వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ ఆదివారం గుంటూరు జిల్లాలో ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. జిల్లాలో ఉప ఎన్నికలు జరిగే మాచర్ల, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో ఆమె రోడ్‌షో నిర్వహించనున్నారని పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. వై.ఎస్.జగన్ సోదరి షర్మిల కూడా ప్రచారంలో పాల్గొంటారని చెప్పారు. ఆదివారం ఉదయం 11 గంటలకు మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తిలోను, సాయంత్రం 4 గంటలకు నియోజకవర్గ కేంద్రం ప్రత్తిపాడులోను ఆమె ప్రసంగిస్తారని వివరించారు. మాచర్ల నియోజకవర్గంలో గత నెల 21 నుంచి 24 వరకు పార్టీ అధినేత వై.ఎస్.జగన్ రోడ్‌షో నిర్వహించారని, సమయాభావం కారణంగా వెల్దుర్తి మండలంలో జగన్ రోడ్‌షో జరగకపోవడంతో ఇప్పుడు విజయమ్మ అక్కడ రోడ్‌షోలో పాల్గొంటున్నారని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రచారం ముగించుకుని నేరుగా శనివారం రాత్రి గుంటూరు జిల్లా చేరుకుని, ఆదివారం ఉదయం నుంచి రోడ్‌షో మొదలు పెడతారని వివరించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment