YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday, 30 June 2012

మత్స్యకారులపై అసెంబ్లీలో ప్రస్తావిస్తాం


మత్స్యకారుల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. పదిహేన్ రోజుల్లోగా తిక్కవానిపాలెం మత్స్యకారులకు న్యాయం జరిగేలా చూడాలని ఎన్‌టీపీసీ యాజమాన్యాన్ని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ డిమాండ్ చేశారు. ఎన్‌టీపీసీ వల్ల బాధితులైన మత్స్యకారులను పరామర్శించేందుకు వైఎస్ విజయమ్మ, షర్మిలాలు ఆదివారం ఉదయం విశాఖ జిల్లాలోని తిక్కవానిపాలెంలో వచ్చారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ఆమె ప్రసంగించారు.ఎన్‌టీపీసీ వల్ల మత్స్యకారులు బాధితులుగా మారారని కావున న్యాయం అందించేందుకు యాజమాన్యం సత్వరం చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా మత్స్యకారులు వైఎస్‌విజయమ్మకు వినతి పత్రాన్ని సమర్పించారు. వైఎస్‌ఆర్ కాంగ్రె స్ పార్టీ నిత్యం ప్రజల పక్షాన నిలుస్తుందని వైఎస్ విజయమ్మ మత్స్యకారులకు భరోసా ఇచ్చారు. 

విశాఖపట్నం చేరుకున్న వైఎస్ విజయమ్మ

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆదివారం ఉదయం విశాఖపట్నం చేరుకున్నారు. ఎన్‌టీపీసీ సింహాద్రి విద్యుత్ ప్లాంట్ బాధితులను పరామర్శించేందుకు ఆమె తిక్కవాని పాలెం వెళ్లనున్నారు. విశాఖపట్నం విమానాశ్రయంలో వైఎస్ విజయమ్మ, షర్మిలలకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై స్వాగతం పలికారు. 

జేడీ ‘కాల్‌లిస్ట్’ కేసును కొట్టేయండి

హైకోర్టులో రఘురామకృష్ణరాజు పిటిషన్
ఎమ్మార్ కేసులో సాక్షిగా సీబీఐ నన్ను విచారించింది
ఆ వివరాలన్నీ ఈనాడు, ఆంధ్రజ్యోతిలలో రావడం మొదలైంది
నా ప్రతిష్టకు భంగం కలిగేలా తప్పుడు కథనాలు ప్రచురించాయి
జేడీ లేదా ఆయన సహచరులు నేను చెప్పిన వివరాలను లీక్ చేసినట్లు అనుమానం వచ్చింది
నా మిత్రుడొకరు దర్యాప్తు అధికారుల కాల్స్ వివరాలను ఇచ్చారు.. వాటినే హైకోర్టు ముందుంచాను
జేడీ వ్యక్తిగత విషయాలను నేను ఎక్కడా ప్రస్తావించలేదు
మీడియాకు లీకులు ఇవ్వడం లేదని జేడీ నాకు చెప్పారు.. 
తరువాత నా పిటిషన్‌ను ఉపసంహరించుకున్నాను
సాక్షి కథనం వెనుక నా ప్రమేయం ఉన్నట్లు జేడీ అనుమానిస్తున్నారు
ఆ అనుమానంతోనే నాపై ఫిర్యాదు చేశారు.. దానిలో వాస్తవం లేదు

హైదరాబాద్, న్యూస్‌లైన్: సీబీఐ జాయింట్ డెరైక్టర్ వి.వి.లక్ష్మీనారాయణ కాల్ లిస్ట్ బహిర్గతం కావడంపై టెలిగ్రాఫ్ చట్టం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టాల కింద సీసీఎస్ పోలీసులు కేసును నమోదు చేయడాన్ని సవాలు చేస్తూ పారిశ్రామికవేత్త కె.రఘురామకృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించారు. సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని, ఈ కేసుకు సంబంధించి తదుపరి చర్యలేవీ చేపట్టకుండా హైదరాబాద్ కమిషనర్, సీసీఎస్ ఎస్‌హెచ్‌ఓలను ఆదేశించాలంటూ ఆయన శుక్రవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో హోంశాఖ ముఖ్య కార్యదర్శి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, సీసీఎస్ ఎస్‌హెచ్‌ఓలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. అంతేకాక సీబీఐ జేడీ లక్ష్మీనారాయణను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చారు. 

‘ఎమ్మార్ హిల్స్ టౌన్‌షిప్ ప్రైవేట్ లిమిటెడ్ (ఈహెచ్‌టీపీఎల్)లో నేను, నా భార్య ప్లాట్లు కొనుగోలు చేశాం. మాతోపాటు వందమందికి పైగా ప్లాట్లు కొన్నారు. ఇదిలా ఉండగా, ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదం చెలరేగింది. ఈ మొత్తం వ్యవహారంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిని విచారించిన హైకోర్టు, ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించింది. ఈ ఆదేశాలకు అనుగుణంగా సీబీఐ దర్యాప్తు ప్రారంభించి, 2011 ఆగస్టు 29న నాకు సీఆర్‌పీసీ సెక్షన్ 91, 160ల కింద నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను గౌరవిస్తూ డీఎస్‌పీ ఎస్.సి.జిలానీ ముందు హాజరై, నాకు తెలిసిన విషయాలన్నీ చెప్పాను. తరువాత మరికొన్నిసార్లు సీబీఐ అధికారులు సాక్షిగా నాకు నోటీసులు జారీ చేసి విచారించారు. ప్రతి విచారణ సమయంలో నాకు తెలిసినవన్నీ చెప్పాను. ఇదిలా ఉండగా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు నాకు వ్యతిరేకంగా అవాస్తవాలతో తప్పుడు కథనాలు వరుసగా ప్రచురించడం మొదలుపెట్టాయి. వాస్తవానికి విచారణ సమయంలో ఏం జరిగిందనేది నాకు, విచారించిన అధికారికి మాత్రమే తెలుసు. అది మొత్తం రహస్య సమాచారం. 

సాక్షుల విచారణ పకడ్బందీగా జరగాల్సి ఉండగా, సాక్షులు చెప్పే వివరాలను ఈ రెండు పత్రికలు సొంత ఆలోచనలు జోడించి కథనాలు ప్రచురిస్తూ వచ్చాయి. దీంతో సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ లేదా ఆయన సహచరులు ఈ రెండు పత్రికలతో కుమ్మక్కయి, నా పరువు, ప్రతిష్టలను దెబ్బతియ్యాలని భావిస్తున్నట్లు నాకు అనిపించింది. ఈ రెండు పత్రికల్లో వచ్చే కథనాలను లక్ష్మీనారాయణ గానీ ఆయన సహచరులు గానీ ఎన్నడూ ఖండించలేదు. 

దీంతో సీబీఐ అధికారుల తీరును, మీడియాతో వారికున్న సాన్నిహిత్యాన్ని ప్రశ్నిస్తూ 2011లో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాను. సాక్షులు ఇచ్చే వాంగ్మూలాలను బహిర్గతం చేసేందుకు మీడియాను ఓ ఆయుధంగా సీబీఐ అధికారులు వాడుకుంటూ, ఆ మీడియా ప్రతినిధులకు ఉద్దేశపూర్వకంగా లీకులు ఇవ్వడం ప్రారంభించారు. మీడియాలో వచ్చే కథనాల ఆధారంగా సీబీఐ అధికారులు సాక్షులపై ఒత్తిడి తేవడం, తాము చెప్పినట్లు చెప్పాలని బెదిరించడం ప్రారంభించారు. సీబీఐ దర్యాప్తు తీరు, దానిపై నేను దాఖలు చేసిన పిటిషన్ గురించి మీడియాలో విస్తృత్తంగా కథనాలు వచ్చాయి. కె.వి.రెడ్డి అనే నాకు తెలిసిన వ్యక్తి దర్యాప్తు అధికారుల కాల్స్ వివరాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆయనే నాకు కాల్ లిస్ట్ సమాచారాన్ని ఇచ్చారు. కొంత ప్రయత్నం తరువాత దర్యాప్తు అధికారులకు వచ్చిన, వారు చేసిన నంబర్లలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, డెక్కన్ క్రానికల్, టైమ్స్ ఆఫ్ ఇండియా తదితర పత్రికల ప్రతినిధుల నంబర్లు ఉన్నట్లు గుర్తించారు. వీరంతా దర్యాప్తు సంస్థ అందించే తప్పుడు సమాచారాన్ని ప్రచురించిన వారే. నేను సేకరించిన ఈ కాల్ లిస్ట్‌ను హైకోర్టు ముందుంచి, ఈ మొత్తం వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని కోరాను. దర్యాప్తు అధికారుల అధికార దుర్వినియోగంపైన కూడా దర్యాప్తు కోరాను. 

ఇందుకుగాను జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని హైకోర్టును అభ్యర్థించాను. ఆ కాల్ లిస్ట్‌లో లక్ష్మీనారాయణకు సంబంధించిన ఇతర కాల్స్ వివరాలను నేను ఎక్కడా ప్రస్తావించలేదు. బహుశా అవి ఆయన వ్యక్తిగత కాల్స్ అయి ఉండొచ్చు. లక్ష్మీనారాయణ వ్యక్తిగత విషయాలను ప్రస్తావించకుండా, మీడియాలో వచ్చిన తప్పుడు కథనాలపై దర్యాప్తు కోరాను. నేను సేకరించిన కాల్ లిస్ట్‌ను మరే రకంగానూ ఉపయోగించలేదు. నాకు వచ్చిన వివరాలను యథాతథంగా కోర్టు ముందుంచాను. లక్ష్మీనారాయణ పరోక్షంలో మీడియా నా పరువు, ప్రతిష్టలపై దురుద్దేశాలతో చేస్తున్న దాడుల నేపథ్యంలో తప్పని పరిస్థితుల్లో నేను ఆ కాల్ లిస్ట్‌ను కోర్టు ముందుంచాల్సి వచ్చింది. 

తరువాత మీడియాలో వస్తున్న కథనాలకు, తనకు ఎటువంటి సంబంధం లేదని లక్ష్మీనారాయణ నాతో మాట్లాడిన సందర్భంగా చెప్పారు. మీడియాకు తానుగానీ, తన సహచరులుగానీ ఎటువంటి లీకులు ఇవ్వలేదని చెప్పారు. ఇందుకు అనుగుణంగా లక్ష్మీనారాయణ మీడియా ప్రకటన జారీ చేశారు. అది విస్తృతంగా ప్రచురితమైంది. లక్ష్మీనారాయణ వివరణలు ఇచ్చిన నేపథ్యంలోనే.. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలపై నేను రూ.25 కోట్లు నష్టపరిహారంగా చెల్లించాలంటూ రెండు పరువు నష్టం దావాలు వేశాను. ఇటువంటి పరిస్థితుల మధ్య నేను హైకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను ఈ ఏడాది ఫిబ్రవరి 17న ఉపసంహరించుకున్నాను. రికార్డుల్లో ఉన్న కాల్స్ వివరాలన్నింటినీ తీసుకునేందుకు సీబీఐ న్యాయవాదికి హైకోర్టు అనుమతినిచ్చింది. ఈ పిటిషన్ ఉపసంహరణ తరువాత, కాల్స్ వివరాలను ఎన్నడూ నేను పట్టించుకోలేదు. 

ఇదిలా ఉండగా.. సీబీఐ జేడీ లక్ష్మీనారాయణకు సంబంధించిన కాల్స్ వివరాలంటూ తెలుగు దినపత్రిక సాక్షి ఇటీవల ఓ కథనం ప్రచురించింది. వీటిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బయటపెట్టినట్లు, జేడీ కాల్స్‌పై విచారణకు ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేసినట్లు ఆ కథనంలో పేర్కొంది. సాక్షి కథనానికి కౌంటర్‌గా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు కథనాలు ప్రచురించడం మొదలుపెట్టాయి. ముఖ్యంగా ఆంధ్రజ్యోతి దినపత్రిక నేరుగా నా పేరును ప్రస్తావించకుండా, నా పేరు స్ఫురించేలా, కాల్స్ వివరాలు బయటకు వచ్చేందుకు నేనే కారణమనే రీతిలో కథనం ప్రచురించింది. తరువాత జేడీ లక్ష్మీనారాయణ సాక్షి టీవీ చానల్, సాక్షి పత్రిక, కొందరు బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులు, నాపై హైదరాబాద్ కమిషనర్ ముందు ఫిర్యాదు చేసినట్లు పత్రికలు, టీవీల ద్వారా తెలుసుకున్నాను. లక్ష్మీనారాయణ ఫిర్యాదు ఆధారంగా సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పిన వివరాల ఆధారంగా సాక్షి పత్రిక, టీవీ చానల్ వరుసగా తన కాల్స్‌కు సంబంధించిన వివరాలతో కథనాలు మొదలుపెట్టాయని జేడీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కాల్స్ వివరాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సాక్షి పత్రిక, టీవీ ఎలా సంపాదించాయో తనకు తెలియదని ఆ ఫిర్యాదులో తెలిపారు. వాస్తవానికి జేడీ కాల్స్‌కు సంబంధించి నేను దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నాను. 

అయినప్పటికీ లక్ష్మీనారాయణ నాపైన, కొందరు ప్రైవేటు డిటెక్టివ్‌లపైన అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఐపీసీ, టెలిగ్రాఫ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. లక్ష్మీనారాయణ చేస్తున్న ఆరోపణలకు, నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను ఎటువంటి నేరం చేయలేదు. నా హక్కులను పరిరక్షించుకునేందుకే గతంలో పిటిషన్ దాఖలు చేశాను. కాల్స్‌కు సంబంధించిన వివరాలు నేను అందజేసినట్లుగా సాక్షి కథనాల్లో ఎక్కడా లేదు. అయినప్పటికీ దర్యాప్తు అధికారులు తప్పుడు కేసులో నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. లక్ష్మీనారాయణ చేసిన ఫిర్యాదులోని ఆరోపణల్లో నేను నేరం చేసినట్లు ఎక్కడా లేదు. కేసు నమోదుకు అవసరమైన అంశాలే అందులో లేవు. ఫిర్యాదులోని ఆరోపణలన్నీ అర్థరహితంగా ఉన్నాయి. నాపై కేసుకు ఎటువంటి ప్రాథమిక ఆధారాలు లేవు. 

ఫిర్యాదులోని ఆరోపణలను పూర్తిగా పరిశీలిస్తే, అందులో నేను ఎటువంటి నేరం చేసినట్లు కనిపించదు. దురుద్దేశాలతోనే ఆ ఫిర్యాదు చేసినట్లు కనిపిస్తోంది. ఇది పూర్తిగా అధికార దుర్వినియోగమే. వేధింపులకు గురి చేయడానికే ఈ ఫిర్యాదు చేసినట్లు స్పష్టమవుతోంది. సీబీఐ చర్యలను ప్రశ్నిస్తూ కోర్టుకెక్కినందుకే నాపై అలా నిరాధార ఆరోపణలు చేశారు. అనుమానితునిగా, నిందితునిగా పేర్కొనడం తప్ప, ఎఫ్‌ఐఆర్‌లో నాపై నిర్దిష్టంగా ఎటువంటి ఆరోపణలు చేయలేదు. కాల్స్ వివరాలు బహిర్గతం కావడంలో నాపాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేయడం అర్థ రహితం. అందువల్ల ఐపీసీ సెక్షన్లు నాకు వర్తించవు’ అని రఘురామకృష్ణరాజు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని ఆయన కోర్టును కోరారు. కేసుకు సంబంధించి తదుపరి చర్యలేవీ చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కూడా ఆయన కోర్టును అభ్యర్థించారు. ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి జస్టిస్ ఖండవల్లి చంద్రభాను సోమవారం విచారించనున్నారు

రాష్ట్రం నుంచి ప్రయాణించే పలు రైళ్ల వేళలు ఆదివారం నుంచి మారనున్నాయి.

నేటి నుంచి కొత్త రైల్వే టైమ్‌టేబుల్
దశలవారీగా ప్రయాణికులకు అందుబాటులోకి 25 కొత్త రైళ్లు
జూలై 6న దురంతో ప్రారంభం
ద.మ.రైల్వే జీఎం వెల్లడి

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రం నుంచి ప్రయాణించే పలు రైళ్ల వేళలు ఆదివారం నుంచి మారనున్నాయి. కొన్ని రైళ్లను పొడిగించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో దశలవారీగా 25 కొత్త రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ జీఎన్ అస్తానా ఈ వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, కొంకణ్, మహారాష్ట్రలతో కూడిన సదరన్ జోన్ రైల్వే టైమ్ టేబుల్‌ను శనివారం రైల్ నిలయంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైళ్ల వేళల్లో మార్పులు, కొన్ని రైళ్ల పొడిగింపు, నంబర్ల మార్పు, వేగం పెరగనున్న రైళ్లు తదితర అంశాలను వివరించారు. కొత్త రైల్వే టైమ్‌టేబుల్ ఆదివారం నుంచి అమల్లోకి రానుంది. గత ఏడాది ప్రకటించిన సికింద్రాబాద్-విశాఖ ఏసీ దురంతో ఎక్స్‌ప్రెస్ జూలై 6వ తేదీన ప్రారంభమవుతుందని అస్తానా తెలిపారు. తిరుపతి, సికింద్రాబాద్ స్టేషన్‌లలో వరల్డ్‌క్లాస్ ప్రమాణాల అభివృద్ధి ఇప్పట్లో లేనట్టేనని పరోక్షంగా చెప్పారు. తగినంత భూమి లభించకపోవడం, కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం వంటి కారణాల వల్ల ఈ స్టేషన్ల అభివృద్ధి జాప్యమవుతోందని చెప్పారు. 

త్వరితగతిన కొత్త రైళ్లు...

గత సంవత్సరానికి భిన్నంగా ఈ ఏడాది వీలైనంత తొందరగా కొత్త రైళ్లను అందుబాటులోకి తేవాలని ఆకాంక్షిస్తున్నట్లు జీఎం చెప్పారు. జూలై 3వ తేదీన తిరుపతి - మున్నార్గుడి-తిరుపతి ఎక్స్‌ప్రెస్ ప్రారంభమవుతుందని, ఇది వారానికి 3 సార్లు తిరుగుతుందన్నారు. జూలైలోనే సికింద్రాబాద్ - బెల్లంపల్లి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్ - అజ్మీర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్ - దర్బంగా బై వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లు ప్రారంభమవుతాయన్నారు. కొత్త రైళ్లలో 15 ఎక్స్‌ప్రెస్‌లు దక్షిణ మధ్య రైల్వే నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. మరో 9 ఎక్స్‌ప్రెస్/మెయిల్ సర్వీసులు దక్షిణ మధ్య రైల్వే మీదుగా రాకపోకలు సాగిస్తాయని చెప్పారు. ఇవి కాకుండా ఎర్రగుంట్ల-నోసమ్/నంగనాపల్లి మధ్య ఒక ప్యాసింజర్ రైలు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. షాలిమార్-చెన్నై వీక్లీ ఎక్స్‌ప్రెస్ కూడా 3వ తేదీనే అందుబాటులోకి వస్తుంది.

నేటి నుంచి 4 రైళ్ల వేళల్లో మార్పులు

హైదరాబాద్-తిరుపతి రాయలసీమ ఎక్స్‌ప్రెస్ (17429) సాయంత్రం 5.25 గంటలకు బదులు మధ్యాహ్నం 3.35 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరుతుంది. ఈ రైలు మరుసటి రోజు ఉదయం 8.10 గంటలకు బదులు 6.40 గంటలకే తిరుపతి చేరుకుంటుంది.
సికింద్రాబాద్-తిరుపతి (12732) ఎక్స్‌ప్రెస్ సాయంత్రం 7 గంటలకు బదులు 8.05 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరుతుంది. ఇది మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు బదులు 10.35కు తిరుపతికి చేరుకుంటుంది.

తిరుపతి-కొల్హాపూర్ హరిప్రియ ఎక్స్‌ప్రెస్ రాత్రి 8.30కు బదులు 9 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరి మరుసటి రోజు సాయంత్రం (పాత టైమ్ ప్రకారమే) 4.35 గంటలకు కొల్హాపూర్ చేరుతుంది.

నాందేడ్-గంగానగర్ ఎక్స్‌ప్రెస్ రాత్రి 11.30కు బదులు ఉదయం 11 గంటలకు నాందేడ్ నుంచి బయల్దేరి రెండోరోజు ఉదయం 10.55 గంటలకు బదులు రాత్రి 10-40కి గంగానగర్ చేరుకుంటుంది.

ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి బయల్దేరుతున్న గుంతకల్-సికింద్రాబాద్ ప్యాసింజర్ ఇక నుంచి కాచిగూడ నుంచి రాకపోకలు సాగిస్తుంది. సికింద్రాబాద్-బోధన్ ప్యాసింజర్‌ను కూడా కాచిగూడకు పరిమితం చేశారు.

స్వల్పంగా సమయాలు మారిన రైళ్లు (ఈ వేళలు కూడా ఆదివారం నుంచే అమల్లోకి వస్తాయి)
పుణే-సికింద్రాబాద్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం 2.40 గంటలకు బదులు మధ్యాహ్నం 2.55కు సికింద్రాబాద్ నుంచి బయల్దేరుతుంది.

ముంబై-సికింద్రాబాద్ దేవగిరి ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం 2.15కు బదులు 2.30కు సికింద్రాబాద్ చేరుతుంది.

కాచిగూడ-గుంటూరు ప్యాసింజర్ సాయంత్రం 4.10కి బదులు 3.30కే కాచిగూడ నుంచి బయల్దేరుతుంది. కాచిగూడ-కర్నూల్ పాసింజర్ సాయంత్రం 6 గంటలకు బదులు 5.35కు కాచిగూడ నుంచి బయల్దేరుతుంది.

డోన్-గుంటూరు ప్యాసింజర్ ఉదయం 5.30కు బదులు 6.30కు డోన్ నుంచి బయల్దేరుతుంది. ఇది మధ్యాహ్నం 2.40కి బదులు 3.20కి గుంటూరుకు చేరుతుంది.

రేపల్లె-సికింద్రాబాద్ ప్యాసింజర్ రాత్రి 8.45కు బదులు 9.25కు రేపల్లెలో బయల్దేరుతుంది. ఉదయం 5.05 గంటలకు బదులు 7.55కు సికింద్రాబాద్ చేరుతుంది.

గుంటూరు-విజయవాడ ప్యాసింజర్ సాయంత్రం 6.05కు బదులు 6.30కు గుంటూరులో బయల్దేరుతుంది. సాయంత్రం 7.10కి బదులు 7.35కు విజయవాడ చేరుతుంది.

త్వరలో ఈ రైళ్ల వేళలు మారతాయి

షాలిమార్ - సికింద్రాబాద్ (22849) ఎక్స్‌ప్రెస్ సెప్టెంబర్ 19వ తేదీ నుంచి షాలిమార్‌లో బుధవారం బయల్దేరి గురువారం సికింద్రాబాద్ చేరుకుంటుంది. అలాగే సెప్టెంబర్ 21 నుంచి సికింద్రాబాద్‌లో ఆదివారానికి బదులు శుక్రవారం బయల్దేరి శనివారం షాలిమార్ చేరుకుంటుంది.

విల్లుపురం-ఖరగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ సోమవారానికి బదులు మంగళవారం విల్లుపురంలో బయల్దేరుతుంది. ఆగస్టు 21వ తేదీ నుంచి ఈ మార్పు అమల్లోకి రానుంది. ఈ రైలు ఖరగ్‌పూర్‌లో బుధవారానికి బదులు గురువారం బయల్దేరుతుంది.

ఢిల్లీ సరాయ్ రోహిల్లా - యశ్వంత్‌పూర్ (12214) దురంతో ఎక్స్‌ప్రెస్ బుధవారానికి బదులు సోమవారం ఢిల్లీలో బయల్దేరుతుంది. అక్టోబర్ 8వ తేదీ నుంచి ఈ మార్పు అమల్లోకి రానుంది.

1,43,66,000. ఇదీ సాక్షి పాఠకుల సంఖ్య

* ఈ ఏడాది తొలి త్రైమాసిక సర్వే ఫలితాలను వెల్లడించిన ఐఆర్‌ఎస్
* మూడు నెలల వ్యవధిలో 1.37 లక్షల మేర పెరిగిన పాఠకుల సంఖ్య.. 
* ఏటా ‘సాక్షి’కి పెరుగుతున్న పాఠకాదరణ
* 2010 తొలి త్రైమాసికంలో సాక్షి పాఠకుల సంఖ్య 1.29 కోట్లు
* రెండేళ్లలో దాదాపు 14 లక్షల మేర పెరిగిన పాఠకుల సంఖ్య

హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలుగు ప్రజల మనస్సాక్షి ‘సాక్షి’ పత్రిక పాఠకాదరణ దినదిన ప్రవర్థమానమవుతోంది. సాక్షి పాఠకుల సంఖ్య ఏటా పెరుగుతోందని ఇండియన్ రీడర్‌షిప్ సర్వే(ఐఆర్‌ఎస్) గణాంకాలు పేర్కొంటున్నాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికం(2012 జనవరి- మార్చి) సర్వే ఫలితాల ప్రకారం.. సాక్షి పాఠకుల సంఖ్య 143.66 లక్షలు(ఒక కోటీ 43 లక్షల 66 వేలు) అని ఐఆర్‌ఎస్ తెలిపింది. ఆరంభం నుంచి ‘సాక్షి’ పాఠకుల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. 

2009 రెండో అర్ధ సంవత్సరం(జూలై-డిసెంబర్)లో సాక్షి పాఠకుల సంఖ్య 125.13 లక్షలు కాగా.. 2010 తొలి త్రైమాసికం(జనవరి-మార్చి)లో అది 129.84 లక్షలకు పెరిగింది. రెండో త్రైమాసికం(ఏప్రిల్-జూన్)లో 132.23 లక్షలకు, మూడో త్రైమాసికం(జూలై-సెప్టెంబర్)లో 133.78 లక్షలకు, నాలుగో త్రైమాసికం(అక్టోబర్-డిసెంబర్)లో 134.74 లక్షలకు చేరింది. 

2011లోనూ ఇదే పెరుగుదల నమోదైంది. తొలి త్రైమాసికంలో పాఠకుల సంఖ్య 139.39 లక్షలకు పెరగగా.. రెండో త్రైమాసికంలో 139.47 లక్షలు, మూడో త్రైమాసికంలో 141.36 లక్షలు, నాలుగో త్రైమాసికంలో 142.29 లక్షలకు చేరింది. ఇప్పుడు తాజా సర్వేలో 2012 తొలి త్రైమాసికంలో పాఠకుల సంఖ్య 143.66 లక్షలకు పెరిగింది. అంటే 3 నెలల వ్యవధిలో 1.37 లక్షలమేర పాఠకుల సంఖ్య పెరిగిందన్నమాట.

ఎగువ రాష్ట్రాల కరుణ ఉంటేనే మన రిజర్వాయర్లు నిండేది

* నారుమళ్లలో తడి లేదు.. ప్రాజెక్టుల్లో నీళ్లు లేవు.. రైతుల్లో ఆశ లేదు 
* వర్షాలున్నప్పుడే నీరివ్వని కర్ణాటక.. వర్షాభావ పరిస్థితుల్లో చుక్క విదల్చడం అనుమానమే
* ఇప్పటి నుంచి భారీగా కుండపోత వర్షాలు కురిస్తే 15 రోజుల్లో ఆలమట్టి నిండే అవకాశం
* ఆలమట్టి నుంచి నారాయణపూర్, జూరాల ద్వారా శ్రీశైలానికి చేరడానికి మరో 10 రోజులు
* భారీ స్థాయిలో వరద నీరు వచ్చినా శ్రీశైలం నిండటానికి కనీసం 20 రోజులు
* శ్రీశైలం నుంచి భారీగా నీరు, అంతర్గత వరదలు వస్తేనే సాగర్ నుంచి పది రోజుల్లో నీరు
* అంటే.. ఇప్పటి నుంచి భారీ వర్షాలు కురిసి, కర్ణాటక కనికరిస్తే నెలన్నరకు సాగు నీరొస్తుంది
* ఇప్పటికే వర్షాలు లేక సాగు విస్తీర్ణంలో 4 లక్షల హెక్టార్లు తగ్గింది..
* వేసిన పంటలకూ అందని సాగు నీరు.. నారుమళ్ల దశలోనే ఎండిపోతున్న వైనం

హైదరాబాద్, న్యూస్‌లైన్: నింగి నుంచి చుక్క రాలడంలేదు. వర్షాకాలం ప్రారంభమై నెల రోజులవుతున్నా వర్షాలు లేవు. పొలం తడవక రైతులు విలవిల్లాడుతున్నారు. వేసిన విత్తనాలు మట్టిలో కలిసిపోయాయి. చుక్క నీరొచ్చే దారిలేదు. రాష్ట్రంలోని పంట పొలాలను సస్యశ్యామలం చేసే రిజర్వాయర్లన్నీ అడుగంటాయి. వీటిలోకి నీరు రావాలంటే వరుస వర్షాలు కురవడంతోపాటు ఎగువ రాష్ట్రమైన కర్ణాటక దయతలచాలి. ఓ పక్క పంటల సీజను మొదలైనా, నారుమళ్లకూ నీరు లేదు. ఎగువ రాష్ట్రంలోనూ వర్షాభావం కారణంగా అక్కడి ప్రాజెక్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. భారీ వర్షాలు కురిసినప్పుడే నీటి విడుదలకు ఇబ్బంది పెడుతున్న కర్ణాటక.. ఈ వర్షాభావ పరిస్థితుల్లో కరుణిస్తుందన్నది అనుమానమే. ముందుగా అక్కడి రిజర్వాయర్లన్నీ నిండి, ఆ రాష్ట్రం అవసరాలు తీరిన తర్వాతే.. అదీ ఎక్కువ నీరుంటే తప్ప మనకు చుక్క విదల్చదు. అప్పటివరకు మనకు సాగు నీరు అందదు. దీనికి చాలా సమయం పడుతుంది. ఈలోగా తమ గతేమిటన్న ఆందోళన రైతుల్లో నెలకొంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో మన ప్రాజెక్టుల్లోకి నీరు రావాలంటే భారీ వర్షాలే ఆధారం.

ఖాళీగా రిజర్వాయర్లు 
రాష్ర్టంలోని రిజర్వాయర్లన్నీ ఇప్పటికే ఖాళీ అయ్యాయి. గత ఏడాది రెండో సీజన్‌లో వర్షాలు కురవకపోవడంతో వీటిలో నీరు అడుగంటింది. ఎగువ రాష్ర్టంలోని ఆలమట్టి, నారాయణపూర్ రిజర్వాయర్లతో పాటు మన రాష్ర్టంలోని జూరాల, తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, నిజాంసాగర్‌లలో నీరు లేదు. ఆలమట్టిలో గత ఏడాది ఈ సమయంలో 55 టిఎంసీల నీరు ఉండగా ప్రస్తుతం 15 టీఎంసీలు మాత్రమే ఉంది. నాగార్జున సాగర్‌లో గత ఏడాది ఈ సమయానికి 314 టీఎంసీలు నీరు ఉండగా ప్రస్తుతం 133 టీఎంసీలే ఉంది. గత ఏడాది ఇప్పటికే కృష్ణా నదిలోకి రాష్ట్రంలోని పరీవాహక ప్రాంతాల నుంచి వరద నీటి ప్రవాహం మొదలయింది. ఈ ఏడాది ఇప్పటివరకు చుక్క నీరు రావడంలేదు. దీంతో వరి సాగు దెబ్బతినే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా డెల్టా ప్రాంత రైతాంగం తీవ్రంగా నష్టపోయే అవకాశముంది. ఇప్పటికే కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయాల్సి ఉంది. అయితే నీటి కొరత కారణంగా నారుమళ్లకు మాత్రం కొద్దిపాటి నీరు విడుదల చేయాలని నిర్ణయించారు.

వర్షాలు లేక ఎండుతున్న పంటలు 
ఈ ఏడాది రుతుపవనాలు మొదలై నెల కావస్తున్నా, ఇప్పటికీ సరైన వర్షాలు కురవడంలేదు. సుమారు 20 శాతం తక్కువ వర్షపాతం నమోదయింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 97 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 77 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. కృష్ణా, గుంటూరు, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో మినహా మిగతా అన్ని జిల్లాల్లో తక్కువ వర్షపాతమే నెలకొంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, కర్నూలు, అనంతపురం, నె ల్లూరు, కడప, కర్నూలు, చిత్తూరు, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. కురిసిన వర్షాలు కూడా పంటలకు ఏమాత్రం అనువుగా లేవు. సరిపడినంత వర్షం లేకపోవడంతో వేసిన పంటలు కూడా ఎండిపోతున్నాయి. 

సాధారణంగా రాష్ట్రంలో ఈ సమయానికి 16 లక్షల హెక్టార్లలో (40 లక్షల ఎకరాలు) పంటలు సాగులోకి వస్తాయి. అయితే, ఇప్పటివరకు 12 లక్షల హెక్టార్ల (30 లక్షల ఎకరాల) విస్తీర్ణంలో మాత్రమే సాగవుతున్నాయి. అంటే 4 లక్షల హెక్టార్ల (10 లక్షల ఎకరాల) విస్తీర్ణం పడిపోయింది. ముఖ్యంగా వరి, జొన్న, సజ్జ, రాగి, మొక్కజొన్న, పెసర, మినుము, వేరుశనగ, పొద్దుతిరుగుడు వంటి పంటలపై వర్షాభావ ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ సమయానికి 2.25 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు కావాల్సి ఉండగా 80 వేల ఎకరాలు మాత్రమే సాగులోకి వచ్చింది. రాయలసీమలో వర్షాధారంగా వేరుశనగ పంట విస్తారంగా వేస్తారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే 19 లక్షల ఎకరాల్లో సాగు చేస్తారు. ప్రస్తుతం ఈ జిల్లాలో వేసిన వేరుశనగ పంట విస్తీర్ణం 37 వేల ఎకరాలు మాత్రమే. దీన్నిబట్టే పరిస్థితి తీవ్రతను అంచనా వేయవచ్చు. 

తెలంగాణ జిల్లాల్లో వర్షాధారంగా పత్తి పంట ఎక్కువ సాగు చేస్తారు. ఇప్పటికే 6.54 లక్షల హెక్టార్ల (16 లక్షల ఎకరాలు)లో పత్తి వేశారు. విత్తనాలు నాటిన తర్వాత వర్షాలు లేకపోవడంతో చాలా ప్రాంతాల్లో మొలకెత్తలేదు. మొలిచిన ప్రాంతాల్లో కూడా ఎండిపోయే ప్రమాదం నెలకొంది. బీటీ పత్తి విత్తనాల కొరత కారణంగా రైతులు ఎక్కువ ధర చెల్లించి బ్లాక్‌మార్కెట్‌లో కొనుగోలు చేశారు. దుక్కిలోనే ఎరువులూ వేశారు. వర్షాలు లేకపోవడంతో ఈ పెట్టుబడి అంతా వృథా అవుతుందేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం ఎకరం పత్తి పంట సాగుకు అయ్యే ఖర్చు రూ.25 వేలు. దీనిప్రకారం చూస్తే వర్షాభావం వల్ల పత్తి రైతులకు సుమారు రూ.300 కోట్ల నష్టం వాటిల్లుతుంది. రాష్ట్రంలో మిగతా పంటలదీ ఇదే దుస్థితి.

కర్ణాటకపై ఒత్తిడి పెంచాలి.. పరిష్కారమిదే..
భారీ వర్షాలు కురిసి, ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు నిండి, వాటి అవసరాలు తీరిన తర్వాత వరద నీరు ఉంటే మనకు వదులుతున్నారు. ఈ నీరు వచ్చేసరికి రాష్ట్రంలో పంటలు దెబ్బ తినే పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పుడు కూడా ఆలమట్టి డ్యాం నిండిన తర్వాతే దిగువకు నీటిని విడుదల చేస్తామని కర్ణాటక పట్టుపడితే.. మనకు పెద్ద దెబ్బే. ఈ సమస్యకు పరిష్కారమేమిటి? వర్షాలు వచ్చి ప్రాజెక్టుల్లోకి వరద నీరు రావడం మొదలైన వెంటనే ఎగువ ప్రాజెక్టుల నుంచి మన రాష్ట్ర వాటా నీటిని విడుదల చేయడం. ఇందుకోసం కర్ణాటకపై ఒత్తిడి పెంచాల్సి ఉంటుంది. 

ఈ విషయంపైనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంతకు ముందునుంచీ డిమాండ్ చేస్తూ వస్తోంది. ఎగువ రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లోకి చేరే నీటిలో మనకు రావాల్సిన వాటాను ఎప్పటికప్పుడు విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని గతంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రానికి లేఖ కూడా రాశారు. ఈ విధానం అమలులోకి వస్తే మన వాటా నీరు ఎప్పటికప్పుడు మనకు అందుతుంది. దీనివల్ల రాష్ట్రంలోని పంటలకు సకాలంలో నీరందుతుంది. అయితే, ఈ విధానం సాధనకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రయత్నం లేకపోవడంతో పంటలు తీవ్రంగా దెబ్బతినే దుస్థితి నెలకొంటోంది.

మన రిజర్వాయర్లు నిండాలంటే...
కృష్ణా బేసిన్‌లో సుమారు వెయ్యి టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యం గల ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవి పూర్తిస్థాయిలో నిండాలంటే వరుసగా కుండపోత వర్షాలు కురవాలి. సుమారు 11 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం 24 గంటలపాటు ప్రాజెక్టులోకి వస్తేఒక్క టీఎంసీ నీరు చేరుతుంది. అంటే ఒక రోజుపాటు లక్షా పది వేల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉంటే 10 టీఎంసీలు వస్తుంది. ఇలా మూడు నెలలపాటు వరద నీరు వ స్తే తప్ప అన్ని ప్రాజెక్టులూ నిండవు. నెల రోజుల్లో ఇవి నిండాలంటే రోజుకు 3 నుంచి 4 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం నమోదవ్వాలి. 

ఈ స్థాయి వరద రావాలంటే ఎగువ రాష్ట్రాల్లోనే కాకుండా మన రాష్ర్టంలోని నదీ పరీవాహక ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురవాల్సి ఉంటుంది. 2009 స్థాయిలో భారీ వరదలు వస్తే రిజర్వాయర్లు పది రోజుల్లో నిండుతాయని అధికారులు చెబుతున్నారు. 2009 అక్టోబరు మొదటి వారంలో రోశయ్య సీఎంగా ఉన్న సమయంలో 20 నుంచి 22 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చింది. దాంతో పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. అయితే.., ప్రస్తుతం ఇందులో సగం వరద అంటే 10 లక్షల క్యూసెక్కులు పది రోజులపాటు వస్తే రిజర్వాయర్లు నిండటానికి అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

అధికారులతో మంత్రి కన్నా సమీక్ష 
ప్రస్తుతమున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఒకవేళ వర్షాలు రావడం ఆలస్యమైనప్పటికీ.. అందుకు తగిన ప్రత్యామ్నాయ పంటల సాగుకు వీలుగా కంటింజెన్సీ ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను వ్యవసాయ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆదేశించారు. శనివారం సచివాలయంలో ఆయన వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి వి.నాగిరెడ్డి, కమిషనర్ కె.మధుసూదనరావు, ఏపీ సీడ్స్ ఎండీ సుధాకర్‌రావులతో సమీక్ష జరిపారు. ప్రత్యామ్నాయ పంటల సాగుకోసం విత్తనాలను కూడా సిద్ధం చేసి ఉంచాలని ఆదేశించారు. 

ఆలమట్టి నిండితే నెలన్నరకు పంటలకు నీరు!
కర్ణాటకలోని ఆలమట్టి డ్యాం పూర్తిగా నిండి, ఆ రాష్ట్రం మనకు నీరు వదిలితే ఆ తర్వాత పంట పొలాలకు నీరందడానికి కనీసం నెలన్నర పడుతుంది. ఆలమట్టి జలాశయం నిల్వ సామర్ధ్యం 123 టీఎంసీలు. అయితే, కర్ణాటక రాష్ట్రం ఈ రిజర్వాయర్ పూర్తిగా నిండితే తప్ప కిందకు నీరు వదలదు. ప్రస్తుతం ఆలమట్టి డ్యాంలో 15.243 టీఎంసీలు మాత్రమే నీరు ఉంది. ఇది డెడ్ స్టోరేజి స్థాయికంటే రెండు టీఎంసీలు తక్కువ. అంటే ఈ డ్యాంలో నీరు లేనట్టే లెక్క. ప్రస్తుతం కర్ణాటకలోనూ వర్షాలు ఆశించిన స్థాయిలో కురవడంలేదు. ఇప్పటి నుంచయినా భారీగా కుండపోత వర్షాలు కురిస్తే ఆలమట్టి నిండటానికి దాదాపు 15 రోజులు పడుతుంది. అది నిండిన తర్వాత కిందికి వదిలిన నీరు ఒక రోజుకు నారాయణపూర్‌కు చేరుతుంది. 

నారాయణపూర్ సామర్ధ్యం 37.64 టీఎంసీలు. ఆలమట్టి నుంచి నీరు ఎక్కువగా వదిలితే నారాయణపూర్ నుంచి వెంటనే నీరు వదిలేస్తారు. అక్కడి నుంచి జూరాలకు వస్తుంది. జూరాల సామర్ధ్యం 11.94 టీఎంసీలే అయినందున అక్కడా నీరు నిల్వ ఉండదు. జూరాల నుంచి శ్రీశైలానికి నీరు రావడానికి దాదాపు 10 రోజులు పడుతుంది. శ్రీశైలం రిజర్వాయర్ సామర్థ్యం 263.63 టీఎంసీలు. భారీ స్థాయిలో వరద నీరు వచ్చినా శ్రీశైలం నిండటానికి కనీసం 20 రోజులు పడుతుంది. 

శ్రీశైలం నుంచి నీటిని వదిలితే నాగార్జున సాగర్‌కు 24 గంటల్లో చేరుతుంది. శ్రీశైలం నుంచి భారీ మొత్తంలో నీటిని వదలడంతోపాటు పరీవాహక ప్రాంతం నుంచి వరద నీరు వస్తే సాగర్ నుంచి వారం పది రోజుల్లో నీటిని సాగర్ కాలువలతోపాటు, కృష్ణా బ్యారేజీకి వదిలే అవకాశాలుంటాయని అంచనా. అంటే.. ఇప్పటి నుంచి భారీ స్థాయిలో వర్షాలు కురిస్తే, కనీసం మరో 45 రోజలకుగాని రాష్ట్రంలోని పంట పొలాలకు నీరు వచ్చే అవకాశాలుండవు.

నేడు విశాఖకు విజయమ్మ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, శాసనసభాపక్ష నేత వైఎస్ విజయమ్మ ఎన్‌టీపీసీ సింహాద్రి విద్యుత్ ప్లాంట్ బాధితులను పరామర్శించేందుకు ఆదివారం విశాఖ వస్తున్నారు. విమానంలో ఉదయం విశాఖ ఎయిర్‌పోర్టుకి చేరుకుని అక్కడి నుంచి నేరుగా ఎన్‌టీపీసీ సింహాద్రి ప్లాంట్‌కు సమీపంలోని తిక్కవాని పాలెం వెళ్లి బాధితులను పరామర్శిస్తారు. ఈ మేరకు ప్రోగ్రాం కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం, పార్టీ జిల్లా కన్వీనర్, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబూరావు ఒక ప్రకటనలో తెలిపారు. 

ఎన్‌టీపీసీ వ్యర్ధాలు, బూడిద విసర్జన, పైప్‌లైన్‌ల ఏర్పాటు వల్ల తమ ఉపాధి దెబ్బతింటుందంటూ గురువారం ఆందోళనకు దిగిన మత్స్యకారులపై సీఐఎస్‌ఎఫ్ పోలీసులు లాఠీఛార్జి, ఫైరింగ్ జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన బాధితులను విజయమ్మ తిక్కవానిపాలెంలో కలుసుకుంటారు. అనంతరం గాయపడి విశాఖ ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్న క్షతగాత్రులను పరామర్శిస్తారు. మధ్యాహ్నం ఆమె విశాఖ నుంచి విమానంలో హైదరాబాద్ బయలుదేరతారు.

త్వరలో చలో హైదరాబాద్: పుత్తా



హైదరాబాద్, న్యూస్‌లైన్:యువత పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ త్వరలో చలో హైదరాబాద్ పేరిట రాజధాని ముట్టడి కార్యక్రమం నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ యువజన విభాగం నిర్ణయించింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం జరిగిన సమావేశానికి అన్ని జిల్లాల అధ్యక్షులు హాజరయ్యారు. సమావేశంలో మొదటగా పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అక్రమ అరెస్టును ఖండిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించారు. అదే విధంగా సీబీఐ మాన్యువల్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తున్న జేడీ లక్ష్మీనారాయణపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ మరో తీర్మానాన్ని ఆమోదించారు. 

అనంతరం రాష్ట్రంలో యువత ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించారు. రాజీవ్ యువకిరణాల పేరిట సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి యువతను మోసగించిన విధానంపై సమావేశం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను నిరసిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి జయంతి రోజైన జూలై 8న పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, ఎస్సీ సెల్ కన్వీనర్ నల్లా సూర్యప్రకాష్‌రావు, కార్మిక విభాగం కన్వీనర్ బి.జనక్‌ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

YSRCP Youth Committee meeting

YS Vijayamma Tour To Fishermen villages in visakha dist..

బాధితులను ఆదుకోవాలి: విజయమ్మ

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం చిలకపాలెం సమీపంలోని నాగార్జున ఆగ్రోకెమ్ కార్మాగారంలో సంభవించిన ఘోర అగ్నిప్రమాద ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో బాధితులను ఆదుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆదివారం విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్టీపీసీ బాధిత గ్రామాలను ఆమె సందర్శిస్తారు. విశాఖపట్నం జిల్లా తిక్కవానిపాలెంలో గురువారం పోలీసుల లాఠీఛార్జీలో గాయపడి చికిత్స పొందుతున్న మత్స్యకారులను విజయమ్మ పరామర్శించనున్నట్లు ఎమ్మెల్యే గొల్ల బాబురావు తెలిపారు.

REGISTER






Name:




Email Address:




CONTACT NO.:




FULL DETAILS:




ADDRESS:




ASSEMBLY CONSTITUION:




FEED BACK & SUGGESTIONS







This contact form was created by Freedback.


జూలై 8న ఘనంగా వైఎస్ జయంతి

జూలై 8న మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నిర్ణయించింది. యువజన విభాగ రాష్ట్రస్థాయి సమావేశం ఈరోజు ఇక్కడ జరిగింది. పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిపై అక్రమ కేసులను నిరసిస్తూ సమావేశం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తూ లీకులకు పాల్పడటాన్ని ఖండిస్తూ మరో తీర్మానం చేశారు. రానున్న 2 నెలల్లో యువత సమస్యలపై 'చలో హైదరాబాద్' కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పుత్తా ప్రతాప్ రెడ్డి చెప్పారు.

Bhumana protest against liquor in Tirupati

Friday, 29 June 2012

అధికార మదాంధత కాదా ఇది?!



వేలాది మంది ఉపాధిని కొల్లగొట్టే చర్యలు చెల్లవని ప్రకటిస్తూ ‘సాక్షి’ ఖాతాలను డీఫ్రీజ్ చేయాలని కోర్టు స్పష్టమైన తీర్పును వెలువరించినా సీబీఐ ఖాతరు చేయకపోవడం రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాయడమే. దేశవ్యాప్తంగా లక్షలాది మంది పాత్రికేయులు ముక్త కంఠంతో ఖండించి, నిరసన ప్రకటించినా సీబీఐ మూర్ఖంగా అదే ఆలోచనను కొనసాగించడం చూస్తున్నదే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వత్తాసుతో ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న అధికారి ఇంతగా బరితెగించడం క్షంతవ్యం కాదు.

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా, విలక్షణమైన లిభితపూర్వక రాజ్యాంగం కలిగిన దేశంగా భారతదేశానికి ప్రత్యేక స్థానం ఉంది. రాజ్యాంగబద్ధంగా ఆవిర్భవించిన అనేక వ్యవస్థలను భారత ప్రజానీకం ఎంతో సమున్నతంగా భావించి గౌరవిస్తోంది. అలా రూపొందిన జాతీయస్థాయి అత్యున్నత విచారణ సంస్థ ‘సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ ఇటీవలి కాలంలో తీవ్ర విమర్శలకు గురికావడం విచారకరం. రాజ్యాంగం నిర్దేశించిన బాధ్యతలను గాలికొదిలి కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారి అడుగులకు మడుగులొత్తడం సీబీఐ అధికారుల దినచర్యగా మారింది.

‘ఆ విషయంలో నేను రెండాకులు ఎక్కువే...’ అన్న చందంగా సీబీఐ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ అన్ని విలువలకు తిలోదకాలిచ్చినట్టు వ్యవహరించడం దిగ్భ్రమ కలిగిస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడన్న అభియోగాలపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విచారణ జరుపుతున్న క్రమంలో అవధులు దాటిన అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్న సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ వ్యవహార సరళిని న్యాయకోవిదులే కాక సామాన్య ప్రజలు కూడా ఛీదరించుకుంటున్నారు. అయినా, ఆయన ఇంకా ఆ బాధ్యతల్లో కొనసాగడం అనుచితం!

న్యాయ నియమాలనన్నిటీనీ ఉల్లంఘించి ‘ప్రభు’భక్తితో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ భవిష్యత్తును ఖతం చేయడానికి కంకణం కట్టుకున్నట్టుగా విధి నిర్వహణ పేరుతో జేడీ ఊగిపోవడం విస్మయానికి గురిచేస్తోంది. చట్టం ముందు అందరూ సమానులేనన్నది రాజ్యాంగం నిర్దేశించిన ప్రాథమిక సూత్రం. అధికారపక్షమైనా, ప్రతిపక్షమైనా అది అందరికీ సమానంగా వర్తిస్తుంది. జగన్ విషయంలో ఈ సూత్రాన్ని పాటించకుండా వివ క్షను ప్రదర్శిస్తూ కక్షపూరితంగా లక్ష్మీనారాయణ విచార ణ పర్వాన్ని కొనసాగించడం విమర్శలకు దారితీస్తోంది.

కాంగ్రెస్ అధిష్టానంతో విబేధించి కొత్త పార్టీ పెట్టడమే జగన్ చేసిన నేరమా? జగన్ పార్టీ వల్ల తమ అధికారానికి ముప్పు ఉందని గ్రహించి, అడ్డదారులుతొక్కైనా అధికారాన్ని నిలుపుకోవాలని కాంగ్రెస్ ‘పెద్దలు’, పోయిన అధికారాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ ఏకమై కుట్ర పద్ధతుల్లో హైకోర్టులో ఒకే విధమైన ‘పిల్’ వేశాయి. దానిపై అనేక మతలబులతో కూడిన విచారణ అనంతరం కోర్టు తీర్పును వెలువరిస్తూ సీబీఐ విచారణకు ఆదేశించింది.

ఆ తీర్పును వెలువరించిన ప్రధాన న్యాయమూర్తికి పదవీ విరమణ అనంతరం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ పదవి లభించడం, అనేక విమర్శలకు తావిచ్చిందని హైకోర్టు సీనియర్ న్యాయవాది రామచంద్రరావు అభిప్రాయపడ్డారు. పిల్ వేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావుకు మంత్రిపదవి లభించింది. మనపాలకులు అనుసరిస్తున్న విలువలు ఎంత పతనావస్థకు చేరుకున్నాయో ఇంతకంటే ఉదాహరణ కావాలా?

కాంగ్రెస్ అధిష్టానం ఎంతగా దిగజారిందంటే, తన విధానాలను ప్రజలకు అనుకూలంగా మార్చుకోవటానికి బదులు సీబీఐని అడ్డం పెట్టుకుని ప్రత్యర్థులను అణచివేయడానికి పాల్పడుతోంది. న్యాయ వ్యవస్థలోని కొన్ని శక్తులు కూడా దానికి వంత పాడటం దురదృష్టకరం. చంద్రబాబు అక్రమ ఆస్తులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ వ్యాజ్యం వేస్తే, న్యాయమూర్తులకు అందులో రాజకీయ దురుద్దేశం కనిపించడం విశేషం! మరి శంకర్రావు, టీడీపీ నాయకులు జగన్‌పై వ్యాజ్యం వేస్తే అందులో ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు కనిపించకపోవడం కూడా విశేషమే మరి! అందరికీ ఒకే న్యాయమన్న సూత్రాన్ని న్యాయస్థానాలు ఎందుకు పాటించడంలేదన్నది సామాన్యుడికి అర్థంకాని సమస్యగా మారింది.

రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం!

ప్రజాస్వామ్యంలో వ్యక్తి స్వేచ్ఛకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. రాజ్యాంగం వ్యక్తి స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా గుర్తించింది. ఒక పార్టీకి అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడూ అయిన జగన్‌మోహన్‌రెడ్డి పట్ల సీబీఐ వ్యవహరిస్తున్న తీరు వ ్యక్తి స్వేచ్ఛను హరించేదిగా ఉంది. అది రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగాన్ని అతిక్రమించడానికి ప్రత్యేక హక్కులు, అధికారాలు ఉన్నట్టు సీబీఐ వ్యహరిస్తోంది. పెట్టుబడులు పెట్టకుండా ఒక పత్రికను గానీ, ఒక ఛానల్‌ను గానీ స్థాపించడం సాధ్యమా? ‘సాక్షి’కి ముందు యెల్లో పత్రికలదే రాజ్యం.

వారు రాసిందే వేదం. జగన్ ఓదార్పు యాత్రకు లక్షలాది జనం తరలివస్తే, ఆ యాత్రనంతా యెల్లో పత్రికలు బ్లాక్ అవుట్ చేశాయి. యాజమాన్యాలకు ఇష్టం ఉన్నా, లేకపోయినా ప్రజాదరణ పొందిన అంశాలను వార్తగానైనా వేయాలి. అది పాఠకుల హక్కు. జగన్, విజయమ్మల సభలను బ్లాకవుట్‌లో చూడటానికి అలవాటు పడ్డ ఒక వర్గం పాఠకులు, ఉప ఎన్నికల ఫలితాలతో షాక్ కు గురయ్యారు.‘సాక్షి’ పత్రిక వైఎస్ హయాంలో ప్రారంభమై, తెలుగు ప్రజల అభిమాన పత్రికగా మారింది. ఇప్పుడు దాని పాఠకుల సంఖ్య కోటిన్నరకు పెరిగింది.

దీనితో ఎల్లో పత్రికల అహం దెబ్బతింది. సీబీఐని ఉసిగొల్పి ‘సాక్షి’ పత్రిక బ్యాంకు ఖాతాలను స్తంభింపచేసింది. వేలాది మంది ఉపాధిని కొల్లగొట్టే చర్యలు చెల్లవని ప్రకటిస్తూ ‘సాక్షి’ ఖాతాలను డీఫ్రీజ్ చేయాలని కోర్టు స్పష్టమైన తీర్పును వెలువరించినా సీబీఐ ఖాతరు చేయకపోవడం రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాయడమే. దేశవ్యాప్తంగా లక్షలాది మంది పాత్రికేయులు ముక్త కంఠంతో ఖండించి, నిరసన ప్రకటించినా సీబీఐ మూర్ఖంగా అదే ఆలోచనను కొనసాగించడం చూస్తున్నదే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వత్తాసుతో ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న అధికారి ఇంతగా బరితెగించడం క్షంతవ్యం కాదు. ప్రజాస్వామ్యవ్యవస్థలో పాలకులుకాదు, ప్రజలే సర్వాధికారులన్న ప్రాథమిక జ్ఞానం లేకుండా నడచుకోవడం పాలనా వ్యవస్థకే తలవంపులు తెస్తుంది.

కక్షపూరిత వైఖరి మానాలి!

దేశ అత్యున్నత విచారణ సంస్థ సీబీఐ స్వతంత్రంగా వ్యవహరించలేకపోతోందనీ, అది కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో మెలగక తప్పడంలేదన్న నిజాన్ని సీబీఐ మాజీ డెరైక్టర్ జోగీందర్‌సింగ్ ఒక సందర్భంలో బయటపెట్టడం దాని పని తీరుకు అద్దం పడుతోంది. ఈ ప్రకటనను సీబీఐ గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ ఖండించకపోవడం విశేషం.

సీబీఐని హైకోర్టు ఆదేశించింది జగన్ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడన్న అభియోగం మీద విచారించమనే కానీ, కాంగ్రెస్, టీడీపీల తరపున జగన్‌పై రాజకీయ కక్ష సాధింపునకు పూనుకోమని కాదు. వైఎస్ హయాంలోని మంత్రివర్గ నిర్ణయాలను తవ్వితీసి, వాటిలో లేని తప్పులను ఉన్నవిగా చెప్పి కొండంతవిగా చూపి పారిశ్రామికాధిపతులను వేధించడం రాష్ట్ర ప్రయోజనాలకు తీరని విఘాతం కలిగిస్తుంది. ఆ నిర్ణయాల్లో జగన్ ఏ దశలోనూ భాగస్వామి కాదు.

ఇవన్నీ ఇలా ఉండగా ఉప ఎన్నికల ప్రచారం మధ్యలో జగన్‌ను అరెస్టు చేసి నిర్బంధించడంతో ప్రజల్లో కోపోద్రేకాలు పెరిగి కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడానికి కారణమైంది. జేడీ లక్ష్మీనారాయణ ప్రభుభక్తి వికటించి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ డిపాజిట్లు కూడా గల్లంతయ్యాయి. జగన్ అరెస్టు తమ కొంప ముంచిందని వయలార్ రవి వాపోయారు. జగన్ అరెస్టుతో జనాన్ని భయభ్రాంతులకు గురిచేసి, ఓటర్లను బెదరగొట్టొచ్చన్న సీబీఐ అంచనాలను ప్రజలు చిత్తు చేశారు. కాంగ్రెస్‌లో కొనసాగి ఉంటే జగన్ కేంద్ర మంత్రి అయ్యేవాడని, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అయ్యేవాడని గులాం నబీ ఆజాద్ ప్రకటించి అసలు రహస్యాన్ని బయటపెట్టాడు. 130 ఏళ్ల కాంగ్రెస్‌కు పట్టిన దుర్గతి ఇది! కాంగ్రెస్‌ను వీడితే మంచి వాళ్లకు సైతం ముప్పుతిప్పలు తప్పవన్నమాట!

హద్దు మీరిన జేడీ ప్రవర్తన!

క్రిమినల్ జస్టిస్‌లోని మౌలిక సూత్రాలు లక్ష్మీనారాయణకు తెలియవనుకోలేము. వాటిని బుద్ధి పూర్వకంగానే ఉల్లంఘిస్తున్నాడు. అభియోగాలు మోపినంత మాత్రం చేతనే ఎవరూ దోషికారు. కోర్టు విచారణతోనే అది తేలాలి. ఆరోపణలను రుజువు చేయాల్సిన బాధ్యత, ఆరోపణలకు తెగబడ్డ వారి మీదనే ఉంటుంది. ఎవరితోనైనా బలవంతంగా నేరాన్ని ఒప్పించే ప్రయత్నం మంచి సాంప్రదాయం కాదు. దాన్ని కోర్టులు అంగీకరించవు. సీబీఐ కక్షగట్టి నెలల తరబడి ఒక వ్యక్తిని నిర్బంధించి విచారణ తతంగాన్ని పొడిగిస్తోంది. విజయసాయిరెడ్డిని ఏకంగా 300 గంటలు ఇంటరాగేషన్ చేసి రికార్డు సృష్టించారు. జగన్ నుంచి వారికి తృప్తికరమైన సమాధానాలు రావడంలేదు కాబట్టి, కస్టడీని పొడిగించాలని జేడీ కోర్టును అభ్యర్థించడం బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట.

ఎన్నికల ప్రచారానికి పక్షం రోజులు బెయిలు మంజూరు చేయమని జగన్ కోర్టును అభ్యర్థిస్తే, దానికీ అభ్యంతరం చెప్పారు. జగన్ బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తాడన్న సాకు చూపారు. విచారణ క్రమంలో తొమ్మిది మాసాలుగా బయట ఉన్న జగన్ సాక్షులను ప్రభావితం చేసినట్లు ఆధారాలు చూపగలరా? అని కోర్టు ప్రశ్నిస్తే జేడీ బిక్కముఖం వేశారు. జగన్ దర్యాప్తుకు సహకరించడం లేదని బుకాయిస్తూ, నార్కో ఎనాలసిస్ పరీక్షకు అనుమతించమని కోర్టును అభ్యర్థించడం అమానుషం, అనాగరికం. ఈ పద్ధతి రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు విరుద్ధమని సుప్రీంకోర్టు విస్పష్టంగా ప్రకటించిన తరువాత కూడా ఇలా అభ్యర్థించడం, రాజ్యాంగ స్ఫూర్తికే భంగకరం. నార్కో పరీక్షలో శరీరంలోని ప్రధాన అవయవాలకు హాని జరుగుతుందన్న విచక్షణ కూడా సీబీఐకి లేకపోవడం విడ్డూరం.

ఎల్లో మీడియాకు ఏకపక్షంగా విచారణకు సంబంధించిన సమాచారాన్ని సీబీఐ లీక్ చేయడం అన్నిటికన్నా పెద్ద నేరం. ఆ సమాచారం ఆ మీడియాలో ముందుగా ప్రచురితం కావడం పెద్ద దుమారంగా మారింది. సీబీఐ జేడీ ఎల్లో మీడియాతో వందల సార్లు ఫోన్ సంభాషణలు జరిపినట్లు ఇటీవల వెల్లడైంది. ఇంత జరుగుతున్నా ఏలినవారితో సహా అన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలూ గుడ్లప్పగించి చూస్తూ ఊరకుంటే ప్రజలు క్షమించరని గుర్తించాలి.

‘‘ఎక్కడ మనస్సు నిర్భయంగా వుంటుందో
ఎక్కడ మానవుడు సగర్వంగా తలెత్తుకొని తిరుగుతాడో...
ఆ స్వేచ్ఛా స్వర్గంలోకి తండ్రీ నా దేశాన్ని మేల్కాంచేట్టు అనుగ్రహించు’’
 అన్న రవీంద్రనాథ్ టాగోర్‌ను ఈ సందర్భంగా గుర్తుచేసుకోక తప్పదు!

హైకోర్టు న్యాయమూర్తులుగా రామచంద్రరావు, ప్రవీణ్‌కుమార్


హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్ర హైకోర్టు నూతన అదనపు న్యాయమూర్తులుగా జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, జస్టిస్ ఎం.సత్యరత్న శ్రీరామచంద్రరావు ప్రమాణం చేశారు. శుక్రవారం ఉదయం 10.15 గంటలకు వీరిద్దరి చేత తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పినాకినీ చంద్రఘోష్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు. ప్రమాణం చేసిన ప్రవీణ్‌కుమార్, రామచంద్రరావులను న్యాయమూర్తులు అభినందించారు. అనంతరం జస్టిస్ ప్రవీణ్‌కుమార్ తాత్కాలిక సీజేతో కలిసి పలు కేసులను విచారించగా... సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ వంగాల ఈశ్వరయ్యతో కలిసి రామచంద్రరావు కేసులను విచారించారు.

కొన్ని సాగునీటి ప్రాజెక్టుల రద్దుకు యోచన

మధ్యంతర మదింపు పేరిట మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు
వైఎస్ మరణానంతరం అనేక ప్రాజెక్టులను పక్కనబెట్టిన ప్రభుత్వం
తాజాగా జీవో నంబర్ 1ను అమలు చేసే యత్నం
రద్దు జాబితాలో దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, 
కంతనపల్లి ప్రాజెక్టులు!

హైదరాబాద్, న్యూస్‌లైన్: జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల్లో కొన్నింటిని రద్దు చేసే దిశలో ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఇప్పటికే నిర్మాణాలపై నిరాసక్త వైఖరిని అవలంబిస్తోన్న సర్కార్... తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టుల మధ్యంతర మదింపు పేరిట మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్‌ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భారీ నీటిపారుదల శాఖ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి, ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి గీతారెడ్డి, చిన్నతరహా నీటిపారుదల శాఖ మంత్రి టిజి వెంకటేశ్‌లు సభ్యులుగా ఉన్నారు. 

జలయజ్ఞంలో భాగంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 86 ప్రాజెక్టులను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఆయన హయాంలోనే 12 ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో 21 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేసి మొత్తం సుమారు 20 లక్షల ఎకరాలకు సాగు నీటిని అందించారు. వైఎస్ మరణానంతరం ప్రాజెక్టులను పట్టించుకునేవారే కరువయ్యారు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రాధాన్యత పేరిట ప్రాజెక్టులను విభజించారు. దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ వంటి ప్రాజెక్టులను పూర్తిగా పక్కన పెట్టారు. ఆయన తర్వాత వచ్చిన కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేయడానికి ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. పైగా ఆయా ప్రాజెక్టుల నిర్మాణ దశలపై మధ్యంతర నివేదికను అందించాలని ఆదేశించారు. అందులో భాగంగా గతంలో జీవో నంబర్-1 పేరిట ఉత్తర్వులను జారీ చేశారు. ఈ జీవో ప్రకారం ఇప్పటికీ నిర్మాణాలను మొదలు పెట్టని ప్రాజెక్టులను రద్దు చేయాల్సి ఉంటుంది. అలాగే మధ్యలోనే పనులు నిలిచిపోయిన ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లాలా ? లేక నిలుపుదల చేయాలా ? అనే విషయంపై అధికారులు స్పష్టమైన నివేదికలను అందించాల్సి ఉంటుంది. ప్రభుత్వ వైఖరి నేపథ్యంలో ప్రాజెక్టుల పనులను కొనసాగించడానికి కాంట్రాక్టర్లుకూడా వెనుకంజ వేస్తున్నారు. 

ముఖ్యంగా ధరలు భారీగా పెరిగినందున పాత ధరలతో తాము పనులను చేయలేకపోతున్నామని చెప్తున్నారు. పెరిగిన ధరలను వర్తింపజేయాలని కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. అప్పటివరకు పనులను చేయబోమని కూడా స్పష్టం చేశారు. దాంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం విశేషం. ప్రాజెక్టుల నిర్మాణ దశలపై ఈ మంత్రుల కమిటీ మధ్యంతర మదింపు నివేదికను ఇవ్వనుంది. అలాగే జీవో నంబర్-1ను కూడా పరిగణనలోకి తీసుకుని తగు సూచనలను చేయనుంది. గతంలో అధికారుల నుంచి నివేదిక కోరిన ప్రభుత్వం.. తాజాగా దీనిపై కేబినెట్ కమిటీని వేయడం కొన్ని ప్రాజెక్టుల రద్దుకే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రద్దు చేయబోయే ప్రాజెక్టుల్లో దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, కంతనపల్లి వంటివి ఉండే అవకాశం ఉంది. అలాగే పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులపై కూడా ఉప సంఘం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

చివరిదశలో ఉన్న ప్రాజెక్టులపైనా చిన్నచూపు

ఇప్పటికే ప్రాజెక్టుల నిర్మాణాల కోసం సుమారు రూ.70 వేల కోట్లు వ్యయం చేశారు. చాలా ప్రాజెక్టులు చివరి దశలో ఉన్నాయి. మూడు నాలుగు వేల కోట్ల రూపాయలను వ్యయం చేస్తే...7 ప్రాజెక్టులను పూర్తిగా, మరో 15 ప్రాజెక్టులను పాక్షికంగా వెంటనే పూర్తి చేయడానికి అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుల ద్వారా 3 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడానికి వీలుంది. ఇందులో నెట్టెంపాడు, కల్వకుర్తి, బీమా, ఎల్లంపల్లి, దేవాదుల, మత్తడివాగు వంటి తెలంగాణ ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే...వీటిపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. కొద్ది మొత్తంలో ఖర్చు చేస్తే పూర్తయ్యే ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. అయినా వాటి విషయంలోనూ ఎలాంటి చర్యల్నీ తీసుకోవడం లేదు. పైగా ఇప్పుడు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడంతో మరిన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

జేడీ ఫోన్‌కాల్స్‌పై సమగ్ర దర్యాప్తు జరపాలి

సీఐడీ దర్యాప్తునకు ఆదేశించాలని కోరిన ఎమ్మెల్యేలు
ఎమ్మెల్యేల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన డీజీపీ


హైదరాబాద్, న్యూస్‌లైన్: సీబీఐ జాయింట్ డెరైక్టర్ వీవీ లక్ష్మీనారాయణ ఫోన్ కాల్స్‌పై సమగ్ర దర్యాప్తు జరపాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు డీజీపీ వి.దినేష్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆ పార్టీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, చెన్నకేశవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎస్వీ మోహన్‌రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి కేకే మహేందర్‌రెడ్డి శుక్రవారం డీజీపీని కలిశారు. వైఎస్‌ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తునకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. సీబీఐ జేడీ పలువురు మీడియా ప్రతినిధులతో అనేకమార్లు ఫోన్‌లో మాట్లాడటం, ఆయా మీడియాలలో ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా పలు అసత్యమైన కథనాలను ప్రచురించడంపై విజయమ్మ డీజీపీకి ఈ నెల 26న ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. జగన్‌మోహన్‌రెడ్డితోపాటు తమ కుటుంబాన్ని అంతమొందించేందుకు కూడా కుట్ర జరుగుతోందనిఆ ఫిర్యాదులో ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ఫిర్యాదుపై పోలీసుశాఖ త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు డీజీపీకి తాజాగా విజ్ఞప్తి చేశారు. 

ఫోన్ కాల్ వివరాలకు సంబంధించి సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ, వాసిరెడ్డి చంద్రబాల ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు హుటాహుటిన కేసులు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారని, విజయమ్మ ఇచ్చిన ఫిర్యాదుపై కూడా దర్యాప్తు జరపాలని ఈ సందర్భంగా కోరారు. చంద్రబాల, సీబీఐ జేడీ ఇచ్చిన ఫిర్యాదులకు సంబంధించిన కేసులను రాష్ట్ర నేర పరిశోధన విభాగాని(సీఐడీ)కి బదిలీ చేసినందున విజయమ్మ ఇచ్చిన ఫిర్యాదు కేసును కూడా సీఐడీకే ఇవ్వాలని ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. ఎంపీ జగన్‌మోహన్‌రెడ్డికి మొదటి నుంచీ వ్యతిరేకంగా ఉన్న మీడియా యాజమాన్యం, వ్యాపారపరంగా ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వారితో సీబీఐ జేడీ అనేకమార్లు ఫోన్‌లో మాట్లాడటం అనుమానాలను రేకెత్తిస్తున్నాయని ఎమ్మెల్యేలు అన్నారు. సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ దర్యాప్తు తీరు సవ్యంగా సాగడంలేదనే అంశంపై విజయమ్మ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌కు, సీబీఐ ప్రధాన కార్యాలయ ఉన్నతాధికారులకు, కేంద్ర హోంమంత్రిత్వశాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేశారని వివరించారు. తమ విజ్ఞప్తిపై డీజీపీ సానుకూలంగా స్పందించారని, విజయమ్మ ఇచ్చిన ఫిర్యాదును హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అనురాగ్‌శర్మకు పంపానని వెల్లడించారని ఎమ్మెల్యేలు మీడియాకు తెలిపారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కూడా కలిసి విజయమ్మ ఫిర్యాదుపై దర్యాప్తు చేయాల్సిందిగా కోరతామన్నారు.

తత్కాల్ టికెట్ల జారీలో మార్పులు

అత్యధిక సంఖ్యలో ప్రయాణికుల ఫిర్యాదుల మేరకు రైల్యే తత్కాల్ (అత్యవసర టికెట్ల) టికెట్ల జారీలో నిబంధనలను మార్పులు చేపట్టేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. తత్కాల్ టికెట్ల అమ్మకాలు ఉదయం 8 గంటలకు కాకుండా 10 గంటలకు ప్రారంభించనున్నారు. భారత రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ తోపాటు గుర్తింపు పొందిన ఏజెంట్లను 10 గంటల నుంచి 12 గంటల వరకు జరిగే తత్కాల్ టికెట్లకు అనుమతించకూడదని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. తత్కాల్ టికెట్ల అమ్మకాలలో చోటు చేసుకుంటున్న అవకతవకలను అడ్డుకోవడానికి రైల్వే శాఖ పలు నిర్ణయాలు తీసుకున్నప్పటికి.. ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. తత్కాల్ టికెట్ల అమ్మకాలు ప్రారంభమైన కొద్ది సేపటికే పూర్తవ్వడం రైల్వేశాఖను ఆలోచనల్లో పడేసింది.

కంగు తినిపించిన ‘పెద్దాయన’ పాట!

మచిలీపట్నం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని ఉద్దేశించి ఇటీవల బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన ‘పెద్దాయన’ పాట కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను కంగు తినిపించింది. ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో రోశయ్యకు కాంగ్రెస్ కార్యకర్తలు పుష్పగుచ్ఛాలు అందజేస్తుండగా ఒక కాంగ్రెస్ కార్యకర్త ఫోన్ మోగడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈ పాటను ఆయన రింగ్ టోన్‌గా పెట్టుకోవడంతో ఒక్కసారిగా ‘పెద్దాయన.. పెద్దాయన.. ఇది స్వార్థపు లోకం.. పెద్దాయనా’ అని పాట వినిపించింది. దీంతో అక్కడివారంతా విస్తుపోయారు. ఒక్కసారిగా ఆ ప్రాంతంలో గంభీరమైన వాతావరణం ఏర్పడింది. తామూ ఆ పాటను రింగ్‌టోన్‌గా పెట్టుకున్నామని, రింగయ్యింది తమ ఫోనేమో అనుకున్నామని మరికొంతమంది కార్యకర్తలు చెప్పుకోవడం కనిపించింది.

YSRC protests on Hitec road


ysrc_protests_postnoon_newsTrue to their word, the YSRC which has assumed the role of the main opposition after the smashing victory in the by-elections, today began its task in the City in earnest by organising a dharna on the Kukatpally-Hitec City road to protest the protracted work of the railway over bridge that results in massive gridlocks on this arterial road.
Scores of the YSRC workers and supporters joined the protest that blamed government apathy to a major mass issue. This railway over bridge planned in 2007 and pledged to be completed in nine months by the HMDA has already consumed three more years and the completion is still nowhere in sight, the YSRC leaders alleged.
“It’s a challenge to the people,” declared Rahul Reddy, a supporter of the YSRC who was lustily cheering the protesters. “Commuters to Hitec City from Kukatpally are facing serious traffic jams everyday,” he pointed out. The situation has become worse for commuters with the onset of monsoons. The traffic police are also closing the way completely when there is heavy rainfall forcing commuters to take the longer alternate routes through Hafeezpet.”
“I get late for work everyday. It takes almost 40 minutes to travel 2 km on my bike. Even with a light shower, there is water logging which results in chaotic traffic during rush hour. I do not know what the government has been doing for the last 10 days. They should at least take the necessary steps to get water logging sorted so that commuters will not face long traffic jams,” said Mohd Razdan, a techie who regularly commutes via this road.
The Lok Satta party, under whose constituency the area falls, had earlier blamed both the railway authorities and the HMDA officials for the mess. The party leader Jayaprakash Narayan regretted that despite revising the budget to build the bridge, the project was dragging along endlessly.

డీజీపీని కలిసిన వైఎస్ఆర్ సీపీ నేతలు

వైఎస్ఆర్ సీపీ నేతలు పలువురు ఈ సాయంత్రం డీజీపీ దినేష్ రెడ్డిని కలిశారు. సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ వ్యవహారంలో తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఫిర్యాదుపై త్వరగా విచారణ చేపట్టాలని వారు డిజిపిని కోరారు. జేడీ, వాసిరెడ్డి చంద్రబాల కాల్‌లిస్ట్ లీకేజీ కేసులను సిఐడికి అప్పగించారు. ఆ కేసులను పోలీసులు ఆగమేఘాల మీద విచారణ చేస్తున్నారని వారు డిజిపికి తెలిపారు.

అనంతరం ఆ పార్టీ ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాస రెడ్డి, చెన్నకేశవరెడ్డి, మాజీ ఎంఎల్సీ ఎస్వీ మోహన్‌రెడ్డిలు మాట్లాడుతూ విజయమ్మ ఫిర్యాదుపై డీజీపీ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. విచారించాలని నగర కమిషనర్‌ను ఆదేశించినట్లు చెప్పారు.

జగన్ త్వరలోనే విడుదలవుతారు: వైవి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి త్వరలోనే విడుదలై ప్రజలను కలుస్తారని ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికలో పార్టీ విధానంపై జగన్‌దే తుది నిర్ణయం అన్నారు. త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సంస్థాగత ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. 

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆదిరెడ్డి అప్పారావుకు చెందిన జగదీశ్వరీ హోటల్‌ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్ సీపీ నేతలు గట్టు రామచంద్ర రావు, జనక్‌ ప్రసాద్, రోజా, వాసిరెడ్డి పద్మ పాల్గొన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కుటుంబ సభ్యులు కలిశారు. శుక్రవారం ఉదయం చంచల్ గూడ జైలుకు వచ్చిన వైఎస్ విజయమ్మ, భారతి, షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్ ములాఖత్ లో భాగంగా ఆయన్ని కలుసుకున్నారు. దాదాపు 20 నిమిషాలు పాటు జగన్ తో భేటీ అయ్యారు. 

వారానికి రెండు ములాఖత్‌లు అంటూ..అది కూడా జైలు అధికారులు సరిగ్గా ఇవ్వకపోవడంతో కుటుంబ సభ్యులు అందరూ ఒక్కసారే జగన్‌ కలిసి మాట్లాడారు. కుటుంబ సభ్యులు వెళ్లిన వెంటనే కొండా దంపతులు జగన్‌ను కలుసుకున్నారు.

Thursday, 28 June 2012

న్యాయమూర్తితో ఎందుకు మాట్లాడారు?

న్యాయమూర్తితో ఎందుకు మాట్లాడారు?
విలేకరులు, పత్రికాధిపతులతో ఎందుకు మాట్లాడారు?
ఈనాడు, ఆంధ్రజ్యోతి కథనాలను ఖండించలేదెందుకు?
ప్రైవసీ మీకొక్కరికే ఉంటుందా? జగన్‌కు ఉండదా?

హైదరాబాద్, న్యూస్‌లైన్: సీబీఐ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ.. సీబీఐ నియమావళికి విరుద్ధంగా మీడియాతోనూ, ప్రైవేటు వ్యక్తులతోనూ మాట్లాడిన ఫోన్ కాల్స్ గురించి సమాధానం చెప్పకుండా బుకాయించేందుకు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఆయన గురువారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ కాల్స్ జాబితాను వెల్లడించడం ద్వారా వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై జరుగుతున్న కుట్రను తాము బయటి ప్రపంచానికి చాటి చెబితే.. దానిపై జేడీ స్పందించకుండా రెచ్చగొట్టే చర్యలకు దిగుతున్నారని విమర్శించారు. 

‘‘కాల్స్ జాబితా వెల్లడించడం వల్ల తన ప్రైవసీ (వ్యక్తిగత గోప్యత) దెబ్బ తిన్నదని జేడీ ఫిర్యాదు చేశారు.. ఆయన ఒక్కరికే ఆ ప్రైవసీ ఉందా? జగన్‌మోహన్‌రెడ్డికి ప్రైవసీ లేదా? ఆయన సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన పారిశ్రామికవేత్తలకు ప్రైవసీ లేదా? 28 బృందాలను తీసుకెళ్లివారి బెడ్‌రూంలలో కూడా తనిఖీలు నిర్వహించారే, అపుడు జేడీకి ప్రైవసీ గురించి గుర్తుకు రాలేదా?’’ అని అంబటి ప్రశ్నించారు. ‘‘మీరొక దర్యాప్తు అధికారి, మీరు పెట్టే కేసులపై తీర్పునివ్వాల్సిన న్యాయమూర్తితో మీరు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? మీడియాతోనూ, మీడియా యాజమాన్యాలతోనూ ఎందుకు మాట్లాడారు? ఇలా మాట్లాడ్డం సీబీఐ మాన్యువల్(నియమావళి)ను ఉల్లంఘిం చినట్లా? కాదా? సమాధానం చెప్పండి’’ అని నిలదీశారు.

నిజం కాకుంటే.. ఖండించరెందుకు?: తన కాల్స్ జాబితా ఎక్కడి నుంచి వచ్చిందని, అలా రావడం తప్పు అని అంటున్న లక్ష్మీనారాయణ తాను మాట్లాడిన కాల్స్ నిజం కాకపోతే.. వాటి ని ఎందుకు ఖండించడం లేదు? అని ప్రశ్నించారు. 

న్యాయమూర్తితో సహా ఎంపిక చేసుకున్న కొందరు విలేకరులతో, వారి యాజమాన్యాలతో మాట్లాడింది నిజమో కాదో ఆయన ఎందు కు చెప్పడం లేదన్నారు. అసలు తాను అధికారిక ఫోన్ నుంచి వీరందరితో మాట్లాడ్డం చట్టబద్ధమే అయితే, మాన్యువల్‌కు అనుగుణంగా ఉంటే జేడీ ధైర్యంగా ఫలానా వారితో మాట్లాడాను అని చెప్పి ఉండే వారని అన్నారు. జగన్ వ్యతిరేక మీడియాతో మాట్లాడుతున్నారని తాము తొలి నుంచీ ఆక్షేపిస్తున్నామ ని, లీకుల పేరుతో లక్ష్మీనారాయణ వార్తలు రాసేలా సమాచారం ఇస్తున్నారని చెప్పారు.ఆయన సమాచారం మేరకే జగన్‌పై ‘ఈనాడు’, దాని తోక పత్రిక పుంఖానుపుంఖాలుగా వార్తలు రాశాయని చెప్పారు. జగన్‌పై దుష్ర్పచారం సాగిస్తూ వస్తున్న వార్తలను ఒక్క రోజూ విచారణాధికారిగా జేడీ ఖండించలేదని, ఎందుకంటే ఆ వార్తలు ఆయన అందించినవేనని రాంబాబు అన్నారు. 

ఆ వార్తలను ఖండిస్తే తాను లీకులు ఇచ్చే మీడియా తిరిగి ప్రశ్నిస్తుందనే ఉద్దేశంతోనే జేడీ మిన్నకున్నారని చెప్పారు. ఈ సందర్భంగా అంబటి సీబీఐ దర్యాప్తు మొదలైనప్పటి నుంచీ ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన వార్తలను ప్రదర్శించారు.

నన్ను అడిగినవే.. పత్రికల్లో: తాను సీబీఐ విచారణకు వెళ్లినపుడు అక్కడ తనను ఏమేమి అడిగారో అవన్నీ ఆ మరుసటి రోజు పత్రికల్లో వచ్చాయని అంబటి తెలిపారు. లక్ష్మీనారాయణ చేస్తున్న కుట్రను తాము బయట పెడుతూ ఉంటే.. ఆయనకు అండగా ఇపుడు ఓ వర్గం మీడియా సమీకృతమై తమపై దాడికి దిగుతోందని, దానికి కారణం ఆయన ఇచ్చే లీకులేనని రాం బాబు దుయ్యబట్టారు. ఒక మహిళను అడ్డం పెట్టుకుని రాజకీ యం చేస్తున్నారంటూ ఓ వర్గం మీడియా తమను ఉద్దేశించి ప్రచారం చేస్తోందని, వాస్తవానికి ఆ పని చేస్తున్నది జేడీయేనని అంబటి అన్నారు. జేడీని న్యాయపరంగా ఎదుర్కొంటామని చెప్పారు.
Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!