హైదరాబాద్, న్యూస్‌లైన్: సీబీఐ ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తిగా యు.దుర్గాప్రసాద్‌రావు బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న ఎ.పుల్లయ్య నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. సీబీఐ మొదటి అదనపు జడ్జిగా పుల్లయ్య బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. కర్నూలు జిల్లా ప్రిన్సిపల్ జడ్జిగా ఉన్న దుర్గాప్రసాద్‌ను హైకోర్టు ఇటీవల బదిలీ చేసిన విషయం తెలిసిందే. 2001లో జిల్లా జడ్జిగా ఎంపికైన దుర్గాప్రసాద్.. గతంలో జ్యుడీషియల్ అకాడమీ అదనపు డెరైక్టర్, హైకోర్టు రిజిస్ట్రార్(జ్యుడీషియల్), కంప్యూటర్ విభాగం ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు నిర్వహించారు.
No comments:
Post a Comment