http://telugu.greatandhra.com/cinema/21-09-2012/chen_21.php
|
నిమ్మగడ్డ ప్రసాద్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో వాదనలు వాడిగా జరిగాయి. సీబీఐ తరఫున న్యాయవాది పీ కేశవరావు వాదనలు వినిపిస్తూ వాన్‌పిక్ సంబంధించి మొదట రాష్ట్ర ప్రభుత్వం, రస్‌అల్‌ఖైమా ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరిందని చెప్పారు. ఆ తరువాత ఇందులోకి నిమ్మగడ్డ ప్రసాద్ భారతీయ భాగస్వామిగా వచ్చి చేరారంటూ అవగాహనా ఒప్పందానికి సంబంధించిన విషయాలను వివరించటం ప్రారంభించారు. ఆ దశలో జోక్యం చేసుకున్న న్యాయమూర్తి ఆ వివరాలన్నీ ఇప్పుడు అవసరం లేదని, ప్రసాద్‌కు బెయిల్ ఎందుకు ఇవ్వరాదో మాత్రమే చెప్పాలని సూచించారు. దీనిపై కేశవరావు బదులిస్తూ ''మీకు నేనెప్పుడైనా అనవసర విషయాలు చెప్పానా? ఈ వివరాలన్నీ కోర్టు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది'' అన్నారు. దాంతో న్యాయమూర్తి వాదనలు కొనసాగించాలని సూచించారు. వాన్‌పిక్‌లో రస్‌అల్‌ఖైమాకు 51% వాటా ఉందని, అందులో నవయుగ కంపెనీకి వాటా ఇవ్వటంతో అది 26.5 శాతానికి పడిపోయిందని వివరించారు. ఆ సమయంలో న్యాయమూర్తి సీబీఐ కోర్టుకు సమర్పించిన చార్జిషీట్‌ను పరిశీలించి, దాంట్లో ఎక్కడా రస్‌అల్‌ఖైమా గురించి పూర్తిస్థాయిలో ప్రస్తావన లేకపోవటంపై కేశవరావును ప్రశ్నించారు. చార్జిషీట్‌లో ఒక్క నిమ్మగడ్డ ప్రసాద్ గురించిన ప్రస్తావన మాత్రమే ఉంది.. రస్‌అల్‌ఖైమా ప్రభుత్వ ప్రతినిధుల గురించి ప్రస్తావన ఎందుకు లేదు? వారి పరిస్థితి ఏమిటి? వారికి సంబంధించిన దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? వారిని నిందితులుగా ఎందుకు చేర్చలేదు? అంటూ ప్రశ్నలు కురిపించారు. దాంతో కేశవరావు తడబడి, ఆ విషయాలను తరువాత వివరిస్తానన్నారు. దీనికి అంగీకరించని న్యాయమూర్తి ముందుగా కోర్టు అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పాలని, ఆ తరువాత మిగతా విషయాలకు వెళ్లాలని సూచించారు. తాను అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వకుండా కేశవరావు దాటవేస్తున్నారని గ్రహించిన న్యాయమూర్తి రెండుసార్లు సమాధానం చెప్పాలంటూ ఆదేశించారు. ఆ సమయంలో కోర్టు హాల్లోనే ఉన్న సీబీఐ డీఐజీ వెంక ఒక కాగితంపై ఏదో రాసి కేశవరావుకు పంపారు. అందులోని విషయాన్ని చదివిన అనంతరం కేశవరావు సమాధానమిస్తూ రస్‌అల్‌ఖైమా ప్రతినిధులకు నోటీసులు పంపించినట్టు చెప్పారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ ''దర్యాప్తు దాదాపుగా పూర్తయ్యింది. మీ (సీబీఐ) వద్ద అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి. అవగాహన ఒప్పందం కూడా ఉంది. అన్నీ మీ వద్ద పెట్టుకుని వారికి నోటీసులు ఎందుకివ్వాల్సి వచ్చింది?'' అని ప్రశ్నించారు. మీరు సాగిస్తున్న దర్యాప్తును చూస్తే ఈ మొత్తం వ్యవహారంలో ఒక్కరిపైనే జరిగినట్టుగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. దీనిపై కేశవరావు సమాధానమిస్తూ దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని చెప్పారు. విచారణ కీలకదశలో ఉందన్నారు. ఈ జవాబుపై న్యాయమూర్తి స్పందిస్తూ.. ఎవరు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినా ప్రతిసారీ దర్యాప్తు కీలక దశలో ఉందని, పూర్తి కాలేదని చెబుతున్నారు. ఏ అంశానికి సంబంధించి దర్యాప్తు పూర్తి కాలేదో స్పష్టంగా చెప్పండి'' అన్నారు. ఆ తరువాత కేశవరావు తన వాదనలు కొనసాగిస్తూ వాన్‌పిక్ కోసం కేటాయించిన భూముల వివరాలను చెప్పటం ప్రారంభించగా న్యాయమూర్తి అప్పుడు కూడా రెండు ప్రశ్నలను సంధించారు. అంతకు ముందు నిమ్మగడ్డ ప్రసాద్ తరఫున న్యాయవాది రాజశేఖరరావు వాదనలు వినిపిస్తూ సీబీఐ తీరును తప్పుపట్టారు. తప్పుడు ఉద్దేశాలను మనసులో పెట్టుకుని సీబీఐ విచారణ జరుపుతోందని వ్యాఖ్యానించారు. నిమ్మగడ్డ ప్రసాద్ విజయవంతమైన వ్యాపారవేత్త అని పేర్కొంటూ మూతబడ్డ ఎన్నో వ్యాపార సంస్థలను ఆయన కొనుగోలు చేసి, నిలబెట్టారన్నారు. 3కోట్ల రూపాయలకు మ్యాట్రిక్స్ ల్యాబ్‌ను కొన్న నిమ్మగడ్డ ప్రసాద్ ఆరేళ్లలోనే దానిని ఆరువేల కోట్ల రూపాయలకు చేర్చారని తెలియచేశారు. ఒక పెట్టుబడిదారుడు ఏ విధంగా ఆలోచించి పెట్టుబడులు పెడతారో.. అదే విధంగా నిమ్మగడ్డ ప్రసాద్ కూడా జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు పెట్టారని చెప్పారు. ఈ పెట్టుబడుల ద్వారా ఆయన లాభాలు కూడా సంపాదించారని వివరించారు. నిమ్మగడ్డ ప్రసాద్ నిజానికి వైఎస్ చనిపోయిన తరువాత జగతిలో పెట్టుబడులు పెట్టారన్నారు. బీవోటీ పద్ధతిలో చేపట్టిన వాన్‌పిక్ వల్ల ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకుండానే ప్రభుత్వం భవిష్యత్తులో రెండు పోర్టులకు యజమాని అవుతుందన్నారు. ఈ అంశాన్ని సీబీఐ పరిగణలోకి తీసుకోవటం లేదని చెప్పారు. వాన్‌పిక్‌కు ప్రభుత్వం భూములను ఉచితంగాగానీ, రాయితీపైగానీ కేటాయించలేదన్నారు. భూముల కేటాయింపు పూర్తి పారదర్శకతతో జరిగిందని చెప్పారు. బెయిల్ రాకుండా చేయటానికే సీబీఐ అధికారులు అర్థం లేని ఆరోపణలు చేస్తూ, కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. నిమ్మగడ్డ ప్రసాద్‌కు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారంటున్న సీబీఐ అధికారులు దానికి ఎలాంటి ఆధారాలను చూపించటం లేదన్నారు. వాదనలు ముగిసేసరికి కోర్టు సమయం ముగియటంతో తదుపరి విచారణను న్యాయమూర్తి శుక్రవారానికి వాయిదా వేశారు.
డీఎస్పీ తరుణ్‌జోషి రాఘవులు పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అటు బీజేపీ నేతలు వెంకయ్యనాయుడు తదితరుల నాయకత్వంలో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో రాస్తారోకో చేయడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. అరెస్టుల సందర్భంగా వివిధ పార్టీల నేతలు మీడియాతో మాట్లాడుతూ.. యూపీఏ ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. యూపీఏ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను ఉపసంహరించుకునేంత వరకూ పోరాటం సాగుతుందని వామపక్షాలు ప్రకటించాయి.
|
|
వైఎస్ విజయమ్మతో బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య భేటీ అయ్యారు. 34% బీసీ రిజర్వేషన్‌ను యథాతథంగా కొనసాగేలా పోరాడాలని వైఎస్ విజయమ్మకు ఆయన విజ్ఞప్తి చేశారు. అంతేకాక రాజ్యాంగ సవరణకోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆర్.కృష్ణయ్య తెలిపారు. సెప్టెంబర్ 26న ఇందిరాపార్క్ వద్ద తాము చెపట్టనున్న బీసీ రణభేరికి వైఎస్ విజయమ్మను కృష్ణయ్యా ఆహ్వానించారు. హైకోర్టు తీర్పును సాకుగా చూపి సీఎం కిరణ్ కుయుక్తులు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. పంచాయతీరాజ్ సంస్థలో బీసీ రిజర్వేషన్లు తగ్గించే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తున్నారని ఆయన అన్నారు. కృష్ణయ్య విజ్ఞప్తికి వైఎస్ఆర్ సీపీ నేత గట్టు రామచంద్రరావు స్పందించారు. రిజర్వేషన్ల విషయంలో బీసీల కోరిక సమంజసమేనని గట్టు రామచంద్రరావు అభిప్రాయపడ్డారు. బీసీ రిజర్వేషన్ ఏమాత్రం తగ్గినా వైఎస్‌ఆర్ సీపీ చూస్తూ ఊరుకోదన్నార. బీసీలకు మేలు చేసేందుకు కృష్ణయ్య చేపట్టిన ఆందోళనకు వైఎస్‌ఆర్ సీపీ మద్దతు ఉంటుందని గట్టు రామచంద్రరావు అన్నారు. |

నందమూరి వారిని నట్టేట ముంచడం ’నారా‘వారికే సాధ్యం. మహానటుడు ఎన్టీఆర్ ను నమ్మించి వంచించిన ఘనత ’నారా‘కే దక్కిందని చెప్పకతప్పదు. పిల్లనిచ్చిన మామపై మాయా రాజకీయం ప్రయోగించడం తెలుగుదేశంలో పరిపాటే. ఎన్టీఆర్ ను రోడ్లపాలు చేసిన ఖ్యాతి ఎవరిదో అందరికీ విధితమే. పార్టీ వ్యవస్థాపకుడినే నా నా అవస్థలపాలు చేసిన నాయుడుగారు తెలుగుదేశంలో మరో ప్రయోగానికి తెరతీశారు. బాలయ్యకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించి లోకయ్యను సహాయకునిగా నియమించనున్నారు. మరి లోకయ్య తన మామ బాలయ్యను ముంచిన అల్లుడవుతాడా? పితృదేవుడు ‘నారా’ నేర్పిన రాజకీయ పాఠాలు బాలయ్యబాబుకూ అప్పజెపుతాడా? పిల్లనిచ్చిన పాపానికి పదవి పోతే పోయింది కానీ పరువుపోతే ఇంకేమైనా ఉందా..? అవశానదశలో ఉన్న తెలుగుదేశం పార్టీకి కొత్త రక్తం కావాలని నాయుడుగారు తలచారు. ఇతరులకు అప్పగిస్తే పార్టీని ఇట్టే ఎగురేసుకుపోతారని భావించినట్టున్నాడు. ‘దేశం’ వారసుడు బాలయ్యను బరిలోకి దింపేందుకు అక్టోబర్ 2న ముహుర్తం ఖరారు చేశాడు. కాగా వియ్యంకుడైన బాలయ్యకు చేదోడువాదోడుగా తన వారసుడైన లోకేష్ బాబును నియమించడంలో నిమగ్నమైయ్యారు. దీంతో తెలుగుదేశంలో మళ్ళీ మామా అల్లుళ్ళ శకం ప్రారంభం కానుందనే చెప్పాలి. జనాభిమానం గల బాలయ్యకు పార్టీ పగ్గాలు అందించి ధనాభిమానం గల లోకేష్ కు సైతం కీలక బాధ్యతలు అప్పగిస్తే తన భాధ్యత తీరినట్టేనని ‘బాబు’ దృఢనిశ్చయానికి వచ్చేశాడు. తెలుగుదేశం పార్టీలో ‘నారా’ నందమూరీ వారి కనుసన్నల్లోనే నడవాలన్నది చంద్రబాబు ఆకాంక్ష. ఈక్రమంలో అన్ని పార్టీలు యువతకు పెద్దపీఠ వేస్తుండటంతో తెలుగుదేశం సైతం అదే పద్దతిని కొనసాగిస్తుందని చాటిచెప్పడానికి ఈ ప్రయత్నం చేస్తున్నట్టు వినికిడి. అంతేకాకుండా దాదాపు దశాబ్డకాలంగా ప్రతిపక్ష గ్రహణంతో విసిగివేసారిన ‘చంద్రుడు’ ఇక తెరచాటు రాజకీయాలు నెరపాలని నిశ్చయించకున్నట్టు తెలియకనే తెలుస్తోంది. ప్రస్తుతానికి పార్టీలో అన్ని బాధ్యతలు తానే చూసుకుంటున్న విషయం తెలిసిందే. కాగా అయిన వారికి తన కనుసన్నల్లో నడుచుకునే వారికి కొన్ని విభాగాలు అప్పగిస్తే కొంత విశ్రాంతి దొరుతుందని ఆలోచించినట్టుసైతం అవగతమవుతోంది. ఇదిలాఉండగా మామను నట్టేట ముంచి పదవి దక్కించుకున్న సాంప్రదాయం ఉన్న తెలుగుదేశంలో మరోసారి మామాఅళ్ళుళ్ల రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయన్న పార్టీలో చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశంలో చోటుచేసుకోబోతున్న సరికొత్త రాజకీయాల్లో ఈసారి మామను అల్లుడు కట్టడిచేస్తాడా? లేక మామే తన అల్లుడి రాజకీయ ఆటలను కట్టిపాడేస్తాడా? అన్నది వేచిచూద్దామా మరి..? 
వైఎస్‌ఆర్‌సిపి మీద ఇవాళ జరుగుతున్న ప్రచారం చూస్తే నాకు 2011 కడప ఎలక్షన్ గుర్తుకు వస్తోంది. అప్పుడూ ఇంతే. అబద్ధాలను ప్రచారం చేసి గెలవాలనుకున్నారు. కానీ ప్రజలకు తెలుసు - ఎవరు మాట మీద నిలబడతారో, ఎవరు మాట కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమవుతారో. 

|
తెలంగాణతో పాటు మిగతా ప్రాంతాల్లో కూడా అనేక సమస్యలపై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అసెంబ్లీలో అన్నారు. బీఏసీలో అన్ని పార్టీలు కలిసి తెలంగాణ సమస్యపై చర్చించ పరిష్కరించవచ్చని, సభలో ఎలాంటి తీర్మానం చేస్తారంటూ అన్ని ప్రాంతాల ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆమె పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలకు ఎక్కువ సమయం లేనందున, ఇప్పటికే ఒకరోజు ముగిసిందని, ప్రజా సమస్యలపై స్పందించి నిర్ణయం తీసుకుంటే మంచిదని విజయమ్మ అన్నారు. |
18-9-12-25560.jpg)
డీజిల్ ధరల పెంపు, వంట గ్యాస్‌పై ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోమవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పార్టీ ఆధ్వర్యంలో మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో మరింత ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు, శాసనసభపక్ష నేత వై.ఎస్.విజయమ్మ నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఎడ్లబండి, సైకిల్ రిక్షాలను తోలుతూ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. మార్గం మధ్యలో రోడ్డుపైన కట్టెలపొయ్యి ఏర్పాటు చేసి వంటా వార్పు నిర్వహించారు. 18-9-12-37998.jpg)