ద్రాక్షారామం: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రయాణించిన హెలికాప్టర్ ప్రమాద ఘటనపై అనేక అనుమానాలున్నాయని ద్రాక్షారామం ఎన్నికల ప్రచార సభలో విజయమ్మ అన్నారు. ప్రమాదం వెనుక ఉన్న అసలు విషయాలు బయటపెట్టాలని విజయమ్మ డిమాండ్ చేశారు. పాత హెలికాప్టర్‌ను ఎందుకు పర్యటనకు పెట్టారని వైఎస్‌కూడా అడిగారట అని ద్రాక్షారామం సభంలో విజయమ్మ తెలిపారు. ప్రమాద కారణాలు తెలిపే వాయిస్ రికార్డుల్లో కొంత భాగమే ఎందుకు ఉందని విజయమ్మ అనుమానం వ్యక్తం చేశారు. దీనివెనుక ఏం కుట్ర జరిగిందని రాష్ట్రప్రభుత్వం ఎందుకు అధికారులను నిలదీయలేదని విజయమ్మ ప్రశ్నించారు. ఆరోజు జరిగినట్టే ఇవాళ కూడా జగన్‌కు జరుగుతుందమోనని భయంగా ఉందని విజయమ్మ అన్నారు. తన కొడుకు జగన్ బాబు ఏం తప్పు చేశాడని జైల్లో వేశారని విజయమ్మ నిలదీశారు. మాటపై నిలబడినందుకే జగన్ బాబు ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నారని... మాటకు కట్టుబడి ఉండాలని మహానేత వైఎస్, జగన్‌కు నేర్పించారని విజయమ్మ తెలిపారు. వారం రోజుల పాటు సీబీఐ మా ఇంట్లో సోదాలు జరిపిందని, గతంలో ఏ నాయకుడి ఇంట్లోనైనా ఇలా సోదాలు చేశారా అని విజయమ్మ విజయమ్మ ప్రశ్నల వర్షం కురిపించారు. ఏనాడూ ఏ అధికారితోనూ జగన్ మాట్లాడేవాడు కాదని, తొమ్మిదినెలల విచారణ కాలంలో సీబీఐ ఒక్క ఆధారాన్నీ సంపాదించలేకపోయారని వైఎస్ విజయమ్మ స్పష్టం చేశారు. వైఎస్ విజయమ్మ రాకతో ద్రాక్షారామం జనసంద్రంగా మారింది. విజయమ్మ మాట్లాడినంత సేపు ప్రజల నుంచి అనూహ్య స్పందన వ్యక్తమైంది. |
Thursday, 31 May 2012
వైఎస్ మరణంపై అనేక అనుమానాలు: విజయమ్మ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment