ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశానని, రేపటి నుంచి పూర్తిస్థాయిలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని ఆళ్లనాని స్పష్టం చేశారు. హైదరాబాద్ చంచల్‌గూడ జైల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌ను ఆయన గురువారం కలిశారు. అనంతరం నాని మీడియాతో మాట్లాడుతూ జగన్ చాలా ధైర్యంగా ఉన్నారని, ప్రజలను ధైర్యంగా ఉండమని చెప్పారన్నారు. వైఎస్ విజయమ్మ పర్యటన ప్రజలు, కార్యకర్తల్లో ధైర్యం పెంచుతుందని ఆళ్ల నాని తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment