జగన్‌ను సీబీఐ కస్టడీలోకి తీసుకుంది. ఈ ఉదయం 10.40 గంటల ప్రాంతంలో జగన్ ను సీబీఐ అధికారులు చంచల్‌గూడ జైలు నుంచి జైళ్లశాఖ డీజీ కార్యాలయానికి తీసుకెళ్ళారు. సాయంత్రం ఐదు గంటలదాకా ఆయనను సీబీఐ అధికారులు విచారించనున్నారు. భద్రతా కారణాలను దృష్టిలో పెట్టుకుని జైళ్లశాఖ డీజీ కార్యాలయంలోనే జగన్ ను విచారించాలని సీబీఐ నిర్ణయం తీసుకుంది. ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో జగన్‌ను సాయంత్రం ఐదు గంటలదాకా ప్రశ్నించిన తర్వాత మళ్ళీ రిమాండ్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. ఈనెల ఏడో తేదీదాకా జగన్‌ను సీబీఐ కస్టడీలోకి తీసుకుని విచారిస్తుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment