2014 వరకు జగన్ ఎంపీగా కొనసాగుతారని.. సాక్షులపై ప్రభావం చూపుతారని అప్పటివరకు బెయిల్ ఇవ్వరా? అని జగన్ తరఫు న్యాయవాదులు వాదించారు. ఈ కేసులో చార్జిషీటు దాఖలు చేశాక సాక్ష్యాలు తారుమారు చేస్తారన్న ప్రశ్నే తలెత్తదని వారు అన్నారు. పార్లమెంటులో 115 మంది ఎంపీలు నేరాల్లో చిక్కుకున్నారని.. కేసు విచారణపై ప్రభావం చూపుతారని వారందర్ని జైల్లో పెట్టారా? అని కోర్టుకు నివేదించారు. కోర్టు పరిధిలో అంశం ఉన్నప్పుడు కోర్టు అనుమతి లేకుండా ఎలా అరెస్టుచేస్తారు? న్యాయవాదులు సూటిగా ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల్లో తనను అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని, బలప్రయోగం చూపుతారని అంటున్న సీబీఐ వాదనలు సరికావు జగన్ బెయిల్ పిటిషన్ లో పేర్కొన్నారు. తొమ్మిదినెలలుగా సీబీఐ ఈకేసులో దర్యాప్తుచేస్తోందని... తాను ఎక్కడా సాక్ష్యాలు తారుమారు చేసినట్టుగాని, సాక్షులను ప్రభావితం చేసినట్టుగాని సీబీఐ ఎక్కడా చెప్పలేదని.. కోర్టు ఎలాంటి షరతులు విధించినా అంగీకరిస్తామని.. బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు దాఖలు చేసిన పిటిషన్ లో అభ్యర్థించారు.
మార్కెట్లో హెచ్చుతగ్గుల ప్రకారం షేర్ల విలువ పెరుగుతూ, తగ్గుతూ ఉంటుందని, అంత మాత్రాన 10 రూపాయల షేరును 350 కి పెంచారని సీబీఐ చెప్తోందని, అలాంటప్పుడు ఎస్‌బీఐ షేరు విలువ 10 రూపాయల నుంచి 2600 రూపాయలకు పెరగలేదా అని, ఫేస్‌బుక్ షేరు విలువ ఒక డాలర్ నుంచి 38 డాలర్లకు పెరిగిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అలాంటి సందర్భాలలో తనది తప్పు ఎలా అవుతుందని, ఆర్థికపరమైన అంశాలు ఏమైనా ఉంటే.. అవి సీబీఐ పరిధిలోకి రావని, హవాలా కేసుల పరిశీలనకు ప్రత్యేక దర్యాప్తు సంస్థలు ఉన్నాయని కోర్టుకు వెల్లడించారు.

No comments:
Post a Comment