వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రాంజెఠ్మలానీ గురువారం చంచల్‌గూడ జైల్లో కలుసుకున్నారు. కేసు గురించి ఆయనతో సుమారు 15 నిమిషాల పాటు చర్చించినట్టు సమాచారం. అనంతరం జైలు బయట మీడియాతో జెఠ్మలానీ మాట్లాడారు. జగన్ తన క్లయింట్‌కావడంతో కేసు గురించి ఆయనతో చర్చించానన్నారు. ‘‘మీడియాకు ఒక విషయం స్పష్టం చేయాల్సి ఉంది. ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా జగన్ స్వేచ్ఛను హరిస్తోంది. శిక్ష పడిన ఖైదీకి కూడా కొన్ని హక్కులుంటాయి. అలాంటిది.. ఒక పార్టీ అధ్యక్షుడైన జగన్‌కున్న రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే ఇదంతా చేస్తున్నారు’’ అని దుయ్యబట్టారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. మీడియా కూడా దీన్ని గమనించాలన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment