విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్, ఆయన కంపెనీ ల్యాంకో ఇన్‌ఫ్రా ఐసీఐసీఐ బ్యాంకును 3 వేల కోట్ల రూపాయల మేర మోసం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, న్యాయవాది గౌతంరెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ లగడపాటి ప్రజల నుంచి సేకరించిన వందల కోట్ల రూపాయలను తీసుకెళ్లి ఆస్ట్రేలియాలో నష్టాల్లో ఉన్న గ్రిఫిన్ అనే కోల్ కంపెనీని కొనుగోలు చేశారన్నారు.
గ్రిఫిన్ పత్రాలను తీసుకొచ్చి ఐసీఐసీఐ బ్యాంకులో కుదువ పెట్టి 3 వేల కోట్ల రూపాయలు తీసుకున్నారని తెలిపారు. ఇప్పుడు ల్యాంకో ఇన్‌ఫ్రా షేరు భారీగా పతనమైందని.. ఐసీఐసీఐ బ్యాంకుతో పాటు, ఇన్వెస్టర్లు తీవ్రంగా నష్టపోయారని గౌతం రెడ్డి చెప్పారు. ఈ ఉదంతంపై సీబీఐతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సెబీ కూడా దర్యాప్తు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. స్పందించకుంటే న్యాయపోరాటం చేస్తామని గౌతంరెడ్డి హెచ్చరించారు. లగడపాటిపై లోక్ సభ స్పీకర్ కు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు.

No comments:
Post a Comment