ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీస్ వ్యవస్థ అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ పార్టీ తొత్తుగా వ్యవహరిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ దుయ్యబట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలను టార్గెట్ చేసి కొందరు పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన నేతలు రవీంద్ర నాయక్, కె.కె.మహేందర్‌రెడ్డి, రాజ్‌ఠాకూర్, వెల్లాల రామ్మోహన్‌లతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి అక్రమ అరెస్టుకు ముందు, తర్వాత పోలీసులు వ్యవహరించిన తీరును బాజిరెడ్డి ఎండగట్టారు. మే 27న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద 9 మంది పార్టీ కార్యకర్తలను అప్పటి ఏసీపీ రామచంద్రరావు అదుపులోకి తీసుకుని.. థర్డ్ డిగ్రీ ప్రయోగించారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ సీపీ నేతలపై పోలీసులు చేసిన అక్రమ అరెస్టు, వేధింపులపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను అశ్రయిస్తామన్నారు.
Thursday, 28 June 2012
కాంగ్రెస్ తొత్తులుగా పోలీసులు: బాజిరెడ్డి

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment