మీడియాకు జేడీ లీకులు, ఫోన్ సంభాషణలపై స్వతంత్ర సంస్థతో విచారణకు విజ్ఞప్తి
లక్ష్మీనారాయణ హద్దు మీరుతున్నారు..
సీబీఐ మాన్యువల్‌ను ఉల్లంఘిస్తున్నారు
జేడీ ప్రవర్తన విచారణాధికారి హోదాకు తగినట్టుగా లేదు
దర్యాప్తు వివరాలను జగన్ వ్యతిరేక మీడియాకు
ఎప్పటికప్పుడు ఫోన్ కాల్స్ ద్వారా లీక్ చేస్తున్నారు
వాటి ఆధారంగా సదరు మీడియా ఏకంగా తీర్పులే ఇస్తోంది
ఇదంతా జగన్‌ను, నా కుటుంబాన్ని రాజకీయంగా, భౌతికంగా నిర్మూలించే కుట్ర
హైదరాబాద్, న్యూస్‌లైన్: సీబీఐ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణపై కేంద్ర విజలెన్స్ కమిషన్ (సీవీసీ)కి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఫిర్యాదు చేశారు. ఆయన ప్రవర్తన విచారణాధికారి హోదాకు తగినట్టుగా లేదంటూ ఆక్షేపించారు. సీబీఐ మాన్యువల్‌ను ఉల్లంఘిస్తూ, జగన్‌కు వ్యతిరేకంగా ఉండే మీడియాకు ఎప్పుడుపడితే అప్పుడు ఆయన విపరీతంగా ఫోన్లు చేస్తున్నారన్నారు. అలా దర్యాప్తు వివరాలను వాటికి ఎప్పటికప్పుడు లీక్ చేస్తున్నారని సీవీసీ దృష్టికి తీసుకెళ్లారు. వాటి ఆధారంగా సదరు మీడియా జగన్‌పై ఏకంగా తీర్పులే చెబుతూ ఆయన పరువుకు భంగం కలిగించడమే గాక ప్రైవసీ హక్కునూ ఉల్లంఘిస్తోందని విమర్శించారు. ఇదంతా జగన్‌ను, తమ కుటుంబాన్ని రాజకీయంగా, భౌతికంగా నిర్మూలించే కుట్రేనన్నారు. జగన్ హోదాను కూడా పట్టించుకోకుండా పోలీసు వ్యాన్లో తరలించి ఆయన ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టిన వైనం తమ ఆందోళనలకు మరింతగా బలం చేకూరుస్తోందని చెప్పారు. ‘‘జేడీ అక్రమ కార్యకలాపాలపై స్వతంత్ర సంస్థ ద్వారా దర్యాప్తు జరిపించండి. నా కుమారునికి సరైన భద్రత కల్పించేలా కూడా చర్యలు తీసుకోండి’’ అని సీవీసీని కోరారు. ఈ మేరకు ఆయనకు బుధవారం విజయమ్మ ఒక లేఖ రాశారు. లేఖ పూర్తిపాఠం ఇదీ...
హద్దుమీరి జేడీ ఒంటెత్తు పోకడలు
‘‘నా కుమారుడైన లోక్‌సభ సభ్యుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హైకోర్టు ఆదేశానుసారం 2011 ఆగస్టు 17న సీబీఐ కేసు నమోదు చేసింది. విచారణలో భాగంగా సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ముందు హాజరు కావాల్సిందిగా ఆ కోర్టు నుంచి ఆయనకు సమన్లందాయి. అదే సమయంలో సీబీఐ కూడా తమ ముందు హాజరవాల్సిందిగా, కేసు నమోదైన దాదాపు 8 నెలల తర్వాత జగన్‌కు నోటీసులిచ్చింది. చట్టానికి కట్టుబడే పౌరునిగా నా కుమారుడు విచారణకు హాజరై సీబీఐకి పూర్తిగా సహకరించారు. అయినా కూడా ఈ కేసు దర్యాప్తుకు నేతృత్వం వహిస్తున్న సీబీఐ జాయింట్ డెరైక్టర్ హద్దుమీరి ప్రవర్తించారు. మరుసటిరోజు సీబీఐ కోర్టులో హాజరవ్వాల్సిన తరుణంలో ఒకే ఒక్క రోజు ముందు ఒంటెత్తు పోకడలతో జగన్‌ను అరెస్టు చేశారు. కేవలం ఇటీవల ముగిసిన ఉప ఎన్నికల్లో ఆయన ప్రచారం చేయకుండా అడ్డుకునేందుకే ఇలా చేశారు.
మీడియా ముందస్తు విచారణ
జగన్‌పై కేసు నమోదైన తొలి రోజు నుంచీ విచారణకు సంబంధించిన సమాచారమంతటినీ ఆయనను వ్యతిరేకించే, ఆయనకు రాజకీయంగా, వ్యాపారపరంగా ప్రత్యర్థులైన ఒక వర్గం మీడియాకు సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ పక్కా పద్ధతి ప్రకారం వివక్షాపూరితంగా వెల్లడిస్తూ వస్తున్నారు. అందుకు కారణమేమిటో ఆయనకు మాత్రమే తెలియాలి! సదరు మీడియా కూడా రహస్యంగా సాగుతున్న ఈ దర్యాప్తుకు సంబంధించి ఊహాజనిత వార్తా కథనాలను ప్రచురిస్తోంది, ప్రచారం చేస్తోంది. తద్వారా నా కుమారుడు విచారణను కూడా ఎదుర్కొనక ముందే ఆయనపై తనంత తానుగానే ‘మీడియా విచారణ’ జరిపి, ‘మీడియా తీర్పులు’ వెలువరిస్తోంది! తానే నేరుగా నా కుమారుడిపై ముందస్తుగా తీర్పులు చెబుతోంది. ఆ విధంగా దర్యాప్తును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోంది. సమాజం దృష్టిలో జగన్ పరువును మంటగలపడమే గాక ఆయనకున్న ప్రైవసీ హక్కునూ ఉల్లంఘిస్తోంది.
జగన్‌పై ఉమ్మడి కుట్ర
లక్ష్మీనారాయణ హద్దు మీరి, సీబీఐ మాన్యువల్‌కు విరుద్ధంగా.. దర్యాప్తు ఏయే దశల్లో ఉందన్న వివరాలను ఒక వర్గం మీడియాకు అందజేస్తున్నారు. ఇది దర్యాప్తు ప్రక్రియకు తీవ్రంగా హాని చేయడమే గాక, దర్యాప్తును కూడా ఎదుర్కోకముందే నా కుమారుడిని అప్రతిష్టపాలు చేస్తోంది. పైగా ఇలాంటి లీకులు భయోత్పాత వాతావరణాన్ని కూడా సృష్టిస్తున్నాయి. ఒక వర్గానికి చెందిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు సీబీఐ జేడీ వివక్షాపూరితంగా సమాచారాన్ని లీక్ చేస్తున్నారనేందుకు ఆధారంగా ఆయన సెల్ ఫోన్ సంభాషణలకు సంబంధించిన కాల్ డేటాను మీ పరిశీలన నిమిత్తం జత చేస్తున్నాను. జేడీ నుంచి సదరు మీడియాకు, వారి నుంచి ఆయనకు అసంఖ్యాకంగా, అసాధారణ వేళల్లో కూడా కాల్స్ వెళ్లాయి. పైగా చంద్రబాల అనే మహిళ, జేడీ పరస్పరం విపరీతంగా ఫోన్లు చేసుకున్న వైనాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించాలి. పైన పేర్కొన్న సదరు మీడియాతో చంద్రబాల నిత్యం టచ్‌లో ఉంటున్నారు. నా కుమారునికి వ్యతిరేకంగా వీరంతా కలసికట్టుగా కుట్ర పన్నుతున్నారని, ఆయన ఇమేజ్‌ను దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారని దీన్ని బట్టి తేలుతోంది.
సమాచారమివ్వాల్సింది డీపీఐఓ మాత్రమే
మాన్యువల్ ప్రకారం ప్రధాన కార్యాలయంలోని డీపీఐఓ మాత్రమే సీబీఐకి అధీకృత అధికార ప్రతినిధి. కేసులకు సంబంధించి ఆయన మాత్రమే మీడియాకు సమాచారమివ్వాలి. కానీ ఈ చట్టబద్ధమైన సూచనలన్నింటికీ సీబీఐ జేడీ తిలోదకాలొదిలారు. సీబీఐ మాన్యువల్‌ను స్పష్టంగా ఉల్లంఘించారు. ఒక వర్గం మీడియాకు ఫోన్ చేసి, కేసు దర్యాప్తు వివరాలను నా కుమారునికి హాని కలిగించేలా వివక్షాపూరితంగా వెల్లడిస్తున్నారు. తద్వారా దర్యాప్తుకు సారథ్యం వహిస్తున్న అధికారిగా తనకున్న పరిధిని అతిక్రమిస్తున్నారు. అంతేకాదు.. అన్ని న్యాయసూత్రాలకూ విరుద్ధంగా హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక జడ్జికి కూడా పలుమార్లు జేడీ ఫోన్లు చేశారు.
ఇదీ కాల్ కమామిషు..
దక్కన్ క్రానికల్ రిపోర్టర్లకు, జేడీకి మధ్య 96 ఫోన్ సంభాషణలు జరిగాయి. ఆయనకు ఈనాడు రిపోర్టర్లతో 396 కాల్స్/ఎస్సెమ్మెస్‌లు, టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టర్లతో 123 కాల్స్/ఎస్సెమ్మెస్‌లు, ఆంధ్రజ్యోతి రిపోర్టర్లతో 250 కాల్స్/ఎస్సెమ్మెస్‌లు జరిగాయి. మరో మహిళతో కూడా జేడీ అధికారిక నంబరు ద్వారా పలు సంభాషణలు జరిగాయి. ఆయన ప్రవర్తన విచారణాధికారి హోదాకు తగినట్టుగా లేదు. దర్యాప్తు ప్రక్రియ సజావుగా సాగడం లేదని.. రాష్ట్రంలో విపక్ష పార్టీ దన్నుతో పాలక పార్టీ రూపొందించిన మహా రాజకీయ కుట్రలో భాగంగా.. నా కుమారుడిని, ఆయనతో పాటు నా కుటుంబం మొత్తాన్నీ రాజకీయంగానూ భౌతికంగానూ నిర్మూలించే పద్ధతిలోనే జరుగుతోందని మాకే గాక సామాన్య ప్రజానీకానికి కూడా ఆందోళన కలుగుతోంది. వీటిని బలపరిచేలా.. పార్లమెంటు సభ్యుడు, ఒక పార్టీ అధ్యక్షుడు, జెడ్ కేటగిరీ భద్రత ఉన్న నా కుమారుడిని అన్ని నిబంధనలకూ నీళ్లొదులుతూ పోలీసు వ్యాన్‌లో కోర్టుకు తరలించారు. తద్వారా ఆయన జీవితాన్నే ప్రమాదంలోకి నెట్టారు. మరోసారి సీబీఐ కస్టడీలో ఉన్న జగన్‌ను విచారించే స్థలాన్ని గురించిన వివరాలను కనీసం ఆయన లాయర్లకు కూడా తెలియజేయకముందే ఒక వర్గానికి చెందిన ఎలక్ట్రానిక్ మీడియా పదేపదే ప్రసారం చేస్తూ వచ్చింది. ఈ విధంగా దర్యాప్తు అధికారులు నా కుమారుని భద్రత విషయంలో రాజీ పడుతున్నారు.
జోక్యం చేసుకోండి
మీ దృష్టికి తీసుకొచ్చిన పై అంశాలన్నింటిపై సరైన చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీడియాలోని ఒక వర్గానికి ఫోన్లు చేస్తూ దర్యాప్తు సమాచారాన్ని వారికి వెల్లడిస్తున్న సీబీఐ జేడీ అక్రమ కార్యకలాపాలపై స్వతంత్ర విచారణ సంస్థ ద్వారా దర్యాప్తు జరిపించాలని కోరుతున్నాను. జేడీ అధికారిక నంబర్ నుంచి చంద్రబాల అనే మహిళకు భారీగా కాల్స్ చేయడం, ఒక వర్గానికి చెందిన మీడియాతో ఆమె నిత్యం సంప్రదింపుల్లో గడుపుతుండటంపై కూడా విచారణ జరిపించండి. దీంతోపాటు నా కుమారునికి చట్ట పరిధిలో సరైన భద్రత కల్పించేందుకు అవసరమైన చర్యలు కూడా తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను

No comments:
Post a Comment