చంచల్‌గూడ జైల్లో వైఎస్ జగన్ ను కలిసేందుకు కుటుంబ సభ్యులను అనుమతిస్తామన్న అధికారులు రెండురోజులకే మాటమార్చారు. జగన్ ను కలిసేందుకు వచ్చిన వైఎస్ వివేకానందరెడ్డిని అధికారులు అనుమతించలేదు. జైల్లో ప్రార్థన చేయడానికి వివేకా ఈరోజు ఉదయం 10 గంటల 45 నిమిషాలకు ఒక చర్చిఫాదర్‌తో కలసి వచ్చారు. చర్చి ఫాదర్‌ను లోనికి అనుమతించని జైలు అధికారులు వివేకానందరెడ్డిని కూడా అడ్డుకున్నారు. జగన్ కుటుంబ సభ్యుడైన వివేకానందరెడ్డిని అనుమతించని చంచల్ గూడ జైలు అధికారుల తీరు వివాదాస్పదం అవుతోంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment