు’ అంటూ ధైర్యం చెప్పారు. ఇంతలోనే కొందరు రైతులు మాట్లాడుతూ ‘అమ్మా.. మాకు ఇన్‌పుట్ సబ్సిడీ గానీ, పావలా వడ్డీ రుణాలు గానీ.. పంట నష్టపరిహారం గానీ అందడం లేదు’ అంటూ వాపోయారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘రైతులపై ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. వైఎస్ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా రైతుల కోసం పోరాడారు. 



జగనన్న అలానే చేస్తారు. కొద్ది రోజులు ఓపికపట్టండి.. రాజన్న రాజ్యంలో రైతేరాజు’ అంటూ ఆత్మస్థైర్యం నింపారు. లత్తవరం గ్రామానికి చెందిన ఓ మహిళ మాట్లాడుతూ ‘అమ్మా.. వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ మేరకు రుణాలు ఇవ్వడం లేదు. వైఎస్ హయాంలో పావలా వడ్డీ రాయితీ క్రమం తప్పకుండా అందేది’ అంటూ విన్నవించుకున్నారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘మహిళలకు, రైతులకు వడ్డీలేని రుణాలు ఇస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం ఆ ఉత్తర్వులు అమలు చేయడంలో చేతులెత్తేసింది. రాజన్న రాజ్యంలో వడ్డీ లేని రుణాలను జగనన్న కచ్చితంగా ఇస్తారు’ అంటూ ధైర్యం చెప్పారు. లత్తవరం గ్రామం దాటగానే ఒక్కసారిగా భారీ వర్షం ప్రారంభమైంది.

హంద్రీ-నీవా ఇంకెన్నాళ్లలో 
పూర్తి చేస్తారు..?
బురదమయమైన రోడ్డులో.. భారీ వర్షంలోనే షర్మిల, ఆమె కుమారుడు రాజారెడ్డి, కుమార్తె అంజలి, వేలాది మంది ప్రజలు లత్తవరం నుంచి ఉరవకొండ దిశగా కదిలారు. మార్గమధ్యలో హంద్రీ-నీవా కాలువను పరిశీలించిన షర్మిల.. ‘దేశంలో తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో జిల్లా రెండో స్థానంలో ఉంది. సాగునీళ్లకే కాదు.. తాగునీటి కొరత ఉంది. దీన్ని నివారించడానికి వైఎస్ హంద్రీ-నీవాను చేపట్టారు. జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలకు సాగు నీళ్లు.. 400 గ్రామాలకు తాగు నీళ్లు ఇవ్వాలని నిర్ణయించారు. తొలి దశ పూర్తి చేయడానికి రూ.45 కోట్లు ఖర్చు చేస్తే చాలు. 


కానీ.. ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. హంద్రీ-నీవాకు రెండు సార్లు శంకుస్థాపన చేసిన చంద్రబాబు ఆ తర్వాత తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. రైతుల పట్ల చంద్రబాబు, కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదనడానికి ఇదే తార్కాణం’ అంటూ విమర్శించారు. ఆ తర్వాత జోరువానలోనే ఉరవకొండకు చేరుకున్నారు. ఉరవకొండ గవిమఠం ఎదురుగా ఉన్న మైదానంలో భోజనం చేసి.. కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. అప్పటికి వరుణుడు కాస్త శాంతించాడు. వరుణుడు కన్నెర్ర చేసినా జనం మాత్రం చెక్కుచెదరలేదు. వర్షంలోనే తడుస్తూ వేలాది మంది ప్రజలు వేచి చూస్తూనే ఉండిపోయారు. సాయంత్రం 3.30 గంటలకు ఉరవకొండ పట్టణంలో పాదయాత్రకు ఉపక్రమించారు. పోలీసుస్టేషన్, మూగబసన్నకట్ట, ఎస్సీ కాలనీ, గాంధీబజారు మీదుగా పురవీధుల్లో కలియతిరిగారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మార్కెండేయ స్వామి గుడి వద్ద అర్చకులు షర్మిలకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కాసుల ఆంజనేయులు అనే చేనేత కార్మికుని ఇంట్లోకి వెళ్లిన షర్మిల.. చేనేతల పరిస్థితులను ఆరా తీశారు. ‘అమ్మా.. ముడిసరుకుల ధరలు పెరిగాయి. కానీ.. చీరలకు గిట్టుబాటు ధరలు లేవు. ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదు. 

రోజుకు రూ.70 మాత్రమే కూలీగా గిట్టుబాటవుతోంది. రోజుకు రూ.70తో ఎలా బతకాలి’ అంటూ విలపించారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘అన్నా బాధపడొద్దు. రాజన్న రాజ్యం వస్తుంది. అప్పుడు ముడిసరుకులను ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. చీరలకు గిట్టుబాటు ధర కల్పిస్తుంది. వడ్డీ లేని రుణాలు ఇస్తుంది’ అంటూ ధైర్యం చెప్పారు. హంద్రీ-నీవాకు దివంగత సీఎం వైఎస్ వేసిన శంకుస్థాపన శిలాఫలకాన్ని పరిశీలించారు. ఆ పక్కనే చంద్రబాబు వేసిన శిలాఫలకాన్ని కూడా పరిశీలించిన షర్మిల.. ‘బాబు వేసిన శిలాఫలకం దిష్టిబొమ్మలా మిగిలిపోయింది’ అంటూ ఎద్దేవా చేశారు.

చంద్రబాబు, కాంగ్రెస్‌లను 
కడిగిపారే సిన షర్మిల
ఉరవకొండ నడిబొడ్డున టవర్‌క్లాక్ సమీపంలో నిర్వహించిన బహిరంగసభకు జనం రికార్డు స్థాయిలో పోటెత్తారు. ఈ బహిరంగసభలో వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ ‘వైఎస్ రెక్కల కష్టంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన ఇచ్చిన హామీలను తుంగలోతొక్కి ప్రజలను ఇబ్బందులపాలు చేస్తోంది. ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారు.

ఇప్పుడు అధికారం కోసం అర్రులు చాస్తూ పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రలో ఉచిత విద్యుత్ ఇస్తామని, రుణాల మాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇస్తున్నారు. కానీ.. ఆయన అధికారంలో ఉన్నప్పుడు వాటిని అవహేళన చేసిన మాట వాస్తవం కాదా? చేనేత, రైతు ఆత్మహత్యలను అపహాస్యం చేసిన మాట నిజం కాదా?’ అంటూ కడిగిపారేశారు. ఆ తర్వాత షర్మిల మాట్లాడుతూ ‘చేనేతల సంక్షేమం కోసం పాటుపడింది ఒక్క వైఎస్ మాత్రమే. ఇప్పుడు చేనేతల కోసం పోరాటం చేస్తోంది ఒక్క జగనన్న మాత్రమే. రాజన్న ప్రాంభించిన 108 సర్వీసు ఇప్పుడు సక్రమంగా పనిచేసి ఉంటే.. ప్రమాదంలో గాయపడిన టీడీపీ సీనియర్ నాయకుడు ఎర్రన్నాయుడు బతికి ఉండేవారు. 11 సార్లు ఫోన్ చేసినా 108 సకాలంలో చేరలేదు. దాంతో.. ఆయన మృతి చెందారు. ఒక్క ఎర్రన్నాయుడే కాదు.. వందలాది మంది ప్రజలు, గర్భిణులు మృతి చెందుతున్నారు. ఇదీ ఈ ప్రభుత్వం పనితీరుకు పరాకాష్ట. ప్రజావంచక ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన చంద్రబాబు కాంగ్రెస్‌తో అంటకాగుతున్నారు. ప్రజల కోసం పోరాడుతోన్న జగనన్నను జైలు పాలు చేయించారు.



దేవుడున్నాడు. జగనన్న ఏదో ఒక రోజు బయటకు వస్తారు.. రాజన్న రాజ్యాన్ని స్థాపిస్తారు. జగనన్నను ఆశీర్వదించండి’ అంటూ ప్రజలకు ధైర్యం చెప్పారు. బహిరంగసభ ప్రారంభంలోనే విద్యుత్ సరఫరాను నిలిపేసిన కాంగ్రెస్, టీడీపీ నేతలు.. సభ ముగిశాక విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. 

సభ ముగిసే వరకు ఓపిక పట్టిన వరుణుడు ఆ తర్వాత విజృంభించాడు. ఉరవకొండలో భారీ వర్షం కురిపించాడు. ఆ వర్షంలోనే ఆమె నడుస్తూ రాత్రి 7.45 గంటలకు మార్కెట్ యార్డ్ వద్దకు చేరి రాత్రి అక్కడే బస చేశారు. మొత్తమ్మీద శనివారం పాదయాత్రలో 10 కిలోమీటర్ల దూరం నడిచారు.

షర్మిల నేటి పాదయాత్ర ఇలా..

జననేత వైఎస్ జగన్ సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర ఆదివారం ఉరవకొండ మార్కె ట్ యార్డు నుంచి ప్రారంభమై గాలిమరల సర్కిల్, వజ్రకరూరు మండలంలోని పీసీ ప్యాపిలి క్రాస్, కడమలకుంట క్రాస్, హం ద్రీ-నీవా కాలువ మీదుగా రాగులపాడు వరకు సాగుతుంది. రాగులపాడులో ఏర్పా టు చేసిన బహిరంగ సభలో షర్మిల ప్రసంగిస్తారు. అనంతరం రాత్రి అక్కడే బస చేస్తారు. ఆదివారం 12.5 కిలోమీటర్లు నడుస్తారని ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ శంకర్‌నారాయణ, సీఈసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి తెలిపారు.

రేపు వజ్రకరూరులో బహిరంగ సభ
షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర సోమవారం రాగులపాడు నుంచి పందికుంట, తట్రకల్లు, గంజికుంట మీదుగా వజ్రకరూరు వరకు సాగుతుంది. వజ్రకరూరులోని గాంధీ విగ్రహం వద్ద బహిరంగ సభలో షర్మిల ప్రసంగిస్తారు. రాత్రి అక్కడే బస చేస్తారు.

source:sakshi

వైఎస్సార్ సీపీలోకి చిట్టూరి బాపినీడు

 ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ ఎమ్మెల్యే చిట్టూరి బాపినీడు తనయుడు చిట్టూరి నరేంద్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. పార్టీగౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సమక్షంలో అభిమానులతో కలిసి చేరతానని శనివారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి, తనతండ్రి బాపినీడు చేసిన సేవలు కొనసాగించేందుకు వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు నరేంద్ర వివరించారు. ప్రముఖ పారిశ్రామిక వేత్తగా పేరొందిన నరేంద్ర చేరికతో పార్టీ మరింత బలపడుతుందని పార్టీ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=480421&Categoryid=14&subcatid=0

YS Vijayamma's speech at uravakonda in Anantapur

YS Sharmila's speech at Uravakonda in Anantapur

జనసంద్రమయిన ఉరవకొండ

మహానేత వైఎస్ తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర అనంతపురం జిల్లా ఉరవకొండలో సాగుతోంది. యాత్రలో భాగంగా నేత కార్మికుడు కాసుల ఆంజనేయులు ఇంటికి వెళ్లి మగ్గాలను షర్మిల పరిశీలించారు. అనంతరం ఉరవకొండ బస్టాండ్ సెంటర్ కు చేరుకున్న షర్మిలకు అపూర్వ స్వాగతం లభించింది. మహానేత తనయను చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. ఆ ప్రాంతమంతా జనంతో నిండిపోయింది. ఎటుచూసినా జనమే కనిపించారు. 


source:sakshi

హంద్రీనివాను పరిశీలించిన షర్మిల

ఉరవకొండ సమీపంలో హంద్రీనివా కాలువను షర్మిల శనివారం పరిశీలించారు. హంద్రీనివా కాలువ పనులు అయిదు శాతం పూర్తయితే ఫలితాలు రైతులు అందుతాయన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆమె ఆరోపించారు. కాగా ఎర్రన్నాయుడు మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని షర్మిల అన్నారు. 

108 సకాలంలో రాకపోవడం వల్లనే ఆయన మృతి చెందారన్నారు. 108 సమయానికి వచ్చిఉంటే ఎర్రన్నాయుడు బతికి ఉండేవారని తెలిపారు. ఎర్రన్నాయుడులాగా ఎంతో మందిని ఈ ప్రభుత్వం పొట్టన పెట్టుకుంటోందని షర్మిల విమర్శించారు. వైఎస్ఆర్‌ ఉన్నప్పుడు 108 ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టిందని షర్మిల గుర్తు చేశారు.

source:http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=480398&Categoryid=14&subcatid=0

సర్‌ఛార్జీల పేరుతో మోత: వైఎస్ఆర్ సీపీ

విద్యుత్ సర్‌ఛార్జీల పేరుతో మూడేళ్ల నుంచి ఈ ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరుస్తోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జనక్ ప్రసాద్‌ విమర్శించారు. వైఎస్‌ఆర్ తన హయంలో ఏరోజూ ఒక్క రూపాయి కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదని గుర్తు చేశారు. వైఎస్‌ఆర్ మరణాంతరం సీఎం పీఠమెక్కిన రోశయ్య, కిరణ్‌ ఛార్జీల మోత మోగిస్తున్నారని ఎద్దేశా చేశారు. సర్దుబాటు ఛార్జీలు పెంచాలన్న నిర్ణయం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని ఆరోపించారు. 

ఈ అసమర్థ ప్రభుత్వానికి చంద్రబాబు ఎందుకు మద్దతిస్తున్నారని, అవిశ్వాసం ఎందుకు పెట్టడంలేదని సూటిగా ప్రశ్నించారు. వైఎస్‌ విజయమ్మ, వైఎస్ భారతి ఢిల్లీ వెళ్లినట్లు ఓ దినపత్రిక గాలివార్తలు రాసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవన్నీ తప్పుడు కథనాలేనని జనక్ ప్రసాద్‌ కొట్టిపారేశారు.


source:
http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=480407&Categoryid=14&subcatid=0


promote our official website

కొవ్వూరు బహిరంగ సభ రద్దు

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదివారం నాడు పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభ రద్దయ్యింది. భారీ వర్షాల కారణంగా  చేతికందిన పంట నష్టపోయి రైతు తీరని కష్టంలో ఉన్నాడనీ, అందుకనే సభను రద్దు చేశామనీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బాలరాజు వెల్లడించారు. ఆ సభలో పార్టీలో చేరాలనుకున్న వారు హైదరాబాద్ వచ్చి పార్టీలో చేరతారని చెప్పారు

continue.........

http://www.ysrcongress.com/news/news_updates/kovvooru_bahiraMga_sabha_raddu.html

Thursday, 1 November 2012

పాలకుల ఫ్యామిలీతో పెట్టుకున్నా అంతే సంగతులు

Written by Srinu On 11/2/2012 3:25:00 AM
రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అంటారు మన పెద్దోళ్లు. పాలకులు ఉన్న పవర్ అంటువంటి మరి. ప్రభువులు కన్నెర్ర చేస్తే ఎంతటివారి అడ్రస్ అయినా గల్లంతవాల్సిందే. పాలకుల ఫ్యామిలీతో పెట్టుకున్నా అంతే సంగతులు. తమను ప్రశ్నించినా, ఎదరించి నిలబడి వారిని చూస్తే ఏలికలకు చిర్రెత్తుకొస్తుంది. నటనలో ఆస్కార్‌కు ఏమాత్రం తీసిపోని నేతలు ఇలాంటి సమయాల్లోనే తమ ‘చాతుర్యం’ చూపుతారు. తమకు చుట్టంగా సేవలందిస్తున్న చట్టానికి పనిచెబుతారు. తమకు వ్యతిరేకంగా గళం విప్పిన వాడికి చుక్కలు చూపిస్తారు. అప్పుడే కదా పాలకుల ‘విలువ’ సామాన్యులకు తెలిసేది.

సమయం చిక్కాలేకానీ తమకు తెలిసిన ‘విద్య’ను ప్రదర్శించేందుకు ప్రభువులు వెనుకాడరు. కేంద్రంలోని ప్రగతిశీల సర్కారులో విత్త మంత్రిగా కొలువు వెలగబెడుతున్న కాంగ్రెస్ నేత పళనియప్పన్ చిదంబరం తన చాణక్యాన్ని చాటారు. తన సుపుత్రుడు కార్తీ చిదంబరంపై సామాజిక సంబంధాల వెబ్‌సైట్‌లో ఆరోపణలు చేసిన ఓ అనామకుడిపై బ్రహ్మాస్త్రం ప్రయోగించారు. ట్విటర్‌లో తన కుమారుడిపై ఆరోపణలు చేసిన అవినీతి వ్యతిరేక కార్యకర్త, పాండిచ్చేరికి చెందిన చిరువ్యాపారి రవి శ్రీనివాసన్‌ను శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపేలా చక్రం తిప్పారు. అంతేకాదు మూడేళ్లు జైలు శిక్ష పడేలా కేసు నమోదు చేయించారు.

ఇంతకీ శ్రీనివాసన్ చేసిన నేరం ఏమిటంటే ‘‘సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా కంటే కార్తీ చిదంబరం అధిక సంపద పోగేశారు’’ ట్విటర్‌లో పోస్ట్ చేయడమే. విత్తమంత్రి కుమారుడు ఇచ్చిన ఈ-మెయిల్ ఫిర్యాదుతో ఆగమేఘాల కదలిన ఖాకీలు శ్రీనివాసన్‌ను అరెస్ట్ చేశారు. అతడిపై 66-ఏ సెక్షన్ కింద కేసు పెట్టేసి స్వామిభక్తి చాటుకున్నారు. విశేషమేమిటంటే 45 ఏళ్ల శ్రీనివాసన్‌కు ట్విటర్‌లో కేవలం 16 మంది ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు. సీబీసీఐడీ అధికారులు తెల్లవారుజామున 5 గంటలకు ఇంటికి వచ్చి నిద్రలేపి మరీ తనను అరెస్ట్ చేశారని నిందితుడు వాపోయాడు. తాను చేసిన తప్పేంటని ప్రశ్నిస్తుడు. పాలకులతో పెట్టుకోడమే అతడు చేసిన తప్పా?

అన్నివైపుల నుంచి దూసుకువస్తున్నఅవినీతి ఆరోపణలతో ‘హస్తం’ పార్టీ నేతలు సతమవుతున్నారు. అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్ లాంటి ఉద్యమకారులు గుప్పిస్తున్న ఆరోపణాస్త్రాలు ఎదుర్కొలేక ఇరిటేట్ అవుతున్నారు. ఉద్యమ నేతలను ఏమీ చేయలేకపోతున్న ఏలికలు సామాన్యులపై తమ ‘ప్రతాపం’ చూపుతున్నారు. శ్రీనివాసన్ ఉదంతమే ఇందుకు ఉదాహరణ. దినపత్రికల్లో తాను చ దివిన వాటినే ట్విటర్‌లో పోస్ట్ చేశానని, తననే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారని శ్రీనివాసన్ సంధిస్తున్న ప్రశ్నలకు పోలీసుల నుంచి సమాధానం లేదు.

అతడిపై 66-ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేయడాన్ని బట్టే అర్థమవుతుంది దీనివెనుకున్న చిదంబర రహస్యం. దీనిబట్టి చూస్తే ఇండియా ఎగెనెస్ట్ కరప్షన్(ఐఏసీ) కార్యకర్తలను టార్గెట్ చే శారన్న శంక కలుగుతోంది. కేజ్రీవాల్‌కు దన్నుగా నిలిచిన ఐఏసీ కార్యకర్తల దూకుడుకు కళ్లెం వేసేందుకు పాలకులు పన్నాగం పన్నారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నాయకుల బెదిరింపులకు తాను భయపడనని, తనకు కావాల్సిందల్లా అవినీతి వ్యతిరేక ఉద్యమకారుల నైతిక మద్దతు మాత్రమేనని శ్రీనివాసన్ అంటున్నాడు. ‘పవర్’కు భయపడని వాడు ఎవరికి తలవంచడని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు!

http://www.sakshi.com/Main/Featuredetails.aspx?Newsid=51830&Categoryid=28&subcatid=0

ఎర్రన్నాయుడు మృతికి విజయమ్మ దిగ్ర్భాంతి

తెలుగుదేశం పార్టీ నాయకుడు, సీనియర్ పార్లమెంటేరియన్ ఎర్రన్నాయుడు మృతి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఎర్రన్నాయుడు సుదీర్ఘ కాలం రాష్ట్ర, కేంద్ర రాజకీయాల్లో తనదైన పాత్ర నిర్వహించారని ఆమె అన్నారు. ఎర్రన్నాయుడు కుటుంబ సభ్యులకు వైఎస్ విజయమ్మ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి లక్ష్మీపార్వతి

 ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించారు. ఈ నెల 4న పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో జరిగే బహిరంగ సభలో పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో ఆమె పార్టీలో చేరనున్నారు. ఆమెతోపాటు తమ్మిశెట్టి నిరంజన్‌కుమార్ ఆధ్వర్యంలో సుమారు 300 మంది ఎన్టీఆర్ అభిమానులు వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరనున్నారు.

‘జన’ తుపాను ముందు ‘నీలం’ తుపాను చిన్నబోయింది


 ‘జన’ తుపాను ముందు ‘నీలం’ తుపాను చిన్నబోయింది. నీలం తుపాను బలహీనపడితే.. జన తుపాను నానాటికీ బలపడుతోంది. షర్మిల వెంట ప్రజలు తండోపతండాలుగా కదం తొక్కుతుండటంతో జన తుపాను బలబడుతూ కాంగ్రెస్, టీడీపీ శిబిరాల్లో ప్రళయం సృష్టిస్తోంది. మహానేత వైఎస్ తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రకు గురువారం ఉరవకొండ నియోజకవర్గం పరిధిలోని కూడేరు మండలం ముద్దలాపురం, జల్లిపల్లి, ఉదిరిపికొండ, శివరాంపేటల్లో జనం పోటెత్తారు. నీలం తుపాన్ ప్రభావం వల్ల జోరుగా వర్షం కురిసినా జనం చెక్కుచెదరలేదు. సరి కదా సమయం పెరిగే కొద్దీ జనం రెట్టింపై షర్మిల వెంట అడుగులో అడుగేసి కదంతొక్కారు. 

బుధవారం రాత్రి కూడేరుకు నాలుగు కిమీలోమీటర్ల దూరంలో బస చేసిన షర్మిల గురువారం ఉదయం 11 గంటలకు పాదయాత్రకు ఉపక్రమించే సరికి వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షంలోనే షర్మిల పాదయాత్రను ప్రారంభించారు. ముద్దలాపురం శివారులో ఇద్దరు మరుగుజ్జు మహిళలను అప్యాయంగా పలకరించిన షర్మిల.. వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. ‘అమ్మా.. అధైర్యపడొద్దు. రాజన్న రాజ్యం వస్తుంది. అప్పుడు నెలకు రూ.వెయ్యి చొప్పున వికలాంగులకు పెన్షన్ వస్తుంది’ అంటూ ధైర్యం చెప్పడంతో వారి కళ్లలో వెలుగులు నిండాయి. ముద్దలాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మువ్వన్నెల జెండాను ఆవిష్కరించిన షర్మిల.. విద్యార్థులతో మమేకమయ్యారు. బాగా చదువుకోవాలని సూచించారు.

ఆ తర్వాత ముద్దలాపురం చేరుకున్న ఆమెకు జనం నీరాజనాలు పలికారు. అడుగడుగునా హారతులు పట్టి.. గుమ్మడికాయతో దిష్టితీసి, ఇంటి బిడ్డలా ఆదరించడంతో షర్మిల ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. ఆ తర్వాత గ్రామ ప్రజలతో రచ్చబండ నిర్వహించారు. ‘వేరుశనగకు వాతావరణ బీమా వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. వైఎస్ ఉన్నప్పుడు గ్రామం యూనిట్‌గా పంటల బీమా వల్ల పంట పండకపోయినా నష్టపరిహారం వచ్చేది. గ్రామాల్లో జ్వరాలు పెరిగిపోయాయి. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రైతుల లోగిల్లలో పంట దిగుబడులు లేవు.. అప్పులే మిగిలాయి’ అంటూ సమస్యలను ఏకరువు పెట్టారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘పాలక, ప్రతిపక్షాలు దొందూ దొందే. కొద్ది రోజులు ఓపిక పట్టండి. జగనన్న సీఎం అవుతారు. మీ కష్టాలను కడతేర్చుతారు’ అంటూ భరోసా ఇచ్చారు.
బీమా లేకుండా చేసి నట్టేట ముంచింది..



ముద్దలాపురం గ్రామం నుంచి వైఎస్సార్ వాటర్ ప్రాజెక్టు వద్దకు చేరుకున్న షర్మిల అక్కడే భోజనం చేసి, కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షంలోనే పాదయాత్రను కొనసాగించారు. జల్లిపల్లి శివారులో గొర్రెల కాపరులతో ముచ్చటించారు. ‘అమ్మా.. వైఎస్ ఉన్నప్పుడు గొర్రెకు రూ.18 చొప్పున కట్టించుకుని బీమా సౌకర్యం కల్పించేవారు. గొర్రె చనిపోతే నష్టపరిహారం ఇచ్చేవారు. గొర్రెలకు మందులు కూడా వేసేవారు. కానీ.. ఇప్పుడు బీమా రద్దు చేశారు. 

మందులు వేయడం లేదు. ఒక్క గొర్రె చనిపోతే ఆరేడు వేల రూపాయల నష్టం వస్తోంది. అదే బీమా ఉంటే మాకు ఆ నష్టం జరిగేది కాదు’ అంటూ సమస్యలను ఏకరువు పెట్టారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘కులవృత్తులను ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. టీడీపీ కూడా ప్రభుత్వానికే వంతపాడుతోంది. జగనన్న సీఎం అవుతారు.. కులవృత్తులకు పెద్దపీట వేస్తారు. రాజన్న చేపట్టిన పథకాలను మళ్లీ చేపట్టి ఆదుకుంటారు’ అనడంతో గొర్రెల కాపర్ల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. 



అక్కడి నుంచి జల్లిపల్లికి చేరుకున్న షర్మిల అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. ‘జగనన్న రైతుల కోసం, విద్యార్థుల కోసం.. చేనేతల కోసం దీక్షలు చేశారు. పోరాటాలు చేశారు. వైఎస్ తరహాలోనే ప్రజల పక్షాన పోరాడి.. జనం హృదయాలను గెలుచుకున్నారు. దీన్ని చూసి ఓర్వలేక.. కాంగ్రెస్, టీడీపీలకు ఉనికి ఉండదనే భయంతోనే జగనన్నను సీబీఐతో అరెస్టు చేయించాయి. చివరకు బెయిల్ కూడా రాకుండా అడ్డుకుంటున్నాయి. దేవుడనేవాడు ఉన్నాడు. న్యాయం జరుగుతుంది. జగనన్న బయటకు వచ్చి.. రాజన్న రాజ్యాన్ని స్థాపిస్తారు’ అంటూ ప్రజలకు ధైర్యం చెప్పారు. జల్లిపల్లి సభ తర్వాత ఉదిరిపికొండకు చేరుకున్న షర్మిలకు ఆ గ్రామ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆ గ్రామంలో రచ్చబండ నిర్వహించి.. సమస్యలు తెలుసుకున్నారు. 



ఉదిరిపికొండ రైతులు మాట్లాడుతూ ‘వైఎస్ హయాంలో 99 శాతం పంట నష్టపరిహారం వచ్చింది. దీని వల్ల అప్పులు తీరాయి. కానీ.. ఇప్పుడు వాతావరణ బీమా వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. కరెంట్ సక్రమంగా ఇవ్వడం లేదు. రైతులు ఎలా బతకాలి’ అంటూ విలపించారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘మహానేత వైఎస్ అధికారంలో ఉన్నా లేకున్నా రైతుల కోసం పోరాటం చేశారు. జగనన్న అదే తరహాలో పోరాటం చేస్తున్నారు. కొద్ది రోజులు ఓపిక పట్టండి.. మంచి రోజులు వస్తాయి’ అంటూ భరోసా ఇచ్చి ముందుకు కదిలారు.

జనాదరణ ఓర్వలేకే కుట్రలు..
ఉదిరిపికొండ నుంచి శివరాంపేటకు చేరుకున్న షర్మిలకు ఆ గ్రామ ప్రజలు ఆత్మీయంగా స్వాగతం పలికారు. షర్మిలపై బంతిపూల వర్షం కురిపించారు. అక్కడ గ్రామీణుల సమస్యలను తెలుసుకున్న తర్వాత షర్మిల మాట్లాడుతూ.. ‘జగన్ కాంగ్రెస్‌లో ఉంటే ఇన్ని కష్టాలు పడి ఉండేవారు కాదని గులాంనబీ ఆజాద్ అన్నారు. దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ కక్ష సాధింపుల్లో భాగంగానే జగనన్నను అరెస్టు చేయించారన్న విషయం అర్థమవుతోంది. 

టీడీపీతో కుమ్మక్కైన కాంగ్రెస్ జగనన్నను ప్రజలకు దూరం చేస్తోంది. జగనన్నకు ఉన్న ప్రజాదరణను చూసి ఓర్వలేక ఈ కుట్రలు చేస్తున్నారు. ఏదో ఒక రోజు జగనన్న బయటకు రాకపోరు.. మీ తరఫున పోరాటం చేయకపోరు.. రాజన్న రాజ్యాన్ని స్థాపించకపోరు.. మీ కష్టాలను కడతేర్చకపోరు.. ఓపికపట్టండి’ అంటూ ధైర్యం చెప్పారు. శివరాంపేట నుంచి భంభంస్వామి గుట్ట వద్దకు రాత్రి 7.30 గంటలకు చేరుకున్న షర్మిల అక్కడే బస చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షంలోనూ వేలాది మంది ప్రజలు షర్మిలను అనుసరించడం రాజకీయ పరిశీలకులను సైతం విస్మయానికి గురిచేసింది. ఇది కాంగ్రెస్, టీడీపీ శిబిరాలను మరింత ఆందోళనకు గురిచేసింది. గురువారం పాదయాత్రలో షర్మిల 13 కిలోమీటర్ల దూరం నడిచారు.

బాబూ.. దమ్ముంటే అవిశ్వాసం పెట్టు

చంద్రబాబు పాదయాత్ర పెద్ద డ్రామా అని, ఆయన కోసం చేసుకుంటున్న ప్రచార యాత్ర అని ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి, వైఎస్సార్‌సీపీ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. జననేత జగన్ సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర గురువారం అనంతపురం జిల్లా కూడేరు మండలంలో సాగింది. ఈ యాత్రలో పాల్గొన్న అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. అబద్ధాలు చెప్పడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. 

పాదయాత్ర ప్రజల కోసమే చేస్తున్నానంటూ బురిడీ కొట్టిస్తున్నారని దుయ్యబట్టారు. ‘రాష్ట్రంలో అసమర్థ పాలన సాగుతోందని చంద్రబాబు అంటున్నారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే బలం, సత్తా ఆయనకున్నా ఎందుకు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు.. నిజంగా దమ్ముంటే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలి. అప్పుడు ప్రజలు విశ్వసిస్తార’ని అన్నారు. ‘ప్రభుత్వం దిగిపోకుండా బాబు పూర్తి మద్దతు ఇస్తున్నారు. 

ఆయనపై ఎలాంటి కేసులు మోపకుండా ప్రభుత్వం కాపాడుతోంది. బాబు తొమ్మిదే ళ్ల పాలనలాగే కాంగ్రెస్ పాలన కొనసాగుతోంది. ప్రభుత్వానికి ప్రజల గోడు ఏమాత్రం పట్టడం లేదు. బీసీలను ఇన్ని రోజులూ విస్మరించిన చంద్రబాబు ఇప్పుడు 100 సీట్లంటూ మాయాజాలం చేస్తున్నారు. జగన్ బయట ఉంటే తమ మనుగడ ఉండదని భావించే అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా ప్రజలు జననేతకు అండగా నిలుస్తార’ని స్పష్టం చేశారు.

సీఎం కిరణ్ ప్రశ్నకు దీటుగా షర్మిల సమాధానం

సీఎం కిరణ్ ప్రశ్నకు దీటుగా షర్మిల సమాధానం
పేదల గుండెల్లో జగన్ స్థానం సంపాదించుకున్నందుకే కుట్ర చేశారు
అన్న బయట ఉంటే మీకూ, టీడీపీకి ఉనికి ఉండదనే మీ భయం
జగన్ కాంగ్రెస్‌లోనే ఉంటే కష్టాలు ఉండేవి కావని కాంగ్రెస్ నాయకుడు ఆజాదే చెప్పారు
అంటే కావాలనే జైల్లో పెట్టారనే కదా?
జగన్ ఏ తప్పూ చేయలేదని ధైర్యంగా చెప్తున్నాం
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’గురువారం యాత్ర ముగిసేనాటికి.. రోజులు: 15, కిలోమీటర్లు: 201.30

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ‘జగన్ ఎవరి కోసం జైలుకెళ్లాడు? ప్రజల కోసమా? మహిళల కోసమా? రైతుల కోసమా? అని కిరణ్‌కుమార్‌రెడ్డి అంటున్నారు. ఆయనకు ఇదే నా సమాధానం. అవును.. జగనన్న రైతుల కోసం పోరాడారు. పేద ప్రజల కోసం పోరాడారు. విద్యార్థుల కోసం పోరాడారు. మహిళల కోసం పోరాడారు. చేనేత కార్మికుల కోసం పోరాడారు. అలా పోరాడడం వల్ల ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుంటున్నాడనే మీరు జైలులో పెట్టారు. అలా పోరాడడం వల్ల మీకు, టీడీపీకి స్థానం ఉండదనే, ఉనికి కోల్పోతారనే మీరు జైలులో పెట్టారు. నీచమైన కుట్రకు పాల్పడ్డారు.

సీబీఐని వాడుకున్నారు. గుండెల మీద చేయి వేసుకుని మీరు నిజం చెప్పలేరు..’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల.. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై ధ్వజమెత్తారు. ప్రజా సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వ వైఖరికి, దానితోనే కుమ్మక్కయిన టీడీపీ వైఖరికి నిరసనగా చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ 15వ రోజు గురువారం పాదయాత్రలో భాగంగా ఆమె అనంతపురం జిల్లా జల్లిపల్లిలో జరిగిన సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆజాద్ పబ్లిక్ మీటింగ్‌లోనే చెప్పారు. జగన్ కాంగ్రెస్‌లోనే ఉంటే ఇన్ని కష్టాలు ఉండేవి కావని అన్నారు. అంటే దానర్థం ఏమిటి? కావాలనే జైలులో పెట్టారనే కదా? కావాలనే బెయిల్ రాకుండా చేస్తున్నారనే కదా దాని అర్థం. రాజన్న కుటుంబం ఈరోజు ఒక మాట చెబుతోంది. జగనన్న ఏ తప్పూ చేయలేదు. ఈ మాట ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఒక రోజు వస్తుంది. ఆరోజు నిజం తెలుస్తుంది. ఆ రోజు జగనన్న తప్పకుండా బయటకు వస్తాడు. సమయం వచ్చినప్పుడు మీరంతా కాంగ్రెస్, టీడీపీలకు గట్టిగా బుద్ధి చెప్పాలి..’ అని షర్మిల ప్రజలకు పిలుపునిచ్చారు.

ఇది చేశానని చంద్రబాబు చెప్పలేరు.. 

‘చంద్రబాబు 9 ఏళ్లు అధికారంలో ఉన్నారు. ఉండి ఏం చేశారు? చేసింది చెప్పుకొనే ధైర్యం లేదు. ప్రజల కోసం ఫలానా మంచి పనిచేశానని చెప్పగలరా? కానీ ఇప్పుడు మళ్లీ అధికారం కావాలట. పాదయాత్రలంటూ కొత్త డ్రామా ఆడుతున్నారు. ప్రజలు అమాయకులేమీ కాదు. చంద్రబాబు అనుకుంటున్నట్టు పిచ్చివాళ్లేం కాదు. చంద్రబాబుకు లేనిది, రాజన్నకు ఉన్నదీ మాట మీద నిలబడే నైజం. చంద్రబాబుకు లేనిదీ, రాజన్న, జగనన్నలకు ఉన్నది విశ్వసనీయత. బాబుకు పాదయాత్ర అవసరం లేదు. ఈ అసమర్థ ప్రభుత్వాన్ని దించేందుకు తగినంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ఆయన అవిశ్వాసం పెట్టరట..’ అని షర్మిల.. చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.


బీమా ఇవ్వడం లేదు..

ఉదయం 11.30కు ముద్దలాపురంలో శంకర్ అనే రైతుకు చెందిన వేరుశనగ చేనును షర్మిల పరిశీలించారు. చెట్లు తీశామని, కానీ చెట్టుకు రెండు మూడు కాయలే ఉన్నాయని ఆ రైతు వాపోయారు. ఎకరానికి 2 నుంచి 3 బస్తాలు కూడా వచ్చే పరిస్థితి లేదని వివరించారు. ‘వర్షాధారంగా ఈ పంట పండిస్తున్నాం. ఏటా పెట్టుబడులు నష్టపోతున్నాం. రాజశేఖరరెడ్డి హయాంలో 4 ఏళ్లు పంట పండింది. పంట పండని సమయంలో ఇన్సూరెన్స్ వచ్చింది. కానీ ఇప్పుడు వాతావరణ బీమా పేరుతో మండలం యూనిట్‌గా చేసి ఇన్సూరెన్స్ ఇవ్వడం లేదమ్మా’ అని శంకర్ వాపోయారు.

రోడ్డు వేయించండమ్మా...

మామూలుగా అయితే రోడ్లు వేయించాలని, కుళాయిలు ఇప్పించాలని ప్రజలు ప్రజా ప్రతినిధుల్ని, అధికార పార్టీ నేతల్ని అడుగుతారు. ఐతే ప్రభుత్వం తమను పట్టించుకోవట్లేదన్న ఉద్దేశంతో ఉన్న ప్రజలు.. పాదయాత్రలో తమ ఊరికి వస్తున్న షర్మిలకు తమ సమస్యలు ఏకరువు పెడుతున్నా రు. గురువారం ఉదయం ముద్దలాపురం సమీపంలో గొటుకూరుకు చెందిన వికలాంగుడు హరినాథ్‌రెడ్డి, అదే గ్రామానికి చెందిన ఆరోగ్యశ్రీ లబ్ధిదారుడు గొనంకి లక్ష్మయ్య రోడ్డు పక్కన కూర్చుని షర్మిల రాకకోసం ఎదురుచూస్తూ కనిపించారు. వారి వద్దకు షర్మిల రాగానే ‘నిన్న కలవాలనుకున్నా సాధ్యపడలేదమ్మా.. అందుకే ఇక్కడ కూర్చున్నాం. మా ఊరు వద్ద రోడ్డు గతుకులుగా ఉండడంతో రోడ్డు ప్రమాదం జరిగి నా కాలు పూర్తిగా విరిగిపోయింది. దయచేసి మా ఊరికి రోడ్డు వేయించండమ్మా’ అని హరినాథ్‌రెడ్డి మొరపెట్టుకున్నారు. రాజన్న రాజ్యంలో మీ కోరికలన్నీ నెరవేరతాయని షర్మిల భరోసా ఇచ్చారు. లక్ష్మయ్య మాట్లాడుతూ.. వైఎస్ తనకు చేసిన మేలుకు కృతజ్ఞతలు తెలుపుకోవడానికిఇక్కడిదాకా వచ్చానన్నారు. ‘నాకు గుండె ఆపరేషన్ అయ్యింది. కానీ మళ్లీ చేయాల్సి వచ్చింది. అప్పుడు వైఎస్ తెచ్చిన ఆరోగ్యశ్రీ నాకు వరమైంది. 2 లక్షలతో మళ్లీ ఆపరేషన్ చేయించారు’ అని అన్నారు.

గొర్రె చనిపోతే దిక్కులేదు..

మార్గం మధ్యలో జల్లిపల్లికి చెందిన గొర్రెల కాపరులు ఇటుకలప్ప, పల్లెప్ప గొర్రెలు కాస్తుండగా షర్మిల వారి వద్దకు వెళ్లి వారితో ముచ్చటించారు. వారి మధ్య సంభాషణ సాగిందిలా..
షర్మిల : ఏమన్నా.. బతుకుదెరువు ఎలా ఉంది?
కాపరి: మా బాధలేమని చెప్పేది.. గొర్రెలు చనిపోతే ఇన్సూరెన్స్ కూడా రావడం లేదమ్మా
ఇంతకుముందు వచ్చేదా?

ఇంతకుముందు గొర్రెకు రూ. 18 కడితే.. చనిపోయినప్పుడు రూ.1,000 వచ్చేది. ఇప్పుడు ఇవ్వడం లేదు.
ఎందుకు రావడం లేదు?

ఏమో అమ్మా. అప్పుడంటే రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు మాబోటివాళ్లను పట్టించుకున్నారు. ఇప్పుడెవరు పట్టించుకుంటారు? బస్సు కింద పడి 180 గొర్రెలు చనిపోయాయి. కానీ ఒక్కదానికీ పరిహారం రాలేదు. గొర్రెలకేం తెలుసు. అవి ఒక్కటి పోయి రైలు కిందపడితే.. అన్నీ వెళ్లి పడతాయి.

పశువులకు నీళ్లు, మేత ఉన్నాయా?

కాలువ నీళ్లు రావడం లేదట. అప్పటి నుంచి ఎక్కడా నీళ్లు దొరకడం లేదు. ఈ ప్రాంతంలో కురుమలు ఎక్కువ. గొర్రెలకు నీళ్లు లేవు. అప్పుడప్పుడు పడే చినుకులకు ఈసారి ఇక్కడ మేత దొరుకుతోంది. కానీ మేత దొరకనప్పుడు ఒక్కోసారి వందల కిలోమీటర్ల దూరం అలా మేపుకొంటూ వలస వెళ్లాల్సిందే. చెరువులు నింపితే మాకు కొద్దిగా ప్రయోజనం. ఇప్పటికే తాగునీళ్లు లేక జనం అల్లాడిపోతున్నారు.
జగనన్న సీఎం అయ్యాక మళ్లీ రాజన్న లాగే పీఏబీఆర్‌కు 10 టీఎంసీల నీటిని తెస్తాడు. ధైర్యంగా ఉండండన్నా..

వర్షంలోనే పాదయాత్ర..

గురువారం పాదయాత్ర ఉదయం వర్షం కారణంగా 11 గంటలకు ప్రారంభమైంది. వర్షం ఆగకపోవడంతో అదే వర్షంలో పాదయాత్ర కొనసాగించారు. మధ్యాహ్నం వరకు జల్లులు కురుస్తూనే ఉన్నాయి.. తిరిగి సాయంత్రం కొద్దిసేపు వర్షం కురిసినా.. షర్మిల ఆగకుండా యాత్ర చేశారు. గురువారం మొత్తం షర్మిల 13 కిలోమీటర్ల మేర నడిచి రాత్రి 7.30కు భం భం స్వామి గుట్ట వద్ద టెంట్‌లో బసచేశారు. దీతో ఇప్పటివరకు పాదయాత్ర 201.30 కిలోమీటర్లు పూర్తయింది. గురువారం పాదయాత్రలో ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, కాపు రాంచంద్రారెడ్డి, గురునాథరెడ్డి, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి, వైఎస్సార్ పార్టీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, ఉరవకొండ పార్టీ ఇన్‌చార్జి వై.విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు, కొల్లి నిర్మల కుమారి, వాసిరెడ్డి పద్మ, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కాపు భారతి తదితరులు పాల్గొన్నారు.

TDP Leader Yerrannaidu died in Road accident


శ్రీకాకుళం: టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కింజరపు ఎర్రన్నాయుడు(55) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న కారు పెట్రోల్ ట్యాంకర్‌ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం దండానపేట కూడలి సమీపంలో గురువారం అర్థరాత్రి 1.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయనను హుటాహుటిన శ్రీకాకుళంలోని కిమ్స్ సాయిశేషాద్రి ఆస్పత్రికి తరలించారు. అరగంట పాటు వెంటిలేటర్ ఉన్న ఆయన చివరకు ప్రాణాలు విడిచారు. 

ఈ ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షుడు చౌదరి బాబ్జీ, మరో ఇద్దరు గాయపడ్డారు. విశాఖపట్టణంలో ఓ వివాహ కార్యక్రమానికి హాజరై శ్రీకాకుళంకు తిరిగొస్తుండగా ఈ దుర్ఘటన సంభవించింది. వీరు ప్రయాణిస్తున్న కారు మలుపుతిరుగుతున్న ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొంది. ఎర్రన్నాయుడు మరణవార్త తెలుసుకుని ఆయన సోదరుడు అచ్చెన్నాయుడు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. ఎర్రన్నాయుడు హఠాన్మరణం పట్ల టీడీపీ నేతలు సంతాపం ప్రకటించారు. 

కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో 1957, ఫిబ్రవరి 23న వ్యవసాయ కుటుంబంలో ఎర్రన్నాయుడు జన్మించారు. కళావతమ్మ, దాలినాయుడు ఆయన తల్లిదండ్రులు. ఏడుగురు సంతానంలో ఆయన మొదటివారు. గారలో ఉన్నతవిద్య, టెక్కలీ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ విద్య అభ్యసించారు. విశాఖ వీఎస్ కృష్ణా కళాశాలలో బీఎస్సీ చదివారు. ఆంధ్రా యూనివ ర్సిటీలో ఎల్‌ఎల్‌బీ చేశారు. 1982, మే 28న విజయకుమారిని వివాహమాడారు. ఆయనకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. 

న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించిన కేంద్ర మంత్రిగా ఎదిగారు. 1983లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1983లో హరిశ్చంద్రపురం ఎమ్మెల్యేగా పోటీ చేశారు. హరిశ్చంద్రపురం నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1983 నుంచి 1996 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు. శాసనసభ్యుడిగా వివిధ హోదాల్లో సేవలందించారు. 1983 నుంచి 1994 వరకు ప్యానల్ ఆఫ్ చైర్మన్ మెంబర్‌గా ఉన్నారు. 1995-96 మధ్య కాలంలో చీఫ్ విప్‌గా సేవలందించారు. 

1996, 98, 99, 2004లో శ్రీకాకుళం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. టీడీపీ పార్లమెంటరీ నేతగానూ పనిచేశారు. ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రిగా సేవలందించారు. 1999-2000లో రైల్వే కమిటీ చైర్మన్‌గా వ్యవహరించారు. పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ, ఉక్కు మంత్రిత్వ శాఖ సంప్రతింపుల కమిటీల్లో సభ్యుడిగా పనిచేశారు.


షర్మిల నేటి పాదయాత్ర ఇలా...

మహానేత వైఎస్ తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర శుక్రవారం భంభం బాబా గుట్ట నుంచి ప్రారంభమై పెన్నహోబిలం, పీఏబీఆర్ కాలువ, కోనాపురం క్రాస్, కోనాపురం, షెక్షాన్‌పల్లి, లత్తవరం సరిహద్దు వరకు సాగుతుంది. షెక్షాన్‌పల్లి బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం లత్తవరం సరిహద్దులో ఏర్పాటు చేసిన గుడారంలో రాత్రి బస చేస్తారు. 12.5 కిలోమీటర్లు నడుస్తారని ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ శంకర్‌నారాయణ, సీఈసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. 

రేపు ఉరవకొండలో..

షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర శనివారం లత్తవరం సరిహద్దు నుంచి బయలుదేరి ఉరవకొండ పట్టణంలో సాగుతుంది. షర్మిల ఉరవకొండ పాతబస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని అనంతరం మార్కెట్ యార్డు వద్ద రాత్రి బస చేస్తారు.

Lakshmi Parvathi Interview@Maro Praja Prasthanam Padayatra

కాంగ్రెస్, టీడీపీలవి నీచ రాజకీయాలు: షర్మిల

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డకి వ్యతిరేకంగా టీడీపీ, కాంగ్రెస్‌లు నీచరాజకీయాల చేస్తున్నాయని షర్మిల మండిపడ్డారు. మరో ప్రజాప్రస్థానం 15 రోజు పాదయాత్రలో షర్మిల మాట్లాడుతూ.. సీబీఐతో కలిసి జగనన్నను అక్రమంగా అరెస్ట్‌ చేయించాయి అని అన్నారు. రాష్ట్రంలో మూడో పార్టీ ఉండకూడదనే ఈ కుట్రలు పన్నుతున్నారని ఆమె అరోపించారు. 

ఎవరి కోసం జగన్‌ జైలు కెళ్లారని సీఎం కిరణ్‌ అనడాన్ని ఆమె తప్పు పట్టారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, చేనేత కార్మికుల పక్షాన నిలిచి జగన్‌ పోరాడి దీక్షలు చేయలేదా అని ప్రశ్నించారు. జగన్‌ చేస్తున్న పోరాటాలు చూసి కాంగ్రెస్, టీడీపీ గుండెల్లో రైళ్లు పరిగెట్టాయని షర్మిల అన్నారు. కాంగ్రెస్‌లో ఉండి ఉంటే జగన్‌కు ఇన్ని కష్టాలు వచ్చేవి కావని ఆజాదే చెప్పిన విషయాన్ని బట్టే కుట్ర బయటపడుతోందని అన్నారు. 

వైఎస్‌ఆర్‌ కుమారుడిగా ప్రజాసమస్యలను.. తన సమస్యలుగా జగన్‌ మలుచుకున్నారని.. జగన్‌ ఏ తప్పూ చేయలేదని తాము ధైర్యంగా చెప్తున్నామని.. త్వరలోనే జగన్‌ బయటకు వస్తారని షర్మిల తెలిపారు. రాజన్న కన్న కలలను జగనన్న నెరవేరుస్తారని ధీమా వ్యక్తం చేశారు. జగనన్న సీఎం అయ్యాక రైతులకు 3 వేల కోట్ల రూపాయలతో ప్రత్యేక బడ్జెట్‌ పెడుతారని ఆమె తెలిపారు. 

Sharmila speech in Jelli Palli@Maro Prasthanam Padayatra

15వ రోజు ముగిసిన మరో ప్రజాప్రస్థానం

మరో ప్రజాప్రస్థానం పేరిట వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన పాదయాత్ర పదిహేనో రోజు.. గురువారం సాయంత్రం ముగిసింది. ఈ పదిహేను రోజుల నిరంతరాయ యాత్రలో షర్మిల మొత్తం 201.3 కిలోమీటర్లు నడిచారు. ఇందఉలో ఒక్క గురువారం నాడే 13 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. ఆమె బంబంస్వామిగుట్ట వద్ద గురువారం రాత్రి షర్మిల బస చేసి, తిరిగి శుక్రవారం ఉదయం మరో ప్రజాప్రస్థానాన్ని కొనసాగించనున్నారు.

టీడీపీ గుర్తింపు రద్దుకు ఈసీకి చిన్నం లేఖ

 తెలుగుదేశం పార్టీ గుర్తింపు రద్దు చేయాలని టిడిపినుంచి సస్పెండైన నూజివీడు ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య ఎలక్షన్‌ కమిషన్‌కు లేఖ రాశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసినందుకు టీడీపీ ఆయనను సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. ఇలా చేయడం రాజ్యాంగ విరుద్ధమనేది రామకోటయ్య వాదన. టీడీపీ అధినేత చంద్రబాబుకు రాజ్యాంగం మీద విశ్వాసం లేదని అందుకే ఆ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని కోరుతున్నట్టు రామకోటయ్య అంటున్నారు. 

పార్టీలో కొనసాగుతున్న పరిణామాలపై గతంలోనే అధ్యక్షుడు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటివరకూ తన ఫిర్యాదులకు ఎలాంటి వివరణా రాకపోవడం బాధాకరమని ఆయన అంటున్నారు. రామకోటయ్యను అనర్హుడిగా ప్రకటించాలని టిడిపి...స్పీకర్‌ను కోరనున్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. వీటినికూడా పరిగణలోకి తీసుకున్న రామకోటయ్య నాకు ఎమ్మెల్యేగా కొనసాగే అవకాశం కల్పించండంటూ ఎలక్షన్‌ కమిషన్‌కు రాసిన లేఖలో అభ్యర్థించారు

వైశ్రాయిలో ఎంతకు కొన్నారు: శోభానాగిరెడ్డి

ఎమ్మెల్యేలను గొర్రెలుగా వ్యాఖ్యానించడంపై వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్ టీఆర్ పదవి నుంచి దింపే సమయంలో వైశ్రాయిలో ఎమ్మెల్యేలను ఎంతకు కొన్నారో చెప్పాలని శోభానాగిరెడ్డి డిమాండ్ చేశారు. జగన్ సీఎం కావాలని సంతకాలు చేసి, యాగాలు చేసిన కిరణ్‌కు జగన్‌ను విమర్శించే హక్కులేదన్నారు. లేపాక్షి హబ్‌కు వైఎస్ఆర్ కేటాయించిన భూములు వెనక్కి తీసుకోవడంలో దేశం, కాంగ్రెస్‌లు కుట్రపన్నాయి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు గుర్నాధరెడ్డి, రామచంద్రారెడ్డి ఆరోపించారు.

Meruga complaint on TDP MLC Rajendra prasad in HRC

YS Sharmila's visits YSR Water Project

జాతీయ జెండా ఆవిష్కరించిన షర్మిల

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని ముద్దలాపురంలో షర్మిల బుధవారం ఉదయం జాతీయ పతాకాన్ని ఎగరేశారు. ఆమె 15వ రోజు పాదయాత్ర కూడేరు శివారు నుంచి ప్రారంభించారు. అనంతరం షర్మిల వైఎస్ఆర్ వాటర్‌ ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారు. భోజన విరామం అనంతరం జెల్లిపల్లి బహిరంగ సభలో పాల్గొంటారు. నేడు ఆమె 13 కిలో మీటర్లు నడవనున్నారు.

4న వైఎస్ఆర్ సీపీలోకి ఎమ్మెల్యే వనిత

గోపాలపురం : పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే వనిత ఈనెల 4వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. కొవ్వూరులో జరిగే భారీ బహిరంగ సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో ఆమె పార్టీ సభ్యత్వం తీసుకోనున్నారు.

ఎమ్మెల్యే వనితతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబు, చింతలపూడి నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ కర్రా రాజారావు, దెందులూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ కొటారు రామచంద్రరావు పార్టీలో చేరనున్నారు. కాగా కొవ్వూరులో జరిగే బహిరంగ సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే ఆళ్లనాని, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తదితరులు పరిశీలిస్తున్నారు.

YS Sharmila Inaugurates Flag at Anantapur


4న వైఎస్ఆర్ సీపీలోకి ఎమ్మెల్యే వనిత

గోపాలపురం : పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే వనిత ఈనెల 4వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. కొవ్వూరులో జరిగే భారీ బహిరంగ సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో ఆమె పార్టీ సభ్యత్వం తీసుకోనున్నారు. 

ఎమ్మెల్యే వనితతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబు, చింతలపూడి నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ కర్రా రాజారావు, దెందులూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ కొటారు రామచంద్రరావు పార్టీలో చేరనున్నారు. కాగా కొవ్వూరులో జరిగే బహిరంగ సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే ఆళ్లనాని, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తదితరులు పరిశీలిస్తున్నారు.

'కేంద్ర పదవులు దక్కటం జగన్ పుణ్యమే'

రాష్ట్రానికి పెద్ద ఎత్తున కేంద్ర పదవులు దక్కటం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుణ్యమేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యులు భూమా నాగిరెడ్డి అన్నారు. జగన్ను ప్రభంజనాన్ని అడ్డుకునేందుకే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలకు పదవులను కట్టబెట్టిందని ఆయన వ్యాఖ్యానించారు.

భూమా నాగిరెడ్డి బుధవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ఈనెల 8వ తేదీ నుంచి కర్నూలు జిల్లాలో షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ప్రారంభం అవుతుందని అన్నారు. తొమ్మిదేళ్ల పరిపాలనలో ప్రజల కష్టాలు చంద్రబాబుకు తెలియవా అని నాగిరెడ్డి ప్రశ్నించారు.
ముద్దాలపురం: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని ముద్దలాపురంలో షర్మిల బుధవారం ఉదయం జాతీయ పతాకాన్ని ఎగరేశారు. ఆమె 15వ రోజు పాదయాత్ర కూడేరు శివారు నుంచి ప్రారంభించారు. అనంతరం షర్మిల వైఎస్ఆర్ వాటర్‌ ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారు. భోజన విరామం అనంతరం జెల్లిపల్లి బహిరంగ సభలో పాల్గొంటారు. నేడు ఆమె 13 కిలో మీటర్లు నడవనున్నారు.


source:sakshi

ఎమ్మెల్యే రాజేష్ కు ఘన స్వాగతం

చింతలపూడి ఎమ్మెల్యే మద్దాల రాజేష్ కుమార్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు బుధవారం ఘన స్వాగతం పలికారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి తొలిసారిగా చింతలపూడి వచ్చిన ఆయనకు అపూర్వ ఆదరణ లభించింది. రాజేష్ కుమార్ కు మద్దతుగా కార్యకర్తలు వలసపల్లి చెక్ పోస్ట్ నుంచి చింతలపూడి వరకూ 1000 బైక్ లతో ర్యాలీ నిర్వహించారు.

జగన్ పై లక్ష కోట్ల ఆరోపణ చేసే చంద్రబాబు నాయుడు ఇప్పుడు రిలయన్స్ పై లక్షపది వేల కోట్ల ఆరోపణలు వచ్చినా స్పందించరే?

చంద్రబాబుకు కొత్త చిక్కు వచ్చి పడింది. కెజి బేసిన్ లో గ్యాస్ ధర సమస్యపై జైపాల్ బదిలీ వెనుక రిలయన్స్ హస్తం ఉందని విమర్శలు వస్తున్నాయి. రిలయన్స్ కంపెనీకి లక్ష కోట్ల లాభం చేకూరేలా కేంద్రంలో అప్పటి మంత్రి మురళీ దేవర సహకరించారని అవినీతి వ్యతిరేక పోరాట యోధుడు కేజ్రీవాల్ ఆరోపించారు.అలాగే ప్రణబ్ ముఖర్జీ కూడా రిలయన్స్ కు పది వేల కోట్ల లాభం చేశారని కూడా ఆయన విమర్శించారు. దీనిపై దేశవ్యాప్తంగా ఆయా రాజకీయ పక్షాలు పెద్ద ఎత్తున స్పందిచాయి. సాధారణంగా అయితే దేశస్థాయిలో జరిగే పరిణామాలపై చంద్రబాబు ప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టి వ్యాఖ్యానిస్తుంటారు. అలాంటిది రిలయన్స్ పై ఆరోపణలు వస్తే ఇంతవరకు ఆయనగాని, ఆయన పార్టీ నేతలు కాని స్పందించలేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మూడేళ్ల క్రితం వై.ఎస్. హత్య వెనుక ఈ సంస్థ హస్తం ఉందని రష్యాకు చెందిన ఒక వెబ్ సైట్ ఒక కధనాన్ని ఇచ్చింది. దాని ఆధారంగా ఇక్కడ కొన్ని టీవీ చానళ్లు కధనాలు , చర్చలు నడిపాయి.ఆ మీదట కొందరు రిలయన్స్ షాపులపై దాడులు చేశారు. ఆ మరుసటి రోజే చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి రిలయన్స్ పై దాడిని తీవ్రంగా ఖండించారు. అంతవరకు బాగానే ఉంది.జగన్ పై లక్ష కోట్ల ఆరోపణ చేసే చంద్రబాబు నాయుడు ఇప్పుడు రిలయన్స్ పై లక్షపది వేల కోట్ల ఆరోపణలు వచ్చినా స్పందించరేమిటని కొంతమంది ప్రశ్నించడం ఆరంభించారు.తప్పు ఎక్కడ జరిగినా తప్పే. కాని రాజకీయ నాయకులు తమకు ఉన్న సంబంధాలతో కొంత రిజర్వుడుగా వ్యవహరిస్తుంటారు.అలాంటి ప్రభావం చంద్రబాబుపైన కూడా ఉందనుకోవాలా?అయితే కేజ్రీవాల్ రిలయన్స్ కు కాంగ్రెస్ ,బిజెపిలు రెండూ సన్నిహితమేనని వ్యాఖ్యానించిన విషయం చూస్తే రాజకీయ పార్టీలు, కార్పొరేట్ సంస్థలకు మధ్య పెనవేసుకున్న అనుబంధం అర్ధం కావడం లేదూ?

source:kommineni
Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!