YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday, 2 June 2012

బాధను దిగమింగుకుంటున్నా: విజయమ్మ

గుంటూరు: తమ కుటుంబానికి ఇచ్చిన మాటకోసం, రాష్ట్రంలోని రైతుల కోసం పదవులు పోగొట్టుకున్న అభ్యర్థుల గెలుపును బాధ్యతగా తీసుకొని తాను ప్రచారం చేస్తున్నానని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ తెలిపారు. ప్రజల్లో వస్తున్న ఆదరణే తన బాధను దిగమింగేలా చేస్తోందన్నారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న విజయమ్మ ప్రచార వాహనంలో 'సాక్షి'టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. 

పార్లమెంట్ సభ్యుల్లో ఎందరో కేసులు ఎదుర్కొంటున్నా, జగన్‌నే టార్గెట్‌ చేసి జైల్లో పెట్టడమేంటని విజయమ్మ ప్రశ్నించారు. జగన్ ఎలా సాక్షులను ప్రభావితం చేస్తారో అరెస్ట్ చేసిన వాళ్లు చెప్పాలన్నారు. ఏం తప్పు చేశాడని తన కుమారుడిని అరెస్ట్ చేశారని ప్రభుత్వాన్ని అడిగినా ఇప్పటి వరకూ సమాధానం లేదన్నారు. చివరకు..ప్రచారానికి వెళ్తుంటే తమ సూట్‌కేసులు కూడా సోదా చేస్తున్నారని విజయమ్మ వాపోయారు.

జగన్‌ను కస్టడీలోకి తీసుకున్న సీబీఐ

జగన్‌ను సీబీఐ కస్టడీలోకి తీసుకుంది. ఈ ఉదయం 10.40 గంటల ప్రాంతంలో జగన్ ను సీబీఐ అధికారులు చంచల్‌గూడ జైలు నుంచి జైళ్లశాఖ డీజీ కార్యాలయానికి తీసుకెళ్ళారు. సాయంత్రం ఐదు గంటలదాకా ఆయనను సీబీఐ అధికారులు విచారించనున్నారు. భద్రతా కారణాలను దృష్టిలో పెట్టుకుని జైళ్లశాఖ డీజీ కార్యాలయంలోనే జగన్ ను విచారించాలని సీబీఐ నిర్ణయం తీసుకుంది. ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో జగన్‌ను సాయంత్రం ఐదు గంటలదాకా ప్రశ్నించిన తర్వాత మళ్ళీ రిమాండ్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. ఈనెల ఏడో తేదీదాకా జగన్‌ను సీబీఐ కస్టడీలోకి తీసుకుని విచారిస్తుంది.

'వైఎస్ మృతిపై ప్రజల్లో అనుమానాలు'

విశాఖపట్టణం: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మృతిపై ప్రజల్లో చాలా అనుమానాలు ఉన్నాయని సినీ నటుడు విజయ్‌చందర్ అన్నారు. వైఎస్‌ మృతి వెనుక సోనియా గాంధీ హస్తం ఉందని ఆయన ఆరోపించారు. పాయకరావుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గొల్ల బాబూరావు మద్దతుగా విజయ్‌చందర్ ప్రచారం నిర్వహించారు. మరోవైపు పాయకరావుపేట మండలం పీఎల్‌పురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గొల్లబాబూరావు ఇంటింటి ప్రచారం చేపట్టారు.

నెత్తురోడుతున్న ‘హస్తం’!

దక్షిణాదిన ఆవిర్భవిస్తున్న నూతన రాజకీయ ధృవతార జగన్‌మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ ఆదేశానుసారం సీబీఐ విరుచుకుపడటంతో అనూహ్యమైన రీతిలో ఆయన ప్రాభ వం దినదిన ప్రవర్ధమానం అవుతున్నది. ఇప్పటికే శిథిల మవుతున్న ఆ పార్టీకి అనతి కాలంలో మరో ఉపద్రవం ముంచుకు రాబోతున్నది.

వైఎస్సార్ మరణానంతరం, కాంగ్రెస్ ఆయన పేరుప్రతిష్టలను రూపుమాపాలనే ప్రయత్నంలో ఆ పథకాలనన్నింటినీ నీరుగార్చింది. వ్యక్తి ఆధిక్యతకు విరుద్ధంగా పార్టీ ఆధిక్యతను నెలకొల్పాలని కాంగ్రెస్ కోరుకుంది. కానీ అది ప్రతికూల ఫలితాలకు దారితీసింది. ఆ పార్టీకి ఆత్మహత్యా సదృశంగా మారింది కూడా. కాంగ్రెస్‌కు సంబంధించినంతవరకు పార్టీలో అధిష్టానాన్ని... అంటే సోనియాగాంధీని మించిన ప్రాంతీయ నేత ఎవరూ ఉండటానికి వీల్లేదు.

‘బంతిని ఎంతగట్టిగా నేలకేసి కొడితే అంతే వేగంగా పైకి లేస్తుంది.’ కొడుకు ైవె ఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలిస్తుండగా దృఢంగా నిలిచిన వైఎస్ విజయమ్మ పలికిన పలుకులివి. మే 28న సీబీఐ స్పెషల్ ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఏ పుల్లయ్య జగన్‌ను జూన్ 11 వరకు జ్యూడిషియల్ కస్టడీలో ఉంచాలని ఆదేశించారు. తీర్పు తదుపరి జగన్ ప్రశాంతంగానూ, స్థిమితంగానూ కనిపించారు. మునుపెన్నడూ ఎరుగని పటిష్ట భద్రతా ఏర్పాట్లతో మే 28 తెల్లవారుజాము నుంచే హైదరాబాద్ నగరం ఒక కోటలాగా మారిపోయింది. నగరమంతా 144వ సెక్షన్‌ను విధించారు. కానీ సాయంత్రం 5.30 గంటలకల్లా సిటీ కోర్టు ఆవరణలో ఆ నిషేధాజ్ఞలు ఆవిరయిపోయాయి.

వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు, కోర్టు సిబ్బంది కలగలసిపోయి మరీ జగన్‌కు సమీపించాలని, ఆయనతో కరచాలనం చేయాలని, కనీసం తాకనైనా తాకాలని తొక్కిసలాడారు. జైలుకు తరలిస్తున్నప్పుడు కూడా ఒక్క క్షణమైనా ఆయన నవ్వు చెదిరింది లేదు. దివంగతులైన తన తండ్రి వైఎస్ రాజశేఖరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా జగన్ ఆదాయానికి మించి ఆస్తులను సంపాదించారంటూ సీబీఐ మోపిన అభియోగాలను పట్టించుకున్నవాళ్లుగానీ, నమ్మినవాళ్లుగానీ అక్కడ ఎవరూ లేరు. జగన్‌పై ఆగ్రహాన్ని రగల్చడానికి బదులుగా కాంగ్రెస్ ఎత్తుగడ దానికే బెడిసికొట్టింది. తనకొక వరంగా పరిణమించగలగిన వ్యక్తిని ఒకే ఒక్క ఎత్తుతో అది బద్ధశత్రువుగా మార్చుకుంది.

జగన్‌ను దెబ్బతీయడానికి కాంగ్రెస్ పార్టీ సీబీఐని ప్రయోగించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 2007లో ములాయంసింగ్‌యాదవ్‌పైనా, 2003లో తాజ్ కారిడార్ కేసులో మాయావతిపైనా కూడా అది అలాగే సీబీఐని ప్రయోగించింది. కానీ ఒక్క జగన్ విషయంలోనే దాని చర్యకు ప్రతిచర్య ఎదురైంది. సీబీఐని ప్రయోగించడం జగన్‌కు వరంగా పరిణమించింది. 18 శాసనసభ స్థానాలకు, ఒక లోక్‌సభ స్థానానికి జూన్ 12న జరగనున్న కీలకమైన ఉప ఎన్నికలలో మొత్తం అన్ని స్థానాలను ఆయనే గెలుచుకునేలా ఉన్నారు. ఇందులో 16 శాసససభ స్థానాలు కాంగ్రెస్‌వే. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పతనం అంచులకు చేరుతోంది.

జగన్ అరెస్టయ్యాక అప్పుడే బొబ్బిలి ఎంఎల్‌ఏ ఎస్‌కే రంగారావు కాంగ్రెస్‌ను వీడారు. మే 30న రాజీనామా చేస్తూ ఆయన తాను వైఎస్సార్ సీపీలో చేరనున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన, పార్వతీపురం ఎంఎల్‌ఏ సువారపు జయమణి, కురుపాం ఎంఎల్‌ఏ టీవీవీటీ జనార్దన్‌లను కూడా తన బాటనే పట్టాలని ఒప్పించే ప్రయత్నంలో ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు సొంత జిల్లా విజయనగరంలోనే ఎంఎల్‌ఏలను నిలబెట్టుకోవడం రోజురోజుకూ కష్టమవుతోంది.

హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్‌ఆర్ మరణించినప్పటి నుంచి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి, జగన్‌కు మధ్య విభేదాలు పెరుగుతూ వచ్చాయి. జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. వేచి ఉండాలని సోనియా భావించారు. రాజకీయ ఎత్తుగడలు మొదలు కావడంతోనే సీబీఐ కూడా రంగప్రవేశం చేసింది. జగన్ ఏమేం చేశారని ఇప్పుడు ఆరోపిస్తున్నారో వాటిని వైఎస్‌ఆర్ చేసినప్పుడు సీబీఐ దర్యాప్తును చేపట్టలేదు. కాంగ్రెస్ అలవాటు ప్రకారమే తన హస్తం కనబడకుండానే పని కానిచ్చేయాలని ఈ వ్యవహారాన్ని న్యాయస్థానం పరిధిలోకి తెచ్చింది.

జగన్ ఆస్తులపై సీబీఐ విచారణను కోరుతూ కాంగ్రెస్ ఎంఎల్‌ఏ పీ శంకరరావు 2011 ఆగస్టు 21న ఏపీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని వేశారు. ఆ తర్వాత 10 రోజులకు ఆయన రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి అయ్యారు. ఏపీ హైకోర్టు 2011 ఆగస్టు 10న జగన్ ఆస్తుల కేసులో దర్యాప్తును చేపట్టాలని సీబీఐని ఆదేశించింది. ఉప ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరాక, మే 25న మొట్టమొదటిసారిగా సీబీఐ జగన్‌ను విచారణకు పిలిచింది. ప్రచారాన్ని ఆపక తప్పని పరిస్థితిని ఆయనకు కల్పించింది. అదే రోజు జగన్ అరెస్టు జరుగుతుందని పుకార్లు షికార్లు చేస్తున్నా సీబీఐ వేచి చూసింది. ‘మే 28న జగన్ ఎలాగూ సీబీఐ న్యాయస్థానం ముందు హాజరు కావాల్సి ఉంది. జగన్ కోర్టుకు హాజరయ్యేలోగా ఆయనను అరెస్టు చేయకపోవచ్చ’ని సీబీఐలోని అత్యున్నత వర్గాలు ‘ఇండియా టు డే’కు తెలిపాయి.

హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌కు పక్కనే ఉన్న దిల్‌కుష గెస్ట్‌హౌస్‌లో సీబీఐ జగన్‌ను ప్రశ్నిస్తుండగా ఢిల్లీలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులామ్ నబీ అజాద్, రాష్ట్ర ఉప ఎన్నికల ఇన్‌చార్జి వాయలార్ రవి, కేంద్ర సహాయ మంత్రి వీ నారాయణస్వామి, కేబినెట్ కార్యదర్శి ఏకే సేథ్‌ల మధ్య ముమ్మరంగా చర్చలు సాగాయి. ఆ తదుపరి, మే 27 ఉదయమూ, ఆ తర్వాతా అజాద్ సోనియాతో భేటీ అయ్యారు. జగన్ అరెస్టుకు ఆదేశాలు జారీ అయ్యాయి.

జగన్‌ను ప్రచారానికి దూరం చేసి నష్టాలను తగ్గించుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది. తద్వారా దానికి కాసింత ఊపిరి పీల్చుకునే అవకాశం దొరికింది. కానీ, ఇంతలోనే ‘ప్రజా న్యాయస్థానమే జగన్‌కు న్యాయం చేస్తుంది’ అంటూ జగన్ తల్లి, పులివెందుల ఎంఎల్‌ఏ విజయమ్మ ప్రచారానికి దిగారు. దీంతో కాంగ్రెస్ పరిస్థితి మరింతగా దిగజారిపోయేట్టుంది. యూపీఏ-1కి 29 లోక్‌సభ సీట్లను, యూపీఏ-2కి 33 సీట్లను అందించిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌కు అత్యంత కీలకమైనది. పైగా దక్షిణాదిలో తనకు తానుగా అధికారం నెరుపుతున్న రాష్ట్రం అదొక్కటే. అందుకే కాంగ్రెస్‌కు ఇది జీవన్మరణ పోరాటం. ‘చాలా నియోజకవర్గాల్లో పోటీ నువ్వా, నేనా అన్నట్టుగా ఉంద’ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డే స్వయంగా అన్నారు. క్యాడర్‌తో సహా పలువురు కాంగ్రెస్ నేతలు వైఎస్సార్‌సీపీ పక్షాన చేరిపోయారని, ఈ ధోరణిని అరికట్టడానికి సమయం పడుతుందని అంగీకరించారు.

ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 12న జరుగనున్న ఉప ఎన్నికలు 1983 సార్వత్రిక ఎన్నికలంతటి కీలకమైనవి. ఆ ఎన్నికలలోనే తెలుగుదేశం పార్టీ (టీడీపీ) బలీయమైన ప్రాంతీయ శక్తిగా ఆవిర్భవించింది. జగన్, ఎన్టీ రామారావుకు దీటుగా నిలవగలడా? 2014 సాధారణ ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ కాంగ్రెస్, టీడీపీలు రెండింటి ఓట్లను గణనీయంగా తన వేపుకు మరల్చుకోగలుగుతుందా? జగన్ విషయంలో అన్యాయంగా ప్రవర్తిస్తున్నారని భావిస్తున్న సామాజిక వర్గాలు వైఎస్సార్‌సీపీ వెనుక బలంగా సంఘటితమయ్యాయి. షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారు కూడా ఆ పార్టీకి మద్దతు పలుకుతున్నారు. అయితే జగన్ అరెస్టు తటస్థ ఓటర్లను... ప్రత్యేకించి అవినీతిని ఎన్నికల అంశంగా భావించే మధ్యతరగతి ఓటర్లను ఆ పార్టీకి దూరం చేసింది.

గత ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్నందున కాంగ్రెస్ బలమైన ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. అది, జగన్ జనాకర్షణను మించి మరీ ఓటర్లను ప్రభావితం చేస్తోంది. ఆ ఓట్లన్నీ టీడీపీ, వైస్సార్‌సీపీల మధ్య చీలుతాయి. ‘యుడోఫడ్ స్ట్రేటజీస్’ డెరైక్టర్ తేజా నర్రా అన్నట్టు ‘‘ప్రధాన ప్రతిపక్షంగా మసకబారిపోతున్న టీడీపీపై 2014 ఎన్నికలు తీవ్ర పర్యవసానాలను కలుగజేస్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2004-2009 కాలాన్ని ప్రజలు వైఎస్సార్‌తో ముడిపడినదిగానే చూస్తున్నారు. ఆ ప్రభుత్వం వల్ల జరిగిన మంచికంతటికీ ఆయనే కారణమని, ఆ తర్వాత నడుస్తున్నది కాంగ్రెస్ పాలన అని భావిస్తున్నారు’’.

టీడీపీ ఎంఎల్‌ఏలు ఐదుగురు రాజీనామాలు చేసి, ఉప ఎన్నికల్లో తిరిగి ఎన్నికయ్యారు. అయితే వారిలో ఒకరు స్వతంత్రులుగానూ, మరొకరు వెఎస్సార్‌సీపీ తరఫున, ముగ్గురు టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి ఎన్నికయ్యారు. మే 31న టీడీపీకి మరో షాక్ తగిలింది. టీడీపీ టిక్కెట్టుపై మరోమారు పోటీ చేసేది లేనేలేదని నూజివీడు ఎంఎల్‌ఏ సీ రామకోటయ్య ప్రకటించారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి రావడం అసంభవమని కూడా ఆయన అన్నారు. రామకోటయ్య ఇప్పుడు తన భవిష్యత్తును తేల్చుకోనున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి తాను తీవ్ర సంకటాన్ని ఎదుర్కొంటున్నానని తెలుసు. ‘‘జగన్‌ను జైలుకు పంపాలన్న కోరిక నాకేమీ లేదు. కాకపోతే కొల్లగొట్టిన ప్రజాధనాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పేదల సంక్షేమానికి వ్యయం చేయాలని కోరుకుంటున్నాను. వైఎస్సార్ పాలనలో జరిగిన అవినీతిని టీడీపీ బట్టబయలు చేసింది. ఆయనపై చర్య తీసుకోవాలని ప్రధానిని కోరింది. కానీ, యూపీఏ, కాంగ్రెస్‌లు యథావిధిగా సకాలంలో చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యాయి’’ అని నాయుడు అన్నారు.

సీబీఐ జగన్‌ను అరెస్టు చేయడంలో కాంగ్రెస్ పాత్రేమీ లేదని ముఖ్యమంత్రి గట్టిగా చెబుతున్నారు. ‘జగన్, తన అరెస్టును ఉపయోగించుకొని సానుభూతిని రేకెత్తింపజేయాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ అరెస్టుకు, మాకు ఎలాంటి సంబంధమూ లేదు’ అన్నారాయన. అయితే, వైఎస్సార్ పేరు ప్రతిష్టలను ప్రత్యేకించి విజయవంతమైన ఆయన అభివృద్ధి కార్యక్రమాలను, పేదరిక నిర్మూలనా పథకాలను ఒక క్రమపద్ధతిలో కాంగ్రెస్ ఎందుకు రూపుమాపాలని ప్రయత్నిస్తోందనే ప్రశ్నకు మాత్రం ఆయన వద్ద సమాధానం లేదు.

జగన్ వ్యతిరేక పోరాటంలో అనుకోని విధంగా తాము సమిధలు కావడం పట్ల కాంగ్రెస్ నేతలు కొందరిలో రోజురోజుకీ ఆందోళన పెరిగిపోతోంది. సీబీఐ జగన్‌ను ప్రశ్నించడానికి పిలిచిన రోజుకు ఒక్క రోజు ముందే ఎక్సైజు మంత్రి మోపిదేవి వెంకటరమణ అరెస్టవడం వారికి దిగ్భ్రాంతిని కలుగజేసింది. వాడరేవు- నిజాం పట్నం ఓడ రేవు... పారిశ్రామిక కారిడర్ (వాన్‌పిక్) ఒప్పందాలకు అనుమతిని ఇవ్వడానికి సంబంధించిన ఆరోపణలపై మోపిదేవిని సీబీఐ అరెస్టు చేసింది. మే 24న ముఖ్యమంత్రికి పంపిన రాజీనామా లేఖలో మోపిదేవి, ఆనాటి సీఎం వైఎస్సార్ ఆదేశాలను పాటించడం మాత్రమే తాను చేశానని, ఆయన కార్యాలయంలోనే ఫైలుపై సంతకం చేశానని, ఆ ఫైలును తన కార్యాలయానికి పంపింది కూడా లేదని పేర్కొన్నారు.

ఏదిఏమైనా అనుమతులు సంపాదించాలని ప్రయత్నిస్తున్న కంపెనీలకు అనుకూలంగా వైఎస్సార్ మంత్రివర్గంలోని ఆరుగురు మంత్రులు, పలువురు ప్రభుత్వాధికారులు ప్రభుత్వ ఆదేశాలను జారీ చేశారని, అందుకు బదులుగా, ఆ కంపెనీలు క్విడ్ ప్రో కోగా జగన్ సంస్థలలో పెట్టుబడులను పెట్టడానికి సిద్ధపడ్డారని సీబీఐ ఒక వాదాన్ని రూపొందించింది. ‘అవినీతికి పాల్పడ్డవారెవరినీ వదిలేది లేదు. ఏపీ హైకోర్టు ఆదేశానుసారం సీబీఐ సాగిస్తున్న దర్యాప్తు సరిగ్గా అదే చేస్తోంది’ అని కాంగ్రెస్ విధేయుడైన ఎంపీ మధుయాష్కీ అభిప్రాయపడ్డారు.

జగన్‌పై రాజకీయ కక్షసాధింపునకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ ఆరోపిస్తోంది. ‘‘జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొనలేక కాంగ్రెస్ ఆయనపై సీబీఐని ప్రయోగిస్తోంది. అధికారంలో ఉన్న పార్టీ ఇలా సీబీఐ వంటి సంస్థలను వాడుకోవడానికి వీల్లేకుండా వాటికి స్వయం ప్రతిపత్తిని కల్పించాలి’’ అని ఒకప్పటి టీడీపీ రాజ్యసభ సభ్యులు ఎంవీ మైసూరారెడ్డి అన్నారు.

2011, ఏప్రిల్‌లో ఆయన తెలుగుదేశం అభ్యర్థిగా లోక్‌సభ ఉపఎన్నికల్లో జగన్‌పై పోటీ చేసి ఓడిపోయారు. కానీ, సీబీఐ జగన్‌ను విచారించడానికి పిలిచేసరికి మైసూరా వైఎస్సార్‌సీపీలో చేరిపోయారు. కాంగ్రెస్ ఇటీవలి కాలంలో వైఎస్సార్‌ను ఒక విలన్‌గా చిత్రీకరిస్తోంది. కానీ జగన్‌కు ఆయన నుంచి సంక్రమించిన రాజకీయ వారసత్వాన్ని ఎదిరించి నిలవడం మాత్రం దాని వల్ల కావడం లేదు. ‘

‘వైఎస్సార్ ఒక అద్భుతమైన నాయకుడు. ఆయన పేదలకు గృహవసతి, ఆహారం, ఆరోగ్య భద్రతలను కల్పించడానికి పలు పథకాలను ప్రారంభించారు. ఈ పథకాలవల్ల 80 లక్షల మంది ప్రజలు లబ్ధిని పొందారు. ‘ఇందిర ప్రభ’ పేరిట ఆయన వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును, నీటిని అందించారు. 28 లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్తు లభించింది’’ అని డీఏ సోమయాజులు తెలిపారు. వైఎస్సార్‌కు ఆయన ఆర్థిక సలహాదారుగా ఉండేవారు.

నేడు ఆయన జగన్ ఆంతరంగికుల్లో ఒకరు. ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’ పథకంద్వారా 11 లక్షల మంది ప్రజలు రాష్ట్రంలోని అత్యుత్తమమైన ఆసుపత్రుల వైద్య సేవలను అందుకున్నారని ఆయన వివరించారు. వైఎస్సార్ మరణానంతరం, కాంగ్రెస్ ఆయన పేరుప్రతిష్టలను రూపుమాపాలనే ప్రయత్నంలో ఆ పథకాలనన్నింటినీ నీరుగార్చింది. వ్యక్తి ఆధిక్యతకు విరుద్ధంగా పార్టీ ఆధిక్యతను నెలకొల్పాలని కాంగ్రెస్ కోరుకుంది. కానీ అది ప్రతికూల ఫలితాలకు దారితీసింది. ఆ పార్టీకి ఆత్మహత్యా సదృశంగా మారింది కూడా. కాంగ్రెస్‌కు సంబంధించినంతవరకు పార్టీలో అధిష్టానాన్ని... అంటే సోనియాగాంధీని మించిన ప్రాంతీయ నేత ఎవరూ ఉండటానికి వీల్లేదు.

జగన్ తన తండ్రికి ఉన్న మంచిపేరును ఆధారం చేసుకొని బలాన్ని పెంపొందింపచేసుకోవడంలో గొప్ప నేర్పును ప్రదర్శించారు. తొలుత ఓదార్పు యాత్రను ప్రారంభించినప్పడు ఆయన ప్రజల సానుభూతి ప్రాతిపదికగా జనాకర్షణశక్తిని పెంచుకున్నారు. ప్రజలు ఆయనను తమ ‘రక్షకుని’ కుమారునిగా చూశారు. కాంగ్రెస్, జగన్‌తో వ్యవహరించిన తీరు దానికి తోడయింది.

2009 నుంచి అజాద్ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా వ్యవహరించారు. కానీ రాష్ట్ర వ్యవహారాలపై మాత్రం ఆయనకు ఎన్నడూ పట్టు లభించలేదు. కొన్ని కాంగ్రెస్ పోస్టర్లలో ఇంకా వైఎస్సార్ ఫొటోలు ఉండటం చూసిన వాయలార్ రవి వాటిని వెంటనే తొలగించేలా చేశారు. ప్రజల మధ్య తిరగడం ప్రారంభించి, రాజకీయాల్లోని కష్టనష్టాలను ఎదుర్కోవడం మొదలయ్యాకే జగన్ ప్రజలకు ప్రేమాస్పదుడైన వ్యక్తిగా అవతరించారు. వైఎస్సార్ విధేయులైన పలువురు మాజీ కాంగ్రెస్ నేతలకు మొదట్లో జగన్ శక్త్తిసామర్థ్యాల పట్ల భరోసా ఉండేది కాదు.

వైఎస్సార్ మరణానంతరం ఆరు నెలలకు తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక కన్నుమూసిన వారి కుటుం బాలను కలుసుకోవడానికి జగన్ ఓదార్పు యాత్రను చేపట్టారు. ఆ యాత్రలో ఆయన ప్రదర్శించిన సహనాన్ని, నిబద్ధతను చూశాక వాళ్లకు జగన్ నాయకత్వ లక్షణాలపై గురి కుదిరింది. ఆ ఓదార్పు యాత్రలోనే ఆయన తన గుండె ధైర్యాన్ని నిరూపించుకునారు. 13 జిల్లాలలో 17,430 కిలోమీటర్ల దూరాన్ని 265 రోజుల పాటు ప్రయాణించిన జగన్ 5,152 గ్రామాలను, 114 పట్టణాలను సందర్శించారు. 700 కుటుంబాలను కలుసుకున్నారు.

జగన్ కడప జిల్లాలో ఎన్నికల ప్రచారంలో ఉండగా మే 17న ‘ఇండియా టు డే’ ఆయనకు ప్రజల నుంచి లభిస్తున్న అఖండ ప్రజా స్పందనను కళ్లారా చూసింది. వైఎస్సార్, జగన్‌ల చిత్తరువులున్న మినీ బస్సు గ్రామాలలోంచి మెలికలు తిరుగుతూ పోతుంటే... కాబోయే ముఖ్యమంత్రి జగన్‌ను దగ్గరి నుంచి చూడాలని దారికి ఇరువేపులా ఉన్న ఇళ్లు, భవనాలపై ప్రజలు గుమిగూడి వేచి ఉన్నారు. జగన్‌కు నేడు అలవాటుగా మారిన పూర్తి చేతుల చొక్కాతో, బూడిద రంగు ప్యాంటు ధరించి మండే ఎండలకు కమిలిపోయి ఉన్నారు. ఆయన ప్రతి గ్రామంలోనూ ఆగి, పిల్లలను ముద్దాడారు, వృద్ధులను కౌగలించుకున్నారు. అత్యంత బలమైన జనాకర్షణ శక్తిని గలిగిన జగన్ తమను తాకడంతోనే మహిళలు, వృద్ధులు, యువకులు ఆనంద భాష్పాలు రాల్చారు. మగవాళ్లు ఆయనతో మాట్లాడాలని, పెద్దలు ఆశీర్వదించాలని తాపత్రయపడ్డారు. చిన్నవాళ్లు ఆయనను ‘అన్నా’ అని పిలిచారు.

మాటలకు తడుములాడుకునే ఒకప్పటి వ్యాపారవేత్త జగన్ తన ప్రసంగాలకు నాటకీయతను జోడిస్తూ ఉత్తేజకరమైన ఉపన్యాసకునిగా పరివర్తన చెందారు. ఏదైనా ఒక అంశాన్ని చెప్పేటప్పుడు ఆయన కుడిచేతిని అలా గాలిలో ఊపుతూ గుమిగూడిన ప్రజల చూపుల్లో చూపులను కలిపేవారు. కడప జిల్లాలోని ప్రతి గ్రామంలోనూ దర్శనమిచ్చే వైఎస్సార్ విగ్రహాలను దాటి మెల్లగా సాగుతున్నప్పుడు చేయి ఊపేవారు. తన తండ్రి పథకాలను పునరుద్ధరిస్తానని హామీ ఇచ్చేవారు. హఠాత్తుగా ఎదిగిన నేతగా ఉన్న స్థితి నుంచి నేడాయన, ఐతిహాసిక పురుషునిగా గుర్తింపు పొందిన ఎన్టీ రామారావుతో పోల్చదగిన ప్రజానాయకునిగా మార్పు చెందారు.

అభిమానం, వల్లమాలిన మోజుగా మారి దినదినం ఇనుమడిస్తున్న జగన్ జనాకర్షణశక్తి, దివంగతులైన తన భర్తను గుర్తుకు తెస్తోందని ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి అన్నారు. మే 26న సీబీఐ విచారణకు వెళ్లడానికి ముందు హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని ఆయన నివాసం ముందు గుమిగూడిన వందలాది మందిలో ఆమె కూడా ఉన్నారు. ‘జగన్ ముఖ్యమంత్రి అవుతారు, ఎన్టీఆర్ కంటే కూడా పెద్ద స్టార్ అవుతారు’ అని లక్ష్మీపార్వతి అన్నారు. జగన్ ఇంట్లో ఆదరపూర్వకమైన ఆతిథేయ పాత్రను నిర్వహిస్తున్న ఆయన భార్య భారతి, సాక్షి గ్రూపునకు చైర్‌పర్సన్. ‘ఆయనలోని శక్తే మాకందరికీ సోకింది, అదే మమ్మల్ని నడిపిస్తోంది’ అని ఆమె అన్నారు.

ఒక ఫొటో కావాలని అడగగానే ఆమె వెనుకకు పోయి నిలిచి ‘మీరు సారు ఫొటోలు తీసుకోవచ్చు’ అన్నారు. జగన్ చెల్లెలు షర్మిళ, బావమరిది అనిల్‌కుమార్‌లు కూడా ఆయనకు మద్దతుగా నిలిచారు. పార్టీ నాయకులు, మిత్రులు, బంధువులు అందరినీ విచారణకు వెళ్లే ముందు తప్పనిసరిగా కలుసుకోవాలని ఆయన అనుకున్నారు.‘కాంగ్రెస్ జగన్‌పై ప్రతీకారాన్ని తీర్చుకుంటోందనేది స్పష్టమే. మాకు ఆయనపై నమ్మకం ఉంది. ఆయన మరింత బలవంతులుగా తిరిగివస్తారని తెలుసు’ అని తెలుగు సినిమా నటి రోజా అన్నారు. కాంగ్రెస్ కక్ష సాధింపు రాజకీయాలు ఒక నవీన ఇతిహాసాన్ని సృష్టించాయి. ఏపీ అంటే దక్షిణాదిలో కాంగ్రెస్‌కు పెట్టని కోట అనే భావన ఇప్పుడిక కేవలం మిథ్యగా మారబోతోంది. ఏదిఏమైనా జూన్ 12న ఈ చిక్కుముడి విడిపోయే ప్రక్రియ ఆరంభమవడం తథ్యం. 1998లో కాంగ్రెస్‌కు లోక్‌సభలో 140 సీట్లు ఉన్నప్పుడు సోనియాగాంధీ ఆ పార్టీకి అధ్యక్షురాలయ్యారు.

కాంగ్రెస్ పార్టీకి వరుసగా పడుతున్న చిన్న చిన్న తూట్ల పరంపరలో ఏపీలో ఇప్పుడిక పెద్ద గండి పడనుంది. పార్టీ నిర్మాణం కుప్ప కూలిపోతోంది. గత 26 ఏళ్లలో మొట్టమొదటిసారిగా హిమాచల్‌ప్రదేశ్ మునిసిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ అధికారం కోల్పోవడం కూడా దానికి దిగ్భ్రాతికరంగానే ఉంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సోనియా పార్టీకి 1998 కంటే తక్కువ స్థానాలే దక్కుతాయా?
‘(‘ఇండియా టుడే’ సౌజన్యంతో...)

ఇండియా టుడే’ 2012 జూన్ 11 సంచిక ‘ది ప్రైస్ ఆఫ్ వెండెట్టా’ శీర్షికతో ప్రచురించిన కవర్ పేజీ కథనాన్ని ‘సాక్షి’ పాఠకులకు అందిస్తున్నాం. ఈ విశేష కథనం రచయితలు 
‘భావన విజ్ అరోరా, అమర్‌నాథ్ కె. మీనన్ 

కోర్టులను రాజకీయం కోసం వేదికలుగా వాడుకోవడం ఆది నుంచీ ఉన్నదే. ఒంటబట్టిన అలవాటే. అలా మొదలైన ప్రహసనం అక్కడితో ఆగి పోలేదు. ఇప్పుడు జగన్ వంతు వచ్చింది. ఇవాళ కాకపోతే రేపు జగన్ ప్రజల్లో గెలిస్తే, ప్రజల ముందు న్యాయస్థానం దోషి కాకూడదు. ప్రభుత్వాన్ని, ప్రతిపక్షాన్ని ప్రజలు ఎంచుకోవాలి. కోర్టులు కాదు.

ఈ దేశంలో రాజకీయ నాయకులు చట్టం అంటూ ఒకటి ఉందన్న సంగతి మర్చిపోయారు. వాళ్లకు తెలిసినంత వరకూ ప్రతిదీ రాజకీయమే. అసెంబ్లీ, పార్లమెంటు కూడా వాళ్లకి స్వ-రాజకీయ వేదికలుగా కనిపిస్తాయి. అధికారపక్షంవాళ్లు అపోజిషన్ వాళ్ల నోరుమూయించడానికి, అలాగే ప్రతిపక్షం వాళ్లు అధికారపక్షాన్ని అల్లరి పెట్టడానికి పార్లమెంటు, అసెంబ్లీలను ఉపయోగించుకుంటున్నారు.పార్లమెంటు, అసెంబ్లీలను చూసిన వాళ్లకి కుస్తీ పోటీలు జరిగే బరి గుర్తొస్తుంది. కాకపోతే కుస్తీ పోటీల్లో కండలు చూపించి, జబ్బలు చరిచి ఒకరి మీద ఒకరు కలబడిపోయి కొట్టుకుంటారు. అదే రాజకీయ వేదికల మీద అధికార, ప్రతిపక్షాలు నోటికొచ్చినట్టు తిట్టుకుంటారు. తిట్టుకోవడమూ, కొట్టుకోవడమూ, కాట్లాడుకోవడమూ పొలిటీషియన్స్ పేటెంటేమోననుకుని వీధి కుక్కలు కూడా కొట్లాడుకోవడం మానేశాయి.

దీంతో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అంటే ప్రజలకి రోతపుట్టింది. అధికారపక్షం, అపోజిషన్ లేకుండా చేసుకోవాలంటే వాళ్లని బోనెక్కించి దోషిగా నిలబెట్టాలనుకొన్నారు. ప్రతిపక్షం వారు నోరు చేసుకొని అధికారపక్షం మీద అభాండాలు వేసి అందర్నీ నమ్మించజూస్తున్నారు. వాళ్లు నోరు చేసుకున్నందుకు వాళ్ల మీద పోలీసులు చెయ్యి చేసుకొని, లాఠీలు చేసుకుని చివరాఖరికి చట్టం ప్రకారం జైలుకు తోలేసేలా చూడాలని కోర్టులని వేడుకున్నారు.కోర్టు వారు పొలిటీషియన్లు పవర్లో ఉంటే తప్ప నోరు చేసుకోవడానికి వీల్లేదు. నోరు చేసుకోవడం, అధికారాన్ని ధిక్కరించడం నేరమా కాదా అన్న విషయం విచారణ తరువాత తేల్చుకోవచ్చు.

ముందుగా ఈ విషయాన్ని తమ కోర్టుకంటే పోలీస్ కోర్టుకి బదిలీ చెయ్యడం మంచిదనుకొని దర్యాప్తు చెయ్యమని పోలీసులను ఆదేశించారు. బపోలీసులు ఎంతో ప్రభుభక్తితో న్యాయస్థానాన్ని గౌరవించి, రాత్రింబగళ్లూ కష్టపడి నిందితులకి నిద్రలే కుండా చేశారు.ఇదన్యాయం, అక్రమం. ప్రజల్లోనూ, పార్లమెంటులోనూ తేల్చుకోవాల్సిన బలాబలాల్ని పోలీస్ కచేరీల్లో తేల్చుకోవలసిరావడం అప్రజాస్వామికం అని ప్రతిపక్షాల వాళ్లు ఎంత గోల చేసినా పెడచెవిన పెట్టారు అధికారపక్షంవాళ్లు.

ప్రజల గోడే కాదు, ప్రతిపక్షాల గోల కూడా పట్టించుకోని ప్రభుత్వం చెవిటిది. ‘‘చెవిటి వాడి ముందు శంఖం ఊదుతావా? ఊదుకో. కానీ వినాల్సింది నేను కాదు. పోలీసు వాళ్లు కాదు. కోర్టువారు. నాకు తెల్సిన భాషలో ప్రతిపక్షం వాళ్ల విమర్శలంటే అర్థం పర్థం లేనివని. మీ మాటలకు అర్థం వెదుకుతూ కూర్చుంటే మా పదవీ కాలం సరిపోదు. అందుచేతే మిమ్మల్ని కోర్టుకి తోలేశాము. మీ అదృష్టం బాగుంటే కోర్టువారు మీ జీవిత కాలం పూర్తయ్యేలోగా తీర్పు చెబుతారు.

అప్పటికదే మీ విజయం’’ అనేసి కోర్టు గొడవల్లో జోక్యం చేసుకోవడం తగదన్నట్లుగా ఊరుకున్నారు. ప్రజల్లో గెల్చినా కానీ, ఊచల్లెక్కబెడుతూ కూచోవాల్సిందే. అందుకే పాలిట్రిక్స్‌లో కేవలం ప్రజల మన్నన పొందితే సరిపోదు. అదృశ్యశక్తి ఆదరణకు నోచుకోవాలి. నోరుచేసుకోవడం నేరమో కాదో తేల్చుకునేసరికి పదవిని అలంకరించడం సంగతి అలావుంచి, వయస్సు మీరిపోతారని సంబరపడుతూ తమ భుజాలు తామే చరుచు కున్నారు అధికారపార్టీ నాయకులు.

ఇది అన్యాయం... అన్యాయం... కోర్టులు రాజకీయ వేదికలుగా మారిపోతే ప్రజాతీర్పుకి విలువ ఉండదని ఘోషించాయి ఎన్నో హృదయాలు.రేపు ఈ కేసులు వీగిపోతే పోలీసులూ, పొలిటీషియన్లూ, పెద్దమనుషులుగా మిగిలిపోవచ్చు.కానీ అంతర్నాటకంలో అణగారిపోయినవారి హృదయాల్లో న్యాయస్థానం పదిలంగా ఉంటుందా? ఇది హాస్యం కాదు. అపహాస్యం కాదు. ప్రజాస్వా మ్యం. అలనాడు పౌరహక్కుల నేత పురుషోత్తంను హత్య చేసిన నిందితుడితో బహిరంగంగా నేరం ఒప్పించి, ఆ తరువాత కోర్టులో కేసు వీగిపోయేలా చేసిన ప్రఖ్యాతి మన తెలుగు ప్రభువుల సొంతం. కోర్టులను రాజకీయం కోసం వేదికలుగా వాడుకోవడం ఆది నుంచీ ఉన్నదే. ఒంటబట్టిన అలవాటే. అలా మొదలైన ప్రహసనం అక్కడితో ఆగి పోలేదు. ఇప్పుడు జగన్ వంతు వచ్చింది. ఇవాళ కాకపోతే రేపు జగన్ ప్రజల్లో గెలిస్తే, ప్రజల ముందు న్యాయస్థానం దోషి కాకూడదు. ప్రభుత్వాన్ని, ప్రతిపక్షాన్ని ప్రజలు ఎంచుకోవాలి. కోర్టులు కాదు.

- కొండమీది బెండయ్య

అ‘న్యాయ’స్వామ్యం!

‘ఈనాడు’ ప్రధాన కార్యాలయం ఆరంతస్తుల భవనంలో ఉంది. రోడ్డుమీద వెళ్ళే ఎవరికైనా ఆ భవనంలో ఎన్ని అంతస్తులున్నాయో కనిపిస్తూనే ఉంటుంది. అదే మీరు నేరుగా ఈ విషయంలో నిజానిజాలు తేల్చుకోదలచి ఆ పత్రిక సంపాదకుడు రామోజీరావును అడిగితే అయిదు అంతస్తులే అని సమాధానం చెపుతారు

హైదరాబాద్‌లోని ‘ఈనాడు’ ప్రధాన కార్యాలయం ఆరంతస్తుల భవనంలో ఉంది. రోడ్డుమీద వెళ్ళే ఎవరికైనా ఆ భవనంలో ఎన్ని అంతస్తులున్నాయో కనిపిస్తూనే ఉంటుంది. అదే మీరు నేరుగా ఈ విషయంలో నిజానిజాలు తేల్చుకోదలచి ఆ పత్రిక సంపాదకుడు రామోజీరావును అడిగితే అయిదు అంతస్తులే అని సమాధానం చెపుతారు. గతంలో చెప్పారు కూడా! అవునవును అయిదే... ఆరోది లేదని మొదటి పేజీలో సంతకం పెట్టి సంపాదకీయం కూడా రాశారు. మూడున్నర దశాబ్దాలకు పైగా ఇలాంటి అసత్యాలు, కాకి లెక్కలతో నిత్యం ఉషోదయాన ‘ఈనాడు’ పత్రికనిండా కనిపించేది అక్షరాల అచ్చు కాదు- ఆ పత్రిక యాజమాన్యం మెదడులో ఉన్న డ్రైనేజీ రొచ్చు. 

అలాంటి పత్రిక యాజమాన్యం, జగన్‌మోహన్‌రెడ్డి కోర్టులో చేసిన వాదనను ఖండిస్తూ నిన్నటి సంచిక ‘ఈనాడు’ మొదటి పేజీలో, ఆరోపేజీలో తన వ్యాఖ్యను రాసింది. ‘‘ఈనాడుది రహదారి- సాక్షిది అడ్డదారి’’ అంటూ రాసిన ఆ కథ(నం)లో అక్షరాలు, అంకెలు నిజం చెపితే ఒట్టు! సాక్షిలోకి వచ్చిన పెట్టుబడుల ప్రీమియం రూ.350 ఉండటం సక్రమం కాదంటూ సాగుతున్న వాదనలకు వివరణగా, సాక్షి ఆవిర్భావానికి కొద్ది నెలల ముందు ఈనాడు మొత్తం వాల్యుయేషన్‌ను, దాని షేర్ విలువ రూ.5,28,630 ఉండటాన్ని జగన్‌మోహన్‌రెడ్డి కోర్టులో విన్నవించారు. ఎక్కడ రూ.350... ఎక్కడ రూ.5,28,630? ఇదే అంశాన్ని జగన్‌మోహన్‌రెడ్డి ప్రస్తావించినప్పుడు ఈనాడుకు రూ.6,800 కోట్లు వాల్యుయేషన్ ఉన్నప్పుడు... సర్క్యులేషన్ పరంగా దేశంలో ఎనిమిదో స్థానంలో ఉన్న సాక్షి అందులో సగం వాల్యుయేషన్ కూడా ఉండదా? అని నివేదించారు. 

ఈ వాదనతో విభేదించదలచుకున్నప్పుడు ఈనాడు తన పాఠకులకు వివరించాల్సిన అంశాల్లో మొదటిది... ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్ వాల్యుయేషన్‌కు ప్రాతిపదిక ఏమిటి? ఆ విలువ కట్టినది ఎవరు? ఆ వాల్యుయేషన్ నివేదికలో ఏముంది? రెండోది- అంత భారీ విలువ, భారీ ప్రీమియం ఏ లెక్కన నిర్ణయించారు? నష్టాల్లో ఉన్న సంస్థకు అంత వాల్యుయేషన్ ఎలా వచ్చింది? మూడోది- అసలు రామోజీ ఈ డబ్బంతా ఎలా సంపాదించారు? నాలుగోది- అడ్డగోలుగా, అక్రమంగా సంపాదించిన ఈ డబ్బు, తద్వారా పుట్టిన సంతానం లాంటి సంస్థలను పెంచి పోషించటానికి మేం ఉన్నాం అంటూ కంపానీలూ అంబానీలూ టీవీ-18 సహా ఎందుకు ముందుకు వచ్చాయి? 

అదీ నిరంతరం నష్టాలకు పేరుబడి, కింది కోర్టులనుంచి సుప్రీం కోర్టు వరకు అన్ని స్థాయుల్లోనూ భూములు, డిపాజిట్లు, పన్నుల ఎగవేతలకు సంబంధించి వేల కోట్లమేర లయబిలిటీ ఉన్న వ్యక్తికి సంబంధించిన సంస్థల్లో షేర్లను... భారీగా సొమ్ము ముట్టజెప్పి కొనటానికి ఈ బడా పారిశ్రామికవేత్తలు ఎందుకు సాహసించారు? రెండు పేజీల్లో కొనసాగిన ఈనాడు వాదన ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకపోగా, ఏకపాత్రాభినయంలో డైలాగుల్ని తలపిస్తూ... మాకు ‘జనహితమే పరమావధి’, ‘ఏనాడూ వ్యక్తిగత ప్రయోజనాల కోసం అంగలార్చలేదు’, ‘ప్రజా సంక్షేమమే మా లక్ష్యం’, ‘న్యాయస్థానాలను విశ్వసించటం, గౌరవించటం మా విధానం’ అంటూ సంబంధం లేని అంశాలతో రంగస్థల పద్యాలు పాడింది. తన సంస్థకు పెట్టుబడులన్నీ రహదారిలో వచ్చాయని ప్రత్యక్ష దైవాలైన పాఠకుల ముందే జంకూగొంకూ లేకుండా బొంకింది. అదెలాగో వివరించే క్రమంలో పెట్టుబడులకు సంబంధించిన సాంకేతిక అంశాలను, ఈనాడు వాదనలో డొల్లదనాన్ని, అసత్యాలను కింది కథనంలో విశ్లేషణాత్మకంగా వివరిస్తున్నాం. 

వేల కోట్లు ఎలా సంపాదించారు?

ఇక్కడ ప్రాథమికమైన వాస్తవం ఏమిటంటే... కృష్ణా జిల్లాలోని ఓ పల్లెటూరిలో రైతు కుటుంబంలో జన్మించిన రామోజీ నేడు కనీసంగా పదివేల కోట్ల రూపాయలకు పైగా విలువైన వ్యాపార సామ్రాజ్యానికి ఎలా పడగలెత్తారన్నది! నూట యాభై ఏళ్ళకు పైగా చరిత్ర, ఈనాడుకు ఏనాడూ తీసిపోని సర్క్యులేషన్ ఉన్న హిందూ వంటి పత్రికల యాజమాన్యాలు డబ్బు సంపాదనలో ఏమాత్రం ఎదగనప్పుడు... ఒక్కడుగా రామోజీ ఇంత సొమ్ము మూటగట్టుకోవటంలో దేవ రహస్యం ఏమిటన్నది ఎవరికైనా వచ్చి తీరే సందేహం. సాక్షికి సంబంధించి జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభ పెట్టుబడులు పెడితే, ఈ రాష్ట్రంలోని పత్రికా రంగంలో ఈనాడు, చంద్రబాబు అనుకూల మీడియా దశాబ్దాల పాటు సృష్టించిన అగాథమే సాక్షి సర్క్యులేషన్‌కు, పాఠక ఆదరణకు ప్రధాన ఆధారమైంది. ఆ అవకాశం స్పష్టంగా కనిపిస్తున్న మీదటే సాక్షిలోకి పెట్టుబడులు వచ్చాయి. 

సాక్షి ఆవిర్భావం అనేకమంది పారిశ్రామికవేత్తల పెట్టుబడుల ఫలితమైతే... విచిత్రంగా, 2007కు మునుపటి వరకు ఎదిగిన ‘ఈనాడు’ గ్రూప్ అన్నది కేవలం రామోజీ జేబు సంస్థ. అప్పటికి రామోజీ గ్రూపులో వాటాల విక్రయం జరగలేదు. అయినా వేల కోట్ల రూపాయల మేరకు స్థలాలూ, ఆస్తులూ అప్పటికే రామోజీ సామ్రాజ్యంగా మేటలు వేశాయి. ఇదెలా సాధ్యం... అన్న మౌలికమైన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా రామోజీ ఉన్నట్టుండి అన్నా హజారేను సమర్థించానంటారు. సమాచార హక్కు ఉద్యమాన్ని భుజాలమీద, నెత్తిమీద మోశానంటారు. మా దారి రహదారి అని ఉత్తుత్తిగా తన పత్రికలోనే తన ముఠాతో అచ్చొత్తించుకునే బదులు... రహదారి అయితే తన సంపదల చట్టబద్ధత గురించి ఆయనే వివరణ ఇవ్వొచ్చు. అలాంటిది ఈ 38 సంవత్సరాల చరిత్రలో ఏనాడూ జరగలేదు. 

అదో పార్శ్వమైతే, హమ్మో! ఆయన పెట్టుబడుల గురించి మాట్లాడటమే తప్పు అంటూ టీవీ చర్చల్లో మొదలు అత్యున్నత సభల్లో వరకు గీపెట్టే రంగురంగుల కండువాలు, కుహనా మేధావులు ఈ రాష్ట్రంలో మరో రకం సామాజిక రుగ్మతకు ప్రతినిధులు. నిజానికి రామోజీ ఈ రూ.10,000 కోట్లకు మించిన సామ్రాజ్యాన్ని నిర్మించటానికి ప్రమోటర్‌గా పెట్టిన మొత్తం పెట్టుబడి ఎంతో తెలుసా? అది కేవలం రూ.2 కోట్లు కూడా లేదు. మరి రామోజీ వేల కోట్లు ఎలా సంపాదించారు? రహదారిలోనా- అడ్డదారిలోనా? ఎవరికీ లేని విధంగా రాష్ట్ర రాజధానిలోనే ఏకంగా 2,000 ఎకరాలకు పైగా భూమిని తమ అధీనంలో ఎలా పెట్టుకోగలిగారు? ప్రభుత్వాల మద్దతుతోనా? చట్టం ఆయనకు ప్రత్యేకంగా ఏవైనా అనుమతులు మంజూరు చేసిందా? దశాబ్దాలుగా ఆయన కంపెనీల బ్యాలెన్స్ షీట్‌లు పరిశీలిస్తే, లాభాలన్నవి ఏనాడూ లేని, నష్టాలకు మాత్రమే పేరుమోసిన ఆ సంస్థలకు అంత వాల్యుయేషన్ ఎలా వచ్చింది? 

అక్రమాస్తుల లెక్క తేలాయి!

రాష్ట్ర ప్రజలందరూ గమనించాల్సిన ముఖ్యాంశమేమిటంటే... జగన్‌మోహన్‌రెడ్డి మీద సాగుతున్న సీబీఐ దర్యాప్తును ‘‘జగన్ అక్రమ ఆస్తుల కేసు’’ అని తెలుగుదేశం అనుకూల మీడియా ఓ పథకం ప్రకారం ప్రచారం చేస్తూ వస్తోంది. ఇంతవరకు ఏ న్యాయస్థానమూ జగన్‌మోహన్‌రెడ్డివి అక్రమ ఆస్తులు అని రూఢి చేసి తీర్పు ఇచ్చినది లేదు. మరోవంక, ఈ రాష్ట్రంలో అక్రమ ఆస్తులు అని తీర్పు రామోజీకి సంబంధించి వెలువడిందన్నది ఇదే సందర్భంగా గమనార్హం. రామోజీ ల్యాండ్ హోల్డింగ్స్ చట్టంలోని 18(2) నిబంధనను ఉల్లంఘించారు. రామోజీ, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన సంస్థలన్నింటికీ చట్టబద్ధంగా ఉండాల్సిన భూమికంటే అదనంగా 1,363 ఎకరాలకు పైగా భూమి ఉన్నందువల్ల అది ప్రభుత్వానికి చెందాల్సిందేనని ల్యాండ్ ట్రిబ్యునల్ ఏనాడో తీర్పు ఇచ్చింది. 

దానిమీద రామోజీ స్టే తెచ్చుకోవటంలో సఫలం అయ్యారు. ఆ స్టే ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజున ఎందుకు అడగటం లేదన్నది ప్రజల దృష్టికి రావాల్సిన అంశం. అలాగే, పేదల కోసం భూములు పంచుతామని ప్రగల్భాలు పలికే రాజకీయ పార్టీలు ఒకనాడు ముందుకు దూకి... ఆ తరవాత ఆ విషయాన్ని ఎందుకు పట్టించుకోలేదన్నది ముఖ్యమైన మరో ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ చిట్‌ఫండ్స్ యాక్ట్‌ను ఉల్లంఘించి డిపాజిటర్ల డబ్బును రామోజీ తమ వద్ద ఉంచుకోవటం ఏ రకంగా నేరమో ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా ఉన్న వట్టి వసంతకుమార్ కనీసం మూడు సందర్భాల్లో గతంలో ఫిర్యాదులు చేశారు. ఇప్పుడు ఆ ఫిర్యాదులకు ఏ గతి పట్టిందో దేవుడికెరుక.

ఇక రామోజీ నిధులకు మూలాధారమైన మార్గదర్శి ఫైనాన్సియర్స్ వ్యవహారంమీద ఇప్పటికీ న్యాయప్రక్రియ అడుగులు ముందుకు పడటం లేదు. రిజర్వ్ బ్యాంక్ నిబంధనల్లో 45 (ఎస్)ను ఉల్లంఘించి ఆయన వేల కోట్ల రూపాయల ప్రజల డబ్బును డిపాజిట్ల పేరిట వసూలు చేశారు. ఇదే సమయంలో అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం ఈ డిపాజిట్ల సేకరణ ఆర్‌బీఐ నిబంధనలకు వ్యతిరేకం అని తెలిసి కూడా రామోజీ కార్యకలాపాలను ఎందుకు చూస్తూ ఊరుకుందన్నది... అదే సమయంలో, చట్టబద్ధమైన ప్రైవేట్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల్లో డిపాజిటర్లను గందరగోళానికి గురిచేసి ఆ బ్యాంకుల మూసివేతకు, లక్షల మంది డిపాజిటర్ల సొమ్ము తిరిగిరాకపోవటానికి అధికార పార్టీగా తెలుగుదేశం, పత్రికగా ఈనాడు ఎంతమేరకు కారణమన్నది ఆరోజుల్లో పరిణామాలను నిశితంగా గమనించినవారికి ఎరుకే. రామోజీ సంస్థలు ఫిలింసిటీ భూములు కొన్నా... ఆ తరవాత టీవీ ఛానళ్ళు పెట్టినా అదంతా ఆర్‌బీఐ నిబంధనలకు వ్యతిరేకంగా... చట్ట విరుద్ధంగా రామోజీ సేకరించిన డబ్బుతోనే. 

ఆ వేల కోట్ల సంపాదన క్లీన్ మనీ అని, డిపాజిట్లు రామోజీ రహదారిలో సేకరించారని ఏ న్యాయస్థానమైనా ఎలా తీర్పు ఇవ్వగలుగుతుంది? ఇంతకీ మార్గదర్శి ఫైనాన్సియర్స్‌కు వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి? చట్ట విరుద్ధమని తెలిసీ రామోజీ ఏపీ చిట్‌ఫండ్స్ యాక్ట్‌ను ఎలా ఉల్లంఘించగలిగారు? ఇలాంటి పునాదులమీద ఎదిగిన రామోజీ తన పత్రిక మొదటి పేజీలో తమ వ్యాపారం దారి రహదారి అని నిలువుగా, అడ్డంగా రాసుకుంటుంటే... ప్రజలు, పాఠకులు ఔనని తల ఊపుతారని ఎలా భావిస్తున్నారు? ఈ రోజున టీడీపీతో పాటు కాంగ్రెస్‌ను కూడా మేనేజ్ చేయగలిగిన ఆయన, కాంగ్రెస్ ఆధ్వర్యంలోని సీబీఐతో ఈ అంశాల మీద దర్యాప్తుకు అంగీకరించకుండా ఎందుకంత హడావుడి పడ్డారు? 

సాక్షి విజయమే అసలు సమస్య

ఇక లోపలి పేజీ కథనంలోకి వెళితే, మార్గదర్శి ఫైనాన్సియర్స్ వ్యవహారంమీద ఏర్పాటైన జస్టిస్.రంగాచారి కమిషన్ వ్యక్తం చేసిన సహేతుక అభ్యంతరాల్నే తూలనాడుతూ... డిపాజిటర్లకు డబ్బు తిరిగి చెల్లించేశాం కదా... అన్నది నిన్నటి ఈనాడు వాదన. ఇదే వాదనను అంగీకరిస్తే, తారా చౌదరి వల్ల కూడా ఎవరికీ ఏ అపకారమూ జరగలేదని... ఉపకారమే జరిగిందని కూడా వాదించవచ్చు. మార్గదర్శి ఫైనాన్సియర్స్‌కు సంబంధించిన అంశం డిపాజిట్ల సేకరణ చట్ట బద్ధమా, కాదా అన్నది తప్ప... అపకారం, ఉపకారాలకు సంబంధించినది కాదు. 

సాక్షి-పెట్టుబడులకు సంబంధించి రామోజీకైనా, చంద్రబాబుకైనా ఉన్న అసలు సమస్య ఈ పత్రిక నాలుగేళ్ళ పైచిలుకు కాలంలో సాధించిన ఘన విజయం. పత్రిక విజయానికి తోడుగా జగన్‌మోహన్‌రెడ్డి వేరే రాజకీయ పార్టీ ప్రారంభించి సృష్టిస్తున్న జన ప్రభంజనం. ఇప్పుడు ఇవే అధికార కాంగ్రెస్‌కు కూడా సమస్యలుగా మారాయి. న్యాయస్థానాలముందున్న అంశాలను అటుంచితే, ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ మీడియా, ప్రత్యామ్నాయ రాజకీయ పక్షం ప్రజల్లో ఎదుగుతుంటే ఇక్కడ అధికారపక్షం-ప్రతిపక్షం ఒకే గొంతుతో మాట్లాడటాన్ని, ఒకే తరహా కుట్రలను అమలు చేయటాన్ని యావత్ రాష్ట్రమూ గమనిస్తోంది. వీటి సమస్య సాక్షి పెట్టుబడులా? సాక్షి అస్తిత్వమా? వీరి సమస్య వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు దక్కుతున్న ప్రజాదరణా... లేక ప్రజా జీవితంలో నైతికత నెలకొల్పే ఉద్యమాన్ని ఈ కాంగ్రెస్ నాయకులు చంద్రబాబు మద్దతు తీసుకుని ఏమన్నా చేస్తున్నారా? 

నవ్విపోతారు ప్రజలు. ప్రజాస్వామ్యంలో గొప్ప దనం అన్నివేళలా వ్యక్తం కాదు. ప్రస్తుతం పరిస్థితులు సాక్షికో దీని యాజమాన్యానికో ప్రతికూలంగా ఉన్నంత మాత్రాన అవతలి శిబిరంలో ఒకటై కూర్చున్న కాకులు హంసలైపోవు. ప్రసార సాధనాల్లో ఎక్కువ శాతాన్ని మేనేజ్ చేసి రోజూ అసత్యాలను ఓ పథకం ప్రకారం అచ్చువేసినంత మాత్రాన అవి నిజాలైపోవు. నిజం-జనం సునామీలుగా మారే సందర్భాలు అరుదుగానే వస్తాయి!

దారి తప్పిన ఈనాడు

 ఉషోదయా లెక్కలన్నీ ఊకదంపుడే 
* ఎన్‌డీటీవీ, జీ న్యూస్, టీవీ-18 సహా దేనికీ లేని విలువ మీ చానళ్లకెలా వచ్చింది? 
* అసలు రూ.6,676 కోట్ల వాల్యుయేషన్ ఎలా ఇచ్చారు?
* వివాదాల్లోని ఆస్తులు పోను దాని పేరిట ఉన్నవేంటి?
* భూములు, యంత్రాలు కూడా ఇతర పేర్లతోనేగా ఉన్నాయి!
* మరి ఉషోదయాకు అంత విలువెలా దక్కింది?
* పన్ను, తరుగుదలకు ముందు లాభాన్ని లెక్కలోకి తీసుకుంటారా?.. 
* అలాగైతే జగతి పబ్లికేషన్స్‌కు తొలి ఏడాది నుంచే లాభాలొచ్చాయి
* సర్క్యులేషన్ సహా ఎక్కడా అంచనాలు తప్పని ‘సాక్షి’ 
* మీ వాల్యుయేషన్‌లో సగం కూడా చెయ్యదా?
* ‘ఈనాడు’ చెప్పిన లాభం ఏ సంవత్సరానిది? 
* ఆర్‌వోసీలో వేరే లెక్కలున్నాయేం?.. 
* ఆర్‌ఓసీకి, మదింపు సంస్థలకు వేర్వేరు వివరాలిచ్చారా?.. 
* పత్రికకు 12 రెట్లు.. టీవీ చానళ్లకు 40 రెట్ల విలువా? ఎందుకలా?
* చంద్రబాబు క్విడ్ ప్రో కో సొమ్ము కంపానీ ద్వారా వచ్చినందుకా?
* రూ.2,600 కోట్లపై నాలుగేళ్లు పైసా లాభం రాకున్నా.. కంపానీ ఊరుకున్నారేం?
* మీ చానళ్లలో ఈటీవీ తెలుగు తప్ప మిగతావేవైనా లాభాల్లో ఉన్నాయా?
* దేనికైనా నంబర్‌వన్ స్థానముందా?.. నిజం చెప్పమంటే హరికథలేల?

ఎవరిని మోసం చేయటానికి ఈ లెక్కలు? ఎవరిని మభ్యపెట్టడానికి ఈ రాతలు? జనమన్నా, న్యాయ వ్యవస్థ అన్నా, దర్యాప్తు సంస్థలన్నా, ఐటీ విభాగాలన్నా ఎందుకింత చులకన? ఈ వ్యవస్థల్లో మీ మోచేతి నీళ్లు తాగే కొందరు అధికారులుంటే ఉండొచ్చు. అంతమాత్రాన అందరినీ చులకన చేస్తే ఎలా? రామోజీ!! అసలు మీరు వేసిన లెక్కలకు ఏమైనా అర్థముందా? ఆ లెక్కలు చెప్పటం లేదా... మీదెంత దుర్మార్గమో, ఎంతటి అక్రమమో, ఆ నిధులు ఏ బాబు జేబులోంచి వచ్చాయో..? ఇంకా ఎన్నాళ్లు ఎంతమందిని మోసం చేయగలరనుకుంటున్నారు? ఈ లెక్కల్లో దాగున్న కుళ్లు, కుతంత్రం మీకు తెలియదా? పాఠకులకు తెలియదనుకుంటున్నారా? ఇదిగో.. వాళ్లకు తెలిసేలా వివరిస్తున్నాం. కావాలంటే మీరూ చూడండి!!
- సాక్షి ప్రత్యేక ప్రతినిధి 

రామోజీ రాతలు సరేసరి! వాటి సంగతి తరవాత!! ముందు ఆయన వేసిన పట్టిక చూద్దాం. అన్నిటికన్నా ముఖ్యమైనది వాల్యుయేషన్. అంటే ‘ఈనాడు’, ఈటీవీ చానళ్లు, ప్రియా పచ్చళ్లను కలిపి రూ.7,150 కోట్లుగా విలువ కట్టడం. దీన్లో రుణాలు పోను నికర విలువ రూ.6,676 కోట్లుగా తేలటం. అసలు ఎవరిచ్చారు ఇంతటి వాల్యుయేషన్? ఈ సంస్థల పేరిట ఏ ఆస్తులున్నాయని? రామోజీ భూములన్నీ ఆయన కుటుంబం పేరిటో, మార్గదర్శి చిట్‌ఫండ్స్ పేరిటో ఉన్నవే. విశాఖ ‘ఈనాడు’ కార్యాలయం లీజు గడువు ముగిసింది. అయినా న్యాయవ్యవస్థపై ‘అపారమైన గౌరవం’ ఉన్న రామోజీ.. దాన్ని యజమానికి అప్పగించకుండా కోర్టుకెక్కటం బహిరంగ రహస్యమే. 

విజయవాడలో తోడల్లుడి నుంచి తీసుకున్న ‘ఈనాడు’ కార్యాలయం లీజు కూడా ముగిసింది. దానిపైనా అదే తరహా ‘న్యాయ పోరాటమే’ చేస్తున్నారు రామోజీ. హైదరాబాద్ మినహా మిగతా జిల్లాల్లో ఈనాడు కార్యాలయాలన్నీ ఊళ్లకు దూరంగా ఉన్నవే. పెపైచ్చు ‘ఈనాడు’ను ముద్రించే యంత్రాలు సైతం కొన్ని మార్గదర్శి చిట్‌ఫండ్స్ పేరిటే ఉన్నాయి. మరి మీ సంస్థకు అంతటి వాల్యుయేషన్ ఎలా ఇచ్చారు? ఏ కంపెనీని అయినా విలువ కట్టేది ప్రమోటర్లిచ్చే వివరాల ఆధారంగానే కదా? మరి మీరు వాల్యుయేషన్ సంస్థల్ని ఏమని మభ్యపెట్టారు? మీకు పాఠకుల పట్ల గౌరవమే ఉంటే.. మీరు చెప్పే మాటలే నిజమైతే.. మీ లెక్కలే సత్యాలైతే.. ఏ ఆస్తుల్ని బట్టి మీకంత విలువ ఇచ్చారో చెప్పొచ్చుగా? అంతటి విలువైన ఆస్తుల చిట్టా చూస్తే జనం నమ్ముతారు కదా? ఎందుకీ రహస్యాలు? జనహితం.. అక్షర పోరాటం అంటూ హరికథలెందుకు?

ఏడు నెలల్లోనే రూ. 2,300 కోట్ల పెరుగుదలా?

చంద్రబాబు ద్వారా ముకేశ్ అంబానీతో దొడ్డిదారి ఒప్పందం కుదుర్చుకోక ముందు.. బ్లాక్‌స్టోన్ సంస్థ రామోజీ కంపెనీలో వాటా కొనుగోలు చేయాలని భావించినట్టు ‘ఈనాడు’ పేర్కొంది. నిజమే! ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్‌లో 26 శాతం వాటా కోసం రూ.1,227 కోట్లు చెల్లిస్తానంటూ అది ముందుకొచ్చింది. ఈ మేరకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలికి (ఎఫ్‌ఐపీబీ) దరఖాస్తు కూడా చేసింది. అంటే, మొత్తం ఉషోదయాకు అది కట్టిన విలువ రూ.4,858 కోట్లు. కానీ దానికి ఆమోదం లభించలేదు. చిత్రంగా ఆరేడు నెలలు తిరక్కుండానే.. అదే 2007లో, ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ చేత ఉషోదయా విలువ కట్టించుకుంది. రూ.7,150 కోట్లుగా అది విలువ కట్టింది. మరి ఈ ఆరేడు నెలల్లోనే ‘ఈనాడు’ ఆస్తులు రూ.2,300 కోట్ల మేరకు ఎలా పెరిగిపోయాయి? రామోజీ ఏం మంత్రం వేశారు? ఆ రహస్యమేమిటో మిగతా వాళ్లకూ కాస్త చెప్పొచ్చుగా?

అడ్డదారి కాదు.. దొడ్డిదారి లాభం!

‘‘అశ్వత్థామ హత ః.. కుంజర’’ అన్న చందాన.. ‘లాభాలు’ అని పెద్ద అక్షరాల్లో రాసి న రామోజీ.. వడ్డీ, పన్నులు, తరుగుదల తీయక ముందు అనే చిన్న షరతు పెట్టారు. అవన్నీ తీసేశాక ఇంకేముంటుంది? అసలేముంది? సంవత్సరాలవారీగా చూస్తే.. ఇవండీ లెక్కలు. ఇవి స్వయంగా రామోజీరావు ఆర్‌ఓసీకి దాఖలు చేసిన పత్రాల్లోనివే. మరిక్కడ రామోజీరావు చెప్పినట్టు ఈనాడు రూ.229 కోట్లు, ఈటీవీ చానళ్లు 106 కోట్లు, ప్రియా ఫుడ్స్ 16 కోట్లు లాభం ఆర్జించినట్టు ఎక్కడుంది? అసలు ఇవి ఏ సంవత్సరం లెక్కలు? 2006 నుంచి 2010 వరకు ఆర్‌ఓసీలో దాఖలు చేసిన లెక్కలతో ఇవి సరిపోలటం లేదెందుకు? అంటే రామోజీ ఆర్‌ఓసీకి ఒక లెక్క.. మదింపు సంస్థలకు మరో లెక్క చెప్పారా? మోసం చేశారా?

పైన చెప్పిన లెక్కల ప్రకారం చూసినప్పుడు 2006-07లో 108 కోట్ల రూపాయల లాభం కళ్లచూసిన ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్.. ఆ తరవాత 2010 వరకూ ఎన్నడైనా లాభం కళ్లజూసిందా? అసలు తరుగుదల, పన్ను తదితరాలు తీయక ముందు లాభం వచ్చిందన్న ‘ఈనాడు’ సూత్రం ప్రకారమైతే జగతి పబ్లికేషన్స్ సంస్థ తొలి ఏడాది నుంచీ లాభాల్లోనే ఉంది. మరి దీనికేమంటారు? ఎవరిని మభ్య పెట్టడానికి ఈ లెక్కలు? 2007 నుంచి వరుసగా నష్టాలే వస్తున్న ‘ఈనాడు’లో ముకేశ్ అంబానీ ఎందుకు ఇన్వెస్ట్ చేశారు? ఏ బాబు చేసిన సాయానికి ప్రతిఫలంగా ఆ డబ్బులు రామోజీకి ముట్టాయి? అది కూడా ముకేశ్ అంబానీ ఎందుకు ధైర్యంగా, నేరుగా పెట్టకుండా, తన తైనాతీల ద్వారా గొట్టాం కంపెనీల్ని సృష్టించి మరీ పెట్టుబడి పెట్టారు? అది కదా మీరు చెప్పాల్సింది? అవన్నీ వదిలేసి తప్పుడు లెక్కలతో ఎవరిని నమ్మించాలని?

ఇన్ని రెట్లు... అన్ని రెట్లు... అసలెన్ని రెట్లు?
లాభంపై ‘ఈనాడు’ మదింపు విలువ 12 రెట్లా? అదే ‘ఈటీవీ’కైతే 40 రెట్లా? ప్రియా పచ్చళ్లకేమో 8 రెట్లా? ఇది మదింపు విలువా, లేక మతి తప్పి వేసిన విలువా? అసలు పన్ను, తరుగుదల తదితరాలకు ముందు వచ్చిన లాభాన్ని లాభంగా చూపించటమే ఓ గొప్ప ఐడియా. దాన్ని బట్టి మీ షేరు విలువ దానికి ఎన్ని రెట్లుందో చెప్పటమంటే.. కనీసం టెన్త్ క్లాస్ కూడా పాసవని వ్యక్తి చెబుతున్నట్టుగా లేదూ? సాధారణంగా అయితే పన్ను, తరుగుదల తరవాత వచ్చే నికర లాభాన్ని మాత్రమే లాభంగా చూస్తారు. దాన్ని ఆ సంస్థ జారీ చేసిన మొత్తం షేర్లతో భాగిస్తారు. అప్పుడు వచ్చే మొత్తాన్ని ప్రతి షేరుకు ఆర్జనగా (ఎర్నింగ్స్ పర్ షేర్) లెక్కిస్తారు. షేరు విలువ ఈ ఈపీఎస్ కన్నా ఎన్ని రెట్లు ఎక్కువ ఉంటే దాన్ని పీఈ (ప్రైస్/ఎర్నింగ్)గా చెబుతారు. ఈ పీఈ ఎంత తక్కువ ఉంటే షేరు విలువ అంత రీజనబుల్‌గా ఉన్నట్టన్నమాట. కాకపోతే పోటీ ప్రపంచంలో తమకు నచ్చిన కంపెనీ షేరును ఎంత పీఈ ఉన్నా కొనటానికి మదుపరులు వెనకాడరు. ఇది మార్కెట్ సూత్రం.

టీవీ చానళ్లకెందుకు 40 రెట్లు?
ఇక్కడ రామోజీ జవాబు చెప్పాల్సిన అంశం మరొకటుంది. ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్‌లో మూడూ భాగమే. ఈ మూడింటినీ విడివిడిగా చూస్తే.. ఉషోదయాకు వస్తున్న మొత్తం ఆదాయంలో 40 శాతం ఈనాడు పత్రిక నుంచి వస్తోంది. 36 శాతం చానళ్ల నుంచి, 24 శాతం పచ్చళ్ల నుంచి వస్తోంది. మరి 40 శాతం ఆదాయాన్ని తెస్తున్న ఈనాడు పత్రికకు రూ.2,750 కోట్ల విలువ కట్టిన రామోజీ.. టీవీ చానళ్లకు రూ.4,250 కోట్లుగా విలువ ఎందుకు కట్టారు? ప్రియా పచ్చళ్లకు రూ.130 కోట్ల విలువే ఎందుకుంది? ప్రియా షేరు విలువ లాభానికి (రామోజీ చెబుతున్న మేరకే) 8 రెట్లుండగా.. అధిక ఆదాయాన్ని తెస్తున్న ‘ఈనాడు’ విలువ 12 రెట్లుండగా.. టీవీ చానెళ్ల విలువ మాత్రం 40 రెట్లు ఎందుకుంది? దీన్లోని మర్మమేంటి? అందుబాటులో ఉన్న వివరాల మేరకు చూస్తే.. రామోజీ తెలివంతా ఇక్కడే కనిపిస్తుంది. ముకేశ్ అంబానీ గొట్టాం కంపెనీలకు రూ.2,600 కోట్లకు ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్‌లో 40 శాతం వాటాను విక్రయించారు రామోజీ. 

అంటే పత్రిక, చానళ్లు, ప్రియా పచ్చళ్లు.. అన్నిట్లోనూ 40 శాతం వాటా అంబానీకి దక్కినట్టే. కానీ అంతో ఇంతో లాభాలు సంపాదిస్తున్న ‘ఈనాడు’ పత్రికను, పచ్చళ్ల వ్యాపారాన్ని వదులుకోవటానికి రామోజీ సిద్ధంగా లేరు. దాంతో చంద్రబాబు ద్వారా మీట నొక్కారు. అంతే! రూ.2,600 కోట్లు పెట్టుబడి పెట్టిన నాలుగేళ్లు వేచి చూసిన తరవాత.. అప్పటివరకూ పైసా వడ్డీ రాకున్నా, నయా పైసా డివిడెండ్ కూడా లేకున్నా ఊరుకున్న నిమేశ్ కంపానీ.. మరో సాహసం చేశారు. తను పెట్టిన పెట్టుబడికి ఆ పుచ్చు చానళ్లలో వాటా చాలని.. పత్రికలోను, పచ్చళ్ల కంపెనీలోను వాటా వదులుకుంటానని ‘ముందుకొచ్చారు’. మరి కంపానీకి ఒరిగిందేమిటి?

- కంపానీకి అప్పటికే ఈనాడు పేపరుతో పాటు, పచ్చళ్లలో, చానళ్లలో 40 శాతం వాటా ఉంది. ఈ మొత్తాన్ని వదులుకున్నందుకు.. అది కూడా రూ.2,600 కోట్లు పెట్టుబడి పెట్టిన నాలుగేళ్ల తరవాత ఆయనకు దక్కిందెంతో తెలుసా?
- ఐదు హిందీ వార్తా చానళ్లలో 100 శాతం వాటా. ఐదు ప్రాంతీయ చానళ్లలో 50 శాతం వాటా. తెలుగు చానళ్లలో 24.5 శాతం వాటా. అంతే!!!

- ఈటీవీ చానళ్లకు వచ్చే ఆదాయంలో 25 శాతం తెలుగు నుంచే వస్తోంది. అలాంటి విభాగంలో కంపానీ వాటా 24.5 శాతమే కావటం గమనార్హం.

- రామోజీ తన చానళ్లకు రూ.4,350 కోట్లుగా విలువ కట్టింది కూడా అందుకే. పత్రికలో, పచ్చళ్ల కంపెనీలో వాటాను ఎవరికీ అమ్మటం లేదు కనక వాటి విలువను కావాలనే కాస్త తక్కువగా వేయించి.. చానళ్లలో వాటాను విక్రయించటం పేరుతో డబ్బులు తెచ్చుకుంటున్నారు కనక వాటికేమో అసాధారణంగా విలువ కట్టేశారు. దానికి చంద్రబాబు సిఫార్సూ తోడవటంతో అంబానీ కూడా ఊకొట్టేశారు. అసలు ఈ దేశంలో ఏ టీవీ సంస్థకైనా ఇంతటి వాల్యుయేషన్ ఉందా?

- దేశంలో న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్, లైఫ్ స్టైల్, బిజినెస్ రంగాల్లో దాదాపు 10 చానళ్లను నిర్వహిస్తున్న ఎన్‌డీటీవీ (న్యూఢిల్లీ టెలివిజన్) మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రస్తుతం ఎంతో తెలుసా? కేవలం రూ.285 కోట్లు!

- పలు భాషల్లో కేవలం వార్తా చానళ్లు మాత్రమే నడుపుతున్న జీ న్యూస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కేవలం రూ.225 కోట్లు. 

- అంతెందుకు? సీఎన్‌బీసీ టీవీ-18, అవాజ్ వంటి బిజినెస్ చానళ్లు.. సీఎన్‌ఎన్
- ఐబీఎన్, ఐబీఎన్18, ఐబీఎన్ లోక్‌మత్ వంటి న్యూస్ చానళ్లు.. కలర్స్, నిక్, ఎంటీవీ వంటి ఎంటర్‌టైన్‌మెంట్ చానళ్లున్న టీవీ-18 సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ కేవలం రూ.655 కోట్లు. మరి ‘ఈటీవీ’కి అంత విలువెలా కట్టారు?

వాటా అమ్మిన సొమ్ము హెచ్‌యూఎఫ్‌లోకి!
మూడున్నర దశాబ్దాలుగా అక్షర యుద్ధం చేస్తున్నామంటూ తెలుగు సినిమా డైలాగులు చెప్పిన ‘ఈనాడు’.. ఉషోదయాలో వాటా అమ్మి రూ.2,600 కోట్లు తెచ్చుకుని మార్గదర్శి డిపాజిటర్లకు చెల్లించామని కూడా పేర్కొంది. కానీ ఆ వాటా ఎవరికి అమ్మారన్నది మాత్రం వెల్లడించలేకపోయింది? తన వాటాదారెవరో చెప్పటానికి అంత సిగ్గెందుకు? తన భాగస్వామి ఎవరో చెప్పటానికి ఉలుకెందుకు?

ఇంకా చిత్రమేంటంటే ఉషోదయా షేర్లను కంపానీకి చెందిన ‘ఈక్వేటర్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్’కు కేటాయించడం ద్వారా రామోజీ తొలి విడత రూ.1,423 కోట్లు రాబట్టుకున్నారు. చట్టబద్ధంగా అయితే ఈ సొమ్ము ఉషోదయా సంస్థలోకి రావాలి. కానీ రామోజీ దాన్ని తన జేబులో వేసుకోవటానికి ఓ ఎత్తు వేశారు. పాత సినిమాలు, ఎండమావులు-అంతరంగాల వంటి సీరియళ్లన్నీ ఉషాకిరణ్ టెలివిజన్ పేరిట ఉన్నాయంటూ.. దాని విలువను రూ.775 కోట్లుగా వాల్యుయేషన్ వేయించారు. దాన్ని ఉషోదయా చేత కొనుగోలు చేయించారు. 

అంతటితో ఊరుకోకుండా.. ఉషాకిరణ్ సంస్థ పోటీగా మరో లైబ్రరీని నిర్వహించకుండా దానికి నాన్ కాంపిటీషన్ ఫీజు కింద రూ.670 కోట్లు చెల్లిం చారు. అంటే మొత్తమ్మీద ఉషోదయాకు వచ్చిన సొమ్మును హెచ్‌యూఎఫ్ చేతిలో ఉన్న ఉషాకిరణ్‌కు మళ్లించారు. అలా తన జేబులో వేసుకుని దాన్ని మార్గదర్శి డిపాజిటర్లకు చెల్లించారు. పనికిరాని సినిమాలు, సీరియళ్లను ఎవరైనా రూ.775 కోట్లిచ్చి కొంటారా? ఉషాకిరణ్‌కు నాన్‌కాంపిటీషన్ ఫీజు కింద రూ.670 కోట్లు చెల్లించటం కరెక్టా? ఇవన్నీ రామోజీకి పట్టవు. ఎదుటి వారికైతే ఎన్నయినా చెబుతారు.

ఆడిటర్లే ముక్కున వేలేసుకుంటున్నారు..
ఈ సాఫ్ట్‌వేర్ లైబ్రరీ విలువ చూసిన రామోజీ ఆడిటర్లు ముక్కున వేలేసుకున్నారు. దానికి అంతటి విలువ ఉంటుందని తాము భావించటం లేదని కామెంట్ కూడా రాశారు. కానీ రామోజీ దానికి ఏమని జవాబిచ్చారో తెలుసా? అది సరైన విలువే అని యాజమాన్యం నమ్ముతోందని!! యాజమాన్యమే నిర్ణయించాలంటే ఆడిటర్లెందుకు? ఇంకా చిత్రమేంటంటే దీనికి అంతటి విలువ చెల్లించడానికి కంపానీ ఒప్పుకున్నా.. కంపానీ ఆడిటర్లు మాత్రం అందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ షరామామూలే!! అదీ రామోజీ నీతి.

పదేళ్లపాటు ఇక నష్టాలే..
ఇంకా విశేషమేంటంటే లైబ్రరీ కొనుగోలుకు చెల్లించిన రూ.1,470 కోట్లను టీవీ చానళ్లకు వచ్చే ఆదాయంలో పదేళ్ల పాటు మినహాయిస్తారు. అంటే దీనర్థం.. వచ్చే పదేళ్ల పాటు రామోజీ చానళ్లు పైసా లాభాన్ని కూడా కళ్ల చూసే అవకాశం లేదనేగా? ఇదంతా తెలిసి కూడా కంపానీ ఎందుకు ఒప్పుకున్నట్టు?

రూ.1,800 కోట్ల నష్టాల హెచ్‌యూఎఫ్...
మార్గదర్శి స్కామ్ బయటపడేటప్పటికి రామోజీ హెచ్‌యూఎఫ్ సంచిత నష్టాలు రూ.1,800 కోట్లు. దీన్లో ప్రధానమైనది మార్గదర్శి ఫైనాన్సియర్సే. ఈనాడుకైనా, ఫిలింసిటీకైనా, టీవీ ఛానెళ్లకైనా నిధులు ప్రవహించింది దీన్నుంచే. చట్టాల్ని చట్టుబండలు చేసి అక్రమంగా సేకరించిన ఈ నిధులతోనే రామోజీ అడ్డదార్లో ఎదిగారు. అది బయటపడి, డిపాజిటర్ల సొమ్ము తిరిగి ఇవ్వాల్సి వచ్చేసరికి తన సియామీ కవల చంద్రబాబు ద్వారా మరో అక్రమానికి దిగారు. ఇదీ రహదారి కథ.

ఈ దేశంలో ఇప్పటిదాకా వెలుగు చూసిన కుంభకోణాల్లోకెల్లా ఇదే అత్యంత తీవ్రమైన కుంభకోణమని అనిపించడం లేదా? ఎందుకంటే కంపానీ అయినా, అంబానీ అయినా రామోజీకి చదివించుకున్న డబ్బు.. పైసా పైసా దాచుకుని షేర్లు కొనుక్కున్న ఇన్వెస్టర్ల సొమ్మే. ఈ వ్యవహారంలో నష్టపోయింది వారే! లిస్టెడ్ కంపెనీలో ఇంత కుంభకోణం జరిగినా సెబీ వంటి దర్యాప్తు సంస్థలు ఎందుకు మిన్నకున్నాయి? ఇన్వెస్టర్ల సొమ్ము గొట్టాల మార్గంలో వచ్చినందుకు రామోజీని ఎందుకు ప్రశ్నించటం లేదు? ఇవన్నీ కాలం మాత్రమే సమాధానం ఇవ్వగలిగే ప్రశ్నలు.

Team Anna member Arvind Kejriwal about JAGAN

Team Anna member Arvind Kejriwal, meanwhile, alleged that the CBI probe was meant to give a clean chit to the Prime Minister.
"The CBI is under the CBI. Here the Prime Minister is accused. How will the CBI investigate the Prime Minister? It is laughable, it is an eye-wash. We know the outcome of this probe. It will say that the Prime Minister has not done anything wrong. It will give a clean chit to Singh," he said.
Kejriwal said why is the Prime Minister afraid of a probe if he is sure that he has not done anything wrong. "We have said that we are ready to be probed. Then why is the Prime Minister afraid. So there is nothing wrong, if people suspect that there was something wrong in this."
Referring to Law Minister Salman Khurshid ruling out a probe as demanded by Team Anna, he alleged that "corrupt" ministers are deciding on whether to investigate corruption charges. "This is the kind of anti-corruption system that currently exists in our country. This is what we are challenging," he said.

Alleging that the CBI is a "complete puppet" in the hands of the government, Kejriwal said disproportionate asset cases were going on against Mulayam Singh Yadav, Lalu Yadav, Mayawati and many other politicians for several years.
"However no worthwhile investigation has taken place. But Jagan Mohan Reddy, who is a political foe of the ruling UPA has been arrested in a very short period. This shows that CBI rather than acting as anti-corruption body is being used to serve the Centre's political agenda.
"Can such CBI ever do an honest and independent investigation into Coalgate scam in which PM himself is accused? Can such a CBI do an honest investigation against the other 14 ministers?" he said, adding this is why they were demanding a probe by a Special Investigation Team.
He said they would not approach Supreme Court if their demand are not met. "This is a political issue," he said.
source: http://articles.timesofindia.indiatimes.com/2012-06-01/india/31958051_1_cbi-probe-clean-chit-coal-bloc

Kejriwal  Alleging that the CBI was a “complete puppet” in the hands of the government, Mr. Kejriwal said disproportionate assets case had been made against leaders of several political parties without any worthwhile investigations because they could be “helpful” to the government, but Jagan Mohan Reddy, who is a political foe of the ruling UPA, had been arrested in a very short period.
(http://www.thehindu.com/news/national/article3480154.ece)

“CBI is a complete puppet in the hands of the Government. Disproportionate asset cases are going on against Mulayam Singh Yadav, Lalu Yadav, Mayawati and many other politicians for several years. However, no worthwhile investigation has taken place. But Jagan Mohan Reddy, who is a political foe of the ruling UPA has been arrested in a very short period. This shows that CBI rather than acting as anti-corruption body is being used to serve the Centre’s political agenda,” added Kejriwal.
(http://dailypioneer.com/nation/69955-cbi-probe-in-coal-scam-pretence-says-kejriwal.html)

Team Anna member Arvind Kejriwal about JAGAN

Team Anna member Arvind Kejriwal, meanwhile, alleged that the CBI probe was meant to give a clean chit to the Prime Minister.
"The CBI is under the CBI. Here the Prime Minister is accused. How will the CBI investigate the Prime Minister? It is laughable, it is an eye-wash. We know the outcome of this probe. It will say that the Prime Minister has not done anything wrong. It will give a clean chit to Singh," he said.
Kejriwal said why is the Prime Minister afraid of a probe if he is sure that he has not done anything wrong. "We have said that we are ready to be probed. Then why is the Prime Minister afraid. So there is nothing wrong, if people suspect that there was something wrong in this."
Referring to Law Minister Salman Khurshid ruling out a probe as demanded by Team Anna, he alleged that "corrupt" ministers are deciding on whether to investigate corruption charges. "This is the kind of anti-corruption system that currently exists in our country. This is what we are challenging," he said.

Alleging that the CBI is a "complete puppet" in the hands of the government, Kejriwal said disproportionate asset cases were going on against Mulayam Singh Yadav, Lalu Yadav, Mayawati and many other politicians for several years.
"However no worthwhile investigation has taken place. But Jagan Mohan Reddy, who is a political foe of the ruling UPA has been arrested in a very short period. This shows that CBI rather than acting as anti-corruption body is being used to serve the Centre's political agenda.
"Can such CBI ever do an honest and independent investigation into Coalgate scam in which PM himself is accused? Can such a CBI do an honest investigation against the other 14 ministers?" he said, adding this is why they were demanding a probe by a Special Investigation Team.
He said they would not approach Supreme Court if their demand are not met. "This is a political issue," he said.
source: http://articles.timesofindia.indiatimes.com/2012-06-01/india/31958051_1_cbi-probe-clean-chit-coal-bloc

Alleging that the CBI was a “complete puppet” in the hands of the government, Mr. Kejriwal said disproportionate assets case had been made against leaders of several political parties without any worthwhile investigations because they could be “helpful” to the government, but Jagan Mohan Reddy, who is a political foe of the ruling UPA, had been arrested in a very short period.

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!