టి. నరసాపురం: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి వుంటే పోలవరం ప్రాజెక్ట్ పూర్తయ్యేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఉభయగోదావరి జిల్లాలకు సమృద్దిగా నీరు లభించేదన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గంలో ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రైతుల పక్షాన నిలిచిన బాలరాజును చూస్తే గర్వంగా ఉందన్నారు. ఏ తప్పు చేయలేదని జగన్ ధైర్యంగా వున్నారన్నారు. కుట్రలన్నీ తీరిపోతాయని, ప్రజలు ధైర్యంగా ఉండాలని జగన్ తనతో చెప్పారని తెలిపారు. ప్రజాకోర్టులో న్యాయం జరుగుతుందని మీ ముందుకు వచ్చానని అన్నారు.
వైఎస్సార్ రెండు సార్లు కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చారని విజయమ్మ గుర్తు చేశారు. ముఖ్యమంత్రికాగానే వైఎస్సార్ చాలా సంక్షేమ పథకాలు చేపట్టారనన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఒక్కొటిగా తీసేస్తోందని ఆరోపించారు. వైఎస్సార్ మరణంపై చాలా మందికి అనుమానాలున్నాయని అన్నారు. వైఎస్సార్ మరణంపై సీబీఐ హడావుడిగా దర్యాప్తు పూర్తి చేసిందన్నారు. చట్టాలను గౌరవించి జగన్ సీబీఐ సహకరించారని విజయమ్మ తెలిపారు.

కొయ్యలగూడెం: పశ్చిమగోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గంలో పర్యటిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. రోడ్ షోలో భాగంగా శనివారం రాత్రి కొయ్యలగూడెం చేరుకున్న విజయమ్మకు అపూర్వ స్వాగతం లభించింది. మహానేత సతీమణిని చూసేందుకు తరలివచ్చిన జనంతో కొయ్యలగూడెం కిక్కిరిసింది. ఎటుచూసినా జనమే కనిపించారు. వీధులన్ని జనంతో నిండిపోయి జనసంద్రాన్ని తలపించాయి. విజయమ్మ వెంట ఆమె కుమార్తె షర్మిల, వైఎస్సార్ కాంగ్రెస్ పోలవరం అభ్యర్థి బాలరాజు, ఆళ్ల నాని తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment