వైఎస్ఆర్ సీపీ నేతలు పలువురు ఈ సాయంత్రం డీజీపీ దినేష్ రెడ్డిని కలిశారు. సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ వ్యవహారంలో తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఫిర్యాదుపై త్వరగా విచారణ చేపట్టాలని వారు డిజిపిని కోరారు. జేడీ, వాసిరెడ్డి చంద్రబాల కాల్‌లిస్ట్ లీకేజీ కేసులను సిఐడికి అప్పగించారు. ఆ కేసులను పోలీసులు ఆగమేఘాల మీద విచారణ చేస్తున్నారని వారు డిజిపికి తెలిపారు.
అనంతరం ఆ పార్టీ ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాస రెడ్డి, చెన్నకేశవరెడ్డి, మాజీ ఎంఎల్సీ ఎస్వీ మోహన్‌రెడ్డిలు మాట్లాడుతూ విజయమ్మ ఫిర్యాదుపై డీజీపీ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. విచారించాలని నగర కమిషనర్‌ను ఆదేశించినట్లు చెప్పారు.

No comments:
Post a Comment