తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు చేరవలసి వచ్చిందో చింతలపూడి ఎమ్మెల్యే రాజేష్ కుమార్ సోమవారం మూడు పేజీల లేఖను విడుదల చేశారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత తన నియోజకవర్గం అభివృద్ధిలో వెనకబడిపోయిందని ఆయన తీవ్ర ఆవేదన చెందారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి లక్ష్యాలను సాధింగలనన్న విశ్వాసాన్ని రాజేష్ కుమార్ వ్యక్తం చేశారు.
తనకు రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్ కుటుంబానికి ఇన్నాళ్లు దూరంగా ఉండటం తనను ఎంతగానో కలచివేసిందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. వైఎస్ స్ఫూర్తితో కేవలం మూడు నెలల కాలంలో 26 అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసినట్లు ఆయన గుర్తు చేశారు. ఇటీవలి కాలంలో అనుకున్న కార్యక్రమాలు అమలు చేయకపోవడం నియోజకవర్గ అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపిందని రాజేష్ తెలిపారు. భవిష్యత్ లో వైఎస్ ఆశయాల కోసం జగన్ తో కలిసి నడుస్తానని ఆయన స్పష్టం చేశారు.

No comments:
Post a Comment