అనంతపురం : వైఎస్ఆర్‌ను ప్రేమించే ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తరలి వస్తారని వైఎస్ వివేకానందరెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో మరికొందరు ఎమ్మెల్యేలు పార్టీలో చేరే అవకాశం ఉందని ఆయన శనివారమిక్కడ అన్నారు. కొన్ని చానళ్లు, పత్రికలు జగన్‌పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాయని వాటిని ప్రజలు గమనిస్తున్నారన్నారు.
అనంతపురంలో మాజీ కార్పొరేటర్ అబు సాలెహతో పాటు మరికొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరారు. వారందరికి వైఎస్ వివేకానందరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ రెహ్మాన్, తోపుదుర్తి కవిత, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి తదితరులు హాజరయ్యారు.

No comments:
Post a Comment