టి.నర్సాపురం (పశ్చిమగోదావరి), న్యూస్‌లైన్: మళ్లీ అవే వేధింపులు. తనిఖీల పేరుతో అత్యుత్సాహం ప్రదర్శిస్తూ పోలీసులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ వాహనాన్ని అడుగడుగునా అడ్డుకుంటున్నారు. ఉప ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల్లో కాంగ్రెస్, టీడీపీ వాహనాలను పెద్దగా పట్టించుకోని పోలీసులు విజయమ్మ వాహనాన్ని మాత్రం నిలిపేస్తున్నారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా చించినాడ బ్రిడ్జి వద్ద వాహనాన్ని ఆపి తనిఖీలు చేసి అవమానించిన పోలీసులు... శనివారం కూడా పశ్చిమగోదావరి జిల్లా టి.నర్సాపురం మండలం మల్లుకుంట చెక్‌పోస్టు వద్ద కూడా అదే పంథా కొనసాగించారు. ఆమె ప్రచారం నిర్వహిస్తున్న బస్సులోకి మహిళా కానిస్టేబుళ్లను పంపి తనిఖీలు చేయించారు. విజయమ్మ కాన్వాయ్‌లో ఉన్న ‘సాక్షి’ వాహనాలను కూడా అణువణువూ తనిఖీ చేశారు. పోలీసులు చుట్టుముట్టి వాహనాల్లోకి ఎక్కి లోపల ఉన్న విలేకరులను కనీసం అడగకుండా బ్యాగ్‌లు తెరిచి చూశారు. విజయమ్మ కాన్వాయ్ వెళ్లిన కొద్దిసేపటికే కాంగ్రెస్‌కు చెందిన ప్రచార వాహనాలు వచ్చినా వాటిని పోలీసులు తనిఖీ చేయకపోవడం గమనార్హం.
Saturday, 2 June 2012
విజయమ్మ ప్రచార వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు, కాంగ్రెస్‌కు చెందిన ప్రచార వాహనాలు వచ్చినా వాటిని పోలీసులు తనిఖీ చేయకపోవడం ..
టి.నర్సాపురం (పశ్చిమగోదావరి), న్యూస్‌లైన్: మళ్లీ అవే వేధింపులు. తనిఖీల పేరుతో అత్యుత్సాహం ప్రదర్శిస్తూ పోలీసులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ వాహనాన్ని అడుగడుగునా అడ్డుకుంటున్నారు. ఉప ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల్లో కాంగ్రెస్, టీడీపీ వాహనాలను పెద్దగా పట్టించుకోని పోలీసులు విజయమ్మ వాహనాన్ని మాత్రం నిలిపేస్తున్నారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా చించినాడ బ్రిడ్జి వద్ద వాహనాన్ని ఆపి తనిఖీలు చేసి అవమానించిన పోలీసులు... శనివారం కూడా పశ్చిమగోదావరి జిల్లా టి.నర్సాపురం మండలం మల్లుకుంట చెక్‌పోస్టు వద్ద కూడా అదే పంథా కొనసాగించారు. ఆమె ప్రచారం నిర్వహిస్తున్న బస్సులోకి మహిళా కానిస్టేబుళ్లను పంపి తనిఖీలు చేయించారు. విజయమ్మ కాన్వాయ్‌లో ఉన్న ‘సాక్షి’ వాహనాలను కూడా అణువణువూ తనిఖీ చేశారు. పోలీసులు చుట్టుముట్టి వాహనాల్లోకి ఎక్కి లోపల ఉన్న విలేకరులను కనీసం అడగకుండా బ్యాగ్‌లు తెరిచి చూశారు. విజయమ్మ కాన్వాయ్ వెళ్లిన కొద్దిసేపటికే కాంగ్రెస్‌కు చెందిన ప్రచార వాహనాలు వచ్చినా వాటిని పోలీసులు తనిఖీ చేయకపోవడం గమనార్హం.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment