గుంటూరు: తమ కుటుంబానికి ఇచ్చిన మాటకోసం, రాష్ట్రంలోని రైతుల కోసం పదవులు పోగొట్టుకున్న అభ్యర్థుల గెలుపును బాధ్యతగా తీసుకొని తాను ప్రచారం చేస్తున్నానని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తెలిపారు. ప్రజల్లో వస్తున్న ఆదరణే తన బాధను దిగమింగేలా చేస్తోందన్నారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న విజయమ్మ ప్రచార వాహనంలో 'సాక్షి'టివితో ప్రత్యేకంగా మాట్లాడారు.
పార్లమెంట్ సభ్యుల్లో ఎందరో కేసులు ఎదుర్కొంటున్నా, జగన్‌నే టార్గెట్ చేసి జైల్లో పెట్టడమేంటని విజయమ్మ ప్రశ్నించారు. జగన్ ఎలా సాక్షులను ప్రభావితం చేస్తారో అరెస్ట్ చేసిన వాళ్లు చెప్పాలన్నారు. ఏం తప్పు చేశాడని తన కుమారుడిని అరెస్ట్ చేశారని ప్రభుత్వాన్ని అడిగినా ఇప్పటి వరకూ సమాధానం లేదన్నారు. చివరకు..ప్రచారానికి వెళ్తుంటే తమ సూట్‌కేసులు కూడా సోదా చేస్తున్నారని విజయమ్మ వాపోయారు.

No comments:
Post a Comment