కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాధించిన పట్టు, నెంబర్‌వన్ స్థానాన్ని తెలంగాణలో కూడా సాధించాలని ఆ పార్టీ ముఖ్యనేతలు అభిప్రాయపడ్డారు. ఇందుకోసం తెలంగాణ సీనియర్ నేతలతో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కమిటీ ఆయా జిల్లాల్లో పార్టీ బలహీనంగా ఉన్నచోట సమీక్షలు జరిపి, బలోపేతమయ్యేందుకు కృషి చేస్తుంది. అదేవిధంగా తెలంగాణ ప్రాంతానికి దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన మంచిపనులను వివరించాలని బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన భేటీకి వైఎస్సార్‌సీపీ నేతలు వై.వి.సుబ్బారెడ్డి, కొండా మురళి, బాజిరెడ్డి గోవర్దన్, రవీంద్రనాయక్, కేశిపల్లి గంగారెడ్డి, బాలమణెమ్మ, కె.కె.మహేందర్ రెడ్డి, నల్లా సూర్యప్రకాష్‌రావు, పుత్తా ప్రతాప్‌రెడ్డి, బి.జనక్‌ప్రసాద్‌లతో పాటు తెలంగాణ జిల్లాల కన్వీనర్లు, పరిశీలకులు హాజరయ్యారు. అనంతరం వివరాలను పార్టీ అధికార ప్రతినిధి బాజిరెడ్డి గోవర్దన్ మీడియాకు వివరించారు. పార్టీని బలోపేతం చేసేందుకు త్వరితగతిన గ్రామ కమిటీలను ఏర్పాటు చేయాలని, సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. పార్టీ తొలి ప్లీనరీలో అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన హామీలను, సందేశాన్ని కరపత్రాల ద్వారా అన్ని జిల్లాల్లో పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఇటీవల జరిగిన పరకాల ఉపఎన్నికల్లో నైతిక విజయం తమ పార్టీ అభ్యర్థి కొండా సురేఖదేనన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment