
జగన్ అక్రమ అరెస్టుపై దివంగత సీఎం వైఎస్‌ఆర్ సతీమణిగా విజయమ్మ చేపట్టిన నిరసనపై పోలీసులు ప్రవర్తించిన తీరుకు రాష్ట్ర ప్రజలు కంటతడి పెట్టారని తెలిపారు. దీనిపై కూడా కాంగ్రెస్, టీడీపీ నేతలు అవాకులు, చెవాకులు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఉప ఎన్నికల్లో విజయమ్మకు దీటుగా స్పందిస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పడంపై గట్టు మాట్లాడుతూ... కడప ఎన్నికల్లో అధికార దుర్వినియోగం చేసి, 16 మంది మంత్రులు, 40 ఎమ్మెల్యేలు పోగై దీటుగా ప్రచారం చేస్తే ఏమైందో గుర్తుచేసుకోవాలన్నారు. కోవూరు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఓటుకు వెయ్యి రూపాయలు పంచినా, వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలపై బైండోవర్ కేసులు బనాయించినా ప్రజలు ఓటు అనే ఆయుధంతో తగిన బుద్ది చెప్పారని గుర్తుచేశారు. అదే విధంగా ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అధినేత్రి ధీటుగా ప్రచారం చేస్తే ఏం జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని ఆయన ఎద్దేవా చేశారు.
జగన్‌పై కేసు ప్రభుత్వానిదే
‘‘ఈ రోజు జగన్‌పై ఉన్న కేసు, ఆరోపణలు ప్రభుత్వంపై వచ్చినవే. 26 జీవోల వల్ల లబ్ధిపొందిన వారే జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని ఆరోపణలు వస్తున్నాయి. కనుక జీవోలకు సంబంధించి ప్రభుత్వమే జవాబు చెప్పాలి. జగన్‌పై వచ్చిన కేసు ప్రభుత్వం వల్లే కనుక నేరం జరిగిందా లేదా అనేది వారే తేల్చాలి’’ అని కాంగ్రెస్ నేతలకు గట్టు సూచించారు. ఎన్నికల్లో విజయమ్మ ప్రచారం చేస్తే జనం ఏవగించుకుంటారని పీసీసీ చీఫ్ బొత్స చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ప్రేమ, అభిమానాలను డబ్బుతో కొనాలని చూసిన సోనియాను తెలుగు ప్రజలు అసహ్యించుకుంటున్నారని పేర్కొ న్నారు. ‘‘తండ్రికి వెన్నుపోటు పొడిచి అక్రమంగా సీటు లాక్కుని... చెప్పులు వేయించి... ఆయన మరణానికి కారకుడైన భర్త చంద్రబాబును నిలదీయకుండా మిన్నకుండిపోయిన భువనేశ్వరే గాంధారి’’ అని గట్టు వ్యాఖ్యానించారు. తమ పార్టీలోనే గాంధారిని పెట్టుకొని టీడీపీ నేతలు ఇతరులను విమర్శించడం సరైంది కాదని హితవు పలికారు.
No comments:
Post a Comment