టీడీపీ, టీఆర్‌ఎస్ పార్టీల నాయకుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, ఇరుపార్టీల నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర కన్వీనర్ హెచ్.ఎ. రెహమాన్ బుధవారం నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మకు ఫిర్యాదు చేశారు. అనంతరం రెహమాన్ మాట్లాడుతూ.. కొంత కాలంగా టీడీపీ, టీఆర్‌ఎస్ నాయకుల నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని, ఈ మేరకు తనకు రక్షణ కల్పించాలని కమిషనర్‌ను కోరినట్లు తెలిపారు.
ఇందుకు కమిషనర్ సానుకూలంగా స్పందించి నగర పరిధి వరకు రక్షణ కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఇతర ప్రాంతాల్లో భద్రత కావాలంటే అడిషనల్ డీజీపీని కలవాలని సూచించినట్లు వెల్లడించారు. తనకు ఎలాంటి హాని జరిగినా టీడీపీ, టీఆర్‌ఎస్ అధినేతలే బాధ్యత వహించాలని రెహమాన్ అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సలీం, ఖలీఫా తదితరులు పాల్గొన్నారు

No comments:
Post a Comment