తిరుపతి, న్యూస్‌లైన్ : వైఎస్ జగన్‌ను అరెస్ట్ చేస్తారని కలత చెంది ఆత్మహత్యాయత్నం చేసిన ఓ అభిమాని సోమవారం మరణించాడు. తిరుపతి సమీపంలోని దామినేడు ఇందిరమ్మ గృహ సముదాయంలో తమ్ముక్త అశోక్(45) నివాసముంటున్నాడు. సొంత ఊరు అనంతపురం జిల్లా పుట్టపర్తి సమీపంలోని కోరంట్ల. కుమార్తె కు వివాహం చేసి అత్తారింటికి పంపించేశారు. వైఎస్‌ను, జగన్‌ను అశోక్ అమితంగా అభిమానించేవారు.
ఈ నేపథ్యంలో జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్టు చేస్తారని ఆదివారం పలు వార్తా చానళ్లలో ప్రసారం కావడంతో కలత చెందాడు. ఆ రోజు సాయంత్రం కిరోసిన్ డబ్బాను తీసుకుని సమీపంలోని చెట్ల పొదల్లోకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటల బాధ భరించలేక ఇంటి వద్దకు పరుగులు తీశాడు. ఇరుగుపొరుగువారు మంటలను ఆర్పి రుయా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అశోక్ సోమవారం మృతి చెందాడు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్టు చేస్తారనే విషయాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్యాయత్నం చేసినట్లు చనిపోవడానికి ముందుప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శరత్‌బాబుకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపినట్లు సమాచారం

No comments:
Post a Comment