సీబీఐ జేడీ లక్ష్మీనారాయణపై వైఎస్‌ఆర్ సీపీ నేత బాజిరెడ్డి గోవర్థన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జేడీ దర్యాప్తు పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఆయన అతితెలివి ప్రదర్శిస్తున్నారన్నారు. జేడీ తీరు దొంగే, దొంగ, దొంగ.. అన్నట్లు ఉందని అభిప్రాయపడ్డారు. జేడీపై తాము చేసిన ఫిర్యాదుకు దిక్కూ, మొక్కూ లేదని, అదే జేడీ ఫిర్యాదుపై మాత్రం ఆగమేఘాలమీద స్పందిస్తున్నారని విమర్శించారు. ఇది కుట్రపై మరో కుట్ర అన్నారు. జేడీ తక్షణమే రాజీనామా చేసి తమ వైరి పక్షంలో చేరితే సంతోషిస్తామని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి కేసు దర్యాప్తు చేయడానికి ఆయనకు నైతిక హక్కు లేదన్నారు. సీబీఐని అడ్డంపెట్టుకుని ఇలాంటి దురాఘతాలకు పాల్పడటం తగదన్నారు. జేడీ తీరుపై న్యాయపరంగా, ప్రజాపరంగా పోరాడతామని ఆయన హెచ్చరించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment