రామోజీరావుకి జగన్ ఫోబియా పట్టుకుందని సినీనటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి ధ్వజమెత్తారు. రాజకీయంగా జగన్‌ను టార్గెట్ చేసుకున్నంత మాత్రాన ఆయన ఎదుగుదలను ఆపలేరన్నారు. ప్రజల అండదండలతో జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని పోసాని అన్నారు. తాను చంచల్‌గూడ జైల్లో జగన్‌తో ములాకత్‌కు వెళ్లినట్టు, అయితే జగన్ భేటీకి నిరాకరించినట్టు ఈనాడు పత్రికల్లో వచ్చిన వార్తలపై ఆయన మండిపడ్డారు.
నైతిక విలువలను తుంగలో తొక్కి వ్యక్తిగత స్వేచ్ఛను హరించే విధంగా రామోజీ వ్యవహరిస్తున్నారని పోసాని విరుచుకుపడ్డారు. ఈనాడులో వచ్చిన ఈ తప్పుడు వార్తపై తనకు తక్షణం క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో తాను రామోజీకి సంబంధించి వాస్తవాలు వెల్లడిస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని పోసాని కృష్ణమురళి హెచ్చరించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment