ఆలమూరు/ఆత్రేయపురం/కొత్తపేట (తూర్పు గోదావరి), న్యూస్‌లైన్: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందంటూ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి రాజకీయ అజ్ఞానిగా మాట్లాడుతున్నారని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్‌రావు విమర్శించారు. ఎక్కడ ఏ పథకం సక్రమంగా అమలవుతుందో నిరూపించాలని డిమాండ్ చేశారు. రావులపాలెంలో, కొత్తపేటలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
2009 ఎన్నికల్లో వైఎస్ కిలో బియ్యం రూ. రెండు పథకంలో 20 కేజీల నుంచి 30 కేజీలకు, ఉచిత విద్యుత్‌ను ఏడు గంటల నుంచి తొమ్మిది గంటలకు పెంచుతానని వాగ్దానమిచ్చారన్నారు. వీటిని అమలు చేయకపోవడంతో పాటు వైఎస్ చేపట్టిన ఇతర పథకాలను నిర్వీర్యం చేసిన ప్రభుత్వాన్ని వెనకేసుకు వచ్చిన చిరంజీవి ఇక ప్రజల్లోకి రాకూడదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న 18 ఉప ఎన్నికల్లో ఐదు స్థానాలను గెలిపించి తీరతానని ప్రగల్భాలు పలికిన చిరంజీవి కోరి టికెట్లను ఇప్పించుకున్న తిరుపతి, రామచంద్రపురం, నరసాపురం నియోజకవర్గాల్లో అభ్యర్థులను గెలిపించాలని సవాల్ విసిరారు.
విజయమ్మ రాకతో వణుకు
వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ప్రచారంతో అధికార కాంగ్రెస్‌కు, ప్రతిపక్ష తెలుగుదేశానికి వెన్నులో వణుకు పుడుతోందని గోనె, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. ఉప ఎన్నికలు జరుగుతున్న అన్ని స్థానాల్లో క్లీన్‌స్విప్ చేస్తామని ధీమా వ్యక్తంచేశారు.

No comments:
Post a Comment