వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అరెస్టును వివిధ దేశాల్లోని ప్రవాస భారతీయులు తీవ్రంగా ఖండించారు. దుబాయ్‌లోని ఒక హోటల్‌లో నెల్లూరు రమేష్‌రెడ్డి ఆధ్వర్యంలో సమావేశమైన 150 మంది ప్రవాసులు.. జగన్ అరెస్టు ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమేనని అభిప్రాయపడ్డారు. పాలక, ప్రతిపక్షాలు కుమ్మక్కై ఎల్లోమీడియాను అడ్డంపెట్టుకుని జగన్‌ను వేధించడానికి సీబీఐని పావులాగా వాడుకుం టున్నారని విమర్శించారు. వైఎస్ మరణించిన తర్వాత ఉత్పన్నమైన పరిణామాల్లో కాంగ్రెస్ నుంచి జగన్‌ను నిష్ర్కమించేలా చేసింది చాలక, పార్టీ స్థాపిం చిన తర్వాత వేధింపులకు గురిచేసి జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తంచేశారు.
అమెరికాలో కొవ్వొత్తుల ప్రదర్శన: జగన్‌ను సీబీఐ కుట్రపూరితంగా అరెస్టు చేసినందుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు డెట్రాయిట్‌లో కొవ్వొత్తుల ప్రదర్శన ద్వారా నిరసన వ్యక్తంచేశారు. సీబీఐని కాంగ్రెస్ అధిష్టానం తమ స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటోందని, జగన్ అరెస్టు ద్వారా తెలుగువారి ఆత్మగౌరవాన్ని కించపరిచిందని దుయ్యబట్టారు. సోనియా అండ్ కంపెనీ రాజకీయ దుశ్చర్యల వల్ల రాష్ట్ర ప్రగతి కూడా నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. టీడీపీతో కలిసి కాంగ్రెస్ చేసిన ఈ కుట్రను ఉప ఎన్నికల్లో ప్రజాతీర్పుతో తిప్పికొట్టాలని ప్రవాసులు పిలుపునిచ్చారు. అమెరికాలోని సెంట్‌లూయిస్, అట్లాంటా, ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌తోపాటు కువైట్ తదితర ప్రాంతాల్లో కూడా నిరసనలు జరిగాయి.

No comments:
Post a Comment