*ప్రచారంలో షర్మిల నిప్పులు
నక్కపల్లి (విశాఖ జిల్లా) న్యూస్‌లైన్: రాజకీయమంటే మంచిమనిషిని జైలుకు పంపడం, హెలికాప్టర్‌లను కూల్చడమేనా అని దివంగతనేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె షర్మిల ప్రశ్నించారు. తల్లి విజయమ్మతో కలిసి బుధవారం ఆమె నరసన్నపేట, పాయకరావుపేట నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ఆవేశంగా ప్రసంగించారు. దాని సారాంశం ఆమె మాటల్లోనే...
‘నేను రాజన్న కూతుర్ని, జగనన్న చెల్లెల్ని, షర్మిలను. ఈ రోజు నేను, మా అమ్మ ఇక్కడకు ఎం దుకు వచ్చామంటే వైఎస్ కుటుంబానికి జరుగుతున్న అన్యాయాన్ని మీకు చెప్పడం కోసం. ఈ అన్యాయం ఎవరు చేస్తున్నారో తెలుసా? ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కలసి... టీడీపీతో చేతులు కలిపి మరీ కుట్ర చే స్తున్నాయి. వైఎస్ మంచిమనిషని, ఆయన పనితీరు బాగుందని మెచ్చి రెండుసార్లు మీరు అధికారం ఇస్తే... ఆయన ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ తదితర పథకాలెన్నో అమలు చేసి పేదలకు అం డగా నిలిచారు. అటువంటి మహానేత గౌరవాన్ని, జగనన్న పరువుని తీయడానికి వీరంతా కంకణం కట్టుకున్నారు. ఆయన చరిష్మాతో నేడు గద్దెపై ఉన్న పాలకులు ఆయన కుటుంబాన్ని వీధిపాలు చేశారు.
జగనన్న గురించి మీకు తెలుసు... మూడేళ్లుగా మీ మధ్యే ఉంటున్నాడు. అటువంటి అన్నను ఈ రోజు జైలుకు పంపించారు. విచారణలో జగన్ సహకరించలేదన్నారు. వీడియోలో చూడమంటే దానికి సమాధానం లేదు. అరెస్టు ఎందుకని ప్రశ్నిస్తే ఎంపీగా ఉన్నారు... సాక్ష్యాలు తారుమారు చేస్తారని అన్నా రు. ఎంపీ అన్న విషయం ఇప్పుడు తెలిసిందా?.. తొమ్మిది నెలలుగా విచారణ జరుపుతున్నారు. సాక్ష్యాలు ఏమైనా తారుమారయ్యాయా? ఇప్పుడొక్కసారి తారుమారు చేసేస్తారా?.. ఇంత అన్యాయమా! వారు ఆశిస్తున్నది వేరు.
రాష్ట్రంలో 18 అసెంబ్లీ, 1 లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. వీటి ప్రచారంలో జగన్ పాల్గొంటే ఓడిపోతామని ఆ రెండు పార్టీలకు భయం పట్టుకుంది. జగన్‌ను మీనుంచి దూరం చేసేందుకే జైలుకు పంపారు. ఇటువంటి నీచరాజకీయాలు ఎక్కడైనా, ఏనాడైనా చూశా మా? నీతిమాలిన రాజకీయాలకు స్వస్తిపలకాలి. ఈ ఉప ఎన్నికల్లో మీరంతా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. ప్యాన్ గుర్తుకు ఓటేస్తే మీరం తా రాజన్న రాజ్యం రావాలని కోరుకున్నట్టే. జగనన్న నిర్దోషని నమ్మినట్టే. ఆయన సీఎం కావాలని కోరుకున్నట్టే’.
వైఎస్‌ను తలపించిన షర్మిల
జగన్ సోదరి షర్మిల తన ప్రసంగంలో ప్రభుత్వ దమన నీతిని కడిగిపారేశారు. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగానే చెయ్యి ఊపుతూ అందరినీ ఆకట్టుకున్నారు. ఆమె హావభావాలు వైఎస్‌ను తలపించాయి. తొలుత ‘నేను మీ రాజన్న కూతుర్ని... నేను మీ జగనన్న చెల్లెల్ని. నా పేరు షర్మిల’ అంటూ సరళమైన స్వరంతో తొలిసారిగా నరసన్నపేట, తర్వాత పాయకరావుపేటలలో చేసిన షర్మిల ప్రసంగాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. ప్రసంగిస్తూనే ప్రజల నుంచి సమాధానాలు రాబట్టిన తీరు ఆకర్షించింది.

No comments:
Post a Comment