నిపుణుల కమిటీతో సినిమా పరిశీలన.. నేనూ చూస్తా: సీఈఓ
టీడీపీకి ప్రచారంగా లేదా ఇంకో పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలుంటే చర్యలు
ఫిర్యాదు రుజువైతే టీడీపీ అభ్యర్థుల వ్యయంలో సినిమా వ్యయం జమ
హైదరాబాద్, న్యూస్‌లైన్: బాలకృష్ణ హీరోగా నటించిన అధినాయకుడు సినిమా చిక్కుల్లో చిక్కుకుంది. ఆ సినిమాపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదుపై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ స్పందించారు. వైఎస్‌ఆర్ సీపీ నేత, మాజీ మంత్రి ఎం.మారెప్ప, అధికార ప్రతినిధి రెహమాన్, వెంకట్‌ప్రసాద్‌లు సచివాలయంలో బుధవారం ఆయనను కలసి విజ్ఞాపన పత్రం అందజేశారు. నిపుణుల కమిటీతో సినిమాను పరిశీలింప చేస్తానని, స్వయంగా తాను కూడా సినిమా చూస్తానని ఈ సందర్భంగా భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదు రుజువైతే ఆ సినిమా తీయడానికైన మొత్తం వ్యయాన్ని టీడీపీ అభ్యర్థుల ఎన్నికల ఖర్చుగా జమ చేస్తామని తెలిపారు.
అప్పుడు టీడీపీ అభ్యర్థులు ఎన్నికల వ్యయం సీలింగ్ అధిగమిస్తారని... తద్వారా అనర్హులవుతారని వివరించారు. సినిమాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మనోభావాలను కించపరిచే విధంగా బాలకృష్ణ డైలాగులున్నాయని, ఉప ఎన్నికల నేపథ్యంలోనే సినిమాను విడుదల చేయనున్నారంటూ కొన్ని డైలాగులను కూడా ఫిర్యాదుతో పాటు అందజేశారని భన్వర్‌లాల్ తెలిపారు. ఆ డైలాగులు టీడీపీ అభ్యర్థులకు ప్రచారం చేసేలా ఉన్నా లేదా మరో పార్టీకి వ్యతిరేకంగా ఉన్నా వాటిని పెయిడ్ న్యూస్ తరహాలోనే పరిగణిస్తామని చెప్పారు. బాలకృష్ణ కూడా స్వయంగా ఉప ఎన్నికల ప్రచారానికి తాను రాను గానీ సినిమాను పంపిస్తానని పేర్కొన్నట్లు తెలిపారని, అదే వాస్తవమైతే అధినాయకుడు సినిమా తెలుగుదేశం అభ్యర్థుల ప్రచారంగానే భావించాల్సి వస్తుందని, సినిమా చూసిన తరువాత ఒక నిర్ణయం తీసుకుంటానని భన్వర్‌లాల్ తెలిపారు. ఉప ఎన్నికల జిల్లాల్లో ఇప్పటివరకు రూ.25 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అలాగే 1.61 లక్షల లీటర్ల అక్రమ మద్యంను స్వాధీనం చేసుకోవడంతో పాటు 10,683 కేసులు నమోదు చేయగా 3,617 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. అన్ని పార్టీలకు చెందిన 29,619 మందిని బైండోవర్ చేసినట్లు ఆయన చెప్పారు.
మనోభావాలను కించపరిచే డైలాగులు: మారెప్ప
వైఎస్‌ఆర్ అభిమానులు, ప్రజల మనోభావాలను కించపరిచేవిధంగా అధినాయకుడు సినిమాలో డైలాగులు, హావభావాలు ఉన్నాయని ఎన్నికల అధికారికి వివరించినట్లు మాజీమంత్రి మారెప్ప తెలిపారు. భన్వర్‌లాల్‌కు విజ్ఞాపన పత్రం అందించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. అధినాయకుడు సినిమా హీరో తెలుగుదేశం పార్టీకి ఉప ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్నారని తెలిపారు. తాను ఉప ఎన్నికల ప్రచారానికి రాబోనని, తన సినిమాను ప్రచారానికి పంపుతున్నానని బాలకృష్ణ స్వయంగా ప్రకటించారని వివరించారు. రాజకీయ అంశాలతో నిర్మితమైన అధినాయకుడు సినిమాను ఉప ఎన్నికల సమయంలో విడుదల చేయకుండా నిలుపుదల చేయాలని కోరారు. ఆ సినిమా తెలుగుదేశం పార్టీకి ఉప ఎన్నికల్లో ఉపయోగపడేవిధంగా నిర్మించినందున నిర్మాణ ఖర్చు రూ.50 కోట్లను ఆ పార్టీ అభ్యర్థుల ఖర్చుగా పరిగణించాలని కోరారు. జూన్ ఒకటవ తేదీన ఆ సినిమాను విడుదల చేయడం ఖచ్చితంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికే వస్తుందని ఎన్నికల అధికారికి వివరించారు.

No comments:
Post a Comment