టార్గెట్ జర్నలిస్ట్: తప్పుడు కేసుల ‘సాక్షి’గా బట్టబయలైన మరో కుట్ర
చంద్రబాల కాల్ వివరాలపై విలేకరిని టార్గెట్ చేసిన పోలీసులు
నిజానికి ఈ వివరాలను బయటపెట్టింది వైఎస్సార్ కాంగ్రెస్
జేడీ-చంద్రబాల-రాధాకృష్ణ సంభాషణలు కుట్రపూరితమని
ఆ పార్టీ అనుమానాలు.. వై.ఎస్.జగన్ భద్రతపై ఆందోళన
సమగ్ర విచారణకు 21న డిమాండ్.. స్పందించని సర్కారు
పైగా ఈ వ్యవహారాన్ని మరుగుపరిచేందుకు మరో కుట్ర
కాల్ వివరాలెలా బయటికొచ్చాయో తేల్చాలని చంద్రబాల ఫిర్యాదు
ఆగమేఘాలపై కదలిన పోలీసులు, కొద్ది గంటల్లోనే ఎఫ్‌ఐఆర్
ఆ వెంటనే తన కాల్ వివరాలపైనా దర్యాప్తునకు జేడీ ఫిర్యాదు
సాక్షి విలేకరిపై అధికార రహస్యాల చట్టం కింద కేసు నమోదు
మరో కుట్ర మొదలైంది. అక్రమాన్ని బయటపెట్టడమే నేరమన్నట్టు.. అరాచకాన్ని ప్రశ్నించటమే ఘోరమన్నట్టు ‘సాక్షి’పై దాడులు ఉధృతమయ్యాయి. ‘సాక్షి’ మీడియానే కాదు.. తప్పుడు కేసులు బనాయించి ఆ సంస్థ జర్నలిస్టులను సైతం టార్గెట్ చేయగలమని నిరూపిస్తూ.. నీచ రాజకీయాలతో పెనవేసుకుపోయిన ఓ అనైతిక కూటమి మంగళవారం తన ముసుగు తొలగించింది. ‘సాక్షి’ పాత్రికేయుల వృత్తిపరమైన సంబంధాల్ని దెబ్బతీసేలా.. విధి నిర్వహణలో వారి నైతిక స్థైర్యాన్ని దిగజార్చేందుకు ఎల్లో మీడియా, ప్రభుత్వం చేతుల్లోని పోలీసు యంత్రాంగం, సీబీఐ కలిసి వికృత కుట్రకు తెరతీశాయి.
దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా.. వాసిరెడ్డి చంద్రబాల కాల్ లిస్టును పొందారంటూ ‘సాక్షి’ విలేకరిపై అడ్డూ అదుపూ లేకుండా కేసులు పెట్టేశాయి. బ్రిటిష్ పాలకుల హయాంలో 1923లో రూపొందిన అధికార రహస్యాల చట్టంతో పాటు ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, భారత శిక్షాస్మృతి.. ఇలా అన్ని చట్టాలనూ మూకుమ్మడిగా బనాయించేశాయి. అధికార రహస్యాల చట్టాన్ని ఎవరిపై ప్రయోగించినా అది పత్రికా స్వేచ్ఛకు.. సమాచార హక్కు చట్టానికి విరుద్ధమంటూ విరుచుకుపడే ఎల్లో మీడియా, దాని మిత్రులు.. ఇప్పుడు మాత్రం వికటాట్టహాసం చేస్తుండటమే ఈ కుట్రకు నిలువెత్తు అద్దం!
‘‘సీబీఐ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ ఓ బాధ్యత గల అధికారి. ఈ రాష్ట్రంలో ఎంతో కీలకమైన.. రాజకీయ స్థితిగతుల్ని ప్రభావితం చేయగల కేసుల్ని విచారిస్తున్నారు. ఇలాంటప్పుడు మరింత బాధ్యతతో వ్యవహరించాల్సిన అధికారి.. అర్ధరాత్రుళ్లు, తెల్లవారుజామున కూడా ఓ మహిళతో వందల కొద్దీ కాల్స్ మాట్లాడుతున్నారు. ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సమాచారం ఇచ్చిపుచ్చుకుంటున్నారు. అంత అవసరం ఏమొచ్చింది? ఆ మహిళ ైవె ఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై, బంధుమిత్రులపై నిత్యం విషం కక్కే ఓ పత్రిక ఎండీతో, మరికొందరు ముఖ్యులతో ఎందుకు అన్నిసార్లు మాట్లాడారు? వీళ్ల మధ్య నడుస్తున్న సమాచారమేమిటి? ఇదంతా చూస్తుంటే మా నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని భౌతికంగా ఏదైనా చేసేందుకు కుట్ర జరుగుతోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలి’’ అంటూ తగు ఆధారాలతో జూన్ 21న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. అదే డిమాండ్‌తో అసెంబ్లీ ఎదుట ధర్నాకూ దిగారు. అంతే తప్ప చంద్రబాలపై ఎలాంటి అనుచిత ఆరోపణలు గానీ, వ్యక్తిగత వ్యాఖ్యలు గానీ చేయలేదు. తరవాత పూర్తి వివరాల్ని అన్ని మీడియాలకూ అందించారు. ఆ వివరాల్ని మిగతా మీడియా కాస్త తక్కువగా కవర్ చేయగా.. ‘సాక్షి’ చానల్, పత్రిక సవివరంగా ప్రసారం చేశాయి.
సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ పలువురు మీడియా ప్రతినిధులకు ఫోన్స్ కాల్స్ చేస్తూ కేసు వివరాల్ని ముందే వెల్లడిస్తున్నారని, లీకుల పేరిట విచారణను ప్రభావితం చేసేలా వారు కథనాలు వెలువరిస్తున్నారని పేర్కొంటూ, జేడీని నిలువరించాలని అభ్యర్థిస్తూ గతంలోనే హైకోర్టులో కేసు దాఖలైంది. ఆ సందర్భంగానే లక్ష్మీనారాయణ కాల్స్ వివరాల జాబితాను పిటిషనర్ కోర్టుకు సమర్పించారు. కోర్టు నుంచే తాము ఆ జాబితాను పొందామని దాన్ని బయటపెట్టిన సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పష్టంగా చెప్పారు. ‘‘ఆ జాబితాలో ఒక నంబర్‌కు జేడీ నుంచి పెద్ద ఎత్తున ప్రతి రోజూ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు వెళ్లటంతో అనుమానం వచ్చి మా పార్టీ అభిమానులు, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రేయోభిలాషులు ఇంకొంచెం లోతుకు వెళ్లారు. ఆ నంబరు వాసిరెడ్డి చంద్రబాల అనే మహిళదని, వైఎస్ కుటుంబంపై, అభిమానులపై పత్రిక ద్వారా నిత్యం విషం కక్కుతున్న ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో ఆమె పలుమార్లు సంభాషణలు జరిపారని వారు మాకు సమాచారమిచ్చారు. దీనికి ఆధారంగా ఆమె నంబరు తాలూకు డిటెయిల్డ్ బిల్లింగ్ ప్రతుల్ని కూడా అందజేశారు. అన్ని ఆధారాలూ ఉన్నాయి కాబట్టే మేం వాటిని బయటపెట్టాం. మా అనుమానాలు ధ్రువపడ్డాయి కాబట్టే విచారణ జరపమన్నాం’’ అని ఆ రోజే వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పష్టంగా చెప్పారు. నాటి నుంచి ఇప్పటికీ సందర్భం వచ్చినప్పుడు ఇదే విషయాన్ని వారు చెబుతూనే వస్తున్నారు.
మరో అడుగు ముందుకేసిన జేడీ..
ఈ మొత్తం కుట్రకు నిలువెత్తు దర్పణం సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ వ్యవహార శైలి. ఎందుకంటే ఆయన కాల్ లిస్టు వివరాలు గతంలో కోర్టులోనే దాఖలయ్యాయి. ఒకసారి కోర్టుకు సమర్పించారంటే అవి పబ్లిక్ డాక్యుమెంట్లనే అర్థం. వాటిని కోర్టులో వేసిన ఓ పారిశ్రామికవేత్త ఈ రాష్ట్రంలో చాలామందికి వాటిని అందజేసినట్టుగా నాలుగు రోజుల కిందట తోకపత్రిక రాసింది కూడా. బహుశా! ఇలా రాశారంటే సదరు తోకపత్రిక ఎండీకో, ఆయనకు బాగా తెలిసిన వారికో కూడా ఆ లిస్టు అంది ఉండాలి. కాకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తాము కోర్టు నుంచి ఆ జాబితా పొందామని జూన్ 22 నుంచి ఇప్పటికి దాదాపు ఐదారుసార్లు వెల్లడించారు. ప్రతి టీవీ చర్చలోనూ ఇదే చెప్పారు. కానీ వాసిరెడ్డి చంద్రబాల ఫిర్యాదు చేసి 24 గంటలు కూడా గడవకముందే లక్ష్మీనారాయణ కూడా మరో ఫిర్యాదు దాఖలు చేశారు. ‘‘సాక్షి మీడియాలో నా కాల్ లిస్టు ప్రసారమైంది. దానికి ఆధారాలేంటో దర్యాప్తు చేసి కనుక్కోండి’’ అని అందులో కోరారు. కోర్టు ద్వారా పొందామని ఎమ్మెల్యేలు చెప్పటమే కాదు.. ఎమ్మెల్యేలు చెప్పిన మాటల్ని, వారు చెప్పినట్టుగానే ‘సాక్షి’ ప్రచురించింది. ఆ వివరాలేమీ ‘సాక్షి’ సొంతంగా రాసిన కథనాలు కావు. ఎమ్మెల్యేలు ప్రెస్‌మీట్‌లో చెప్పిన మాటలే. దానిపై ఇన్ని రోజులూ ఊరుకుని, ఇంతలా వివరణలిచ్చిన తరవాత హఠాత్తుగా లక్ష్మీనారాయణ ఇప్పుడిలా ఫిర్యాదు చేయటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ‘సాక్షి’ని ఏదో రకంగా వేధించాలన్న దురుద్దేశం తప్పితే ఇందులో ఇంకేమీ లేదని న్యాయవర్గాలే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.
అన్నీ విస్మరించి మహా కుట్ర..
అన్నిటికన్నా ఘోరమేమిటంటే రాష్ట్ర ప్రభుత్వంతో కుమ్మక్కయిన ఓ వర్గం మీడియా.. వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల భయాందోళనల్ని ఏమాత్రం పట్టించుకోలేదు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి భౌతికంగా హాని తలపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అంశాన్ని పూర్తిగా విస్మరించేశారు. సహేతుక డిమాండ్లు వచ్చినప్పుడు దానిపై స్పందించి విచారణ జరిపించాల్సిన ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చుంది. పెపైచ్చు మొత్తం కుట్రను పక్కన పెట్టేసి.. విషయాన్ని పక్కదోవ పట్టించేసి.. జనానికి అసలు విషయం చే రకుండా చూసేందుకు కొత్త ఎత్తులు మొదలెట్టింది. ఓ వర్గం మీడియా, ప్రభుత్వం చేతుల్లోని పోలీసులు, సీబీఐ కలిసి.. అసలు కుట్రను మరుగున పరుస్తూ కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చాయి. వాసిరెడ్డి చంద్రబాల కాల్ లిస్టును అక్రమంగా పొందారంటూ నానా యాగీ మొదలెట్టాయి. తమకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేయోభిలాషుల ద్వారా వివరాలు అందాయని ఎమ్మెల్యేలు స్పష్టంగా చెబుతున్నా పట్టించుకోకుండా.. జగన్‌మోహన్‌రెడ్డిపై జరుగుతున్న కుట్రను బయటపడకుండా.. ‘సాక్షి’ విలేకరిని టార్గెట్ చేస్తూ కేసులు బనాయించాయి. ఈ వ్యవహారానికి ఏమాత్రం సంబంధం లేకపోయినా.. ఓ విలేకరికి ఆమె కాల్ లిస్టు అందిందంటూ.. ఆ విలేకరిపై అధికార రహస్యాల చట్టాన్ని సైతం ప్రయోగిస్తూ మొత్తం పాత్రికేయ వ్యవస్థే భయభ్రాంతమయ్యే మహా దారుణానికి ఒడిగట్టాయి. ఈ అంశాన్ని పదేపదే ప్రసారం చేస్తే.. దీనికి అపరిమితమైన ప్రాధాన్యమిస్తే తాము స్వయంగా పన్నిన కుట్ర పక్కదోవ పడుతుందన్న నమ్మకంతో.. కుట్రలో భాగస్వామిగా ఉన్న ఓ చానల్ మరింత రెచ్చిపోయింది. ఓ వర్గానికి చెందిన పత్రికలు, చానళ్లు కూడా ఈ అంశాన్ని అదేపనిగా ప్రసారం చేస్తూ.. అసలు కుట్రను పక్కదోవ పట్టించేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి. నిజానికి పాత్రికేయులు తమ వృత్తిధర్మంలో భాగంగా పలు రకాల సమాచారాల్ని.. రకరకాల వ్యక్తుల ద్వారా పొందుతుంటారని, ఇందుకోసం చాలామందిని ఆశ్రయిస్తారని, అది వారికి ఆ వృత్తి ఇచ్చిన హక్కు అని ఇప్పుడిలా భూతద్దంలో చూస్తున్న మీడియాకు తెలియనిదేమీ కాదు. కాకపోతే అసలు అంశాన్ని పక్కదోవ పట్టించే ఏకైక ఉద్దేశంతో ఇలా సమాచార హననానికి పూనుకున్నాయంతే!!!
అటు నిర్లక్ష్యం.. ఇటు ఆగమేఘాలు..
వాసిరెడ్డి చంద్రబాల తన కాల్ వివరాలు బయటికెళ్లాయంటూ ఫిర్యాదు చేసినది జూన్ 25న. అంటే సోమవారం. మంగళవారానికల్లా దీనిపై శరవేగంగా కేసు నమోదైపోయింది. వివరాల్ని బయటపెట్టిన ఎమ్మెల్యేల్ని వదిలిపెట్టి.. కాల్ జాబితాను పొందారంటూ ఓ విలేకరిపై కనీవినీ ఎరుగని కేసులు బనాయించేశారు. ఇంకేముంది.. అరెస్టులూ చేసేస్తారంటూ ఎల్లో చానళ్లు ఊరూవాడా ఊదరగొట్టేస్తున్నాయి. భూమ్యాకాశాల్ని ఏకం చేసేస్తున్నాయి. మరోవంకేమో తమ నాయకుడి భద్రతపై సందేహాలు కలుగుతున్నాయని, జేడీ సంభాషణల తీరుతో అనుమానాలు రేగాయని, దీనిపై దర్యాప్తు జరిపించాలని ఏకంగా 16 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ ‘సాక్షి’గా డిమాండ్ చేశారు. ధర్నాకు కూడా కూర్చున్నారు. కొద్దిరోజుల కిందటే అఖిలాంధ్ర ప్రజల ఆశీస్సులతో గెలిచిన అంతమంది ఎమ్మెల్యేలు.. తమ నాయకుడి భద్రతపై అనుమానాలు వ్యక్తం చేస్తూ డిమాండ్ చేసినా ప్రభుత్వం కనీసం స్పందించలేదు. సరికదా, ఆ ఎమ్మెల్యేలనే అరెస్టు చేసి మరీ ధర్నా స్థలి నుంచి లాగి పారేసింది. పోలీసులు కూడా వారి డిమాండ్‌ను పట్టించుకోవడం గానీ, వారి డిమాండ్‌ను ఎల్లో మీడియా వినిపించటం గానీ.. న్యాయవ్యవస్థ స్పందించటం గానీ ఏమీ జరగలేదు. ఆఖరికి మహిళా ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఈ విషయమై మంగళవారం రాష్ట్ర అత్యున్నత పోలీసు అధికారి డీజీపీని కలిసి కూడా ఫిర్యాదు అందజేశారు. తమ డిమాండ్లకు తగిన ఆధారాలున్నాయంటూ కాల్స్ వివరాల్ని పూర్తిగా సమర్పించారు. ఇకనైనా తమ డిమాండ్‌ను పట్టించుకోవాలన్నారు. ఇన్ని చేస్తున్నా పట్టించుకోని పోలీసులు.. ఓ ప్రైవేటు వ్యక్తి ఫిర్యాదుపై ఆగమేఘాలపై కదులుతుండటం చూస్తే.. ఈ వ్యవస్థలన్నీ ఎవరికోసం పని చేస్తున్నాయన్న భయాందోళనలు కలుగుతున్నాయి. అన్ని వ్యవస్థలూ కుమ్మక్కై ‘సాక్షి’ని ఎంతలా టార్గెట్ చేస్తున్నాయన్నది స్పష్టంగా బయట పడుతోంది. ఇటీవల ప్రజల చెప్పుతో కొట్టినట్టు తీర్పునిచ్చినా... ఇంకా కుట్రలతో ఇలా చెలరేగిపోతుండటాన్ని ప్రజాస్వామ్య హననం అని కాక ఇంకేమనుకోగలం?!

No comments:
Post a Comment